ప్లేగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్లేగు
వర్గీకరణ & బయటి వనరులు
Yersinia pestis seen at 200× magnification with a fluorescent label. This bacterium, carried and spread by fleas, is the cause of the various forms of the disease plague.
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 14226
m:en:MedlinePlus 000596
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH {{{m:en:MeshID}}}

ప్లేగు వ్యాధి ఒక రకమైన అంటు వ్యాధి. ఈ ప్రాణాంతకమైన వ్యాధి ఎర్సీనియా పెస్టిస్ (పాస్చురెల్లా పెస్టిస్) అనే బాక్టీరియా వలక కలుగుతుంది. ఇది జంతువులు ముఖ్యంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది, మానవులకు ఈగల ద్వారా చేరుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఎన్నో విశ్వమారిగా చాలా మంది మరణానికి కారణమైంది, కొన్ని ప్రాంతాలలో మహమ్మారిగా స్థిరపడింది. చర్మం, శ్లేష్మ పొర గాయాల నుండి సంక్రమణ, సంక్రమణ కారణంగా స్ప్లాషింగ్ (టార్పెడో) దీని ప్రభావిత కాలం 1 నుండి 5 రోజులు. మెజారిటీ (> 90%) శోషరస గ్రంథులను ప్రభావితం చేసే గ్రంథి ప్లేగు , రక్తస్రావం బ్రోంకోప్న్యుమోనిటిస్, చర్మంలో స్ఫోటములు, పూతలని సృష్టించే స్కిన్ ప్లేగుకు కారణమయ్యే ఇతర ప్లేగు ప్లేగులు ఉన్నాయి. దీని చికిత్స సల్ఫా డ్రగ్ , స్ట్రెప్టోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది.

వ్యాప్తి

[మార్చు]

క్రీస్తుశకం 541 కాలంలో ఆనాటి బిజంటైన్‌(ఈశాన్య యూరప్‌ రాజ్యం) రాజధాని కాన్‌స్టాంటినోపిల్‌లో మొదటిసారి ప్లేగు వ్యాధి వచ్చింది. ఈజిప్టు నుంచి మెడిటెర్రెనియన్‌ సముద్రం మీదుగా ఈ వ్యాధి పాకిందని చరిత్రకారులు చెబుతున్నారు. [1] . ప్లేగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది ప్రజలు చనిపోయి ఉంటారని అంచనా

1994 సురత్ మహమ్మారి

[మార్చు]

1994 సంవత్సరంలో న్యుమోనిక్ ప్లేగు మహమ్మారి భారతదేశంలోని సూరత్ పట్టణంలో వ్యాపించింది. దీనిమూలంగా 52 మంది మరణించగా సుమారు 3 లక్షల మంది స్థానికులు రాష్ట్రం వదిలి పారిపోయారు.[2].

భారీ వర్షాలు, మూసుకుపోయిన డ్రైనేజీ పైపులు మూలంగా ఏర్పడిన అనారోగ్య పరిస్థితుల మూలంగా చనిపోయిన జంతువుల మృతదేహాలను సకాలంలో తొలంగించలేకపోవడం దీనికి ప్రధానకారణంగా భావిస్తున్నారు.[3]. అయితే భారత ప్రభుత్వం చేపట్టిన సత్వర చర్యల మూలంగా ఈ మహమ్మారి దేశమంతా వ్యాపించకుండా నిరోధించారు.[4][5].

కొంతమంది ఈ మహమ్మారికి ముఖ్యమైన కారణం ప్రయోగశాల పరీక్షలలో దీనిని గుర్తించలేకపోవడమేనని పేర్కొంటారు.[5]. ప్రయోగశాలలో నిర్ధారించలేకపోయినా రక్త పరీక్షలలో ప్లేగు ప్రతిరక్షకాలు ఉండడం, వ్యాధి లక్షణాలు ఇది ప్లేగు వ్యాధిగా నిర్ధారించాయి.[6].


1720లో యూరప్ ఫ్రాన్సులోని మర్సెయిల్స్ లో బయటపడిన ఈ వ్యాధి ఆ ఒక్క నగరంలోనే 50 వేల మంది ప్రాణాలకు కబలించింది. లక్షల మందిని అనారోగ్యం పాలు చేసింది.

https://www.hmtvlive.com/specials/an-infectious-diseases-attacking-for-every-100-years-like-coronavirus-41903 Archived 2020-10-21 at the Wayback Machine

మూలాలు

[మార్చు]
  1. "ఆ వ్యాధులు ఎలా కనుమరుగయ్యాయి?". www.eenadu.net. Retrieved 2020-04-04.
  2. "Pneumonic Plague Epidemic in Sural". Association of American Geographers. Archived from the original on 2007-08-08. Retrieved 2008-04-26.
  3. "Surat: A Victim of Its Open Sewers". New York Times. September 25, 1994. Retrieved 2008-04-26.
  4. "With Old Skills and New, India Battles the Plague". New York Times. September 29, 1994. Retrieved 2008-04-26.
  5. 5.0 5.1 "Plague's Origins A Mystery". New York Times. March 14, 1995. Retrieved 2008-04-26.
  6. "The Surat Plague and its Aftermath". Godshen Robert Pallipparambil. Archived from the original on 2010-06-11. Retrieved 2008-04-26.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లేగు&oldid=3884526" నుండి వెలికితీశారు