జ్ఞానవాపి మసీదు
జ్ఞానవాపి ఆలయం (ఆంగ్లం: Gyanvapi Temple) ఇది ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కలదు. ఇది 1669లో శివాలయాన్ని కూల్చివేసి ఔరంగజేబుచే నిర్మించబడింది.[1]
వివాదం
[మార్చు]కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు సుదీర్ఘ న్యాయ పోరాటంలో చిక్కుకుంది. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మిస్తున్నారనే వాదనలు రావడంతో వారణాసిలోని న్యాయస్థానం మసీదు నిర్మాణంపై విచారణ జరపాలని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)ని ఆదేశించింది.ఇక స్థానిక కోర్టు ఆదేశాలతో పటిష్ఠ పోలీసు భద్రత మధ్య ఈ సముదాయంలో వీడియోగ్రఫీ సర్వేను 2022 మే 14,15,16 తేదీలలో నిర్వహించారు.[2] జ్ఞానవాపి మసీదు సముదాయంలో సర్వే సందర్భంగా శివలింగం కనిపించిందని, ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు 2022 మే 16న జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఆ ప్రాంతానికి ఎవరినీ ప్రవేశించేందుకు అనుమతివ్వద్దని స్పష్టం చేసింది.[2] అలాగే ఈ ప్రాంతాన్ని రక్షించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను 2022 మే 17న సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ముస్లింలు ప్రార్థనలు చేయడానికి మసీదులోకి ప్రవేశాన్ని అడ్డుకోవద్దని పేర్కొంది.[3] తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. 16వ శతాబ్ధంలో కాశీ విశ్వనాధ ఆలయంలో కొంత భాగాన్ని ఔరంగజేబు ఆదేశాలతో కూల్చివేసి జ్ఞాన్‌వాపి మసీదు నిర్మించారని వారణాసి కోర్టులో 1991లో పిటిషన్ దాఖలైంది. జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో ప్రార్ధనలకు అనుమతించాలని పిటిషనర్లు ఎప్పటినుంచో కోరుతున్నారు.
వివాదంలో కీలక మలుపు
[మార్చు]జ్ఞానవాపి కేసులో మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జ్ఞానవాపిలో హిందూ దేవతా విగ్రహాలకు పూజలు చేసే అవకాశం దక్కింది. జ్ఞానవాపి మశీదు నిర్మాణానికి సంబంధించి దాఖలైన పిటిషనుపై కోర్టు ఇరువర్గాలు వాదనలు విన్నది. కోర్టు 2024 జనవరి 31న కీలక తీర్పును వెల్లడించింది. దీనితో ప్రాంగణంలో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Catherine B. Asher (24 September 1992). Architecture of Mughal India. Cambridge University Press. pp. 278–279. ISBN 978-0-521-26728-1.
- ↑ 2.0 2.1 "Gyanvapi Masjid Survey Over Varanasi Court Orders Seal - Sakshi". web.archive.org. 2022-05-18. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Gyanvapi Mosque Case: Supreme Court Orders Shivling Location To Be Protected - Sakshi". web.archive.org. 2022-05-18. Archived from the original on 2022-05-18. Retrieved 2022-05-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Gyanvapi Case | జ్ఞానవాసి కేసులో కీలక మలుపు.. మసీదు ప్రాంగణంలో పూజలకు కోర్టు అనుమతి..!-Namasthe Telangana". web.archive.org. 2024-01-31. Archived from the original on 2024-01-31. Retrieved 2024-01-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)