గృహభంగం
గృహభంగం | |
నవల ముఖపత్రం | |
కృతికర్త: | ఎస్.ఎల్.భైరప్ప |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | గృహ భంగ |
అనువాదకులు: | సంపత్ |
ముఖచిత్ర కళాకారుడు: | శ్రీ ధీరజ్ చౌదరి |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు (మూలం:కన్నడ) |
ప్రక్రియ: | నవల |
ప్రచురణ: | నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా |
విడుదల: | 1992(మూల కన్నడ రచన:1974) |
ప్రచురణ మాధ్యమం: | పుస్తకం |
పేజీలు: | 410 |
గృహభంగం ప్రముఖ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్ప కన్నడ నవలకు తెలుగు అనువాదం. ఈ నవలను కన్నడ భాష నుంచి సంపత్ తెలుగులోకి అనువదించారు.
రచన నేపథ్యం
[మార్చు]గృహభంగం నవలను సంచలన రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఎస్.ఎల్.భైరప్ప రచించిన గృహభంగకు తెలుగు అనువాదం. 1974లో ఎస్.ఎల్.భైరప్ప రచించిన గృహభంగ భైరప్ప ఇతర నవలల్లానే కన్నడ సాహిత్యంలో సంచలన విజయాన్ని సాధించింది. గృహభంగను నే.బు.ట్ర. సంస్థ అంతర భారతీయ గ్రంథమాల శీర్షికన ప్రచురించింది. ఈ నవలను తెలుగులోకి గృహభంగం శీర్షికన సంపత్ తెలుగులోకి అనువదించారు. అనువాద నవల ప్రథమ ముద్రణ 1992లో జరిగింది.
రచయిత గురించి
[మార్చు]ప్రధాన వ్యాసం: ఎస్.ఎల్.భైరప్ప
మూల రచయిత భైరప్ప కన్నడ భాషలోని దిగ్గజ నవలాకారుల సరసన స్థానం సంపాదించిన సాహిత్యకారుడు. ఆయన రచనలు తొలినాళ్ల నుంచీ అటు వివాదాలు ఇటు సంచలన విజయాలు సాధించి సంచలన రచయితగా నిలబెట్టాయి. ఈనాటి రచయితలందరిలో (1990ల నాడు) రచయితలందరిలో భైరప్ప, కె.శివరామ కారంత్ లది అగ్రతాంబూలమని, వీరిద్దరిదీ కన్నడ సాహిత్య ప్రతినిధులుగా, సాహిత్యభారాన్ని తమ భుజస్కంధాలపై మోస్తున్నారంటూ ప్రముఖ కన్నడ సాహిత్యవిమర్శకులు మాధవ కులకర్ణి పేర్కొన్నారు. భైరప్ప మహాభారతం గాథను ఆధారంగా చేసుకుని రచించిన విశిష్ట నవల పర్వ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆపై ఎన్నో సాహిత్య పురస్కారాలు, గౌరవాలు పొందిన భైరప్పకు జ్ఞానపీఠ్ పురస్కారం దక్కాలని, ఇప్పటివరకూ ఇవ్వకపోవడం పక్షపాత ధోరణి అంటూ కన్నడ సాహిత్యవేత్తలు, పాఠకులు నిరసనలు వ్యక్తంచేశారు.[1][2]
ఇతివృత్తం
[మార్చు]గ్రామీణ జీవితం గృహభంగం నవలకు ప్రధానమైన కథావస్తువు. నిరక్షరాస్యుడు, స్వార్థపరుడు ఐన భర్త ఒకవైపు, కర్కోటకుడు ఐన అత్త మరోవైపు జీవితాన్ని నరకమయం చేయగా సంఘర్షణలు అనుభవించిన నంజమ్మ కథ ఇది. తన జీవితాన్ని సుఖమయం చేసుకుని తనవారి జీవితాన్ని సుఖప్రదం చేయాలని ఆ ఇల్లాలు పడ్డ పాట్లు, ఆమె సాహసం వంటివి ఈ నవలలోని ముఖ్యాంశాలు.
మూలాలు
[మార్చు]- ↑ http://www.dnaindia.com/bangalore/report-noted-kannada-writer-patil-puttappa-kicks-up-jnanpith-storm-1589749
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-10. Retrieved 2014-02-23.