డెల్టా ఎయిర్ లైన్స్
హార్ట్స్ ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన కేంద్రంగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రధాన స్థావరంగా డెల్టా ఎయిర్ లైన్స్ సేవలు కొనసాగుతున్నాయి. 2014 జూన్ నాటి లెక్కల ప్రకారం ఈ ఎయిర్ లైన్ ఆధ్వర్యంలో మొత్తం 5,400 విమానాలు నిత్యం దేశీయంగా, అంతర్జాతీయగా ప్రయాణిస్తున్నాయి. ఆరు ఖండాల్లోని 64 దేశాల్లోని 333 గమ్యస్థానాలకు విమానాలు నడుస్తున్నాయి. పది దేశీయ స్థావరాలతో పాటు ఆమ్ స్టర్ డామ్, ప్యారీస్, టోక్యో వంటి మూడు అంతర్జాతీయ స్థావరాల నుంచి డెల్టా తన సేవలను కొనసాగిస్తోంది.
చరిత్ర
[మార్చు]డెల్టా ఎయిర్ లైన్ మే 30, 1924న అమెరికాలోని మెకాన్,[1] జార్జీయాలో ఆకాశయానం ద్వారా పంటలపై మందుల పిచికారి సేవలను ప్రారంభంచింది. ప్రయాణీకులను తీసుకెళ్లే సేవలను ఈ సంస్థ జూన్ 17, 1929 నుంచి ప్రారంభించింది.[2] డెల్టా ఎయిర్ లైన్ సంస్థ అమెరికాలోని అతి ప్రాచీనవిమానాయాన సంస్థ. ప్రపంచంలోనే ఇది తొలి వ్యవసాయాధారిత వాణిజ్య విమాన సంస్థ. అప్పటి నుంచి ఇది క్రమేణా ఎదుగుతూ ప్రపంచంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమాన సంస్థగా గుర్తింపు సాధించింది.[3]
ప్రధాన కేంద్రం
[మార్చు]డెల్టా యొక్క కార్పోరేట్ ప్రధానకేంద్రం అట్లాంటా నగర సరిహద్దులోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న కార్పోరేట్ క్యాంపస్ లో గల ఉత్తర సరిహద్దులో ఉంది.
ప్రధాన మార్గాలు
[మార్చు]- డెల్టా ముంబై ప్యారీస్ విమానాలు[4]
- డెల్టా ముంబయి న్యూయార్క్ విమానాలు
- డెల్టా ముంబయి ఆమ్ స్టర్ డామ్ విమానాలు
- డెల్టా బెంగళూరు ప్యారీస్ విమానాలు
- డెల్టా న్యూఢిల్లీ ప్యారీస్ విమానాలు
- డెల్టా న్యూఢిల్లీ ఆమ్ స్టర్ డామ్ విమానాలు
- డెల్టా న్యూయార్క్ అట్లాంటా, అట్లాంటా-న్యూయార్క్విమానాలు
- డెల్టా హాస్టన్ అట్లాంటా విమానాలు
- డెల్టా డెట్రాయిట్ న్యూయార్క్ విమానాలు
- డెల్టా వాషింగ్టన్ అట్లాంటా, అట్లాంటా వాషింగ్టన్ విమానాలు
- డెల్టా చికాగో అట్లాంటా విమానాలు
- డెల్టా మియామీ అట్లాంటా విమానాలు
- డెల్టా డల్లాస్ ఫోర్ట్ వర్త్ అట్లాంటా విమానాలు
- డెల్టా అట్లాంటా చికాగో విమానాలు
- డెల్టా న్యూయార్క్ డెట్రాయిట్ విమానాలు
- డెల్టా న్యూయార్క్ బోస్టన్ విమానాలు[5]
- డెల్టా రాలేగ్ న్యూయార్క్ విమానాలు
- డెల్టా అట్లాంటా డల్లాస్ ఫోర్ట్ వర్త్ విమానాలు
ముద్ర
[మార్చు]డెల్టా ఎయిర్ లైన్ సంస్థ తన ముద్రను అందరికీ తెలిసేలా విమానాలను నాలుగు ప్రత్యేక రంగుల్లో తీర్చి దిద్దింది.ప్రస్తుతం ఉపయోగిస్తున్న ముద్ర(బ్రాండింగ్)ను 2007 నుంచి ఉపయోగిస్తోంది. ప్రతి నాలుగేళ్లకోసారి విమానాలకు కొత్తగా రంగులు వేస్తున్నారు.1959 లో డెల్టా కంపెనీకి త్రిభుజాకార లోగోను పరిచయం చేశారు.[6]
స్థావర సమాచారం
[మార్చు]హార్స్ ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లై డెల్టా ఎయిర్ లైన్ ప్రధాన కార్యకలాపాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇది కాకుండా డెల్టాకు దేశీయంగా మరో పది, అంతర్జాతీయంగా మరో మూడు స్థావరాలున్నాయి.
అవార్డులు
[మార్చు]ఈ ఎయిర్ లైన్ సంస్థ ఎన్నో అవార్డులు గెలుచుకుంది. వాటిలో ముఖ్యమైనవి కొన్ని:
- ఫార్చున్ మేగజైన్ 2011- ప్రపంచ గౌరవప్రదమైన ఎయిర్ లైన్ సంస్థల జాబితాలో మొదటి ర్యాంకు.[7]
- 2010లో ట్రావెల్ మ్యాగజైన్-ఉత్తమ దేశీయ ఎయిర్ లైన్ అవార్డు, ఉత్తమ దేశీయ ప్రయాణీకుల సేవా ఎయిర్ లైన్ ఆవార్డు.
- 2009లో బిజినెస్ ట్రావెలర్ మాగజైన్ - బెస్ట్ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రాం అవార్డు, ఉత్తమ ఎయిర్ లైన్ వెబ్ సైట్ అవార్డు, ఉత్తమ ఎయిర్ పోర్టు లాంజ్ అవార్డు.
సేవలు
[మార్చు]డెల్టాఎయిర్వేస్ప్రయాణికులకు వినోదాన్నిఅందించేఉత్తమసంస్థల్లోఒకటిగాగుర్తింపు పొందింది. ఇందులో ప్రయాణించినవారికి ఒకఅందమైన అనుభూతి కలుగుతుంది. న్యూయార్క్ నుంచి అట్లాంటా, అట్లాంటా నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి వాషింగ్టన్, వాషింగ్టన్ నుంచి న్యూయార్క్లకు వారాంతపు విమానాలను డెల్టా నడిపిస్తోంది. డెల్టా ఎయిర్ లైన్స్ బ్యాగేజ్ అలవెన్స్ విధాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం 50 పౌండ్ల(23 కి.గ్రా.) బరువైన లగేజిపై అదనపు ఛార్జీలు వసూలు చేయడాన్ని మినహాయించింది.
విమాన దారి మళ్లింపు
[మార్చు]ఇప్పటి వరకు డెల్టా విమానాలకు సంబంధించి డజను పైగా విమాన మళ్లింపు ప్రయత్నాలు జరిగాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- యునైటెడ్ స్టేట్స్ లో విమాన రవాణా
- యునైటెడ్ స్టేట్స్ లో ఎయిర్ లైన్స్ జాబితా
- యునైటెడ్ స్టేట్స్ లో విమానాశ్రయాల జాబితా
బాహ్య లింక్
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "History". news.delta.com. Delta Air Lines Inc. Retrieved 2011-01-11.
1924 The Huff Daland Dusters crop-dusting operation, which formed the roots for Delta, founded in Macon, Ga. Passenger Airline founded 1929, Monroe, La.
- ↑ Norwood, Tom; Wegg, John (2002). North American Airlines Handbook (3rd ed.). Sandpoint, Idaho: Airways International. p. 40. ISBN 0-9653993-8-9.
- ↑ "Airline Certificate Information – Detail View". Federal Aviation Administration. September 30, 1988. Archived from the original on 2011-01-20. Retrieved 2022-04-06.
- ↑ "International Hubs". news.delta.com.
- ↑ "Domestic Hubs". news.delta.com.
- ↑ "Delta celebrates milestone launch of Seattle-Hong Kong service". news.delta.com. Archived from the original on 2014-07-19. Retrieved 2015-01-19.
- ↑ "Delta Airlines". Cleartrip.com. Archived from the original on 2014-05-31. Retrieved 2015-01-19.