ధారీ దేవి ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధారీ దేవి ఆలయం
livepahadi
ధారీ దేవి
ధారీ దేవి ఆలయం is located in Uttarakhand
ధారీ దేవి ఆలయం
ఉత్తరాఖండ్
భౌగోళికం
భౌగోళికాంశాలు30°12′50″N 78°46′33″E / 30.214°N 78.77592°E / 30.214; 78.77592
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాశ్రీనగర్, ఉత్తరాఖండ్
రుద్రప్రయాగ
స్థలంకళ్యాసౌర్
ఎత్తు560 m (1,837 ft)
సంస్కృతి
దైవంకాళీ (ధారీ దేవి)
ముఖ్యమైన పర్వాలునవరాత్రి
వాస్తుశైలి
నిర్మాణ శైలులునార్త్ ఇండియన్ ఆర్కిటెక్చర్
చరిత్ర, నిర్వహణ
వెబ్‌సైట్livepahadi.com

ధారీ దేవి ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్‌ లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్, రుద్రప్రయాగ, అలకనంద నది ఒడ్డున ఉన్న హిందూ దేవాలయం. ఈ గుడిలోని దేవి రూపం ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధ స్త్రీగా మారుతూ పూజలందుకుంటుంది. [1]గర్భగుడిలో అమ్మవారి పై సగభాగం మాత్రమే ఉంటుంది. విగ్రహం క్రింది భాగం కాళీమఠ్ లో వుంది. ఇక్కడ ఆమెను కాళీ దేవిగా పూజిస్తారు. ఈ ఆలయం భారతదేశంలోని 108 శక్తి పీఠాలలో ఒకటి. ఆమె ఉత్తరాఖండ్ పోషక దేవతగా, చార్ ధామ్‌ ల రక్షకురాలిగా పరిగణించబడుతుంది . ఈ ఆలయం దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం నాటిది. ఈ ఆలయానికి పై కప్పు ఉండదు.[2]

చరిత్ర[మార్చు]

క్రీ.శ 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు. ఆ రాజు చేసిన అపచారంతో కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. దేవి మహత్మ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. దీనిని ఆదిశంకరాచార్యులు స్థాపించారు. ఈ పీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది.[3]

2013 ఉత్తరాఖండ్ వరదలు[మార్చు]

2013 జూన్ 16న అలకనంద హైడ్రో పవర్ కంపెనీ లిమిటెడ్ (ఎహెచ్ పిసిఎల్) నిర్మించిన 330 మెగావాట్ల అలకనంద హైడ్రో ఎలక్ట్రిక్ ఆనకట్ట నిర్మాణానికి మార్గం సుగమం చేయడానికి, అమ్మవారి మూల మందిరాన్ని తొలగించి, అలకనంద నదికి దాదాపు 611 మీటర్ల ఎత్తులో ఉన్న కాంక్రీట్ ప్లాట్‌ఫారమ్‌లోకి మార్చారు. యాదృచ్ఛికంగా, విగ్రహాన్ని తరలించిన కొన్ని గంటల తర్వాత, వర్షం ప్రారంభమయి, చాల రోజులు వర్షాలు పడి వరదలు వచ్చి కొండచరియలు విరిగి మొత్తం కొట్టుకుపోయింది. వరదల తర్వాత శిథిలావస్థకు చేరిన 330 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ కోసం దేవతను తన అసలు స్థలం (అసలు నివాసం) నుండి మార్చబడినందున ఆమె ఆగ్రహానికి గురైందని స్థానికుల, భక్తుల నమ్మకం. కొత్త ఆలయం ఇప్పుడు దాని అసలు స్థానంలో నిర్మించబడింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Maa Dhari devi ✅ District pauri near Srinagar Garhwal माँ धारी देवी श्रीनगर गढ़वाल - Uttarakhand HuB". 2020-02-20. Retrieved 2023-05-24.
  2. "Dhari Devi Temple Srinagar Uttarakhand - How To Reach Dhari Devi Temple". www.euttaranchal.com. Retrieved 2023-05-24.
  3. Telugu, TV9 (2021-02-14). "Dhari Devi Temple: ఓవైపు సైన్స్.. మరోవైపు విశ్వాసం.. ఉత్తరాఖండ్ విపత్తుకి ఆ దేవి విగ్రహం తరలింపునకు లింకేంటి?". TV9 Telugu. Retrieved 2023-05-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Dhari devi temple on river Alaknanda awaits relocation since 3 years". The Times of India. 2017-02-26. ISSN 0971-8257. Retrieved 2023-05-24.