ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
Appearance
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ఐక్యరాజ్య సమితి |
ప్రారంభం | 2007 (ఆమోదం), 2009 (ప్రారంభం) |
జరుపుకొనే రోజు | ఫిబ్రవరి 20 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదేరోజు |
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించబడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1]
చరిత్ర
[మార్చు]పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను అధిగమించడానికి చేయవలసిన కృషికోసం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకోవాలన్న ప్రతిపాదనను 2007, నవంబరు 26న జరిగిన ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం, ఎ/ఆర్ఈఎస్/62/10 పై తీర్మానించగా 2009, ఫిబ్రవరి 20న తొలిసారిగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపబడింది.[2][3]
విధులు
[మార్చు]- సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తించి పేదరికం, లింగ సమానత్వం, నిరుద్యోగం, మానవ హక్కులు, సామాజిక రక్షణ వంటి అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించడం
- అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య స్నేహ బాంధవ్యాలు ఏర్పాటుచేయడం, సామరస్య వాతావరణం సాధించడం, వివిధ దేశాలమధ్య సమాన ప్రాతిపదికపై సంబంధాలు నెలకొల్పడం
- విలువలు, స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం, భద్రత, ఆర్థిక సామాజిక పురోభివృద్ధి వంటి ప్రాథమిక అంశాల విషయంలో ఎటువంటి వివక్షత పాటించకుండా సామాజిక న్యాయం అమలయ్యేలా చూడడం[4]
కార్యక్రమాలు
[మార్చు]- ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాజిక సంస్థలు ఈ దినోత్సవం రోజున సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన కొరకు ప్రచారం చేస్తాయి. సెమినార్లు, సమావేశాలు జరుగుతాయి. పేదలకు సహాయం చేయడానికి నిధులు సేకరించబడతాయి.
- సామాజిక న్యాయం యొక్క ఆవశ్యకత గురించి విద్యార్థులకు బోధించడానికి అనువైన విషయాలలో పేదరికం, ప్రపంచ పౌరసత్వం, మానవ హక్కులు, వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలు ప్రధానమైనవి.
- దేశాల వారిగా వివిధ రకాల బోధన విషయాలు ఐక్యరాజ్య సమితి వద్ద అందుబాటులో ఉన్నాయి.[5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ "World Day of Social Justice, 20 February". www.un.org (in ఇంగ్లీష్). Retrieved 20 February 2020.
- ↑ UN declares 20 February as World Day of Social Justice
- ↑ నవతెలంగాణ, నేటివ్యాసం (20 February 2016). "న్యాయ సాధనలో సామాజిక న్యాయం ఏపాటిది?". దడాల సుబ్బారావు. Archived from the original on 20 February 2020. Retrieved 20 February 2020.
- ↑ ప్రజాశక్తి, ఎడిటోరియల్ (20 February 2016). "సన్నగిల్లుతున్న సామాజిక న్యాయం". దడాల సుబ్బారావు. Archived from the original on 20 ఫిబ్రవరి 2020. Retrieved 20 February 2020.
- ↑ "United Nations Matters lesson plans - by UNA-UK". Guardian Teacher Network (in ఇంగ్లీష్). 2013-09-04. Archived from the original on 20 ఫిబ్రవరి 2018. Retrieved 20 February 2020.
- ↑ "Power-shift power point (secondary) – Oxfam's Food for Thought project". Guardian Teacher Network (in ఇంగ్లీష్). 2011-12-23. Archived from the original on 20 ఫిబ్రవరి 2018. Retrieved 20 February 2020.
- ↑ Hannah, Valerie (2014-02-17). "How to teach … social justice". the Guardian (in ఇంగ్లీష్). Retrieved 20 February 2020.