జీరా ఆలూ
Appearance
జీరా ఆలూ [1] తెలుగు వారు ఇష్టపడే కూరగాయల్లో బంగాళాదుంప (ఆలూ) ఒకటి. ఆహార ప్రియులు ఆలూ ఫ్రై చేసి అన్నంతో కాకుండా నేరుగా తినేస్తూంటారు.[2] [3]
కావలసినవి
[మార్చు]- బంగాళాదుంపలు -4
- నూనె-రెండు టేబుల్ స్పూన్లు
- నెయ్యి-రెండు టేబుల్ స్పూన్లు
- అల్లం తరుగు -టేబుల్ స్పూను
- పచ్చి మిర్చి -2
- ఇంగువ-చిటికెడు
- ఉప్పు-తగినంత
- కసూరీమేథీ-చెంచా
- కొత్తిమీర తరుగు -పావు కప్పు
- జీలకర్ర -ఒకటింపావు చెంచా
- పసుపు- పావు చెంచా
- కారం-చెంచా
- జీలకర్రపొడి-చెంచా
- దనియాలపొడి-టేబుల్ స్పూను
తయారీ విధానం
[మార్చు]- ముందుగా బంగాళాదుంపల్ని కుక్కర్ లో వేసుకుని మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని ఆ తరువాత చెక్కు తీసి పెద్ద ముక్కల్లా కోసి పెట్టుకోవాలి.
- స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె, నెయ్యి వేయాలి.
- నెయ్యి వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం తరుగు, సన్నగా కోసిన పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కారం, జీలకర్రపొడి, దనియాలపొడి, తగినంత ఉప్పు, కసూరీమేథీ వేసి బాగా కలపాలి.
- రెండు నిమిషాలయ్యాక బంగాళాదుంపలు వేసి మరోసారి కలపాలి.
- ఆలూ ముక్కలు వేగాయనుకున్నాక కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ని కట్టేయాలి
మూలాలు
[మార్చు]- ↑ "Aloo Jeera". NDTV Food (in ఇంగ్లీష్). Retrieved 2024-05-12.
- ↑ ఈనాడు ఆదివారం (2024-05-12), ఆలూ.. అదిరిపోయేలా!, retrieved 2024-05-12
- ↑ Ghose, Sandip (2023-11-18). "In praise of potatoes: People may come and people may go, but the Aloo will go on forever". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-05-12.