Jump to content

బొల్లోజు బాబా

వికీపీడియా నుండి
బొల్లోజు బాబా
బొల్లోజు బాబా రచయిత
జననం
బొల్లోజు బాబా

15 ఆగస్టు 1970
పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన యానాం
ఇతర పేర్లుబొల్లోజు బాబా
విద్యఎం.యస్సీ, ఎం.ఫిల్
క్రియాశీల సంవత్సరాలు1991 నుండి ప్రస్తుతం
ఉద్యోగంకాకినాడలో అధ్యాపకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత.
తల్లిదండ్రులుబసవలింగం
అమ్మాజీ

బొల్లోజు బాబా కవి, రచయిత. అతను కాకినాడలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. బాబా పలు చారిత్రక అంశాలతో పుస్తకాలు రాశాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

బొల్లోజు బాబా బొల్లోజు బసవలింగం, అమ్మాజి దంపతులకు 1970 ఆగస్టు 15 న పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన యానాంలో జన్మించాడు. అతను జంతుశాస్త్రంలో ఎమ్మెస్సీ, ఎం.ఫిల్ చేసాడు. కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్ కాలేజ్ సర్విస్ కమిషన్ పరీక్షలు ఉత్తీర్ణుడై 1997లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్ని పొంది ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డాడు. ప్రస్తుతం కాకినాడలో నివాసమేర్పరచుకొన్నాడు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతనికి మండపేటకు చెందిన నరిగిరి సూర్యపద్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కుమార్తె పేరు అపరాజిత. కుమారుడి పేరు బసవ శ్రీధర్.

రచనా ప్రస్థానం

[మార్చు]

వీరి తండ్రిగారైన బొల్లోజు బసవలింగం నాటకరచయితగా ఎవరుదోషి?, వారసుడు, నేటి విద్యార్థి, కృష్ణరాయబారము వంటి నాటకాలు రచించాడు. అందువల్ల బాబా ఇంట్లో సాహిత్యానికి సంబంధించిన వాతావరణం ఉండేది. బాబా ఇంటర్ చదివే సమయంనుంచీ కవితలు అల్లటం మొదలు పెట్టాడు. కళాశాల మాగజైన్స్ లో తనపేరుతోను, మిత్రుల పేరుతోను అనేక కవితలు పంపగా అచ్చు అయ్యేవి. ఆ తరువాత యానానికే చెందిన కవి శిఖామణి ఇచ్చిన ప్రోత్సాహంతో వాటిని పత్రికలకు పంపేవాడు. 1991 నవంబరు 8 నాటి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో "ఈ వారం కవిత"గా ప్రచురించబడిన "తిరిగి భవిష్యత్తులోకే[1]" అనే కవిత ద్వారా అతను సాహితీలోకానికి పరిచయమయ్యాడు. ఆ తరువాత క్రమంగా అన్ని ప్రముఖ పత్రికలలోను అతని కవితలు ప్రచురితమయ్యాయి.

ముద్రిత రచనలు

[మార్చు]
  1. యానాం విమోచనోద్యమం − 2007 లో ప్రచురింపబడింది. ఈ పుస్తకంలో, యానాంలో 1947 నుంచి 1954 మధ్య ఫ్రెంచి వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్యపోరాటం గురించి సవివరంగా, ఆనాటి ఛాయా చిత్రాలతో ఉంటుంది.[2]
  2. ఆకుపచ్చని తడిగీతం − ఇది 2008 లో ప్రచురించబడిన మొదటి స్వీయ కవితా సంకలనం.[3] దీనికి శిలపరసెట్టి ప్రత్యేక సాహితీ అవార్డు వచ్చింది.
  3. ఫ్రెంచి పాలనలో యానాం[4] − ఈ పుస్తకం 2012 లో ప్రచురింపబడింది. యానాంలో ఆవిష్కరించబడింది. 1724 లో ఫ్రెంచి వారు యానాం వచ్చినప్పటినుంచి 1954 లో వెళ్లిపోయేవరకూ జరిగిన సంఘటనలు, విద్య, చట్ట వ్యవస్థ, రాజకీయ చిత్రణ, వ్యాపారాలు, ఆనాటి సామాజిక వ్యవస్థ, వారుచేసిన నిర్మాణాలు వంటి వివరాలతోకూడిన చారిత్రిక పరిశోధనాత్మక పుస్తకం.[5]
  4. వెలుతురు తెర − వీరి రెండవ కవిత్వసంపుటి.[6] 2016 లో ప్రచురించబడింది. ఇది విమర్శకుల ప్రశంసలు పొందింది.దీనికి కవి ఇస్మాయిల్ గారిపేరిట ఇచ్చే "ఇస్మాయిల్ సాహిత్య పురస్కారం", ఇంకా "రొట్టమాకు రేవు పురస్కారం" లభించాయి.
  5. స్వేచ్ఛా విహంగాలు − విశ్వకవి రవీంద్రుడు రచించిన స్ట్రే బర్డ్స్ పుస్తకాన్ని వీరు 2009 లోనే అనువదించి తన బ్లాగులో ప్రచురించుకొన్నారు. దానిని వాడ్రేవు వీరభద్రుడి ముందుమాటతో స్వేచ్ఛావిహంగాలుగా 2016 లో పుస్తకరూపంలోకి తీసుకొని వచ్చారు.[7]
  6. కవిత్వ భాష − పాశ్చాత్య అలంకారలను వివరించే సాహిత్య వ్యాసాలు.[8] కవిసంగమంలో సీరిస్ గా కవిత్వస్వరం పేరిట వ్రాసిన వ్యాసాలను అన్నింటిని "కవిత్వ భాష" పేరుతో 2018 లో పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ఈ పుస్తకావిష్కరణ రొట్టమాకురేవు ఖమ్మంలో శివారెడ్డి, యాకూబ్, ప్రసేన్ ల చేతులమీదుగా జరిగింది.
  7. మూడో కన్నీటిచుక్క − 2019 లో ప్రచురించబడిన స్వీయ కవిత్వ సంపుటి.[1]
  8. మెకంజీ కైఫీయ్యతులు-తూర్పుగోదావరి ( 2020) ISBN 978-93-5408-115-6 పుస్తకాన్ని పల్లవి సంస్థ ప్రచురించింది. విజయవాడలో నవంబరు 22 పుస్తకావిష్కరణ జరిగింది.[9] .
  9. ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా (2021) ISBN 978-93-5473-695-7 పుస్తకాన్ని పల్లవి ప్రచురణ సంస్థ ప్రచురించింది [10].
  10. థేరీ గాథలు - తొలితరం బౌద్ధ సన్యాసినుల కవిత్వం (2022) ISBN 978-93-92968-14-3 పుస్తకాన్ని ఛాయా రిసోర్స్ సెంటర్ ప్రచురించింది.[11]
  11. ఫ్రెంచి ఇండియా స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ దడాల రఫేల్ రమణయ్య ISBN 978-93-5780-001-3 పుస్తకాన్ని పల్లవి ప్రచురణ సంస్థ ప్రచురించింది.[12]
  12. వేద బాహ్యులు, చరిత్ర వ్యాసాలు ISBN: 978-93-94374-43-0 పుస్తకాన్ని పల్లవి ప్రచురణ సంస్థ ప్రచురించింది.
  13. ప్రాచీన గాథలు - అనువాద కవిత్వం, ఛాయా ప్రచురణ సంస్థ ముద్రించింది. ISBN: 978-81-982293-1-1


ఇ-బుక్స్ రూపంలో ఉన్న అముద్రిత రచనలు

[మార్చు]
  • 'ఎడారి అత్తరులు' ప్రముఖ సూఫీ కవుల గీతాల అనువాదాలు[13]
  • 'ఇరవై ప్రేమ కవితలు ఒక విషాద గీతం' Twenty Love poems and a song of despair – Pablo Neruda అనువాదం[14]
  • రవీంద్రుని క్రిసెంట్ మూన్ అనువాదం[15]
  • గాథాసప్తశతి - కొన్ని అనువాదాలు[16]
  • వివిధ పుస్తకాల పరిచయాలు, ప్రసంగాలు, సమీక్షా వ్యాసాలు[17]
  • వివిధ ప్రపంచకవుల రెండువందలకు పైన కవితల అనువాదాలు
  • రూమీ వాక్యాలు

ప్రసంశలు/అవార్డులు

[మార్చు]
  1. ఆకుపచ్చని తడిగీతం పుస్తకానికి శ్రీ శిలపరశెట్టి సాహితీ ప్రత్యేక ప్రశంసా పురస్కారం 2010[18]
  2. పాలకొల్లుకు చెందిన శ్రీకళాలయ సాంస్కృతిక సంస్థవారిచే రాష్ట్రస్థాయి సాహితీపురస్కారం -2012
  3. శ్రీ ర్యాలి ప్రసాద్- డా.సోమసుందర్ స్మారక పురస్కారం 2016
  4. ఇస్మాయిల్ సాహితీ పురస్కారం 2017[19]
  5. రొట్టమాకు రేవు కవిత్వ అవార్డు 2018[20]
  6. పాతూరి అన్నపూర్ణ స్మారక సాహిత్య పురస్కారం 2020
  7. పెన్నా సాహిత్య పురస్కారం 2020 [21]

మూలాలు

[మార్చు]
  1. Baba, Bolloju (7 September 2008). "సాహితీ-యానం: తిరిగి భవిష్యత్తులోకే ..." సాహితీ-యానం.
  2. పుస్తకం, చరిత్ర. "యానాం విమోచనోద్యమం".
  3. పుస్తకం, కవిత్వ సంకలనం. "ఆకుపచ్చని తడిగీతం".
  4. "Bolloju Baba". పుస్తకం (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-10.
  5. పుస్తకం, చరిత్ర. "ఫ్రెంచిపాలనలో యానాం".
  6. పుస్తకం, కవిత్వం. "వెలుతురు తెర".
  7. పుస్తకం, అనువాదం. "స్వేచ్ఛావిహంగాలు".
  8. సాహిత్యవ్యాసాలు, పుస్తకం. "కవిత్వభాష".
  9. బొల్లోజు బాబా (2021). Mackenzie Khaifiyats, Bolloju Baba.
  10. బొల్లోజు బాబా (2021-11-01). Pracheena Patanalu Pdf Bolloju.
  11. Baba, Bolloju (2022-10-19). "సాహితీ-యానం: చరిత్రను పొదువుకొన్న కవిత్వం-థేరీగాథలు". సాహితీ-యానం. Retrieved 2022-10-19.
  12. Baba, Bolloju (2023-02-25). "సాహితీ-యానం: "ఫ్రెంచి ఇండియా స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ దడాల రఫేల్ రమణయ్య" పుస్తకావిష్కరణ". సాహితీ-యానం. Retrieved 2023-04-14.
  13. "ఎడారి అత్తరులు - సూఫీ కవితానువాదాలు" (in Telugu).{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  14. "ఇరవై ప్రేమ కవితలు ఒక విషాద గీతము" (in Telugu).{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  15. "Crescent Moon Telugu" (in English).{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  16. "Gadhasaptha Shathi By Bolloju Baba" (in English).{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  17. బొల్లోజు బాబా. Bolloju Baba Sahithya Vyasaalu Final.
  18. Baba, Bolloju (6 July 2010). "సాహితీ-యానం: శిలపరశెట్టి పురస్కార సభా విశేషాలు". సాహితీ-యానం.
  19. Baba, Bolloju (9 April 2020). "సాహితీ-యానం: ఇస్మాయిల్ సాహితీ పురస్కార సభ". సాహితీ-యానం.
  20. Baba, Bolloju (9 February 2020). "సాహితీ-యానం: రొట్టమాకు రేవు అవార్డు స్వీకరణ సభలో -- నా స్పందన". సాహితీ-యానం.
  21. Baba, Bolloju. "సాహితీ-యానం". Retrieved 2021-08-19.

బాహ్య లంకెలు

[మార్చు]