Jump to content

దొడ్డబెట్ట శిఖరం

వికీపీడియా నుండి
దొడ్డబెట్ట
దూరదర్శిని గృహం
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు2,637 మీ. (8,652 అ.)
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్2,256 మీ. (7,402 అ.)
జాబితాUltra
భౌగోళికం
ప్రాంతంIN
పర్వత శ్రేణినీలగిరి పర్వతాలు
అధిరోహణం
సులువుగా ఎక్కే మార్గందొడ్డబెట్ట రోడ్
Detailed map of surrounding area

దొడ్డబెట్ట శిఖరం దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం. ఇది తమిళనాడులోని నీలగిరి జిల్లాలో విస్తరించి ఉన్న నీలగిరి పర్వత శ్రేణుల్లో ఉంది. ఈ నీలగిరి పర్వతాలు పశ్చిమ కనుమల్లో అంతర్భాగం. దొడ్డబెట్ట శిఖరం సుమారు 2,637 మీటర్ల (8640 అడుగులు) ఎత్తును కలిగి ఉంది[1]. ఈ శిఖరం ప్రసిద్ధ వేసవి విడిది అయిన ఊటికి 9 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఊటి నుండి కోటగిరికి వెళ్ళు మార్గంలో ఈ శిఖరం కనిపిస్తుంది. ఊటిని సందర్శించే ప్రకృతి ప్రేమికులు కచ్చితంగా చూసే ప్రదేశాలలో దొడ్డబెట్ట ఒకటి. తమిళనాడు పర్యాటకం వారు సూపరిండెంటింగ్ ఇంజనీరు శ్రీ గోవిందన్ సారథ్యంలో ఇక్కడ 18.06.1983లో టెలీస్కోప్ హౌస్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో సందర్శకుల కొరకు రెండు టెలీస్కోపులను ఉంచారు. టెలీస్కోప్ హౌస్ మీదికెక్కి చూస్తే, చుట్టూ కొండలు, లోయలు, ఊటి సౌందర్యం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుందీ ప్రదేశం. ఈ శిఖరానికి అత్యంత సమీపంలోనే దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న తేయాకు కర్మాగారం ఒకటి ఉంది.

పేరు నేపథ్యం

[మార్చు]

కన్నడంలో దొడ్డ అంటే పెద్ద, బెట్ట అంటే పర్వతం. పెద్ద పర్వతం కాబట్టి దీనికి దొడ్డబెట్ట అని పేరు.[2]

వర్షపాతం

[మార్చు]

ఈ పర్వత శిఖరం మీద సంవత్సరపు సరాసరి వర్షపాతం 125 సెం.మీ. ఉంటుంది[3].

ఉష్ణోగ్రత

[మార్చు]

ఈ పర్వత శిఖరం మీద గరిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీ సెంటిగ్రేడ్ కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటిగ్రేడ్‌గా నమోదవుతుంది.

ఇవీ చూడండి

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ""Doda Betta, India" on Peakbagger". Archived from the original on 2014-09-23. Retrieved 2014-10-26.
  2. Grigg, Henry Bidewell (1880). A Manual of the Nílagiri District in the Madras Presidency. Madras: E. Keys at the Government Press. p. 3. Retrieved 26 October 2014.
  3. తమిళనాడు టూరిజం వారు శిఖరంపై ఏర్పాటుచేసిన సూచిక బోర్డ్