Jump to content

త్రి-భాషా సూత్రం

వికీపీడియా నుండి


1968లో భారత ప్రభుత్వ విద్యా మంత్రుత్వ శాఖచే పాఠశాల విద్యా స్థాయిలో విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో రూపొందించబడినదే ఈ "త్రి-భాషా సూత్రం". ఈ సూత్రాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తరువాత 1968 జాతీయ విధాన స్పష్టత(national policy resolution) ద్వారా అమలులోకి వచ్చింది.ఈ సూత్రం ప్రకారం భారత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ మూడు భాషలను ఉపయోగించాలి. హిందీలో మాట్లాడే రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఆధునిక భారతీయ భాష(ప్రాధాన్యంగా దక్షిణ భారతదేశ భాష), హిందీలో మాట్లాడని రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఏదైనా ప్రాంతీయ భాష ఉండాలని నిర్ణయించారు.

దక్షిణాది ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాల ప్రజలు చేసిన నిరసనల ఫలితంగా త్రి-భాషా సూత్రాన్ని సవరించి ఈ విధంగా మార్చారు. ప్రస్తుతం తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్. అన్నాదురై గారు చేసిన ప్రయత్నాల వల్ల త్రి-భాషా సూత్రాన్ని అనుసరించడంలేదు.

చరిత్ర

[మార్చు]

ఈ సూత్రాన్ని మొదట 1948-1949లో అమలుపరచాలని విశ్వవిద్యాలయ విద్యా కమిషన్(university grants commission) సలహా ఇచ్చినప్పటికీ మూడు భాషలలో విద్యను అమలుపరచడానికి గల కారణాన్ని కునుక్కోలేక భారతదేశం కంటే ముందే ఈ సూత్రాన్ని అమలుపరించిన నెథర్ ల్యాండ్స్, స్విట్జర్ ల్యాండ్స్ ను చూసి అనవసరమని భావించారు. అలాగే హిందీ భాష మైనారిటీ భాష అని, ఎంతో చరిత్ర, సాహిత్యం ఉన్న ఇతర భాషలపై అంటే కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, మళయాలం, ఉర్దూ, గుజరాతీ భాషలపై ఆధిపత్యం లేదని ఒప్పుకుంటూనే హిందీ భాష చివరికి ఆంగ్ల భాష స్థానాన్ని భర్తీ చేసి ప్రభుత్వ విధులన్ని హిందీ భాషలోనే జరుగుతాయని నమ్మారు.

1964-1965లో విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో కొన్ని సవరణలు చేసి త్రి-భాషా సూత్రాన్ని అమలుపరచాలని సలహా ఇచ్చారు.కొన్ని చర్చలూ, సమావేశాల తరువాత 1968లో భారత శాసనసభ అసలైన త్రి-భాషా సూత్రాన్ని స్వీకరించింది.1968లో అమలు చేసిన సూత్రాన్ని 1986లో జాతీయ విధాన స్పష్టత మళ్ళీ పునరుద్ఘాటించింది.

అలానే 1972లో కేంద్ర ప్రభుత్వం ఉర్దూ భాషను ప్రచారం చేసే బృందాన్ని ఏర్పాటు చేసి దానికి ఐ.కే. గుజ్రల్ అధ్యక్ష్యత వహించారు.1975లో ఈ బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉర్దూ భాష మాట్లాడే మైనారిటీల హక్కులను కాపాడుతూ ఉర్దూని బోధనా మాధ్యమంలోనూ, అధికార పనులలోనూ ఉపయోగించాలని ఆశించారు. వీటిని ఒక నివేదికగా చేసి 1979లో మంత్రివర్గం, 1979-1983 వరకు గమనించిన మార్పులను, వాటి ఫలితాలను ఒక నివేదిక తయారుచేసి తరాక్కి-ఇ-ఉర్దూ బోర్డు వాళ్ళు గుజ్రల్ బృందానికి అందజేయగా 1984లో వారు దనిని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించారు.

గుజ్రల్ బృందం ఇచ్చిన సలహాలు ఎంత వరకూ అమలులోకి వచ్చాయో పరీక్షించడానికి అలీ సర్దార్ జఫ్రీ అధ్యక్ష్యుడిగా కేంద్రం ఒక కొత్త నిపుణుల బృందాన్నిఏర్పాటు చేసింది. ఈ బృందం త్రి-భాషా సూత్రాన్ని సవరణలు చేయాలని సూచించింది. హిందీ భాషను మాట్లాడే ప్రాంతాలలో (అ) హిందీ (సంస్కృతం మిశ్రమ కోర్సుగా). (ఆ) ఉర్దూ లేదా ఇతర ఆధునిక భారతదేశ భాష. (ఇ) ఆంగ్లం లేదా ఇతర ఆధునిక యూరోపియన్ భాష. హిందీ భాష మాట్లాడని ప్రాంతాలలో (అ) ప్రాంతీయ భాష. (ఆ) హిందీ (ఇ) ఉర్దూ లేదా ఇతర ఆధునిక భారతీయ భాష (అ), (ఆ) మినహాయించి ఉండాలని సూచించారు.

ఆక్షేపణ

[మార్చు]

అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి సి.ఎన్. అన్నాదురై, తమిళనాడులో హిందీ నేర్చుకునే అవకాశాన్ని తిరస్కరించారు.


ఈ త్రి-భాషా సూత్రం విద్యారంగంలో విఫలమైందనే చెప్పవచ్చు. "ఈ సూత్రం వాస్తవంలో కంటే ఉల్లంఘించడం వల్లే సత్కరించబడింది" ద్రవిడ సంస్కృతిలో నిష్ణాతుడైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన షిఫ్ఫ్మన్ చెప్పారు.