Jump to content

ఫిలిం వేగం

వికీపీడియా నుండి
ఈ ఫిల్మ్‌ పెట్టెపై పిలిం వేగం ISO 100/21° గా గుర్తించబడినది.

ఫిలిం వేగం లేదా ఐ ఎస్ ఓ వేగం ఒక ఫిలిం లేదా ఇమేజ్ సెన్సర్ యొక్క కాంతిని గుర్తించగలిగే తత్త్వం. ఈ వేగం ఎంత ఎక్కువగా ఉంటే కాంతిని గుర్తించే తత్వం అంతగా పెరుగుతుంది. సెన్సిటోమెట్రీ ఈ వేగాన్ని నిర్ధారించగా, దీనిని కొలవటానికి అనేక కొలమానాలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాణాలలో అత్యాధునికమైనవి, ISO ప్రమాణాలు.

ఒకే ప్రతిబింబాన్ని ఒకే రకంగా చిత్రీకరించటానికి రెండు ఫిలింలను వినియోగించినపుడు ఒక దానిపై కాంతిని ఎక్కువ నిడివి పాటు/ఎక్కువ తీవ్రతతో బహిర్గతం చేయవలసి వస్తే ఆ ఫిలిం యొక్క వేగం తక్కువ అని (స్లో ఫిలిం) మరొక ఫిలిం పై కాంతిని తక్కువ నిడివి పాటు/తక్కువ తీవ్రతతో బహిర్గతం చేసినా సరిపోతే ఆ ఫిలిం యొక్క వేగం ఎక్కువ అని (ఫాస్ట్ ఫిలిం) అని సాంకేతిక పరిభాషలో వ్యవహరిస్తారు. ఫిలిం ఫోటోగ్రఫీ అయినా డిజిటల్ ఫోటోగ్రఫీ అయినా కాంతిని గుర్తించే తత్వం పెరిగే కొలదీ, తదనుగుణంగా బహిర్గతం తరుగుతూ వస్తుంది. తత్ఫలితంగా ఛాయాచిత్రం యొక్క నాణ్యత కూడా (ఫిలిం గ్రెయిన్ పెద్దగా రావటం, లేదా నాయిస్ రావటం వంటివి జరగటం మూలాన) తరుగుతూ వస్తుంది.