ప్రపంచ సంగీత దినోత్సవం
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ప్రపంచ సంగీత దినోత్సవం (World Music Day) ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా ఫ్రాన్స్లో 1982లో ప్రారంభించబడింది. ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకుంటారు.
సంగీతం
[మార్చు]సంగీతం - ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. మనుషులేం ఖర్మ? దేవతలు సైతం సంగీతాన్ని వదలలేకపోతుంటారు. ఒక్కోసారి వేణువు, ఒక్కోసారి డమరుకం సాయంతో సంగీత సాధన జరిగిపోతూ ఉండేది. అందువల్లే కాబోలు, చదువుల తల్లి 'సరస్వతీ దేవి'కి కూడా ఓ చేతిలో పుస్తకం వుంటే - మరో చేతిలో వీణ అలంకరించింది. సంగీతంలో కావాల్సిన వారికి శక్తి, రక్తి, భక్తి దొరుకుతుంది. విశ్వజనీనంగా మాడ్లాడే శక్తి కేవలం 'సంగీతానికే వుందన్నది నిర్వివాదాంశం! సంగీతం మానవుల సర్వసామాన్య భాష! ప్రపంచంలో ఎలాంటి ఎల్లలూ లేకుండా స్వైర విహారం చేసేది సంగీతమే!
రాతియుగం నుంచి కంప్యూటర్ యుగం దాకా సంగీతం స్వేచ్ఛగా రాజ్యమేలుతున్నది - అనే సత్యాన్ని గుర్తించాలి .
రాతి యుగం:
అసలు గుడ్డలూ, స్టైల్లూ, ఫ్యాషన్లూ లేని పాషాణయుగం. మనిషి డ్యూటీ 'వేట'. కడుపు నింపడం. రాయితో రాయి ఢకొీన్నప్పటి 'ఠక... ఠక', రాయి నీటిలో పడ్డప్పటి 'బుడుంగ్', జంగల్‌లో మంగల్ చేసే సెలయేటి గలగలలు, చెట్ల ఆకుల గరగరలు, నీలాకాశంలో రివ్వున ఎగిరిపోయే పక్షుల కిలకిలా రావాలు, పాపాయి నోటి 'ఉంగ్వాఁఁ ఉంగ్వాఁఁ' ల తొలి రాగాల్లో సంగీతాన్ని గమనించారు. పాషాణ యుగంలోని మన పూర్వజులు.
క్రీ.పూ 5000-6000 వైదిక కాలంగా భావిస్తే - మన నాలుగు వేదాలను సకల కళల 'గంగోత్రి'గా భావించక తప్పదు.
వేదాలు అపౌరుషేయాలు. ముఖోద్గతం చేసి ఇంకొక తరానికి అందించబడ్డాయి.
వేదాల్లో 'రుచ'లు. సంగ్రహం సామవేదం. అన్నీ గేయ స్వరూపాలే!
మధ్యయుగం:
మధ్య యుగంలో (సా.శ.. 800 - 1800) రాగ సంగీతం మొగ్గలేసింది. ఆ తర్వాత సంగీతంలో 'ఖయాల్ గానం'... 'వాద్యగానం' ప్రజాదరణ పొందసాగాయి. ఖైబరు కనుమల నుండి జోరుగా మొగలాయీ దండయాత్రలు సాగాయి. వారి వెంట కత్తులూ, కఠార్లతో పాటు 'యుద్ధ పిపాస' ఏమాత్రం లేని అరబ్బీ, ఫారసీ, ఇరానీ సంగీతం కూడా వచ్చింది మనదేశంలోకి.
తన చుట్టూ ఎల్లల వలయాలు సృష్టించుకోలేని, సంగీతం మెల్లమెల్లగా ఇక్కడి సంగీతంతో మమేకమైంది.
'కవ్వాలి' అలా అక్కణ్ణించే వచ్చి నేడు సినిమా తెరమీదా, మన సమాజంలోనూ విడదీయలేని భాగమైపోయింది. నేటికీ 'ఉర్స్' ఉన్నచోట 'కవ్వాలి' ఉండాల్సిందే! సారంగీ, సరోద్ - చంగ్ షV్‌ానాయీ - బర్‌బత్ - రబాబ్ లూ అక్కడివే! హాయిగా ఇక్కడివైపోయి సన్నాయి నొక్కలు సాగిస్తూ నవ్వుకున్నాయి.
ముస్లిమ్ సంగీతం:
ముస్లిమ్ సంగీతంలో ఆద్యుడు 'ఇబ్నే - ముసV్‌ా -హజ్'. ఇరాకలోేని 'అబ్బాసీ దర్బాల్'లోని అరబ్బీ, ఫారసీల సంగీతాన్ని కలుపుకుని 'ఇరానీ సంగీతం' రూపంలో ప్రపంచం నిండా వ్యాపించింది. ఇరానీ 'కవ్వాల్' సంగీతంలోని 'జంగులా' - 'జీఫ్' - 'షాహనా' - దర్బారీ' - 'జిలా' (ఖవజ్) మెల్లమెల్లగా మన సంగీతంలో కలిసిపోయాయి. 'అమీర్ ఖుస్రో' రెండు సంగీతాల మేళవాన్ని 'అందమైన సంగీత మిశ్రమం'లా తయారు చేశాడు. 'సితార్' నిర్మాణం ఆయనదే అని చెప్పుకుంటారు. ముస్లిమ్‌లది 'సూఫీ సాంప్రదాయ సంగీతం'. అంతా భక్తి సంగీతం అన్నమాట. మొహమ్మద్ తుగ్లకనుే మనం చరిత్ర చదివో చదవకో, 'పిచ్చి తుగ్లక' అని స్టాంప్ అంటించి దులుపుకున్నాం. కానీ, ఆయన దర్బార్ లోనూ సంగీతం పొంగి పొర్లింది. ఆ 'తుగ్లక'గారి దర్బారులో అలనాటి గొప్ప గాయకుడు 'అమీర్ షమ్స్ ఉద్దీన్ తబ్రేజీ ' ఉండేవాడు. అలానాటి 'దేవ్‌గఢ్' (నేటి 'ఔరంగాబాద్' సమీపానున్న 'దౌలతాబాద్' కోట) దగ్గర 'తరబాబాద్'అనే 'చౌపట్ బజార్' ఉండేది. పగలు మూడు గంటల్నుంచి తెల్లారే దాకా అక్కడ 'అరబీ - ఇరానీ - హిందూస్థానీ' సంగీతం ప్రముఖంగా ఉత్తర భారత దేశాలలో జోరందుకుంది. అలనాటి మధుర, అయోధ్య, బనారస్, లక్నో ప్రముఖమైన 'సంగీత క్షేత్రాలు'. షాజహాన్ కాలంలో సంగీతం మీద 'షమ్స్ - ఉల్ - అస్వాత్' అనే మొదటి గంథ్రం రాశారట. రెండో అక్బర్ కాలంలో 'మీర్జాఖాన్', సంస్కృత పండితుల సాయంతో 'తుహఫా - తుల్ - హింద్' అనే గొప్ప గ్రంథం రచించాడు. అందులో జ్యోతిష్యం, సాముద్రికం, కోకశాేస్త్రం, నాయికా భేదం, ఇంద్రజాలం వంటి విషయాలతో పాటు అలనాటి సంగీతం ముచ్చట్లున్నాయి.
భారతీయ సంగీతం:
భారతీయ సంగీత శాస్త్రం గురించి ఫారసీలో నవాబ్ 'ఆసఫ్ - ఉద్దౌలా' శాసనకాలంలో రాసిన 'ఉసూల్ - ఉల్ - నగమాత్ - ఉల్ - ఆసిఫియా' గొప్ప గ్రంథం. ఇప్పుడు ఒకటో - రెండో ప్రతులు, అవీ ఏ మ్యూజియంలోనో ఉండొచ్చు. 'వాజిద్ అలీషాV్‌ా' జమానా వచ్చే సరికి లఖ్నోలో కదర్‌పియా రచించిన 'ఠుమ్రీ'లు గల్లీ గల్లీలోని 'ఆమ్ ఆద్మీ' కోసం పసందుగా నిలిచిపోయాయి. ధృపద్ - హోరీల కన్నా ఖమాజ్ - ఝింఝోటీ - భైరవీ - సునిద్రా - తిలక - కామోద్ - పీలూ లాంటి రాగాల స్వరాలు పాపులర్ అయిపోయాయి. సర్వసామాన్యులు కూడా 'ఠుమ్రీ'లు గున్‌గానాయించేవారు.
ఆ కాలంలో హిందూస్థానీ రాగ రాగినీలు, ముఖ్యంగా భైరవీ రాగం అక్షరాలా లఖ్నో 'తెల్ల ఖర్బూజా'లంత జనరంజకాలు. ఎంతో ప్రజాదరణ పొందాయి. పెళ్ళిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు 'జులుష్' (ఊరేగింపు) లో 'ఢోల్ -తాషా', 'రౌషన్ చౌకీ', - 'నౌబత్' - 'తురహీ - కర్నా (శంఖం) ' - 'ఢంకా-బిగుల్' - 'అంగ్రేజ్ ఆర్గన్' ఉండాల్సినవే. అలా, అలనాడు సంగీతం మామూలు మనిషి ఇంట్లో, ఒంట్లో సుతారంగా ఒదిగిపోయింది. అక్బర్ పాదుషా కాలంలో సంగీతం మూడు పువ్వులు- ఆరు కాయల్లా వెలిగిపోయింది. కొన్ని వెలుగులు 'రాగ్ - దీప్' తాలూకు మహానీయుడైన 'సంగీత్ సామ్రాట్ తాన్‌సేన్'వి. మనం కూడా మరిచిపోలేదు (చాలామంది రసికులకు 'బైజుబావరా' జ్ఞాపకం వుండొచ్చు ఇంకా). ఎటొచ్చీ - ఔరంగజేబు చూపుల్లో, మనసుల్లో సంగీతం లాంటి రమ్యతలు అంతగా పొసగలేదు. ఆయనకు నచ్చిందల్లా ఒక్కటే. గెలిచిన చోటల్లా 'నౌబత్'లను జోరుగా వాయించడం. మన హైదరాబాద్ 'నౌబత్ పహాడ్'మీది సంగీతం అలనాటి 'నగరాల మోతే'!
ఆధునిక సంగీతం:
చూస్తూ చూస్తూ ఆధునిక కాలం వచ్చేసింది. వాద్యసంగీతం, లలిత సంగీతం కూడా మామూలు మనుషుల గుండెలకు చేరువైపోయాయి.
భరతుడి 'నాట్యశాస్త్రం', జయదేవుడి 'గీతాగోవిందం'ల చోటే ఠుమ్రీ, గజల్, అభంగ్, భజన గీతాలు పాపులర్ అయిపోయాయి.
ఆత్మ పల్లవించే పడవలా, వెచ్చని పాటలతో, వెండి అలలపై నిద్రిస్తున్న రాజహంసలా అలనాటి సినిమా సంగీతం - ఆ తర్వాత నేటి రణగొణ ధ్వనులతో నిండిన, గల్లీ గల్లీలో సునామీలా దద్దరిల్లే లోల్లి సంగీతం వచ్చింది.
షహ్నాయి, సంతూర్, వేణువు, వయోలిన్, సితార్ ల అద్భుత లయలతో పాటు సింఫొనీ, సొనటా, కన్సర్ట్, క్యార్టెట్, ర్యాంప్, బీటల్స్ కూడా వచ్చాయి.
మన యువతీ యువకులు జానా బెత్తెడు గుడ్డలేసుకుని పిచ్చెక్కినట్టు చిందులేశారు. ఎంతసేపని ఎగురుతారు? చిందులేస్తారు? అలసీసొలసీ, సంగీతం గురించైనా ఆలోచిస్తున్నారా? సంగీతం ఒక మహత్తర ప్రవాహం. అది ఒక మహా తరంగం. ప్రతి మదిని దోచే మనోహర తరంగం.
శాస్త్రీయ సంగీతం గురించి ఏమాత్రం అవగాహన లేకున్నా సంగీతం అంటే అంతో ఇంతో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న పాఠకులకు ఇక్కడ సవినయంగా చిన్న మనవి.
సంగీతాన్ని ఆస్వాదించడానికి 'స-రి-గ-మ'ల ప్రవేశం, సంగీత జ్ఞానం ఏమాత్రం అవసరం లేదు. 'తామెచ్చింది రంభ' అన్నట్లు 'మనసుకు నచ్చిందే సంగీతం'. దట్స్ ఆల్!!
శాస్త్రీయ సంగీతం:
శాస్త్రీయ సంగీతం - నానా విధ పుష్ప ఫల జాతుల అందమైన చిక్కటడవి అనుకుంటే లలిత సంగీతం పరిమళాల పూల మొక్కలున్న చిరు ఉద్యానవనం.
శాస్త్రీయ సంగీతం ఇంతెత్తు అలల మహాసముద్రం. లలిత సంగీతం మనసైన గుండెల కోసం పలకరించే 'తామర కొలను'.
శాస్త్రీయ సంగీతంలో 'రాగం' విస్తృతంగా, సంపూర్ణంగా దర్శనమిస్తుంది. లలిత సంగీతంలో రాగంలోని ఒక భాగం సొగసైన భంగిమతో శ్రావ్యమైన నాథలహరులను సృష్టిస్తుంది. అన్నింటిలోనూ ఉంది 'శృతి' - 'లయ'!!
మన దేశంలో దాదాపు ఉత్తరాదిలో వ్యాపించి ఉన్నది 'హిందూస్తానీ సంగీతం' దక్షిణాదిలో ఉన్న సంగీతం. అందాలన్నీ 'కర్ణాటక సంగీతం బాపతే.
భరతుని 'నాట్యశాస్త్రం'లో 28 నుండి 33 వరకున్న ఆరు అధ్యాయాల్లో కేవలం సంగీతం చర్చే! 28వ అధ్యాయంలో వాద్యాల ముచ్చట్లున్నాయి.
'నగ్మాతే ఆస్ఫీ' - 'రయీస్ మొహమ్మద్ రజా' రాసిన సంగీత పాఠ్యగ్రంథం. పండిట్ విష్ణుశర్మ, పండిట్ భాత్‌ఖండే, సంగీత మహాపండితుడు షోరంగదేవ్ రాసిన 'సంగీత రత్నాకర్, పండిట్ లోచన్ విరచితమైన రాగతరంగిణి, పండిట్ శ్రీనివాస్, విష్ణుదిగంబర్ పలుస్కర్ లాంటి మహనీయుల వల్ల మన సంగీత సీమ ఎంతో విస్తరించింది.
72 థాట్‌లోని ఉత్తరాది 'హిందుస్తానీ సంగీతం'తో దాదాపు 10 దక్షిణాది రాగాలు సామ్యం కలిగి ఉన్నాయి.
బిలావత్ (శ్రీ శంకరాభరణం), కల్యాణ్ (మేచ్ కల్యాణి), ఖమాజ్ (హరికాంభోజి), కాఫీ (ఖరహరప్రియ), ఆసావరీ (నటభైరవి), భైరవి (హనుమత్తోడి), భైరవ్ (మాయామాలవ్ గౌళ), పూర్వీ (కామవర్థిని), మార్వా (గమనప్రియ), తోడి (శుభపంతువరాలి)... ఇవి కొన్ని సామ్యం ఉన్న రాగాలు! మనం మామూలు మనుషులం!
పక్క వాటాలోంచి మంచి సంగీతమో, పాటో విన్పిస్తే సిటీ బస్ మిస్సయినా తట్టుకుని విని పరవశం చెందే పిచ్చోళ్లం!
మనకు 'ఆరోహణ' - 'అవరోహణ' - 'అస్తాయీ' - 'అంతరా' - నోమ్‌తోమ్'తో 'క్యా లేనా దేనా'? మన పని చెవులకింపైన మధుర సంగీతాన్ని వినటం... గున్‌గునాయించడం...! ప్రతి రాగానికి ప్రత్యేక సమయం అంటూ ఉంది. రాగాలు ప్రత్యేకమైన మానసిక ప్రవృత్తులకు నిదర్శనాలు. భైరవి సభ ఆఖర్న పాడే రాగం. రౌద్ర రసరాగం, భూపాల్ శృంగార రసానికి, వసంత్ హాస్య రసానికి, మాళవరాగం భయానక రసానికి అని స్వరూప వర్ణనలున్నాయి. సినీ సంగీతం వల్ల రాగాలు ముక్కలై మరో మనోహర రూపం దాల్చాయి. సినీ సంగీతం దునియా పూర్తిగా విచిత్రమైంది. హిందీ సినీ సంగీతం దునియాలోని ఎవర్‌గ్రీన్ మెలోడీ మేకర్స్ శంకర్ - జై కిషన్‌లు భైరవీ రాగంలో అందించిన గీతాలు నాడూ - నేడూ ఎవర్ గ్రీన్ రొమాంటిక్స. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు కదా? ఉదాహరణకు చోరీచోరీ, శ్రీ 420, అనాడీ, సన్యాసీ గీతాలు వినండి. ఎక్కడుందీ రౌద్రం? హిందుస్తానీ సంగీతంలో నాలుగు ప్రముఖ ఘరానాలున్నాయి.
1.గ్వాలియర్ ఘరానా : మూల పురుషుడు నథన్ పీర్ బక్ష, హస్సూఖాన్, హద్దూఖాన్‌లు ఆయన మనుషులు. మహారాష్ట్రలో ఖ్యాల్ గాయకీ ప్రత్యేకతను చాటి చెప్పిన కీ.శే. బాలకృష్ణరువా ఇచల్ కరంజీకర్, పలుస్కర్, ఎం.ఓంకార్‌నాథ్ ఠాకూర్, వినాయక రావ్ పటవర్థన్, నారాయణరావ్ వ్యాస్, కుమార్ గంధర్వ్ అగ్రగణ్యులు. శుద్ధరాగం - సరళమైన గాన పద్ధతి వీరి ప్రత్యేకత.
2. కిరాణా ఘరానా : ఆద్యులెవరూ? అనే ప్రశ్నకన్న సాక్షాత్తు శ్రీకృష్ణుడి వేణువు మా కంఠంలో రూపుదిద్దుకునేలా 'న భూతో న భవిష్యత్'గా అద్భుత గాన కోవిదుడు ఖాం సాహెబ్ అబ్దుల్ కరీం ఖాన్ గారిని తలచుకోవడం ముఖ్యం. వారి శిష్యులే రామ్ భావుకుంద్ గోళ్‌కర్ (సవాయీ గంధర్వ్), సురేష్ బాబూ మానే, రోషనారాబేగం, హిరాబాయి బడోదేకర్, గంగూబాయి హంగల్, ప్రభా అత్రే! భారత్ రత్న పండిట్ భీమ్‌సేన్ జోషి గారి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి? టీవీ చేసే ప్రతి పాలుకారే బుగ్గల పసివాడు కూడా చెప్తాడు 'మిలే సుర్ మేరా తుమ్హారా' ముచ్చట! రసికులు ఆయన భక్తిగీతాలు విని ఇంకా ఆనందించవచ్చు.
3. జయపూర్ ఘరానా : మూల పురుషుడు 'మన్‌రంగ్' అని పేర్కొంటారు. ఆ ఘరానా మరోపేరు 'అత్రోలీ ఘరానా'! ఇందులోంచే పాటియాలా ఘరానా పుట్టుకొచ్చింది. ఈ తరంలో జైపూర్ ఘరానా రెపరెపలు కిషోరీ శిమోణ్‌కర్ గాత్రం ద్వారా నలుదిశలా వ్యాపించింది. సురశ్రీ కేసర్ బాయి కేర్కర్, మోగూబాయి కుర్డీకర్, పండిత్ మల్లికార్జున్ మన్సూర్ చాలా ప్రముఖమైన గాయకులుగా సుపరిచితులే.
4. ఆగ్రా ఘరానా : సంగీత్ సామ్రాట్ తాన్‌సేన్ అల్లుడైన 'హజీ సుజాన్' తర్వాత వివరీతమైన పేరు ప్రఖ్యాతులు స్వంతం చేసుకున్నారు. బడోదాకు చెందిన విశ్వ విఖ్యాత గాయకుడు ఉస్తాద్ ఫైయ్యాజ్ ఖాన్ గారు. ఈ మధ్యకాలంలో దిన్‌కర్ కాయకిణి, లలితా రావ్, బబన్ రావ్ హళదణ్ కర్ ఆగ్రా ఘరానా జండాను రెపరెప లాడిస్తున్నారు.
మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. మన గానకోకిల లతా మంగేష్కర్ తండ్రి స్వర్గీయ దినానాథ్ మంగేష్కర్ గొప్ప పేరున్న శాస్త్రీయ గాయకుడు. సంగీత నాటకాల్లో అగ్రగణ్యుడు (ఆశా భోంస్లే 'శురా మీ వందిలే' వీలు చూసుకుని ఒక్క సారైనా వినండి). మహారాష్ట్రలో నాట్య సంగీత్ - భావ్‌గీత్ - లావణీ - పొవాడా లాంటి చాలా ప్రజాదరణ పొందాయి.
సంగీత నాటకాల్లోని గీతాలు బింబాధరా మధురా (శారదా), 'కఠిణ్ కఠిణ్ కఠిణ్ కతీ' (భావబంధన్), మృగనయనా రసిక మోహినీ (సంశరు కల్లోళ్) నరవర్ కృష్ణా సమాన్ (స్వయంవర్), ఉగవలా చంద్రపునవేచా ( పాణీగ్రహణ్) నేటికీ గున్‌గునాయించే మహా కవులు పూణే గల్లీ గల్లీలో కన్పిస్తారు.
రశిక శ్రోతలకు, పాఠకులకూ ముందే విన్నవించుకుంటున్నాను. భారతీయ శాస్త్రీయ సంగీతం మహా సముద్రం. ఏవో కొన్ని రాగాలు గీతాలు గున్‌గునాయించే మా బోటి మామూలు మనుషులం ఏం రాస్తాం? ఎంత రాసినా తక్కువే!
విశ్వజనీనం...
సంగీతం విశ్వజనీనమైంది కదా! అటుకేసికూడా తొంగి చూద్దాం. ప్రాచీన గ్రీసు వాళ్లు సంగీత ప్రియులు. చట్టాలు గిట్టాలు జాన్తానై... ఈ దేశానికి కావాల్సిన పాటలు నేనే తయారు చేస్తానంది బాబూ అనే మాట చిన్నా చితకలు అనలేదు. సాక్షాత్తూ ప్లాటో అన్నాడా మాట.
చైనా గీతాల్లో ఎ పిక్చర్ ఆఫ్ వైయోలెంట్ ఎగొనీ ఉందంటారు. జపాన్ గీతాల్లో చింగ్ చింగ్... టింగ్ టుంగ్ అంటూ అడపాదడపా తోవ తప్పిన గోల మనసుకు రేడియోలో గమ్మత్తు సంగీతం విన్పిస్తుంది. అవి రుతువుల సంగీతధారలు...!
సెకనుకు 240 కంపనాలున్నది షడ్జస్వరం. ఇంగ్లీష్ సంగీతం మన బుర్రకు అంతగా ఎక్కిచావదు. నేను విన్నది, నాకు కాస్తో కూస్తో పరిచయం ఉన్నవారి సంగతి చెప్తాను. లుడ్విగ్ వాన్ బిధోవిన్, హెక్టర్ బెర్లియోజ్, ఫ్రాంజ్, మొజార్ట్ (పూర్తిపేరు వుల్ఫ్ గాంగ్ అమాడియస్ మొజార్ట్), వాగర్, చైకోవస్కీ, గుస్తావ్.... ఇక బీటల్స్ సంగతి తెలియనిదెవరికని? ఈనాటి యువత కోసం మిగతా రాతలు వదిలేస్తాను! ఈ తరం ఇష్టం! ప్రపంచం సంగీతం ముచ్చట్లలో రవీంద్ర సంగీతాన్ని కూడా మరచిపోకూడదు.
'ఎకలా చలోరే...' నుంచి పాదో ప్రాంత రాఖోసేబోకే, శాంతి సదన సాధన ధన దేబో దే బోహె లాంటి చర్చిలోని కోయిర్ గీతం దాకా రవీంద్ర సంగీతం రంజింప చేసింది. ప్రపంచ సంగీతంలో ఒక్క తంజావూరు ఆస్థానంలోనే 300 పైగా సంగీత విద్వాంసులు కొలువు తీరిన కర్ణాటక సంగీతం ప్రత్యేకత దానిదే! సంగీత త్రిమూర్తులు త్యాగరాయ స్వామి - ముత్తుస్వామి దీక్షితులు - శ్యామశాస్త్రి లాంటి వారు మహోన్నతులు. ఇటీవల అన్నమయ్య లక్షగొంతుల గీతాల వాణి ప్రపంచంలో మనకో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది.
తెలుగు లలిత సంగీత వికాసం - తెలుగు, హిందీ సినీ సంగీతం గురించి ముచ్చటించక పోతే ఎలా? నేడు మన ఊపిరే అది కదా! శ్రీశ్రీ మరో ప్రపంచం - కృష్ణశాస్త్రి - రాయప్రోలు - ఎంకి పాటల నండూరి - శివశంకర శాస్త్రి - చింతా దీక్షితులు - అడవి బాపిరాజు - విశ్వనాథుల వారు... సముద్రాల దగ్గర్నించి సినారే, దాశరథి, వేటూరి, తేజా దాకా... సంగీతం లలితంగా వయ్యరంగా సాగింది.
అది మైలవరం వారి సావిత్రి నాటకంలో 'హాఁ బాల పొమ్మికన్' కావచ్చు. వరలక్ష్మి నుండి జానకి, సుశీల, చిత్ర దాకా.... ఘంటసాల నుండి బాలు దాకా... సైగల్, రఫీ, ముఖేష్, కిషోర్, మన్నాడే, తలత్‌ల నుండి సోనూ దాకా... లతా నుండి శ్రేయా దాకా గాత్ర సంగీతం మనలను అలరిస్తూనే ఉంది. దాదాపుగా సినీ సంగీతం అన్నింటినీ డామినేట్ చేసింది.
ఫక్షులలో సంగీతము -- మానవునికి పాట నాంది : పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః అన్నారు పెద్దలు. కానీ పశువులకన్నా, శిశువుల కన్నా పక్షులకు గానం గురించి బాగా తెలుసు అని ప్రకృతి నిరూపిస్తోంది. పాట అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కోయిలమ్మ. ఆ తరువాత ఏనాడూ వినకపోయినా మైనా పాట..ఆ తరువాత బాగా పాడుతుందని తెలిసిన నైటింగేల్‌పాట..ఇంకొంచెం తక్కువగా రాబిన్‌పిట్ట. నా పాట నీ నోట పలకాల చిలక అని ఓ సినీ కవి అన్నా, సుస్వర స్వరాలలో కీరవాణికి గుర్తింపు ఉన్నా చిలకలు పాటలకు కాక పలుకులకు, కులుకులకు ప్రసిద్ధి మనను పొద్దున్నే నిద్దురలేపే కోడి కూడా సుప్రభాత గీతాలు పాడుతున్నా దాని కూత వైతాళిక గీతమైందే తప్ప అది గాయనిగా గుర్తింపుకు నోచుకోలేదు. మన చుట్టూ ఎన్నో మధుర స్వరాల పక్షులు ఉన్నా వాటివి కలకూజితాలుగానే గుర్తింపు పొందాయి. పక్షి ప్రేమికులు పర్యావరణాన్ని శోధించి 980 రకాల పక్షులు పాటలు పాడతాయని వాటి పాటలు ఎంతో కమనీయంగా ఉంటాయని గుర్తించారు. ఇవి ఇంత వరకు మన దాకా వచ్చిన పాటలు. ఈ విశాల ప్రపంచంలో ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో..ఎన్ని నైటింగేల్స్, మరెన్ని మైనాలు అడవిగాచిన వెన్నెలలా అడవులకే అంకితమై ఉన్నాయో! ఎడారిలో పాటలు పాడుతూ రసజ్ఞతకు నోచుకోక బ్రహ్మ మందభాగ్యానికి ప్రతీకలుగా మిగిలిపోతున్నాయో!!
మన కంటికి కనిపించే ప్రకృతి అశాశ్వతమని, దాని ఆకృతి ఎప్పటికప్పుడు మారిపోతుంటుందని వేదాంతులు చెబుతుంటారు. కానీ కళ్ళ ముందు ఉన్న దాన్ని కాదనుకుని కంటి ముందులేనిదాన్ని ఊహించుకుని స్వర్గనరకాలు సృష్టించుకుని బాధలు పడడమేమిటంటారు లౌకిక వాదులు. ఈ సృష్టి శాశ్వతమా అశాశ్వతమా అంటే శాశ్వత అశాశ్వతం అన్నది వారి వాదనల సారాంశం. అశాశ్వత ప్రపంచంలో శాశ్వతంగా సాధించగలిగిందేదైనా ఉందంటే అది కీర్తి. గొప్ప పనులు చేసిన వాళ్ళు సాధారణ కాయాన్ని విడిచివేసి కీర్తికాయులవుతారని పెద్దలు చెబుతారు. ఇలాంటివేవీ తెలియకపోయినా సంగీత ప్రపంచంలో ఓలలాడుతూ ఆనందాన్ని, విషాదాన్ని అందులోనే నింపుకుని కమ్మని పాటను అందించే జీవజాతులు సంగీతాన్ని తమ జాతి లక్షణంగా మార్చుకుని ఎనలేని కీర్తిని సొంతం చేసుకున్నాయి. కోయిల కులంలో పుట్టిన పిట్టకు పాట వస్తుందా అని అడగక్కర్లేదు. అది పాడడం కోసమే పుడుతుంది. పాడుతూనే బతుకుతుంది. ఇలా పాటే ప్రాణంగా, జీవనంగా, జీవలక్షణంగా ఉన్న పక్షిజాతులు 980కి పైగా ఉన్నాయి మన పరిసరాలలో.. విచిత్రమేమిటంటే పాటలు పాడే పిట్టలు పది మందికీ పంచి ఆనందపరచగలవే కాని వాటి పాటను అవి వినలేవు. హెవిక్స న్యూరాన్స్ అవి పాడే టపðడు పనిచేయవు. అందువల్ల పాట పాడుతున్నంత సేపు ఆ పిట్టకు చెవులు వినబడవు. అందుకని అది తన పాట తానుగా వినలేదు. పక్క పక్షి ఏం పాడుతోందో వినగలదు. అంటే పాడే పిట్టలు మంచి శ్రోతలేకాని సొంత పాట వినలేని కళాకారులన్నమాట. మరి దాని పాట బాగుందో లేదో దానికి ఎలా తెలియాలి పిట్ట పాట పాడుతున్నపðడు మనలాగే ఇతర జంతుజాతులు, సాటి పక్షులు దాన్ని అనుకరించి పాడతాయి. అది విని తన పాట ఎలా ఉందో నిర్ణయించుకుని సాధన చేస్తుంది ఆ పిట్ట. ఈ విధంగా దాని పాటను అది మెరుగు పరుచుకుంటుంది. ఇదంతా మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ ఫలితం అంటారు శాస్త్రవేత్తలు. సహకార గానాలు, అనుకరణలు వగైరాలన్నిటికీ ఈ మిర్రర్ న్యూరానే కారణమని పరిశోధనలలో వెల్లడైంది. మనుషులలో కూడా ఈ వ్యవస్థ బలంగా పనిచేస్తోంది. అందుకే ప్రతీ ఒక్కరూ పాడగలగడం, మరొకరిని ఇమిటేట్ చేయగలగడం వంటివి చేస్తుంటారు. గ్రహింపు (గ్రాస్పింగ్ పవర్) అనేది దీని ద్వారానే కలుగుతుందని అంటారు. పక్షులు వినడం ద్వారానే ఫీడ్‌బ్యాక తీసుకోగలుగుతాయి కనుక పాటను ఏకథాటీగా కాకుండా ఆగిఆగి పాడుతూ ఫీడ్‌బ్యాక చూసుకుంటూ ఉంటుంది. చిన్న పిట్టలు అసలు పాటను తండ్రి నుంచే నేర్చుకుంటాయి. చాలా జాతులలో మగ పిట్టలే తెగ పాడుతుంటాయి. ఆడపిట్టలు పాడడం తక్కువే! ఒక వేళ ఏదైనా జాతి పిట్టపాడినా దాని గొంతు సన్నగా ఉంటుంది. ఎక్కువ దమ్ముపట్టి పాడే శక్తి వాటికి ఉండదు. అందుకని చిన్నచిన్న పాటలు పాడతాయి. పిట్టల్లోనూ యాసలుంటాయి. ఈ యాసల ప్రభావం కొత్త పిట్టల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే తండ్రిలాగ అవి పాటను పాడవు. కొన్ని మౌలిక సంగతులను అవి నేర్చుకున్నా వాటి పాట తండ్రి పాటతో వేరుపడి కొత్త లక్షణాలతో ఉండడానికి యాసే కారణం.
నిజానికి సంగీతమనేది మానవునికి సహజగుణం కాదని, అది వారి నైజం కూడా కాదని సంగీత మర్మం తెలిసిన వారు చెబుతుంటారు. మనిషికి సంగీతం నైసర్గిక గుణంగా వస్తుందని అంటారు. చుట్టూ ఉన్న జీవ జంతు జాలాలు పాడే పాటలకు ప్రేరణ పొంది, వాటిని అనుకరిస్తూ పాటలు పాడడం మొదలు పెట్టాడని చెబుతారు. ఇ్పడు మనుషులు పాడే పలు రాగాలకు జంతువుల కలగానాలే ప్రేరణాలని అంతా అంగీకరించే అంశం. హంసధ్వని, చక్రవాక, కోకిలధ్వని, గరుడధ్వని, హంసనంది, రిషభప్రియ, గోప్రియ, భైరవ తదితర రాగాలే ఇందుకు సాక్ష్యం. సంగీతంలో పక్షుల ఉనికికి మూడు కారణాలు చెబుతారు. 1. పక్షుల పాటలు విని ప్రేరణ పొందడం ద్వారా పాటను పుట్టించడం. 2. సందర్భానుసారంగా పక్షిపాటను బుద్ధిపూర్వకంగా అనుకరించి పాట కట్టడం. 3. పాటలో యథావకాశంగా పక్షిపాటకు స్థానం కల్పించి పాటచేయడం. పశువులు, పక్షుల పాటలను అనుకరిస్తూ పాటలు సృష్టించి 16వ శతాబ్దంలోనే మనకు అందించిన మరో మహనీయుడు జానెక్విన్. ఆయన 'లీ చాంట్ డెస్ ఒయాసిస్' అనే పుస్తకాన్ని రచించారు. పక్షుల పాటలను యథాతథంగా వినియోగించుకుంటూ పాటలు సృష్టించి అందించిన ప్రముఖుడు వివాల్డి. ఆయన 'అన్ని కాలాల ఆమని' (స్ప్రింగ్ ఫ్రమ్ ది ఫోర్ సీజన్స్) అనే పుస్తకాన్ని అందించాడు. బీబర్ పాటలొచ్చిన పిట్టలు (సొనాటా రిప్రెజెంటేటివా) అనే పుస్తకాన్ని రచించాడు. బీతోవాన్ ఆరో సింఫని అనే పుస్తకాన్ని రచించాడు.
అమెరికా రాబిన్: పాటలు పాడే పక్షులు అనగానే మనకు చటుక్కున స్ఫురించే వాటిలో కోకిల, మైనా, నైటింగేల్ తరువాత వినిపించే పేరు రాబిన్. శ్రావ్యమైన సంగీతానికి పెట్టింది పేరు రాబిన్. నల్లతల ఎర్రటి ఛాతీ, గోధుమ రంగులో ఉండే ఈ రాబిన్ తెల్లవారితే చాలు ఇంటింటికీ వచ్చి కిటికీలపైనా, పెరటి చెట్లపైనా కూచుని మధురగీతాలాలపిస్తూ శుభోదయం పలుకుతుంది. విజిల్ లాంటి ఈలవేస్తూ మగ రాబిన్ పాడే పాట ఎంతో హుషారునిస్తుంది. ఇది చేసే ధ్వనిని జాగ్రత్తగా వింటే మనకు చీరియో...చీరప్ చెబుతున్నట్టుగా ఉంటుంది.
స్కార్లెట్ టానేజర్: మండుటెండలో మలయ సమీరం, అందమైన వసంత గీతం టానేజర్ గీతం. ఎర్రతల, నల్ల రెక్కలు, నల్లముక్కుతో ఉండి మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికెక్కి మలమల మాడ్చేస్తుంటే గొప్ప ఉపశాంతి టానేజర్ 'చికబ్రీే' గీతి. బుర్రుపిట్ట తుర్రుమంటే ఇది పాడేటప్పుడు టుర్రు మంటుంది. విజిల్ వేసినపుడు వినిపించే కంపిత నాదం దీని పాటలో వినబడుతుంది. పాటకు పాటకు మధ్య చాలా వ్యవధి తీసుకుని ఇది పాడుతుంది. రాబిన్ పిట్ట బొంగురు గొంతుతో పాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీని పాట అని విన్నవారు చెబుతుంటారు.
రోజ్ బ్రెస్టెడ్ గ్రాస్‌బీక: ఛాతి మీద ఎర్ర త్రికోణం ఆకారంలో ఉండే రోజ్‌బ్రెస్టెడ్ గ్రాస్‌బీక అందమైన పాటకు, అందమైన శరీర రంగులకు పెట్టింది పేరు. నల్లతల, తెల్లముక్కు, ఎర్రఛాతీ, తెల్లటి ఉదరంతో ఎంతో అందంగా ఉంటుంది. చాలా కొద్ది రకాల జాతులే ఇలా స్వరం, శరీరం అందంగా ఉండి కనబడతాయి. దీని పాట విన్నా రాబిన్ పాటే గుర్తుకు వస్తుంది. కాకుంటే దీని పాట మరింత అందంగా, పొందికగా ఉంటుంది. రాబిన్ పక్షే సంగీతం నేర్చుకు వచ్చి పాడుతోందా అనిపించేలా ఉంటుంది.
బాల్టీవెూర్ ఓరియోల్: చెట్లు గుబురుగా ఉన్న చోట దాక్కున్నట్టుగా ఉండి కమ్మని పాటలతో వీనుల విందు చేసే మరో పాటల పిట్ట బాల్టీవెూర్ ఓరియోల్. వనాలలో, సామాజిక వనాలలో, ఉద్యాన వనాలలో కూడా ఉండి ఈ నల్లతల, బంగారు వర్ణపు పిట్ట పాటలతో అలరిస్తుంది. ఎత్తయిన చెట్ల మీద ఉండి పాటపాడాలంటే ఈ పిట్టకు ఎంతో ఇష్టం. ఈ జాతి పిట్టలలో మగ, ఆడ రెండూ గొంతెత్తి పాటలు పాడతాయి. వీటి గొంతులో స్టీరియో ఎఫెక్ట ఉంటుందని విన్న వారు చెబుతారు. ఆడపిట్ట పాట సీదా సాదాగా చిన్న చిన్న పాటలు పాడితే మగ పిట్ట ఈలవేసినట్టుగా గిరికీలు చుడుతూ పెద్దపెద్ద పాటలు పాడుతుంది.
ఎల్లో వార్బలర్: గుబురు పొదలలో, పంట చేలల్లో, దట్టపు కుదిమట్టపు చెట్లలో, చేమల్లో, పొదరిళ్ళల్లో, పొలాలలో వార్బలర్ చాలా తరుచుగా కనబడుతుంది. నల్లతల, పసుపు పచ్చ రంగుతో ఉండే ఈ జాతి పిట్టలలోనూ మగ పిట్టలే పాటలు పాడతాయి. దీని గొంత స్పష్టంగానూ, ఉచ్ఛస్వరంలోనూ ఉంటుంది. వరసగా ఒకే సారి అనేక పాటలు పాడడం దీనికి హాబీ! ఇది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత ఆనందంగా పాటపాడుతుంది. దాని పాట వినే వారికే కాదు దానికి కూడా ఎంతో ఆనందంగా ఉంది కాబోలు అనిపించేలా హాయిగా రెపరెపలాడుతూ పాడుతుంది.
రెడ్ ఐడ్ వీరో: దట్టమైన అడవులలో కనిపించే పాటల పిట్ట ఈ రెడ్ అర్డు వీరో. తూర్పు తీర దేశాలలో విరివిగా కనిపించేది, పాటలు వినిపించేది ఈ పిట్ట. గోధుమ వర్ణంతో తలపై కిరీటంతో శోభించే ఈ పిట్టను చాలా మంది దీన్ని చూడలేదని, దాని పాట మాత్రం వింటూ ఉంటామని చెబుతుంటారు. అంటే అంత అరుదుగా కనిపించే పిట్ట అన్నమాట ఇది. తెల్లవారింది మొదలు పొద్దు గుంకె వరకు వెనక్కి తిరిగి చూడకుండా, ఇతర పక్షులు పాటలు పాడడం మానేసినా విడకుండా పాడే పిట్ట ఇది. అందుకే దీన్ని ప్రీచర్ బర్డ్ అని పిలుస్తుంటారు. తెరతెరలుగా, విడతలు విడతలుగా ఎక్కడి కక్కడ గ్యాప్‌లిస్తూ పాటలు పాడే ఈ పిట్టపై అదే పనిగా అధ్యయనం చేసిన ఒక సైంటిస్ట్ ఈ పిట్ట ఒక రోజులో 3 వేల పాటలు పాడుతుందని లెక్కవేసి చెప్పాడు.
వైట్ త్రాటిల్డ్ స్పారో: ఉత్తరాది దేశాలలోని గుట్టల మీద, చెరువు కట్టల మీద, దట్టమైన అడవులలో చాలా తరుచుగా కనిపించే పక్షి వైట్ త్రాటిల్డ్ స్పారో. గోధుమవర్ణం చుక్కల రెక్కలు, తలపై తెల్లచార, ముఖంపై పసుపు బొట్టు గల ఈ పిట్ట స్వరం ఎంతో స్పష్టంగా, సన్నగా, పై స్థాయిలోనూ అందంగా పాడగలిగిన స్వరం దీనిది. కెనడా దేశంలో ఈ పిట్ట చాలా ఎక్కువగా కనబడుతుంది. మనుషులు దీని పాటను చాలా తేలికగా అనుకరించగలరు. ఈల వేయడం వచ్చిన వారికైతే దీని పాట పాడడం మరింత సులువు. ఉదయం, సాయంత్రం వేళలలో దీని పాట వినడానికి ఎంతో బాగుంటుంది. దీని పాట సుప్రభాత గీతికగా భావించి లేచే వాళ్ళు, దీని పాట వినేందుకే తెల్లవారు ఝూమున నిద్రలేచే వాళ్ళ సంఖ్య కెనడాలో ఎక్కువ.
గ్రే క్యాట్‌బర్డ్: పిల్లి మ్యావ్‌మన్నట్టే వింత ధ్వని చేస్తూ పాటపాడుతుంది కనుకనే దీన్ని క్యాట్‌బర్డ్ అని పిలుస్తారు. బూడిదరంగు, నల్లముక్కు, తలపై నల్లచారగల ఈ పిట్ట పెరటి చెట్లలో, గుబురు పొదలలో ఉంటుంది. కానీ ఇది చాలా వరకు కనిపించకుండా ఉంటుంది. దీని పాటను విని ఆనందించని వారుండరంటే అతిశయోక్తికాదు. పెద్ద స్వరంతో పై స్థాయి పాటలు పాడడంలో దీన్ని మించిన పక్షి లేదంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కాని ఇది నిజం. మగ పిట్ట పాటను ఏక బిగిన కాక ఆగిఆగి పాడుతుంది. ఒకసారి రాగయుక్తంగా, ఒకసారి బండగా, మరొకసారి విడతలు విడతలుగా వింత పోకడలు పోతూ పాడుతుంది.
ఈస్ట్రన్ టౌహి: పంట పొలాలలో, గుబురు పొదలలో హాయిగా దాగుని తీయగా పాటలుపాడే పక్షి టౌహి. నల్లతల, పసుపుకన్ను, ఎర్రఛాతితో కనిపించే ఈ పిట్ట పెద్ద గొంతుతో, కంపిత నాదంతో పాడే పాట, పాటలను అభిమానించే వారిని ఎంతగానో ఆకర్షిస్తుంది. విన్న కొద్దీ వినాలనిపించే పాట తీరు దానిది. ఫ్లారిడా ప్రాంతంలో అమితంగా కనిపించే పక్షిరాజం ఇది. దీని పేరు టౌహి అయినా అక్కడి వాళ్ళు మాత్రం ముద్దుగా టౌవీ అని చూవీ అని పిలుచుకుంటారు. చాలా టౌహీలకు కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఫ్లారిడాలో కనిపించే టౌహి కళ్ళు తెల్లగా ఉంటాయి.
టఫ్టెడ్ టిట్‌మౌజ్: సామాజిక వనాలలో, పెరటి చెట్లలో కనిపిస్తూ పాటలు పాడే పొట్టి ముక్కుపిట్ట ఇది. తలపై తురాయి, బూడిద వర్ణంతో అందంగా ఉండే ఈ జాతి పిట్టలలో మగవే పాటలు పాడతాయి. ఒకటి పాడితే ఆ పరిసరాల్లో మరో పిట్ట ఉంటే అది కూడా అందుకుని పాటను కొనసాగిస్తుంది. ఇలా ఈ పిట్టలు బృందగీతాలు ఆలపిస్తుంటాయి. దారావాహిక సంగీతాన్ని అందిస్తుంటాయి. అందుకే వీటి పాటలు వినడానికి జనం చెవులు కోసుకుంటుంటారు. ఇది చేసే ధ్వనిని జాగ్రత్తగా వింటే అది పీటర్ పీటర్ అని పిలుస్తున్నట్టు ఉంటుందని అంటుంటారు.
ఇండిగో బంటింగ్: ఇది ముదురు నీలం రంగులో ఉండే అందమైన పిట్ట. దూరం నుంచి చూసే వారు మాత్రం ఈ పిట్ట నల్లగా ఉందంటారు. పారిస్ దేశంలో ఈ పిట్ట పాట మారువెూగు తుంటుంది. చాలా పెద్ద స్వరంతో, పెద్ద స్థాయిలో పాటలు పాడే పిట్ట ఇది. తూర్పు, మధ్య ప్రాచ్య దేశాలలో కనిపించేది, పాటలను వినిపించేది ఈ పిట్ట. ఈ పిట్ట పాటను అనుకరిస్తూ 'ఫైర్-ఫైర్, వేర్-వేర్, హియర్-హియర్, సీ ఇట్-సీ ఇట్' పాట పుట్టింది.
ఊడ్ త్రాష్: గోధుమ రంగు తల, చుక్కల ఛాతితో తూర్పు తీర అడవులలో గుబురు చెట్లు వేణుగానం చేస్తున్నట్టుగా పాటలు పాడే పిట్ట ఊడ్ త్రాష్. లయలు, హొయలు తప్పకుండా అనేక స్థాయిలలో స్వరాన్ని విస్తరించి పెంచి పాడగల సత్తా దీని సొత్తు. గొంతును పలు రకాలుగా వణికిస్తూ ఇది పాడే పాట వినే వారిని శ్రవణానందంలో తేలియాడిస్తుంది. జాతి ఒకటే అయినా త్రాష్ పిట్టలు ఒకొక్కటి ఒక్కొక్క రకంగా పాటలు పాడి అలరిస్తాయి. ఈ విషయంలో దేని శైలి దానిదే! ఆడ పిట్టలు చిన్న చిన్న పాటలు పాడతాయి.
Source : prajashakti New paper