Jump to content

ఫిత్రా

వికీపీడియా నుండి

ఫిత్రా  : ఈ పదానికి అర్థం, మానవునిలో గల ప్రకృతిక ధర్మం. అనగా, తనతోపాటు ఇతరులకూ సంతోషాన్నివ్వడం. ఈ ప్రకృతిక ధర్మం ప్రతి మనిషిలోనూ వుంటుంది. ఈ ధర్మం ప్రకారం, మానవుడి, దైవ మార్గాన, భాగ్యములేని(నిర్భాగ్యులకి ) వారికి, ధన రూపేణా భాగ్యము కల్పించడం. ప్రముఖంగా, ఈ ఫిత్రాను రంజాన్ పండుగనాడు, పేదలకు, అభాగ్యులకు ఇచ్చే దానం. ఇది ప్రతి ముస్లిం ఇవ్వవలసిన కనీస దానం. ఈ దానం, రంజాన్ పండుగకు మూడు రోజుల మునుపునుండి ఇవ్వవచ్చును. అలా ఇచ్చినపుడు, పేదలూ పండుగ చేసుకునే అవకాశం వాతావరణం ఏర్పడుతుంది. దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు దానం చేసే ఈవిధానంలో గోధుమలు గానీ , ఆహారధాన్యాలను గానీ, ధనాన్ని గానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేస్తారు. మానవతా రూపంలో చూసిన యెడల ఇదొక సామాజిక బాధ్యత గల దానం. అభాగ్యులకు, పేదవారికి చేసే దానం.అందుకే ఈ పండుగని ఈద్ ఉల్ ఫిత్ర్ అంటారు. అంటే ఫిత్ర్ అర్ధం దానం అందువలనే ఈ పండుగను "దానాల పండుగ" పిలుస్తారు  

ప్రవక్త ప్రవచనం

[మార్చు]

రంజాన్ ఉపవాస దీక్షలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అన్నారు ముహమ్మద్ ప్రవక్త.(శాంతి కలుగుగాక.)

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • J.M. Cowan (1994), The Hans Wehr Dictionary of Modern Written Arabic
  • John Esposito (2003), The Oxford Dictionary of Islam
  • M. Masud (1996), Islamic Legal Interpretation: Muftis and Their Fatwas
  • Imam Ali, Nahjul Balagha: Sermons, Letters & Sayings of Imam Ali
  • Al-Kulayni, al-Usul mina ‘l-Kãfi, vol. 2, p. 13; al-Bukhãri, Sahih, vol. 2 (Beirut: Dãr al-Fikr, 1401) p. 104

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఫిత్రా&oldid=3539389" నుండి వెలికితీశారు