ఝాము
ఝాము:
భారతీయ కాలగణన ప్రకారం
ఝాము ఒక కాలమానము. ఒక ఝాము 3 గంటలు లేదా 7 1/2 ఘడియలకు సమానము. ఎనిమిది ఝాములు ఒక రోజుగా పరిగణిస్తారు. మనం గాలిపీల్చి వదలడానికి పట్టు కాలమును “ప్రాణము” అంటారు.
6 ప్రాణములు = 1 విఘడియ
60 విఘడియలు = 1 ఘడియ ( ఘడియ అనగా 24నిమిషముల కాలము. అనగా 2 ½ ఘడియలు ఒక గంట )
60 ఘడియలు = ఒక దినము ( 24 గంటలు)
2 ఘడియలు = 1 ముహూర్తము
2 ½ ఘడియలు = 1 గంట 30 రోజులు - 1 నెల
12 నెలలు - 1సంవత్సరము
60 సంవత్సరాలు - 1 సంవత్సర చక్రము ( షష్టిపూర్తి)
4,32,000 సం.లు - కలి యుగము
8,64,000 సం.లు - ద్వాపర యుగము
12,96,000 సం.లు - త్రేతా యుగము
17,28,000 సం.లు - కృత యుగము
మొత్తము 43,20,000 సంవత్సరములు - 1 మహా యుగము
71 మహాయుగాలు - ఒక మన్వంతరము
14 మన్వంతరాలు - 1 కల్పం
2 కల్పాలు - బ్రహ్మకు 1 రోజు
2000 కల్పాలు - బ్రహ్మ ఆయుష్షు
విష్ణువుకు 200 కల్పాలు - శివునికి 1 రోజు
శివునికి 200 కల్పాలు - ఆది పరాశక్తికి 1 కనురెప్పపాటు