Jump to content

ట్రిపుల్ తలాక్

వికీపీడియా నుండి

ముస్లిం మహిళ వివాహ హక్కుల సంరక్షణ బిల్లు.2017లో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అని తెలిపింది. [1]2018 లో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ మోదీ ప్రభుత్వం బిల్లును తయారు చేసి లోక్‌సభలో ప్రవేశపెట్టింది.ఈ బిల్లుకు లోక్‌సభలో 2018 డిసెంబర్ 27వ తేదీన ఆమోదం తెలిపింది. [2]ఈ నిబంధనల ప్రకారం ముస్లిం మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం.అలా చెబితే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది.[3]

ట్రిపుల్ తలాక్ అంటే ఏంటి

[మార్చు]

ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనేది తలాక్ చెప్పే ఒక విధానం. దీని ద్వారా భర్తలు ఒకే సమయంలో మూడు సార్లు 'తలాక్', 'తలాక్', 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు పొందవచ్చు.దీనిని మాటల ద్వారా లేదా చెప్పవచ్చు. ముస్లిం మహిళల నుంచి సుప్రీంకోర్టుకు పెద్ద ఎత్తున పిటిషన్లు వెల్లువెత్తడంతో, కోర్టు ఇది రాజ్యాంగవిరుద్ధం అంటూ 2017 ఆగస్టులో దానిని నిషేధించింది.[4]

ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన దేశాలు

[మార్చు]

ట్రిపుల్ తలాక్‌ను చాలా ముస్లిం దేశాలు నిషేధించాయి. ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరంగా పరిగణిస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, సిప్రస్, ట్యునీషియా, మలేషియా, ఇరాన్, శ్రీలంక, జోర్డాన్,అల్జీరియా, ఇండోనేషియా, యూఏఈ, ఖతార్, సుడాన్, మొరొకో, ఈజిప్ట్, ఇరాక్, బ్రూనేలాంటి దేశాలు నిషేధించాయి. తాజాగా ఈ జాబితాలో తాజాగా భారతదేశం చేరింది[5].

మూలాలు

[మార్చు]
  1. "Triple Talaq verdict: What exactly is instant divorce practice banned by court?". Hindustan Times (in ఇంగ్లీష్). 2017-08-22. Retrieved 2019-12-11.
  2. Phukan, Sandeep (2017-12-28). "Lok Sabha passes triple talaq bill". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-12-11.
  3. Correspondent, Special (2019-08-01). "President Ram Nath Kovind gives assent to triple talaq Bill". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-12-11.
  4. https://www.andhrajyothy.com/artical?SID=860669[permanent dead link]
  5. Sur, Esita (2018-03-25). "Triple Talaq Bill in India: Muslim Women as Political Subjects or Victims?". Space and Culture, India. 5 (3): 5. doi:10.20896/saci.v5i3.299. ISSN 2052-8396.