నవీన శిలా యుగం
కొత్త రాతి యుగం [1] (లిస్టెనిను "న్యూ స్టోను ఏజి" అని కూడా పిలుస్తారు) రాతి యుగం చివరి విభాగం. ఇది సుమారు 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. " ఎపిపాలియోలిథికు నియరు ఈస్టులో " వ్యవసాయం మొదటి పరిణామాలు కనిపించాయి. తరువాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ విభాగం సుమారు 6,500 సంవత్సరాల క్రితం (క్రీ.పూ. 4500) నుండి చాల్‌కోలిథికు పరివర్తన కాలం వరకు కొనసాగింది. ఇది లోహశాస్త్రం అభివృద్ధి ద్వారా గుర్తించబడింది. ఇది కంచుయుగం, ఇనుప యుగంలకు దారితీసింది. ఉత్తర ఐరోపాలో కొత్తరాతియుగం క్రీ.పూ 1700 వరకు కొనసాగింది. చైనాలో ఇది క్రీ.పూ 1200 వరకు విస్తరించింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు (న్యూ వరల్డుతో సహా) " ఐరోపియన్ కాంటాక్టు " వరకు కొత్తరాతియుగం అభివృద్ధి దశలో విస్తృతంగా ఉన్నాయి.[2]
కొత్తరాతియుగం ప్రవర్తన సాంస్కృతిక లక్షణాలు, మార్పుల పురోగతిని కలిగి ఉంటుంది. వీటిలో అడవి, దేశీయ పంటలు, జంతువుల మచ్చిక చేసుకుని పెంపుడు జంతువులుగా వాడడం ఉన్నాయి.[a]
కొత్తరాతియుగం అనే పదం గ్రీకు నియోసు (అంటే "కొత్త"), (లాథోసు"రాయి") నుండి వచ్చింది. దీని అర్ధం "కొత్త రాతియుగం". ఈ పదాన్ని సరు జాను లుబ్బాకు 1865 లో మూడు-కాలపరిమితి వ్యవస్థను పేర్కొనడానికి ఉపయోగించారు.[3]
ప్రారంభం
[మార్చు]ఎ.ఎస్.పి.ఆర్.ఒ. కాలక్రమానుసారం కొత్తరాతియుగం క్రీస్తుపూర్వం 10,200 లో లెవాంటులో ప్రారంభమైంది. ఇది నాటుఫియను సంస్కృతి నుండి ఉద్భవించింది. అడవి తృణధాన్యాలు ఉపయోగించడం వ్యవసాయం ప్రారంభదశగా అభివృద్ధి అయింది. నాటుఫియను కాలం లేదా "ప్రోటో-కొత్తరాతియుగం" క్రీ.పూ 12,500 నుండి 9,500 వరకు కొనసాగింది. ఇది క్రీ.పూ 10,200–8800 నాటి ప్రొటో - కొత్తరాతియుగం (పిపిఎన్ఎ) తో అతివ్యాప్తి చెందడానికి తీసుకోబడింది. నాటుఫియన్లు వారి ఆహారంలో అడవి తృణధాన్యాలపై ఆధారపడటం, వారిలో నిశ్చల జీవన విధానం ప్రారంభమైంది. యంగరు డ్రైయసుతో (క్రీ.పూ 10,000 గురించి) సంబంధం ఉన్న వాతావరణ మార్పులు ప్రజలను వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేలా వత్తిడి చేశాయని భావిస్తున్నారు.
క్రీ.పూ 10,200–8800 నాటికి లెవాంటులో వ్యవసాయ సంఘాలు పుట్టుకొచ్చాయి. ఇవి ఆసియా మైనరు, ఉత్తర ఆఫ్రికా, ఉత్తర మెసొపొటేమియాకు వ్యాపించాయి. మెసొపొటేమియా క్రీ.పూ 10,000 నుండి కొత్తరాతియుగం విప్లవం ప్రారంభ పరిణామాల ప్రదేశంగా ఉంది.
ప్రారంభ కొత్తరాతియుగం వ్యవసాయం పరిమితం అయింది. ఇందులో ఐనుకార్ను గోధుమలు, చిరుధాన్యాలు, స్పెల్టు, కుక్కలను మచ్చిక చేయడం, గొర్రెలు, మేకలను ఉంచడం ఉన్నాయి. క్రీ.పూ 6900–6400 నాటికి, ఇందులో పెంపుడు పశువులు, పందులు, శాశ్వతంగా లేదా కాలానుగుణంగా నివసించే స్థావరాల స్థాపన, కుండల వాడకం ఉన్నాయి. [b]
కొత్తరాతియుగం ఈ సాంస్కృతిక అంశాలన్నీ ఒకే క్రమంలో ప్రతిచోటా కనిపించలేదు: నియరు ఈస్టులోని తొలి వ్యవసాయ సంఘాలు కుండలను ఉపయోగించలేదు. ఆఫ్రికా, దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా వంటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో స్వతంత్ర పెంపకం సంఘటనలు వారి స్వంత ప్రాంతీయ విలక్షణమైన కొత్తరాతియుగం సంస్కృతులకు దారితీశాయి. ఇవి ఐరోపా, నైరుతి ఆసియాలోని వారి నుండి స్వతంత్రంగా ఆవిర్భవించాయి. ప్రారంభ జపనీసూ సమాజాలు, ఇతర తూర్పు ఆసియా సంస్కృతులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ముందు కుండలను ఉపయోగించాయి.[5][6]
మట్టిపాత్రల తయారీ దశలు
[మార్చు]క్రీస్తుపూర్వం 10 వ సహస్రాబ్దిలో మధ్యప్రాచ్యంలో కొత్తరాతియుగంగా గుర్తించబడిన సంస్కృతులు కనిపించడం ప్రారంభించాయి.[7] ప్రారంభ అభివృద్ధి లెవాంటులో (ఉదా., ప్రీ-పాటరీ కొత్తరాతియుగం ఎ, ప్రీ-పాటరీ కొత్తరాతియుగం బి) జరిగింది. అక్కడ నుండి తూర్పు, పడమర వైపు వ్యాపించింది. కొత్తరాతియుగం సంస్కృతులు క్రీస్తుపూర్వం 8000 నాటికి ఆగ్నేయ అనటోలియా, ఉత్తర మెసొపొటేమియాలో ధృవీకరించబడ్డాయి.[ఆధారం చూపాలి]
చైనాలోని హెబీ ప్రావింసులోని యిక్సియను సమీపంలో ఉన్న చరిత్రపూర్వ బీఫుడి ప్రాంతం క్రీస్తుపూర్వం 6000–5000 నాటి సిషాను, జింగులాంగ్వా సంస్కృతులతో సమకాలీన సంస్కృతి శేషాలను కలిగి ఉంది. తైహాంగు పర్వతాలకు తూర్పున ఉన్న కొత్తరాతియుగం సంస్కృతులు, రెండు ఉత్తర చైనా సంస్కృతుల మధ్య ఉన్న పురావస్తు అంతరాన్ని నింపాయి. మొత్తం తవ్విన ప్రాంతం 1,200 చదరపు గజాల కంటే అధికం (1,000 హ 2; 0.10 హెక్టార్లు), ప్రాతాం వద్ద కొత్తరాతియుగం ఫలితాల సేకరణలో రెండు దశలు ఉన్నాయి.[8]
కొత్తరాతియుగం 1 - మట్టిపాత్రల పూర్వ కొత్తరాతియుగం ఏ (పి.పి.ఎన్.ఎ)
[మార్చు]కొత్తరాతియుగం 1 (పిపిఎన్ఎ) కాలం సుమారు క్రీ.పూ 10,000 లో లెవాంటులో ప్రారంభమైంది.[7] క్రీస్తుపూర్వం 9500 నాటి ఆగ్నేయ టర్కీలోని " గోబెక్లి టేపే వద్ద " ఒక ఆలయ ప్రాంతం ఈ కాలానికి ప్రారంభంగా పరిగణించబడుతుంది. ఈ స్థలాన్ని వేట-సేకరణ ఆధారిత జీవనం గడిపే ఆగ్నేయ టర్కీలోని తెగలు అభివృద్ధి చేశాయి. దీనికి సమీపంలో శాశ్వత గృహాలు ఋజువులు లేవు. ఇది మానవ నిర్మిత పురాతన ప్రార్థనా ప్రాంతం.[9]ఇది 25 ఎకరాల (10 హెక్టార్లు) విస్తీర్ణంలో కనీసం ఏడు రాతి వృత్తాలు, జంతువులు, కీటకాలు, పక్షులతో చెక్కబడిన సున్నపురాయి స్తంభాలను కలిగి ఉంటాయి. స్తంభాలను రూపొందించడానికి వందలాది మంది రాతి ఉపకరణాలను ఉపయోగించి పనిచేసారు. ఇవి పైకప్పులకు మద్దతు ఇస్తాయి. క్రీస్తుపూర్వం 9500–9000 నాటి ఇతర ప్రారంభ పిపిఎన్ఎ ప్రాంతాలు " టెల్ ఎస్-సుల్తాన్ " (పురాతన జెరిఖో), వెస్టు బ్యాంకు (ముఖ్యంగా ఐన్ మల్లాహా, నహలు ఓరెను, క్ఫరు హహోరేషు), జోర్డాను లోయలోని గిల్గాలు, లెబనాన్లోని బైబ్లోస్లలో కనుగొనబడ్డాయి. కొత్తరాతియుగం 1 ప్రారంభం తహూనియనులో వ్యాప్తి చెందింది.[ఆధారం చూపాలి]
కొత్తరాతియుగం 1 ప్రధాన పురోగతి నిజమైన వ్యవసాయం. ప్రోటో-కొత్తరాతియుగం నాటుఫియను సంస్కృతులలో అడవి తృణధాన్యాలు పండించబడ్డాయి. బహుశా ప్రారంభ విత్తనాల ఎంపిక, విత్తనాలను తిరిగి నాటడం సంభవించాయి. ధాన్యం పిండిలో వేయబడింది. ఎమ్మరు గోధుమలు పెంపకం చేయబడ్డాయి. జంతువులను మచ్చిక చేసుకుని మందలుగా పెంచడం సంభవించి ఉంటాయి.[ఆధారం చూపాలి]
2006 లో ఒక ఇంట్లో క్రీస్తుపూర్వం 9400 నాటి జెరిఖోలోని అత్తి పండ్ల అవశేషాలు కనుగొనబడ్డాయి. అత్తి పండ్లను పురుగుల ద్వారా పరాగసంపర్కం చేయబడలేదు. అందువల్ల చెట్లు కోత నుండి మాత్రమే పునరుత్పత్తి చేయగలవు. ఈ సాక్ష్యం అత్తి పండ్లను మొట్టమొదటిగా పండించిన పంట అని, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణను సూచిస్తుంది. ఇది మొదటి ధాన్యం సాగుకు శతాబ్దాల ముందు జరిగింది.[10]
వృత్తాకార గృహాలతో, నాటుఫియన్ల మాదిరిగానే, ఒకే గదులతో, స్థావరాలు మరింత శాశ్వతంగా మారాయి. అయితే ఈ ఇళ్ళు మొట్టమొదటిసారిగా మట్టితో తయారు చేయబడ్డాయి. ఈ స్థావరం చుట్టూ రాతి గోడ, బహుశా రాతి టవరు (జెరిఖోలో ఉన్నట్లు) ఉన్నాయి. గోడ సమీప సమూహాల నుండి రక్షణగా, వరదలు నుండి రక్షణగా లేదా జంతువులను రాయడానికి ఉపయోగపడింది. కొన్ని ఆవరణలు ధాన్యం, మాంసం నిల్వను కూడా సూచిస్తాయి.[11]
కొత్తరాతియుగం 2 - మాట్టిపాత్రల పూర్వ కొత్తరాతియుగం బి (పి.పి.ఎన్.బి)
[మార్చు]కొత్తరాతియుగం 2 (పి.పి.ఎన్.బి) లెవాంటు (జెరిఖో, వెస్టు బ్యాంకు) లోని " ఎ.ఎస్.పి.ఆర్.ఒ. క్రోనాలజీ " ఆధారంగా క్రీ.పూ 8800 లో ప్రారంభమైంది.[7] పిపిఎన్ఎ తేదీల మాదిరిగా పైన పేర్కొన్న ఒకే ప్రయోగశాలల నుండి రెండు వెర్షన్లు ఉన్నాయి. అయితే ఈ పరిభాష విధానం ఆగ్నేయ అనటోలియా, మధ్య అనటోలియా బేసిను స్థావరాలకి అనువర్తించడం లేదు. [ఆధారం చూపాలి]'ఐన్ గజలు ' అని పిలువబడే నియరు ఈస్టులోని అతిపెద్ద చరిత్రపూర్వ స్థావరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది సుమారుగా క్రీ.పూ 7250 నుండి సుమారు క్రీ.పూ 5000 వరకు మానవనివాసిత ప్రాంతంగా ఉంది.[12]
స్థావరాలలో దీర్ఘచతురస్రాకార మట్టి-ఇటుక ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ కుటుంబం ఒకే లేదా బహుళ గదులలో కలిసి ఉండేది. ఖననం గురించి కనుగొన్న విషయాలు పూర్వీకుల ఆరాధనను సూచిస్తాయి. ఇక్కడ ప్రజలు చనిపోయినవారి పుర్రెలను సంరక్షించారు, వీటిని ముఖ లక్షణాలను చేయడానికి మట్టితో ప్లాస్టరు చేశారు. ఎముకలు మాత్రమే మిగిలిపోయే వరకు మిగిలిన శవాన్ని స్థావరం వెలుపల వదిలివేయవచ్చు. తరువాత ఎముకలు నేల క్రింద లేదా ఇళ్ళ మధ్య స్థావరం లోపల ఖననం చేయబడ్డాయి.[ఆధారం చూపాలి]
కొత్తరాతియుగం 3 మట్టిపాత్రల కొత్తరాతియుగం (పి.ఎన్)
[మార్చు]కొత్తరాతియుగం 3 (పిఎన్) సారవంతమైన భూభాగంలో క్రీ.పూ 6,400 లో ప్రారంభమైంది.[7] అప్పటికి హలాఫియను (టర్కీ, సిరియా, ఉత్తర మెసొపొటేమియా) ఉబైదు (దక్షిణ మెసొపొటేమియా) వంటి కుండలతో విలక్షణమైన సంస్కృతులు వెలువడ్డాయి. ఈ కాలాన్ని కొన్ని ప్రాంతాలలో పిఎన్ఎ (పాటరీ కొత్తరాతియుగం ఎ), పిఎన్బి (పాటరీ కొత్తరాతియుగం బి) గా విభజించారు. [13]చాల్కోలిథికు (తామ్ర శిలా యుగం ) కాలం క్రీ.పూ 4500 లో ప్రారంభమైంది. తరువాత నవీన శిలా యుగం సంస్కృతుల స్థానంలో క్రీ.పూ 3500 లో కంచుయుగం ప్రారంభమైంది.[ఆధారం చూపాలి]
కాలానుగుణప్రాంతాలు
[మార్చు]పశ్చిమ ఆసియా
[మార్చు]వ్యవసాయ శకం
[మార్చు]క్రీస్తుపూర్వం 10,000 లో మొదటి-కుమ్మరి కొత్తరాతియుగం ఎ (పిపిఎన్ఎ) దశకు చెందిన మొట్టమొదటి పూర్తిగా అభివృద్ధి చెందిన కొత్తరాతియుగం సంస్కృతులలో సారవంతమైన వ్యవసాయవిధానం కనిపించింది.[7] క్రీస్తుపూర్వం 10,700–9400 లో అలెప్పోకు ఉత్తరాన 10 మైళ్ళు (16 కి.మీ) టెలు కరామెలులో ఒక స్థావరం స్థాపించబడింది. ఈ స్థావరంలో క్రీ.పూ 9650 నాటి రెండు దేవాలయాలు ఉన్నాయి.[14]ఇది పిపిఎన్ఎ సమయంలో క్రీ.పూ 9000 లో ప్రపంచంలోని మొట్టమొదటి పట్టణాలలో ఒకటైన జెరిఖో లెవాంటులో కనిపించింది. దీని చుట్టూ రాతి గోడ ఉంది. ఇందులో 2000–3000 జనాభా, భారీ రాతి గోపురం ఉన్నాయి.[15] క్రీస్తుపూర్వం 6400 లో సిరియా, ఉత్తర మెసొపొటేమియాలో " హలాఫు సంస్కృతి " కనిపించింది.
1981 లో మైసను డి ఎల్ ఓరియంటు ఎట్ డి లా మాడిటెరానీ పరిశోధకుల బృందం, జాక్వెసు కావిను, ఆలివరు ఔరేంచె నవీన తూరఉ రాతియుగం కాలాలను సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక లక్షణాల ఆధారంగా పది కాలాలుగా (0 నుండి 9 వరకు) విభజించారు.
[16] 2002 లో డేనియలు స్టోర్డూరు, ఫ్రెడెరికు అబ్బెసు ఈ వ్యవస్థను ఐదు కాలాలుగా విభజించారు.
- క్రీస్తుపూర్వం 12,000, 10,200 మధ్య నాటుఫియను,
- క్రీస్తుపూర్వం 10,200, 8800 మధ్య ఖిమియను, పిపిఎన్ఎ: సుల్తానియను (జెరిఖో), మురేబెటియను,
- క్రీ.పూ 8800, 7600 మధ్య ప్రారంభ పిపిఎన్‌బి (పిపిఎన్‌బి యాన్సీను), మధ్య పిపిఎన్‌బి (పిపిఎన్‌బి మోయెను) 7600 - 6900 బిసి మధ్య,
- క్రీస్తుపూర్వం 7500 - 7000 మధ్య పిపిఎన్‌బి (పిపిఎన్‌బి రీసెంటు)
- ఒక పిపిఎన్బి (కొన్నిసార్లు పిపిఎన్సి అని పిలుస్తారు) పరివర్తన దశ (పిపిఎన్బి ఫైనల్), దీనిలో హలాఫు " నల్లటి ముఖాలు కలిగిన కాల్చిన పాత్రలు " వాడకం క్రీ.పూ 6900, 6400 మధ్య ప్రారంభమవుతుంది.[17]
- జెర్ఫు ఎల్ అహ్మరు టెలు అస్వాదు వంటి ప్రాంతాలలో క్రీ.పూ 8800, 8600 మధ్య పిపిఎన్ఎ, పిపిఎన్బి మధ్య పరివర్తన దశ ఉందని ప్రతిపాదించాడు.[18]
దక్షిణ మెసపొటేమియా
[మార్చు]సారవంతమైన మైదానాలు (సుమేరు (ఎలాం)) తక్కువ వర్షపాతం, నీటిసరఫరాను మెరుగుపరచవలసిన అవసరం కల్పించింది. క్రీ.పూ. 6,900 నాటికి ఇది ఉబైదు సంస్కృతిగా ఆరంభం అయింది.[ఆధారం చూపాలి]
ఉత్తర ఆఫ్రికా
[మార్చు]క్రీ.పూ 6000 లోనే తూర్పు నుండి గొర్రెలు, మేకల పెంపకం ఈజిప్టుకు చేరుకుంది.[19][20][21] గ్రేం బార్కరు ఇలా పేర్కొన్నాడు "నైలు లోయలో క్రీ.పూ 500 వరకు ఉత్తర ఈజిప్టులో దేశీయ మొక్కలు, జంతువుల పెంపకం గురించిన వివాదరహితమైన సాక్ష్యం లేదు. 1000 సంవత్సరాల తరువాత వరకు దక్షిణం ప్రాంతాలలో లేదు. ఈ రెండు సందర్భాలలో ఇప్పటికీ చేపలు పట్టడం, వేట, అడవి మొక్కల సేకరణ మీద అధికంగా ఆధారపడ్డారు " సమీప తూర్పు నుండి వలస వచ్చిన రైతుల వల్ల ఈ జీవనాధార మార్పులు సంభవించలేదు. అయితే ఇది స్థానిక తృణధాన్యాలు అభివృద్ధి, వస్తు మార్పిడి ద్వారా వీటిని పొందవచ్చు అని సూచిస్తుంది. [22] ఈజిప్టులో వ్యవసాయం, పెంపుడు జంతువులకు (అలాగే మట్టి-ఇటుక నిర్మాణం, ఇతర కొత్తరాతియుగం సాంస్కృతిక లక్షణాలు) ప్రాధమిక ప్రేరణ మధ్యప్రాచ్యం నుండి వచ్చినదని ఇతర విద్యావేత్తలు వాదించారు. [23][24][25]
ఐరోపా
[మార్చు]క్రీస్తుపూర్వం 7 వ సహస్రాబ్దిలో ఆగ్నేయ ఐరోపాలో మొదటి వ్యవసాయ సమాజాలు మొదట కనిపించాయి. ఆగ్నేయ అల్బేనియాలోని వష్టమిలో కనుగొన వ్యవసాయ ప్రదేశం తొలి వ్యవసాయ ప్రాంతాలలో ఒకటిగా (క్రీ.పూ 6500) ధృవీకరించబడింది.[26][27]వాయువ్య ఐరోపాలో దాదాపు 3,000 సంవత్సరాలు ఉనికిలో (క్రీ.పూ.4500 - క్రీ.పూ 1700)ఉంది.
క్రీస్తుపూర్వం 6000 నుండి బాల్కన్లలో,[28]మధ్య ఐరోపాలో క్రీ.పూ 5800 నాటికి ఆంత్రోపోమోర్ఫికు బొమ్మలు కనుగొనబడ్డాయి (లా హోగుయెట్). ఈ ప్రాంతం మొట్టమొదటి సాంస్కృతిక సముదాయాలలో థెస్సాలీలోని సెసుక్లో సంస్కృతి ఉన్నాయి. తరువాత ఇది బాల్కన్లలో విస్తరించింది. ఇది స్టారుసెవో-కోరసు (క్రిసు), లీనియరు బ్యాండు రామికు, విన్కా సంస్కృతులు అభివృద్ధి చెందడానికి దారితీసింది. సాంస్కృతిక విస్తరణ, ప్రజల వలసల కలయిక ద్వారా, కొత్తరాతియుగం సంప్రదాయాలు పశ్చిమం, ఉత్తరం వైపు విస్తరించి క్రీ.పూ 4500 నాటికి వాయువ్య ఐరోపాకు చేరుకున్నాయి. విన్కా సంస్కృతి మొట్టమొదటి రచనా వ్యవస్థ అయిన విన్కా సంకేతాలను సృష్టించి ఉండవచ్చు. అయినప్పటికీ పురావస్తు శాస్త్రవేత్త షాను విను వారు నిజంగా అభివృద్ధి చెందిన రచనల కంటే పిక్టోగ్రాం, ఐడియోగ్రాంల అభివృద్ధికి కృషిచేసారని విశ్వసిస్తున్నారు.[29]
కుకుటేని-ట్రిపిలియను సంస్కృతి రొమేనియా, మోల్డోవా, ఉక్రెయిన్లలో క్రీ.పూ 5300 - 2300 వరకు అపారమైన స్థావరాలను నిర్మించింది. మధ్యధరా ద్వీపమైన గోజో (మాల్టీస్ ద్వీపసమూహంలో), మ్నాజద్రా (మాల్టా) లోని అగంటిజా మెగాలిథికు ఆలయ సముదాయాలు వాటి భారీ కొత్తరాతియుగం నిర్మాణాలకు ప్రసిద్ది చెందాయి. వీటిలో క్రీ.పూ 3600 నాటి పురాతనమైనవి నిర్మాణాలు ఉన్నాయి. మాల్టాలోని పావోలాలో క్రీ.పూ 2500 నాటి మాల్ - సఫ్లియేని హైపోజియం అనే ఒక భూగర్భ నిర్మాణం తవ్వి వెలికితీయబడింది. ఇది ప్రపంచంలోని ఏకైక చరిత్రపూర్వ భూగర్భ దేవాలయం అయిన నెక్రోపోలిసుగా గుర్తించబడుతుంది. ఇది మాల్టీసు ద్వీపాల పూర్వ చరిత్రలో ప్రత్యేకమైన రాతి శిల్పకళలో కళాత్మకత స్థాయిని చూపిస్తుంది. క్రీస్తుపూర్వం 2500 తరువాత ఈ ద్వీపాలు కాంస్య యుగం వలసదారుల ప్రవాహం వచ్చే వరకు అనేక దశాబ్దాలుగా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఈ సంస్కృతి చనిపోయినవారికి దహన సంస్కారాలు చేసింది. వీరు మాల్టాలో డాల్మెన్సు అని పిలువబడే చిన్న మెగాలిథికు నిర్మాణాలను ప్రవేశపెట్టారు.[30] వీటిలో అధికంగా పెద్ద శ్లాబుతో కప్పబడిన చిన్న చిన్న రాతి గదులు ఉన్నాయి. గతంలో మెగాలిథికు ఆలయాలను నిర్మించిన ప్రజలు వీటిని నిర్మించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న మాల్టీసు డోలెమను నిర్మాణాలు ఇక్కడ సిసిలీ ప్రజలు నివసించారని సూచిస్తున్నాయి.[31]
దక్షిణ, తూర్పు ఆసియాలు
[మార్చు]క్రీస్తుపూర్వం 7,000 లో దక్షిణ ఆసియాలో పాకిస్తాన్లోని బలూచిస్తాను ప్రాంతంలో స్థిర జీవితం, జీవనాధారం కొరకు ఆహారం సంపాదించడానికి వ్యవసాయం విధానానికి పరివర్తన, మతసంబంధమైన పరివర్తనను ప్రారంభమైంది.[32][33][34] బెలూచిస్తాన్లోని మెహర్గరు ప్రదేశంలో గోధుమలు, బార్లీల పెంపకం గురించి నమోదు చేయవచ్చు. వేగంగా మేకలు, గొర్రెలు, పశువుల పెంపకం అధికరించింది.[35] 2006 ఏప్రెలులో నేచరు అనే శాస్త్రీయ పత్రికలో వివోలో రంద్రం చేయబడిన దంతాల (విల్లు, చెకుముకి చిట్కాలను ఉపయోగించి రంద్రం చేయబడి ఉండవచ్చు) పురాతన (మొదటి ప్రారంభ కొత్తరాతియుగం) ఆధారాలు మెహర్గరులో కనుగొనబడ్డాయి.[36]
క్రీస్తుపూర్వం 6500 నాటికి దక్షిణ భారతదేశంలో కొత్తరాతియుగం ప్రారంభమై మెగాలిథికు పరివర్తన కాలం ప్రారంభమయ్యే వరకు (క్రీ.పూ 1400 వరకు) కొనసాగింది. దక్షిణ భారత కొత్తరాతియుగం కర్ణాటక ప్రాంతంలో క్రీ.పూ 2500 నుండి యాషు మట్టిదిబ్బలు [విడమరచి రాయాలి] తరువాత తమిళనాడు వరకు విస్తరించింది.[37]
తూర్పు ఆసియాలో, క్రీ.పూ 9500–9000లో నాన్జువాంగ్టౌ సంస్కృతి,[38] క్రీ.పూ 7500–6100 మద్యకాలంలో పెంగ్టౌషాను సంస్కృతి, క్రీ.పూ 7000–5000 మద్యకాలంలో పీలిగాంగు సంస్కృతి ఉన్నాయి.
'కొత్తరాతియుగం' (పాలిషు చేసిన రాతి పనిముట్లను ఉపయోగించడం ఈ పేరాలో నిర్వచించబడింది) చిన్న సమాజంగా సులువుగా చేరుకోలేని భూభాగం అయిన వెస్టు పాపువా (ఇండోనేషియా న్యూ గినియా) ప్రజల జీవన సంప్రదాయంగా మిగిలిపోయింది. లోహపు పరికరాల లభ్యత పరిమిత ప్రాంతాలలో ప్రస్తుతకాలం వరకు (2008 నాటికి) మెరుగు చేసిన రాతి గొడ్డలి, గొడ్డలిని ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో లోహాలు పరిమితంగా ఉన్నాయి. పాత తరం చనిపోవడం, స్టీలు బ్లేడ్లు, గొలుసు రంపం ప్రబలంగా ఉండటంతో రాబోయే కొద్ది సంవత్సరాలలో ఇది పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది.
2012 లో దక్షిణ కొరియాలోని మునాం-రి, గోసోంగు, గాంగ్వాను ప్రావిన్సు, కనుగొనబడిన ఒక కొత్త వ్యవసాయ స్థలం గురించి వార్తలు విడుదలయ్యాయి. ఇది తూర్పు ఆసియాలో ఇప్పటివరకు తెలిసిన తొలి వ్యవసాయ భూములు కావచ్చు.[39] "కొత్తరాతియుగం కాలానికి చెందిన వ్యవసాయ క్షేత్రం అవశేషాలు ఇంతకుముందు ఏ తూర్పు ఆసియా దేశంలోనూ కనుగొనబడలేదు. ఇన్స్టిట్యూటు మాట్లాడుతూ " కొరియా ద్వీపకల్పంలో వ్యవసాయ సాగు చరిత్ర కనీసం ప్రారంభమైందని ఈ ఆవిష్కరణ వెల్లడించింది".[40] ఈ పొలం క్రీ.పూ 3600 - 3000 మధ్య నాటిది. కుండలు, రాతి ఉపకరణ తయారీ కేంద్రాలు, ఇళ్ళు కూడా కనుగొనబడ్డాయి. "2002 లో పరిశోధకులు ఈ ప్రాంతంలోని ఇతర వస్తువులలో చరిత్రపూర్వ మట్టి పాత్రలు, జాడే చెవిపోగులు కనుగొన్నారు". ప్రాంతం గురించిన మరింత ఖచ్చితమైన తేదీని తిరిగి పొందడానికి పరిశోధనా బృందం యాక్సిలరేటరు మాస్ స్పెక్ట్రోమెట్రీ (ఎ.ఎం.ఎస్) డేటింగు చేస్తుంది.
అమెరికా ఖండాలు
[మార్చు]మెసోఅమెరికాలో, క్రీస్తుపూర్వం 4500 నాటికి ఇదే విధమైన సంఘటనలు (పంటల పెంపకం, నిశ్చల జీవనశైలి) సంభవించాయి, కాని బహుశా క్రీ.పూ 11,000–10,000 నాటికి. ఈ సంస్కృతులను సాధారణంగా కొత్తరాతియుగంకు చెందినవిగా సూచించబడలేదు. అమెరికాలో మధ్య-కొత్తరాతియుగంకు బదులుగా ఫార్మేటివు స్టేజి, ఎర్లీ కొత్తరాతియుగంకు బదులుగా ఆర్చియాయికు ఎరా, మునుపటి కాలానికి పాలియో-ఇండియను వంటి పదాలను ఉపయోగించారు.[41] నిర్మాణ దశ యూరపు, ఆసియా, ఆఫ్రికాలో ఫార్మేటివు స్టేజి పదానికి బదులుగా కొత్తరాతియుగం విప్లవ కాలం అనే పదం వాడారు. నైరుతి యునైటెడు స్టేట్సులో ఇది 500 నుండి 1200 వరకు సంభవించింది. ఈ కాలంలో వేగవంతంగా అభివృద్ధి చెందిన కారణంగా గ్రామాలు అభివృద్ధి చెంది మెట్ట భూములలో మొక్కజొన్న వ్యవసాయం, తరువాత బీన్సు, స్క్వాషు, టర్కీల పెంపకం ప్రజల జీవనాధారానికి మద్దతు ఇచ్చింది. ఈ కాలంలో విల్లు, బాణం, సిరామికు కుండలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి.[42] తరువాతి కాలంలో గణనీయమైన పరిమాణంలో ఉండే నగరాలు అభివృద్ధి చెందాయి. 700 నాటికి లోహశాస్త్రం ప్రారంభం అయింది.[43]
ఆస్ట్రేలియా
[మార్చు]న్యూ గినియాకు విరుద్ధంగా ఆస్ట్రేలియాకు సాధారణంగా కొత్తరాతియుగం కాలం ఉండదని ఐరోపియన్లు రాక వరకు వేట-సేకరణ జీవనశైలి కొనసాగుతూనే ఉంది. వ్యవసాయం నిర్వచనం పరంగా ఈ అభిప్రాయాన్ని సవాలు చేయవచ్చు. కాని "కొత్తరాతియుగం" ఆస్ట్రేలియను చరిత్రను చర్చించడంలో చాలా అరుదుగా ఉపయోగించబడే, చాలా ఉపయోగకరమైన భావనగా మిగిలిపోయింది.[44]
సాంస్కృతిక లక్షణాలు
[మార్చు]సంఘిక నిర్మాణం
[మార్చు]కొత్తరాతియుగం యుగంలో యురేషియా చాలా ప్రజలు వంశాలతో కూడిన చిన్న తెగలలో బహుళ బృందాలుగా నివసించారు.[45]
కొత్తరాతియుగం సమాజాలలో అభివృద్ధి చెందిన సామాజిక స్థిరీకరణకు శాస్త్రీయ ఆధారాలు తక్కువగా ఉన్నాయి; సాంఘిక స్థిరీకరణ తరువాతి కాంస్య యుగంతో ముడిపడి ఉంది.[46] కొన్ని చివరి యురేషియను కొత్తరాతియుగం సమాజాలు సంక్లిష్టమైన స్థిరీకరించిన ప్రధాన రాజ్యాలను ఏర్పరచుకున్నప్పటికీ సాధారణంగా యురేషియాలో లోహశాస్త్రం పెరుగుదలతో మాత్రమే రాజ్యాలు అభివృద్ధి చెందాయి. మొత్తం మీద చాలా కొత్తరాతియుగం సమాజాలు సరళమైనవి, సమతౌల్యమైనవిగా ఉండేవి.[45] స్థానిక కొత్తరాతియుగం సమయంలో యురేషియాతో మూడు ప్రాంతాలలో రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి ప్రీసెరామికు అండీసు విత్ ది నార్టే చికో సివిలైజేషను,[47][48] ఫార్మేటివ్ మెసో అమెరికా, ప్రాచీన హవాయి. [49] ఏది ఏమయినప్పటికీ చాలా కొత్తరాతియుగం సమాజాలు వాటికి ముందు ఉన్న ఎగువ పాలియోలిథికు సంస్కృతుల కంటే అధిక క్రమానుగతవిగా ఉండేవి.[50][51]
పెద్ద జంతువుల పెంపకం (క్రీ.పూ. 8000) ఫలితంగా అనూహ్యంగా చాలా ప్రాంతాలలో సామాజిక అసమానత అధికరించింది; ఇందులో న్యూ గినియా ఒక ముఖ్యమైన మినహాయింపు.[52] పశువులను మచ్చిక చేసుకోవడం గృహాల మధ్య పోటీని అనుమతించింది. ఫలితంగా సంపదలో అసమానతలు వచ్చాయి. పెద్ద మందలను నియంత్రించే కొత్తరాతియుగం పాస్టోరలిస్టులు క్రమంగా ఎక్కువ పశువులను సంపాదించారు. ఇది ఆర్థిక అసమానతలను మరింత స్పష్టంగా చూపించింది.[53] ఏది ఏమయినప్పటికీ సామాజిక అసమానత సాక్ష్యాలు ఇప్పటికీ వివాదాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే " కాటలు హుయుకు" వంటి స్థావరాలలోని గృహాలు, శ్మశాన వాటికల పరిమాణంలో గణనీయమైన వ్యత్యాసాన్ని వెల్లడిస్తున్నాయి. మూలధనం సంబంధిత ఆధారాలు లేనప్పటికీ మరింత సమతౌల్య సమాజాన్ని సూచిస్తున్నాయి. అయినప్పటికీ కొంచెం పెద్దది లేదా ఇతరులకన్నా విస్తృతంగా అలంకరించబడిన కొన్ని గృహాలు ఉండేవి.
కుటుంబాలు, గృహాలు ఆర్థికంగా చాలా స్వతంత్రంగా ఉన్నాయి. ఇల్లు బహుశా జీవిత కేంద్రంగా ఉండేది.[54][55] అయినప్పటికీ మధ్య ఐరోపాలో జరిపిన త్రవ్వకాలలో ప్రారంభ కొత్తరాతియుగం లీనియరు సిరామికు సంస్కృతులు ("లీనియర్బ్యాండు కెరామికు") క్రీ.పూ 4800 - 4600 మధ్య కాలంలో నిర్మించిన వృత్తాకార గుంటలు బహిర్గతమయ్యాయి. ఈ నిర్మాణాలకు ( కాజ్వేడు ఎన్క్లోజర్లు, శ్మశానవాటికలు, హెంజి వంటి నిర్మాణాల తరువాత) నిర్మించడానికి గణనీయమైన సమయం, శ్రమ అవసరం. కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులు మానవ శ్రమను నిర్వహించడానికి, నిర్దేశించగలిగారు అని సూచిస్తుంది - అయినప్పటికీ క్రమానుగత, స్వచ్ఛంద శ్రమదానం అవకాశాలు ఉండవచ్చు.
రైనె ప్రాంతంలో లీనియర్బ్యాండుకెరామికు ప్రాంతాలలో బృహత్తరమైన బలవర్థకమైన స్థావరాల సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే కనీసం కొన్ని గ్రామాలకు కొంతకాలం పాలిసేడు కందకంతో బలపరచబడ్డాయి.[56][57] టాల్హీం డెత్ పిట్ వద్ద దొరికిన పాలిసేడ్లు, ఆయుధ-గాయాలు పడిన ఎముకలతో కూడిన స్థావరాలు కనుగొనబడ్డాయి. " సమూహాల మధ్య క్రమబద్ధమైన హింస" జరిగడానికి సాక్ష్యంగా ఉన్నాయి. ఇవి యుద్ధం బహుశా పూర్వ పాలియోలిథికు కాలంలో కంటే కొత్తరాతియుగం సమయంలో చాలా సాధారణం అనడానికి సాక్ష్యంగా ఉన్నాయి.[51] ఇది లీనియరు పాటరీ సంస్కృతి "ప్రశాంతమైన, ధృవీకరించని జీవనశైలి" గా జీవించే మునుపటి అభిప్రాయాన్ని భర్తీ చేసింది. [58][58]
కార్మిక నియంత్రణ - అంతరు-సమూహ సంఘర్షణ సామాజిక హోదా కలిగిన గిరిజన సమూహాల లక్షణం ఒక ఆకర్షణీయమైన వ్యక్తి - 'పెద్ద మనిషి' లేదా ప్రోటో-అధిపతి - వంశం-సమూహ అధిపతిగా పనిచేయడానికి అవకాశం ఉందని భావించారు. క్రమానుగత సంస్థ వ్యవస్థ ఉనికిలో ఉందా అనేది చర్చనీయాంశంగా ఉంది. ఐరోపా ప్రధాన రాజ్యాలలో ప్రారంభ కాంస్య యుగం ఉన్నట్లుగా, కొత్తరాతియుగం సమాజాలు ఆధిపత్య తరగతి లేదా అధిపతి ఆధ్వర్యంలో పనిచేసాయో స్పష్టంగా సూచించే ఆధారాలు లేవు.[59]
కొత్తరాతియుగం (పాలియోలిథికు) సమాజాల సమతౌల్యతను వివరించే స్పష్టమైన సిద్ధాంతాలు తలెత్తాయి. ముఖ్యంగా ఆదిమ కమ్యూనిజం మార్క్సిస్టు భావనగా భావిస్తున్నారు.
ఆశ్రయం
[మార్చు]ఎగువ పాలియోలిథికు నుండి కొత్తరాతియుగం యుగం నాటికి ప్రారంభ ప్రజల ఆశ్రయం గణనీయంగా మారింది. పాలియోలిథికులో ప్రజలు సాధారణంగా శాశ్వత నిర్మాణాలలో నివసించరు. కొత్తరాతియుగంలో ప్రజలు మట్టిపూత పూసిన మట్టి ఇటుక ఇళ్ళు నిర్మించడం ప్రారంభించారు. [60] వ్యవసాయం వృద్ధి శాశ్వత గృహాలను సాధ్యం చేసింది. ఇళ్ళు లోపల, వెలుపల నిచ్చెనలతో పైకప్పు మీద తలుపులు తయారు చేయబడ్డాయి.[60] పైకప్పు లోపలి నుండి కిరణాలు లోపలకు ప్రసరించేలా ఈ గృహాలు నిర్మించబడ్డాయి. కఠినమైన భూమి వేదికలు, చాపలు, చర్మంతో (నిద్రించడానికి) కప్పబడి ఉంది.[61] ఆల్పైను, పియానురా పదనా (టెర్రామరే) ప్రాంతంలో స్టిల్టు-హౌసుల స్థావరాలు సాధారణం.[62] స్లోవేనియాలోని " లుబ్బ్జానా మార్షెసు " సమీపంలో, ఎగువ ఆస్ట్రియాలోని మోండ్సీ, అటర్సీ సరస్సుల వద్ద వీటి అవశేషాలు కనుగొనబడ్డాయి.
వ్యవసాయం
[మార్చు]పంటల పెంపకం, సాగు కొరకు అన్వేషిస్తూ మొదట అభివృద్ధి చేయబడిన ప్రాంతాలలో మానవ జీవనాధారం, జీవనశైలిలో గణనీయమైన, దూరప్రాంత మార్పు తీసుకురాబడింది: సంచార వేట-సేకరణ జీవనాధార సాంకేతికత, మతసంబంధమైన మార్పు మునుపటి జీవనాధారమార్గాలు కొత్తవిధానాలతో భర్తీ చేయబడ్డాయి. తరువాత సాగు భూముల నుండి ఉత్పత్తి చేయబడిన ఆహారాలపై ఆధారపడటం ప్రారంభం అయింది. ఈ పరిణామాలు స్థావరాల వృద్ధిని బాగా ప్రోత్సహించాయని విశ్వసిస్తున్నారు. పంట పొలాల పెంపకంలో ఎక్కువ సమయం, శ్రమను ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది కనుక స్థానికీకరించిన నివాసాల అవసరం ఏర్పడి ఉండవచ్చు అని భావించవచ్చు. ఈ ధోరణి కాంస్య యుగంలో కొనసాగింది. చివరికి సాగుభూల ఉత్పాతకతతో అధికరించిన జనసమూహం కారణంగా శాశ్వతంగా స్థిరపడిన వ్యవసాయ పట్టణాలు, తరువాత నగరాలు, రాజ్యాలు అభివృద్ధి చేయబడ్డాయి.
కొత్తరాతియుగం ప్రారంభ వ్యవసాయ పద్ధతుల ప్రారంభంతో సంబంధం ఉన్న మానవ పరస్పర చర్యలలో, జీవనాధార పద్ధతులలో సంభవించిన తీవ్ర వ్యత్యాసాలను కొత్తరాతియుగం విప్లవం అని పిలుస్తారు. ఈ పదాన్ని 1920 లలో ఆస్ట్రేలియను పురావస్తు శాస్త్రవేత్త " వెరే గోర్డాను చైల్డు " సృష్టించాడు.
వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, పెరుగుతున్న అధునాతనత కారణంగా ప్రయోజనంతో మిగులు పంట దిగుబడిని ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది. సమాజంలోని తక్షణ అవసరాలకు మించి ఆహార సరఫరా ఏర్పడిన ఫలితంగా మిగులును తరువాత ఉపయోగం కోసం నిల్వ చేయడం, ఇతర అవసరాలు లేదా విలాసాల కోసం వర్తకం చేయడం అనే విధానాలు ప్రారంభం అయ్యాయి. ఈ మార్పుల ఫలితంగా ప్రజలకు సంచార జీవితంలో సాధ్యం కాని సంరక్షణను వ్యవసాయజీవితం ఇచ్చింది. స్థిరమైన వ్యవసాయ జనాభా సంచార జాతుల కంటే వేగంగా అభివృద్ధి చెందింది.
అయినప్పటికీ కరువు లేదా తెగుళ్ళ వల్ల సంభవించే ఆహారకొరత కాలంలో ప్రారంభ రైతులను ప్రతికూల ప్రభావితం అయ్యారు. వ్యవసాయం ప్రధాన జీవన విధానంగా మారిన సందర్భాలలో ప్రజలజీవన విధానాన్ని ఈ కొరతలు తీవ్రంగా ప్రభావితం చేసాయి. ముందస్తు వేట-సేకరణ వర్గాలు ఈ కరువును అనుభవించకపోవచ్చు.[53] ఏదేమైనా వ్యవసాయ సంఘాలు కొనసాగాయి. వారి పెరుగుదల, సాగు కింద భూభాగం వరకు విస్తరించడం కొనసాగింది.
కొత్తగా అనేక వ్యవసాయ వర్గాలు చేసిన మరో ముఖ్యమైన మార్పులో ఆహారవిధానాలలో సంభవించిన మార్పు ఒకటిగా భావించబడింది. వ్యవసాయ పూర్వ సమాజాలలో ప్రాంతం, సీజను, అందుబాటులో ఉన్న స్థానిక మొక్క, జంతు వనరులు, మతసంబంధమైన విధానాలు, వేట ఆధారిత ఆహారవిధానాలు ఉండేవి. వ్యవసాయ అనంతర ఆహారం పండించిన తృణధాన్యాలు, మొక్కలు, వైవిధ్యమైన పెంపుడు జంతువులు, జంతు ఉత్పత్తులకు పరిమితం మొదలైన సమిష్టి జీవనవిధానం అభివృద్ధికి దారితీసింది. భూమిని స్వతంచేసుకునే సామర్ధ్యం, జనాభా పెరుగుదల, అధిక నిశ్చలమైన స్థానిక జనాభా కేంద్రీకృతం అయింది. కొన్ని సంస్కృతులలో పిండి పదార్ధం, మొక్కల మాంసకృత్తులకు ఆహారంలో ప్రాధాన్యత ఇవ్వడం వంటి గణనీయమైన మార్పులు సంభవించాయి. ఈ ఆహార మార్పుల పోషక ప్రయోజనాలు, లోపాలు, ప్రారంభ సామాజిక అభివృద్ధి మీద వాటి ప్రభావం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి.
అదనంగా పెరిగిన జనసాంద్రత, జనాభా చైతన్యం తగ్గడం, పెంపుడు జంతువులకు నిరంతర సామీప్యత, తులనాత్మకంగా జనసాంధ్రతా నిరంతర వృద్ధి పారిశుద్ధ్య అవసరాలు, వ్యాధి నమూనాలను మార్చాయి.
లిథికు సాంకేతికత
[మార్చు]పాలియోలిథికు యుగంలో ఉపయోగించిన ఫ్లాక్డు రాతి సాధనాలకు భిన్నంగా కొత్తరాతియుగం యుగంలో సాంకేతికాపరంగా అభివృద్ధి చెందిన మెరుగుపెట్టబడిన రాతి ఉపకరణాలు ఉపయోగించడం ప్రారంభించారు.
కొత్తరాతియుగం ప్రజలు నైపుణ్యం కలిగిన రైతులు, పంటల పెంపకం, కోత, ప్రాసెసింగు (కొడవలి, తిరుగలి రాళ్ళు వంటివి), ఆహార ఉత్పత్తి (ఉదా. కుండలు, ఎముక పనిముట్లు) కోసం అవసరమైన సాధనాలను తయారు చేశారు. వారు ఇతర రకాల రాతి ఉపకరణాలు, ఆభరణాలు (పూసలు, విగ్రహాలతో సహా ఇతర రకాల రాతి పనిముట్లు) ఆభరణాల తయారుచేయడంలో నైపుణ్యం కలిగిన తయారీదారులు. కానీ అటవీ నిర్మూలనకు మిగతా అన్ని సాధనాల కంటే పాలిషు చేసిన రాతి గొడ్డలి ఉపయోగించబడింది. ఉదాహరణకు ఆశ్రయం, నిర్మాణాలు, పడవలకు కలపను తయారు చేయడం కొత్తగా గెలిచిన వ్యవసాయ భూములను పంటలను ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించింది.
లెవాంటు, అనటోలియా, సిరియా, ఉత్తర మెసొపొటేమియా, మధ్య ఆసియాలోని కొత్తరాతియుగం ప్రజలు కూడా ఇళ్ళు, గ్రామాలను నిర్మించడానికి మట్టి-ఇటుకను ఉపయోగించి భవనాలు నిర్మించారు. కాటలుహోయుకు వద్ద పూతపూయబడిన ఇళ్ళు మానవులు జంతువుల విస్తృతమైన దృశ్యాలతో చిత్రీకరించబడ్డాయి. ఐరోపాలో వాటిలు డౌబు వద్ద నిర్మించిన పొడవైన ఇళ్ళు నిర్మించబడ్డాయి. చనిపోయినవారి కోసం విస్తృతమైన సమాధులు నిర్మించారు. ఐర్లాండులో ఈ సమాధులు ముఖ్యంగా చాలా ఉన్నాయి. వాటిలో చాలా వేల సమాధులు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. బ్రిటీషు దీవులలోని కొత్తరాతియుగం ప్రజలు తమ చనిపోయిన, కాజ్‌వేడ్ శిబిరాలు, హెంజెస్, ఫ్లింట్ గనులు, కర్సస్ స్మారక కట్టడాల కోసం పొడవైన లాగుడుబళ్ళు, చాంబరు సమాధులు, స్మారకచిహ్నాలు (రాతి, చెక్కతో నిర్మించినవి) నిర్మించారు. ఆహారం నెలలకాలం వరకు నిలువచేయడానికి గాలి చొరబడని కంటైనర్లు తయారు చేయబడ్డాయి. ఆహారాన్ని నిలువచేయడానికి ఉప్పు ఉపయోగించబడుతుంది.
అమెరికా, పసిఫికు ప్రాంతాలలో ఐరోపా దాడులు జరిగేవరకు ఎక్కువగా కొత్తరాతియుగం ఉపకరణ తయారీ సాంకేతికతను నిలుపుకున్నారు. మినహాయింపులలో గ్రేటు లేక్సు ప్రాంతంలో రాగి గొడ్డలి, ఈటెలు ఉన్నాయి.
దుస్తులు
[మార్చు]జంతువుల తోలుతో అనేక దుస్తులు తయారు చేయబడినట్లు కనిపిస్తాయి. తోలును కట్టుకోవడానికి ఉపయోగించబడిన ఎముక, కొమ్ముల పిన్నులను కనుగొనబడ్డాయి. తరువాతి కొత్తరాతియుగం సమయంలో ఉన్ని వస్త్రం, నార అందుబాటులోకి వచ్చి ఉండవచ్చు,[63][64] చిల్లులు గల రాళ్లను కనుగొన్నట్లు (పరిమాణాన్ని బట్టి) కుదురు వోర్లు లేదా మగ్గం బరువులుగా ఉపయోగపడవచ్చు.[65][66][67] కొత్తరాతియుగం యుగంలో ధరించే దుస్తులు " ఎట్జి ది ఐస్మాను " (అయినప్పటికీ అతను కొత్తరాతియుగం కానప్పటికీ (అతను తరువాత రాగి యుగానికి చెందినవాడు)) ధరించిన దుస్తులతో సమానంగా ఉండవచ్చు.
ఆరంభకాల స్థావరాల జాబితా
[మార్చు]నవీనశిలాయుగం మానవనివాసిత స్థావరాలు:
పేరు | ప్రాంతం | ప్రారంభ తేదీ (క్రీ.పూ) | చివరి తేదీ (క్రీ.పూ) | వాఖ్యలు |
---|---|---|---|---|
గోబెక్లి తెపె | టర్కీ | 10,000[68] | 8000 | |
గుయిలా నాక్విట్జు గుహ | ఒయాక్సకా, మెక్సికో | 11,000 | ||
టెలు క్వారమెలు | సిరియా | 10,700[69] | 9400 | |
ఫ్రాంచిథి గుహ | గ్రీసు | 10,000 | ఆక్రమిత కాలం క్రీ.పూ 7500 - 6000 | |
నాంఝుయాంగ్టు | హెబెయీ, చైనా | 9500 | 9000 | |
బైబ్లాసు | లెబెనాను | 8800 | 7000[70] | |
జెరిచొ (టెలు ఎస్ సుల్తాను) | పశ్చిమ తీరం | 9500 | ప్రారంభ ఉత్పన్నం ఎపిపాలియోలిథికు, నాటుఫియను సంస్కృతి. | |
అసిక్లి హొయుక్ | మద్య అనటోలియా, టర్కీ, అసర్మేటిక్ నవీనశిలాయుగ స్థావరం. | 8200 | 7400 | correlating with the E/MPPNB in the Levant |
నెల్వి కొరి | టర్కీ | 8000 | ||
పెంగ్తౌషన్ సంస్కృతి | చైనా | 7500 | 6100 | rice residues were carbon-14 dated to 8200–7800 BC |
కాటల్హొయుక్ | టర్కీ | 7500 | ||
మెంటెస్ టెపె, కమిల్టెపె | అజర్బైజాన్ | 7000 | 3000[71] | |
అయిన్ ఘజా | జోర్డాన్ | 7250 | 5000 | |
చొగా బొనట్ | ఇరాన్ | 7200 | ||
జౌసి | భారతదేశం | 7100 | ||
మొట్జా | ఇజ్రాయెల్ | 7000 | ||
గంజ్ డారెహ్ | ఇరాన్ | 7000 | ||
లహురాడెవా | భారతదేశం | 7000 [72] | ||
జైహు | చైనా | 7000 | 5800 | |
క్నొసాస్ | క్రెటె | 7000 | ||
ఖిరొకిటియా | సిప్రస్ | 7000 | 4000 | |
సెస్కొలా | గ్రీస్ | 6850 | 660- మార్జిన్ ఆఫ్ ఎర్రర్తో | |
మెహర్గర్ | పాకిస్తాన్ | 6500 | 5500 | |
పొరొడిన్ | ఉత్తర మాసిడోనియా | 6500[73] | ||
పరదాహ్- లిన్ గుహలు | బర్మా | 6000 | ||
పెట్నికా | సెర్బియా | 6000 | ||
స్తర జగొరా | బల్గేరియా | 5500 | ||
కుకుటేని - ట్రిపిలియన్ సంస్కృతి | ఉక్రైయిన్, మొల్డోవా, రొమానియా | 5500 | 2750 | |
టెల్ జెయిడన్ | ఉత్తర సిరియా | 5500 | 4000 | |
టర్బన్ గుహాసముదాయం | క్యుజా - పాల్వన్, ఫిలిప్పైంస్ | 5000 | 2000[74][75] | |
హెముడు సంస్కృతి, వరిచేలు | చైనా | 5000 | 4500 | |
మాల్టా మెగాలితిక్ ఆలయాలు | మాల్టా | 3600 | ||
హోవర్ నాప్, స్కర బ్రే | ఒర్క్నె, స్కాట్లాండు | 3500 | 3100 | |
బ్రూ నా బొయిన్నె | ఐర్లాండు | 3500 | ||
లాఫ్ గుర్ | ఐర్లాండు | 3000 | ||
షెంగావిట్ స్థావరం | ఆర్మేనియా | 3000 | 2200 | |
నొర్టే చికొ నాగరికత, 30 సెరామిక్ కాలం స్థావరాలు. | ఉత్తర సముద్రతీరం పెరు. | 3000 | 1700 | |
టిచిట్ నవీనశిలాయుగం గ్రామం టగ్నట్ పీఠభూమి | మౌరిటానియా దక్షిణమద్య | 2000 | 500 | |
ఒయాక్సకా, రాష్ట్రం. | నైరుతి మెక్సికొ | 2000 | మద్య లోయాప్రాంతంలో స్థాపించిన క్రీ.పూ. 2000 నవీనశిలాయుగ గ్రామాలు. | |
లజియా | చైనా | 2000 | ||
ముమున్ మట్టిపాత్రల కాలం | కొరియా ద్వీపకల్పం | 1800 | 1500 | |
నవీనశిలాయుగం, విప్లవం | జపాన్ | 500 | 300 |
ప్రంపంచంలో అతి పురాతన రహదారి, ఇంగ్లాండులోని స్వీట్ ట్రాక్, క్రీ.పూ. 3000 నాటి ఖర్జూరం, నవీనశిలాయుగం నాటి ఆలయంలోని ఘంట.(ఘోజొ,మాల్టా).
నవీన శిలా యుగంలో దశలు
[మార్చు]- 1వ దశః క్రీ.పూ. 25 వేల నుండి 18 వేల వరకు
- 2వ దశః క్రీ.పూ. 18 వేల నుండి 15 వేల మధ్య కాలం
- 3వ దశః క్రీ.పూ. 15 వేల నుండి 5 వేల మధ్య కాలం
మానవుడు ఆహార సేకరణ దశ నుండి ఉత్పత్తి దశకు చేరుకున్న కాలం: నవీన శిలాయుగం
- వ్యవసాయం, పశుపోషణ, దుస్తులు, కుమ్మరిసారె, రాతి విగ్రహాలు, చిత్రకళ మొదలైన అన్నీ సాధ్యమైన కాలం:
నవీన శిలాయుగం
- నవీన శిలాయుగాన్ని నాగరికతా విప్లవం అని వర్ణిం చిన చరిత్రకారుడు:
గార్డెన్‌చైల్డ్
- రాతి పనిముట్లను మానువుడు నునుపుగా నమోదు చేసుకున్న కాలం:
నవీన శిలాయుగపు తొలిదశలో (25,000 బి.సి- 18,000)
- మానవుడు ఇళ్లను నవీన శిలాయుగపు రెండవ దశలో (క్రీ.పూ. 18, 000-15,000) నిర్మించుకున్నాడు.
- మానవుడు కుమ్మరిసారెను నవీన శిలాయుగపు మూడవ దశలో (క్రీ.పూ.15 వేలు-5 వేలు)లో కను గొన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Neolithic: definition of Neolithic in Oxford dictionary (British & World English)". Archived from the original on 2015-09-24. Retrieved 2016-07-10.
- ↑ Morelle, Rebecca (21 June 2019). "old stone tools pre-date earliest human". South African History Online. Archived from the original on 21 జూన్ 2019.
- ↑ మూస:Cite OED
- ↑ Diamond, J.; Bellwood, P. (2003). "Farmers and Their Languages: The First Expansions". Science. 300 (5619): 597–603. Bibcode:2003Sci...300..597D. CiteSeerX 10.1.1.1013.4523. doi:10.1126/science.1078208. PMID 12714734.
- ↑ Habu, Junko (2004). Ancient Jomon of Japan. p. 3. ISBN 978-0-521-77670-7.
- ↑ Xiaohong Wu. "Early Pottery at 20,000 Years Ago in Xianrendong Cave, China". Sciencemag.org. Retrieved 15 January 2015.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 Bellwood 2004, p. 384.
- ↑ "New Archaeological Discoveries and Researches in 2004 — The Fourth Archaeology Forum of CASS". Institute of Archaeology, Chinese Academy of Social Sciences. April 28, 2005. Retrieved September 18, 2007.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ Scham, Sandra (November 2008). "The World's First Temple". Archaeology. 61 (6). Archaeological Institute of America: 23.
- ↑ Kislev, Mordechai E.; Hartmann, Anat; Bar-Yosef, Ofer (June 2, 2006). "Early Domesticated Fig in the Jordan Valley". Science. 312 (5778). American Association for the Advancement of Science: 1372–1374. doi:10.1126/science.1125910. PMID 16741119.
- ↑ "Neolithic Age".
- ↑ Feldman, Keffie. "Ain-Ghazal (Jordan) Pre-pottery Neolithic B Period pit of lime plaster human figures". Joukowsky Institute for Archaeology and the Ancient World. Brown University. Retrieved March 9, 2018.
- ↑ Killebrew, Ann E.; Steiner, Margreet; Goring-Morris, A. Nigel; Belfer-Cohen, Anna (2013-11-01). "The Southern Levant (Cisjordan) During the Neolithic Period". The Oxford Handbook of the Archaeology of the Levant (in ఇంగ్లీష్). doi:10.1093/oxfordhb/9780199212972.013.011. ISBN 9780199212972.
- ↑ Yet another sensational discovery by polish archaeologists in Syria Archived 2011-10-01 at the Wayback Machine. eduskrypt.pl. 21 June 2006
- ↑ "Jericho", Encyclopædia Britannica
- ↑ Haïdar Boustani, M., The Neolithic of Lebanon in the context of the Near East: State of knowledge Archived 2018-11-16 at the Wayback Machine (in French), Annales d'Histoire et d'Archaeologie, Universite Saint-Joseph, Beyrouth, Vol. 12–13, 2001–2002. Retrieved on 2011-12-03.
- ↑ Stordeur, Danielle., Abbès Frédéric., Du PPNA au PPNB : mise en lumière d'une phase de transition à Jerf el Ahmar (Syrie), Bulletin de la Société préhistorique française, Volume 99, Issue 3, pp. 563–595, 2002
- ↑ PPND – the Platform for Neolithic Radiocarbon Dates – Summary. exoriente. Retrieved on 2011-12-03.
- ↑ Linseele, V.; et al. (July 2010). "Sites with Holocene dung deposits in the Eastern Desert of Egypt: Visited by herders?" (PDF). Journal of Arid Environments. 74 (7): 818–828. doi:10.1016/j.jaridenv.2009.04.014. Archived from the original (PDF) on 2022-03-09. Retrieved 2019-08-06.
- ↑ Hays, Jeffrey (March 2011). "EARLY DOMESTICATED ANIMALS". Facts and Details. Archived from the original on 21 అక్టోబరు 2013. Retrieved 6 ఆగస్టు 2019.
- ↑ Blench, Roger; MacDonald, Kevin C (1999). The Origins and Development of African Livestock. Routledge. ISBN 978-1-84142-018-9.
- ↑ Barker, Graeme (25 March 2009). The Agricultural Revolution in Prehistory: Why Did Foragers Become Farmers?. Oxford University Press. pp. 292–293. ISBN 978-0-19-955995-4. Retrieved 3 December 2011.
- ↑ Alexandra Y. Aĭkhenvalʹd; Robert Malcolm Ward Dixon (2006). Areal Diffussion and Genetic Inheritance: Problems in Comparative Linguistics. Oxford University Press, USA. p. 35. ISBN 978-0-19-928308-8.
- ↑ Fekri A. Hassan (2002). Droughts, food and culture: ecological change and food security in Africa's later prehistory. Springer. pp. 164–. ISBN 978-0-306-46755-4. Retrieved 3 December 2011.
- ↑ Shillington, Kevin (2005). Encyclopedia of African history: A-G. CRC Press. pp. 521–. ISBN 978-1-57958-245-6. Retrieved 3 December 2011.
- ↑ Dawn Fuller (April 16, 2012). "UC research reveals one of the earliest farming sites in Europe". Phys.org. Retrieved April 18, 2012.
- ↑ "One of Earliest Farming Sites in Europe Discovered". ScienceDaily. April 16, 2012. Retrieved April 18, 2012.
- ↑ Female figurine, c. 6000 BC, Nea Nikomidia, Macedonia, Veroia, (Archaeological Museum), Greece Archived 2011-01-28 at the Wayback Machine. Macedonian-heritage.gr. Retrieved on 2011-12-03.
- ↑ Winn, Shan (1981). Pre-writing in Southeastern Europe: The Sign System of the Vinča Culture ca. 4000 BC. Calgary: Western Publishers.
- ↑ Daniel Cilia, "Malta Before Common Era", in The Megalithic Temples of Malta. Retrieved 28 January 2007.
- ↑ Piccolo, Salvatore (2013) Ancient Stones: The Prehistoric Dolmens of Sicily, Abingdon-on-Thames, England: Brazen Head Publishing, pp. 33-34 ISBN 978-0-9565106-2-4
- ↑ Coningham, Robin; Young, Ruth (2015), The Archaeology of South Asia: From the Indus to Asoka, c. 6500 BCE – 200 CE, Cambridge University Press Quote: ""Mehrgarh remains one of the key sites in South Asia because it has provided the earliest known undisputed evidence for farming and pastoral communities in the region, and its plant and animal material provide clear evidence for the ongoing manipulation, and domestication, of certain species. Perhaps most importantly in a South Asian context, the role played by zebu makes this a distinctive, localised development, with a character completely different to other parts of the world. Finally, the longevity of the site, and its articulation with the neighbouring site of Nausharo (c. 2800—2000 BCE), provides a very clear continuity from South Asia's first farming villages to the emergence of its first cities (Jarrige, 1984)."
- ↑ Fisher, Michael H. (2018), An Environmental History of India: From Earliest Times to the Twenty-First Century, Cambridge University Press, ISBN 978-1-107-11162-2 Quote: "page 33: "The earliest discovered instance in India of well-established, settled agricultural society is at Mehrgarh in the hills between the Bolan Pass and the Indus plain (today in Pakistan) (see Map 3.1). From as early as 7000 BCE, communities there started investing increased labor in preparing the land and selecting, planting, tending, and harvesting particular grain-producing plants. They also domesticated animals, including sheep, goats, pigs, and oxen (both humped zebu [Bos indicus] and unhumped [Bos taurus]). Castrating oxen, for instance, turned them from mainly meat sources into domesticated draft-animals as well."
- ↑ Dyson, Tim (2018), A Population History of India: From the First Modern People to the Present Day, Oxford University Press, ISBN 978-0-19-882905-8, Quote: "(p 29) "The subcontinent's people were hunter-gatherers for many millennia. There were very few of them. Indeed, 10,000 years ago there may only have been a couple of hundred thousand people, living in small, often isolated groups, the descendants of various 'modern' human incomers. Then, perhaps linked to events in Mesopotamia, about 8,500 years ago agriculture emerged in Baluchistan."
- ↑ Wright, Rita P. (2009), The Ancient Indus: Urbanism, Economy, and Society, Cambridge University Press, pp. 44, 51, ISBN 978-0-521-57652-9
- ↑ Coppa, A.; Bondioli, L.; Cucina, A.; Frayer, D. W.; Jarrige, C.; Jarrige, J. -F.; Quivron, G.; Rossi, M.; Vidale, M.; Macchiarelli, R. (2006). "Early Neolithic tradition of dentistry". Nature. 440 (7085): 755–756. doi:10.1038/440755a. ISSN 0028-0836.
- ↑ Eleni Asouti and Dorian Q Fuller (2007). TREES AND WOODLANDS OF SOUTH INDIA: ARCHAEOLOGICAL PERSPECTIVES.
- ↑ Xiaoyan Yang (2012). "Early millet use in northern China". Proceedings of the National Academy of Sciences. 109 (10): 3726–3730. doi:10.1073/pnas.1115430109. PMC 3309722. PMID 22355109. Retrieved 15 January 2015.
- ↑ The Archaeology News Network. 2012. "Neolithic farm field found in South Korea" Archived 2012-11-20 at the Wayback Machine.
- ↑ The Korea Times (2012). "East Asia's oldest remains of agricultural field found in Korea".
- ↑ Willey, Gordon R.; Phillips, Philip (1957). Method and Theory in American Archaeology. University of Chicago Press. ISBN 978-0-226-89888-9.
- ↑ "The Neolithic Demographic Transition in the North American Southwest". American Antiquity. 73 (4): 645–669. 2008. doi:10.1017/s000273160004734x.
{{cite journal}}
: Cite uses deprecated parameter|authors=
(help) - ↑ A. Eichler, G. Gramlich, T. Kellerhals, L. Tobler, Th. Rehren & M. Schwikowski (2017). "Ice-core evidence of earliest extensive copper metallurgy in the Andes 2700 years ago"
- ↑ White, Peter, "Revisiting the ‘Neolithic Problem’ in Australia" PDF, 2006
- ↑ 45.0 45.1 Leonard D. Katz Rigby; S. Stephen Henry Rigby (2000). Evolutionary Origins of Morality: Cross-disciplinary Perspectives. United kingdom: Imprint Academic. p. 158. ISBN 0-7190-5612- 8.
- ↑ Langer, Jonas; Killen, Melanie (1998). Piaget, evolution, and development. Psychology Press. pp. 258–. ISBN 978-0-8058-2210-6. Retrieved 3 December 2011.
- ↑ "The Oldest Civilization in the Americas Revealed" (PDF). CharlesMann. Science. Archived from the original (PDF) on 10 అక్టోబరు 2015. Retrieved 9 October 2015.
- ↑ "First Andes Civilization Explored". BBC News. 22 December 2004. Retrieved 9 October 2015.
- ↑ Hommon, Robert J. (2013). The ancient Hawaiian state: origins of a political society (First ed.). New York: Oxford University Press. ISBN 978-0-19-991612-2.
- ↑ "Stone Age," Microsoft Encarta Online Encyclopedia 2007 © 1997–2007 Microsoft Corporation. All Rights Reserved. Contributed by Kathy Schick, B.A., M.A., Ph.D. and Nicholas Toth, B.A., M.A., Ph.D. Archived 2009-11-01.
- ↑ 51.0 51.1 Russell Dale Guthrie (2005). The nature of Paleolithic art. University of Chicago Press. pp. 420–. ISBN 978-0-226-31126-5. Retrieved 3 December 2011.
- ↑ "Farming Pioneered in Ancient New Guinea". New Scientist. New Scientist. Retrieved 9 October 2015.
- ↑ 53.0 53.1 Bahn, Paul (1996) "The atlas of world archeology" Copyright 2000 The brown Reference Group plc
- ↑ "Prehistoric Cultures". Museum of Ancient and Modern Art. 2010. Archived from the original on 3 ఆగస్టు 2018. Retrieved 5 September 2013.
- ↑ Hirst, K. Kris. "Çatalhöyük: Urban Life in Neolithic Anatolia". About.com Archaeology. About.com. Archived from the original on 21 అక్టోబరు 2013. Retrieved 5 September 2013.
- ↑ Idyllic Theory of Goddess Creates Storm Archived 2008-02-19 at the Wayback Machine. Holysmoke.org. Retrieved on 2011-12-03.
- ↑ Krause (1998) under External links, places.
- ↑ Gimbutas (1991) page 143.
- ↑ Kuijt, Ian (30 June 2000). Life in Neolithic farming communities: social organization, identity, and differentiation. Springer. pp. 317–. ISBN 978-0-306-46122-4. Retrieved 3 December 2011.
- ↑ 60.0 60.1 Shane, Orrin C. III, and Mine Küçuk. "The World's First City." Archived 2008-03-15 at the Wayback Machine Archaeology 51.2 (1998): 43–47.
- ↑ Barber, E. J. W. (1991). Prehistoric Textiles:The Development of Cloth in the Neolithic and Bronze Ages with Special Reference to the Aegean. Princeton University Press. ISBN 978-0-691-00224-8.
- ↑ Alan W. Ertl (15 August 2008). Toward an Understanding of Europe: A Political Economic Précis of Continental Integration. Universal-Publishers. p. 308. ISBN 978-1-59942-983-0. Retrieved 28 March 2011.
- ↑ Harris, Susanna (2009). "Smooth and Cool, or Warm and Soft: Investigating the Properties of Cloth in Prehistory". North European Symposium for Archaeological Textiles X. Academia.edu. Retrieved 5 September 2013.
- ↑ "Aspects of Life During the Neolithic Period" (PDF). Teachers' Curriculum Institute. Archived from the original (PDF) on 5 మే 2016. Retrieved 7 ఆగస్టు 2019.
- ↑ Gibbs, Kevin T. (2006). "Pierced clay disks and Late Neolithic textile production". Proceedings of the 5th International Congress on the Archaeology of the Ancient Near East. Academia.org. Retrieved 5 September 2013.
- ↑ Green, Jean M (1993). "Unraveling the Enigma of the Bi: The Spindle Whorl as the Model of the Ritual Disk". Asian Perspectives. 32 (1). University of Hawai'i Press: 105–24. hdl:10125/17022.
- ↑ Cook, M (2007). "The clay loom weight, in: Early Neolithic ritual activity, Bronze Age occupation and medieval activity at Pitlethie Road, Leuchars, Fife". Tayside and Fife Archaeological Journal. 13: 1–23.
- ↑ Oliver Dietrich; Çiğdem Köksal-Schmidt; Jens Notroff; Klaus Schmidt (2016). "Establishing a Radiocarbon Sequence for Göbekli Tepe. State of Research and New Data". NEO-LITHICS 1/13 the Newsletter of Southwest Asian Neolithic Research.
- ↑ Mazurowski, Ryszard F.; Kanjou, Youssef, eds. (2012). Tell Qaramel 1999-2007. Protoneolithic and early Pre-Pottery Neolithic settlement in Northern Syria. PCMA Excavation Series 2. Warsaw, Poland: Polish Center of Mediterranean Archaeology, University of Warsaw. ISBN 978-83-903796-3-0.
- ↑ E. J. Peltenburg; Alexander Wasse; Council for British Research in the Levant (2004). Garfinkel, Yosef., "Néolithique" and "Énéolithique" Byblos in Southern Levantine Context in Neolithic revolution: new perspectives on southwest Asia in light of recent discoveries on Cyprus. Oxbow Books. ISBN 978-1-84217-132-5. Retrieved 18 January 2012.
- ↑ Ostaptchouk, Dr. "Contribution of FTIR to the Characterization of the Raw Material for "Flint" Chipped Stone and for Beads from Mentesh Tepe and Kamiltepe (Azerbaijan). Preliminary Results" (in ఇంగ్లీష్).
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ Davis K. Thanjan (12 January 2011). Pebbles. Bookstand Publishing. pp. 31–. ISBN 978-1-58909-817-6. Retrieved 4 July 2011.
- ↑ Developed Neolithic period, 5500 BC Archived 2011-03-11 at the Wayback Machine. Eliznik.org.uk. Retrieved on 2011-12-03.
- ↑ "Manunggul Burial Jar". Virtual Collection of Asian Masterpieces. Retrieved 5 September 2013.
- ↑ "Tabon Cave Complex". National Museum of the Philippines. 2011. Archived from the original on 25 ఫిబ్రవరి 2021. Retrieved 5 September 2013.
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు from August 2015
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు from November 2016
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు from June 2019
- Wikipedia articles needing clarification from February 2019
- చరిత్ర
- రాతి యుగం
- మానవ పరిణామం
- మూలాల లోపాలున్న పేజీలు