Jump to content

టూత్ బ్రష్

వికీపీడియా నుండి
A common Toothbrush
కొన్ని టూత్ బ్రష్‌లు

దంతాలను శుభ్రం చేసేదే టూత్ బ్రష్ . దాదాపు ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి దీనితో తమ పళ్లను శుభ్రం చేసుకుంటారు.

చరిత్ర

[మార్చు]

దీనిని ఆవిష్కరించింది చైనీయులు, ప్రచారంలోకి తెచ్చింది ఫ్రెంచివాళ్లు, ఉత్పత్తి చేసింది బ్రిటిష్ వాళ్లు, హక్కులు తీసుకుంది అమెరికా వాళ్లు. వెలుగులోకి తేవడంలో ఇంతమంది చేయి ఉంది.

ఆవిష్కరణ

[మార్చు]

ఒకరకం పందికి ఉండే వెంట్రుకలతో చైనీయులు తొలిసారిగా బ్రష్‌ను రూపొందించారట. క్రీస్తుశకం ఐదో శతాబ్దంలో చైనా రాజులు టూత్‌బ్రష్‌ను ఉపయోగించే వారని... తర్వాత 15, 16 శతాబ్దాల్లో ఫ్రెంచివాళ్లు దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకు వచ్చారని తెలుస్తోంది. విలియం ఆడీస్ అనే బ్రిటిషర్ పెద్ద ఎత్తున టూత్‌బ్రష్‌లను ఉత్పత్తి చేసి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారట. 1885లో అమెరికాకు చెందిన వడ్త్‌వర్స్ అనే వ్యక్తి బ్రష్‌లపై పేటెంట్ రైట్స్ రిజిస్టర్ చేసుకుని ఒక కంపెనీ పేరుతో టూత్‌బ్రష్‌ల ప్రొడక్షన్ ప్రారంభించారట. అక్కడ నుంచి టూత్‌బ్రష్‌లు విస్తృత స్థాయిలో వినియోగంలోకి వచ్చాయని తెలుస్తోంది.

అయితే బ్రష్ వెనుక ఉన్న చరిత్ర గురించి ఇంకా అనేక థియరీలు ఉన్నాయి. చైనీయుల కన్నా ముందు క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దంలోనే ఈజిప్షియన్లు టూత్‌బ్రష్‌ను వినియోగించారనేది మరో పరిశోధన చెప్పే వివరం. భారతీయుల్లో క్రీస్తు పూర్వం ఐదువందల సంవత్సరాల కిందటే టూత్‌పేస్ట్ వినియోగం, వేపపుల్లలతో బ్రష్ చేసుకునే అలవాటు ఉందని తెలుస్తోంది. ఏదేమైనా కుడి చేతి చూపుడు వేలు మనిషి వాడిన తొలి టూత్‌బ్రష్ అని, పరిణామక్రమంలో జంతువుల వెండ్రుకలు, పక్షుల ఈకలతో రూపొందించిన టూత్‌బ్రష్‌లు వినియోగంలోకి వచ్చాయనేది మాత్రం అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకునే విషయం!


యితర లింకులు

[మార్చు]