పులిపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: గుంటూరు జిల్లా తెనాలి లో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు.11వ ఏట రంగస...
(తేడా లేదు)

11:28, 15 జూన్ 2013 నాటి కూర్పు

గుంటూరు జిల్లా తెనాలి లో 1890 సెప్టెంబర్ 15న జన్మించారు.11వ ఏట రంగస్థలం పై ప్రవేశించి స్థానం నరసింహా రావు,బందా కనకలింగేశ్వర్ రావు,బళ్ళారి రాఘవ వంటి మహామహుల సరసన మద్రాసు,మైసూరు,మహారాష్ట్ర,బెంగాల్ వంటి ప్రాంతాల్లో ప్రదర్శనలనిచ్చారు.నాటకాలలో అర్జునుడు,నక్షత్రకుడు,భవానీ శంకరుడు,సుబుద్ధి,చెకుముకి శాస్త్రి,వెంగళరాయడు,భరతుడు,నారదుడు పాత్రలను పోషించడమే కాక, సినిమా రంగం లో ప్రవేశించి చింతామణిలో భవానీ శంకరుడు,హరిశ్చంద్ర లో నక్షత్రకుడు,సారంగధరలో సుబుద్ధి,పాశుపతాస్త్రం లో నారదుడు గా నటించారు. మోహినీ రుక్మాంగద, సతీ తులసి, చంద్రహాస, తల్లిప్రేమ, విష్ణుమాయ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు.వీరికి రెండుసార్లు గజారోహణం జరిగింది.1960లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లభించింది.