డెంగ్ జియావో పింగ్
డెంగ్ జియావో పింగ్ ([tə̂ŋ ɕi̯àu̯pʰǐŋ][tə̂ŋ ɕjɑ̀ʊpʰǐŋ] ( listen), Chinese: 邓小平; 1904 ఆగస్టు 22 – 1997 ఫిబ్రవరి 19) చైనాకు చెందిన విప్లవకారుడు, రాజనీతవేత్త. 1978 నుంచి 1989లో పదవీ విరమణ చేసే వరకూ చైనాకు అత్యున్నత నాయకునిగా వ్యవహరించారు. ఛైర్మన్ మావో జెడాంగ్ మరణించాకా అధికారం చేపట్టిన డెంగ్ ప్రస్తుత చైనా ఆర్థిక స్థానం, విధానాల దిశగా నడిపించిన ఆర్థిక-మార్కెట్ సంస్కరణలు చేపట్టారు. రాజ్యాధినేతగానో, ప్రభుత్వాధినేతగానో, ప్రధాన కార్యదర్శిగానో (కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా) పదవులు చేపట్టకున్నా డిసెంబరు 1978 నుంచి నవంబరు 1989 వరకూ పీపుల్స్ రిపల్ఇక్ ఆఫ్ చైనాకు అత్యున్నత స్థాయి నాయకునిగా వ్యవహరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో రెండవ తరం నాయకుల్లో ముఖ్యునిగా డెంగ్ ఎనిమిది మంది పెద్దలుగా పేరొందిన పార్టీ తొలితరం నాయకులతో అధికారాన్ని పంచుకున్నారు.
సిచువాన్ ప్రావిన్సులో గ్వాంగన్ లో రైతు నేపథ్యంలో జన్మించిన డెంగ్ 1920ల్లో ఫ్రాన్సులో చదువుకుని, పనిచేశారు. అక్కడే ఆయన మార్క్సిజం-లెనినిజం పట్ల ఆకర్షితులయ్యారు. 1923లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఆయన చైనాకు తిరిగివచ్చాకా గ్రామీణ ప్రాంతంలో రాజకీయ కమిషర్ గా పార్టీలో పనిచేశారు. లాంగ్ మార్చిలో విప్లవాత్మక వెటరన్ గా ప్రసిద్ధి చెందారు.[1] పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడ్డ వెంటనే 1949లో డెంగ్ టిబెట్, ఇతర నైఋతి ప్రాంతాల్లో కమ్యూనిస్టు అధికారాన్ని బలపరిచి ఏకీకృతం చేసేందుకు పనిచేశారు.
1950 దశకం తొలి అర్థభాగమంతా మావో జెడాంగ్ కు డెంగ్ ప్రధాన సమర్థకునిగా నిలిచారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా 1960ల్లో గొప్ప ముందడుగుగా అభివర్ణించే చారిత్రక సందర్భంలో చైనా ఆర్థిక పునర్నిర్మాణంలో కృషిచేశారు. మావో రాజకీయ ఆదర్శాలకు, డెంగ్ ఆర్థిక విధానాలకు చుక్కెదురు కావడంతో ఆయనను సాంస్కృతిక విప్లవ కాలంలో రెండుసార్లు అధికారం నుంచి తొలగించారు. కానీ 1978లో మావో ఎంపిక చేసుకున్న ఆయన వారసుడు హువా గువోఫెంగ్ ను రాజకీయంగా చిత్తుచేసి తిరిగి ప్రాధాన్యత సంతరించుకున్నారు.
మావో యుగానికి చెందిన సాంస్కృతిక విప్లవం, ఇతర రాజకీయ ఉద్యమాల కారణంగా సాంఘిక, సంస్థాగత దు:ఖాల్లో మునిగివున్న దేశం సంక్రమించడంతో ఆయన చేసిన కృషి కారణంగా రెండవ తరం నాయకుల్లో అత్యంత ప్రముఖునిగా ప్రసిద్ధి చెందారు. కమ్యూనిస్టు పార్టీ సోషలిస్టు సిద్ధాంతాలను, ఫలితాలు సాధించగల మార్కెట్ ఆర్థిక పద్ధతులతో కలగలిపిన కొత్త రకం సామాజిక మేధో మథనాన్ని నిర్మించిన వ్యక్తిగా ఆయన్ని కొందరు భావిస్తారు.[2] డెంగ్ చైనాలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు, ప్రైవేటు రంగంలో పోటీని ప్రోత్సహించారు. 35 సంవత్సరాలుగా చైనాను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసిన వ్యక్తిగా, కోట్లాది మంది చైనా ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా అభివృద్ధి చేసిన నాయకునిగా ఆయనను పరిగణిస్తారు.[3]
డెంగ్ జియావో పింగ్ ([tə̂ŋ ɕi̯àu̯pʰǐŋ][tə̂ŋ ɕjɑ̀ʊpʰǐŋ] ( listen), Chinese: 邓小平; 1904 ఆగస్టు 22 – 1997 ఫిబ్రవరి 19) చైనాకు చెందిన విప్లవకారుడు, రాజనీతవేత్త. 1978 నుంచి 1989లో పదవీ విరమణ చేసే వరకూ చైనాకు అత్యున్నత నాయకునిగా వ్యవహరించారు. ఛైర్మన్ మావో జెడాంగ్ మరణించాకా అధికారం చేపట్టిన డెంగ్ ప్రస్తుత చైనా ఆర్థిక స్థానం, విధానాల దిశగా నడిపించిన ఆర్థిక-మార్కెట్ సంస్కరణలు చేపట్టారు. రాజ్యాధినేతగానో, ప్రభుత్వాధినేతగానో, ప్రధాన కార్యదర్శిగానో (కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా) పదవులు చేపట్టకున్నా డిసెంబరు 1978 నుంచి నవంబరు 1989 వరకూ పీపుల్స్ రిపల్ఇక్ ఆఫ్ చైనాకు అత్యున్నత స్థాయి నాయకునిగా వ్యవహరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో రెండవ తరం నాయకుల్లో ముఖ్యునిగా డెంగ్ ఎనిమిది మంది పెద్దలుగా పేరొందిన పార్టీ తొలితరం నాయకులతో అధికారాన్ని పంచుకున్నారు.
Notes
[మార్చు]- ↑ China's leaders.
- ↑ cite web|url=http://www.nytimes.com/1997/02/20/world/deng-xiaoping-is-dead-at-92-architect-of-modern-china.html?pagewanted=all%7Ctitle=Deng Xioaping Is Dead at 92; Architect of Modern Chona|work=New York Times|date=20 February 1997}
- ↑ China in the Era of Deng Xiaoping.