బొట్టు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ముఖాన బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం ఒక హిందూ సంప్రదాయం.
భాషా విశేషాలు
[మార్చు]తెలుగు భాషలో బొట్టు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] బొట్టు అనగా బిందువు (A drop) లేదా శరీరం మీద పెట్టుకొనే చుక్క. నిలువుబొట్టు వైష్ణవానికి చిహ్నం అయితే అడ్డబొట్టు శైవానికి చిహ్మంగా భావిస్తారు. తాళిబొట్టు వివాహానికి గుర్తుగా స్త్రీలు మెడలో ధరించేది. బొట్టుకట్టు అనగా వివాహంలో తాళిబొట్టు కట్టడం లేదా వివాహం చేసుకోవడం. బొట్టుదారం అనగా మంగళసూత్రం.
భౌతికశాస్త్రం
[మార్చు]భౌతికశాస్త్రంలో నీరు వంటి ద్రవ పదార్ధాలు పైనుండి పడేటప్పుడు బిందువులుగా పడతాయి; వాటిని కూడా బొట్టు లేదా బొట్లు (drop or drops) అంటారు. ఉదాహరణకు వర్షం పడేటప్పుడు నీటి బొట్లు ఆకాశం నుండి భూమి మీదకు పడతాయి.
తిలకథారణం
[మార్చు]హిందూమతంలో మాత్రమే బొట్టుపెట్టుకొనే ఆచారముంది. ప్రపంచంలో ఏ ఇతర మతాలలోనూ ఈ ఆచారం లేదు. బ్రహ్మదేవుడు నుదుట వ్రాసినగీత తప్పింప ఎవరికీ శక్యం కాదు. కాని ఎవ్వరు ముఖాన బొట్టు పెట్టుకుందురో వారు బ్రహ్మరాసిన రాతను చెరిపి మంచిరాత వ్రాసుకుంటారనే నమ్మకం కొందరిలో ఉంది.