ఫిరాయింపు
Jump to navigation
Jump to search
రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీకి విధేయుడిగా ఉంటూ ఆ రాజకీయ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడి గెలిచి పదవులను పొందిన తరువాత అక్రమంగా మరొక పార్టీలో చేరడాన్ని ఫిరాయింపు లేదా పార్టీ ఫిరాయింపు అంటారు. అక్రమంగా పార్టీ ఫిరాయించిన వ్యక్తిని పార్టీ ఫిరాయింపుదారు లేదా పార్టీ నమ్మకద్రోహి అంటారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
[మార్చు]భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచాక మరో పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఎన్నికైన పార్టీని వదిలేసి, మరో పార్టీలోకి చేరే అభ్యర్థులు ఈ చట్టం ద్వారా అనర్హులవుతారు. ఒక పార్టీ పక్షాన ఎన్నికై, మరో పార్టీలో చేరడమనేది అనైతిక, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. ఈ తరహా చర్యలను నివారించడానికే ఈ చట్టం చేశారు. కానీ ఈ చట్టం వల్ల ఎవరూ ఇంత వరకు అనర్హత వేటుకి గురికాబడలేదు.