Jump to content

బిబ్‌కోడ్

వికీపీడియా నుండి
బిబ్‌కోడ్
పూర్తి పేరుబిబ్లియోగ్రాఫిక్ కోడ్
ప్రవేశపెట్టిన తేదీ1990s
అంకెల సంఖ్య19
చెక్ డిజిట్లేదు
ఉదాహరణ1924MNRAS..84..308E

బిబ్‌కోడ్ అనేది ఖగోళ శాస్త్ర సంబంధ సాహిత్యం లోని ఆకరాలను ప్రత్యేకంగా పేర్కొనడానికి అనేక ఖగోళ డేటా సిస్టమ్‌లు ఉపయోగించే ఒక పొందికైన ఐడెంటిఫైయర్. దీన్ని రెఫ్‌కోడ్ అని కూడా పిలుస్తారు.

స్వీకారం

[మార్చు]

బిబ్లియోగ్రాఫిక్ రిఫరెన్స్ కోడ్ (రిఫ్‌కోడ్) ను SIMBAD లోను, NASA/IPAC ఎక్స్‌ట్రా-గలాక్టిక్ డేటాబేస్ (NED) లోనూ ఉపయోగించడం కోసం అభివృద్ధి చేసారు. అయితే ఇది డి ఫాక్టో ప్రమాణంగా మారింది. ఇప్పుడు మరింత విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఉదాహరణకు, NASA ఆస్ట్రోఫిజిక్స్ డేటా సిస్టమ్ - ఈ "బిబ్‌కోడ్" అనే పదాన్ని కాయించినది వాళ్ళే - దీన్ని వాడూతుంది. [1]

ఫార్మాట్

[మార్చు]

బిబ్‌కోడ్ 19 అక్షరాల కచ్చితమైన పొడవుతో, కింది ఆకృతిలో ఉంటుంది.

YYYYJJJJJVVVVMPPPPA

ఇక్కడ YYYY అనేది నాలుగు-అంకెల సంవత్సరానికి సూచిక కాగా, JJJJJ అనేది ఎక్కడ ప్రచురించబడిందో సూచించే కోడ్. VVVV అనేది జర్నల్ రిఫరెన్స్ విషయంలోనైతే వాల్యూమ్ సంఖ్య, M అనేది ప్రచురించబడిన పత్రిక లోని విభాగాన్ని సూచిస్తుంది. PPPP ప్రారంభ పేజీ సంఖ్యను ఇస్తుంది. A అనేది మొదటి రచయిత చివరి పేరు లోని మొదటి అక్షరం. ఉపయోగించని ఫీల్డ్‌లను పూరించడానికీ, ఏదైనా ఫీల్డులో ఇచ్చిన విలువ పొడవు తక్కువగా ఉంటే దాన్ని నిర్ణీత పొడవు వరకు ప్యాడింగు చేయడానికి పీరియడ్ (.) లను ఉపయోగిస్తారు; ప్యాడింగు పబ్లికేషన్ కోడ్‌కు కుడి వైపున, సంచిక సంఖ్య, పేజీ సంఖ్యలకు ఎడమ వైపున ప్యాడింగ్ చేస్తారు. [1] పేజీ సంఖ్య 9999 కంటే ఎక్కువ ఉంటే M కాలమ్‌లో కొనసాగుతాయి. [1]

ఉదాహరణలు

[మార్చు]

బిబ్‌కోడ్‌లకు కొన్ని ఉదాహరణలు:

బిబ్‌కోడ్
1974AJ.....79..819H
1924MNRAS..84..308E
1970ApJ...161L..77K
2004PhRvL..93o0801M

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "The ADS Data, help page". NASA ADS. Archived from the original on 14 October 2007. Retrieved November 5, 2007. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "b" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు