భగవద్గీతా ఫౌండేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భగవద్గీత ఫౌండేషన్
వ్యవస్థాపకులుగంగాధర శాస్త్రి ఎల్.వి
కార్యస్థానం
  • బంజారాహిల్స్, హైదారాబాద్, భారతదేశం.
జాలగూడుhttp://www.bhagavadgitafoundation.org/contactus.html

భగవద్గీత ఫౌండేషన్ భగవద్గీతను విశ్వవ్యాప్తం చేయడానికి స్థాపించిన  లాభాపేక్ష లేని ఒక ధార్మిక సంస్థ. గీత నేర్చుకుందాం - రాత మార్చుకుదాం - ఇంటిటా గీతా జ్యోతిని వెలిగిద్దాం' అనేది ఈ ఫౌండేషన్ నినాదం.[1]

స్థాపన

[మార్చు]

ఈ ఫౌండేషన్ ను ప్రముఖ గాయకుడు ఎల్.వి గంగాధర శాస్త్రి 5 మార్చి 2007 రోజున స్థాపించారు.

కార్యక్రమాలు

[మార్చు]

భగవద్గీత సంస్థ వ్యవస్థాపకుడు గంగాధర శాస్త్రి సంపూర్ణ భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను తెలుగులో తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంతో గానం చేసి, రికార్డు చేసి తన జీవితాన్ని గీతా ప్రచారానికి అర్పించాడు.

గంగాధర శాస్త్రి భగవద్గీత

[మార్చు]
  • భగవద్గీతకు భారతదేశంలో, గాన పద్ధతిలో ప్రచారం కల్పించినవాడు తెలుగువాడు (ఘంటసాల) కాబట్టి, భగవద్గీతను సంపూర్ణంగా గానం చేసేవాడు కూడా తెలుగువాడే కావాలన్న లక్ష్యంతో ఘంటసాల భగవద్గీత స్ఫూర్తితోప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి- భగవద్గీతలోని 700 శ్లోకాలనూ తాత్పర్య సహితంగా గానం చేయడానికి సంకల్పించాడు.
  • ఈ సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం 2006 జూన్ 25న, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి చేతుల మీదుగా హైదరాబాదులోని అన్నా ఆడియో లాబ్‍లో ప్రారంభమై, 6 సంవత్సరాల కృషి అనంతరం , 2012లో పూర్తయ్యింది.
  • శ్రీ ఘంటసాల గౌరవార్థం, ఆయన పాడిన 106 శ్లోకాలను యథాతథంగా గానం చేస్తూ, మిగిలిన శ్లోకాలను గంగాధర శాస్ర్తి స్వీయ సంగీతంలో గానం చేసి 700 శ్లోకాల ’భగవద్గీత’ను సంపూర్ణంగా రికార్డు చేసాడు.
  • పద్మశ్రీ ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృతమిత్ర డా||ఆర్.వి.ఎస్.ఎస్.అవధానులు, ఆచార్య శ్రీ కోరాడ సుబ్రహ్మణ్యంల పర్యవేక్షణలో ప్రామాణిక స్థాయిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.
  • ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక విలువలతో డిజిటల్ స్టీరియో రికార్డింగ్‍లోను, ’డాల్బీ డిజిటల్ 5.1’ ఛానల్‍లోను మిక్సింగ్ చేయడం ఈ ’భగవద్గీత’ ప్రత్యేకత.
  • ఘంటసాల ’భగవద్గీత’కు పనిచేసిన ’సితార్’ వాద్యకాళాకారుడుశ్రీ జనార్దన్, సౌండ్ ఇంజనీర్’హెచ్.ఎమ్.వి’.రఘు, సంగీత దర్శకులుశ్రీ సంగీతరావు ఈ ప్రాజెక్టుకు కూడా గౌరవహోదాల్లో పనిచేయడం విశేషం.
  • కర్నాటక శాస్ర్తీయ, హిందుస్థానీ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతాల మేళవింపుగా సాగే ఈ ’భగవద్గీత’ శ్రోతల్ని ఆధ్యాత్మిక సంగీత ధ్యానంలోకి తీసుకువెళ్ళేట్టుగా సాగుతుంది.
  • శ్రీ కృష్టార్జున సంవాదాన్ని కళ్ళకు కట్టినట్టుగా వినిపించేందుకు అనుగుణమైన సంగీతం, సౌండ్ఎఫెక్ట్స్ ఈ ’భగవద్గీత’లో ప్రత్యేక ఆకర్షణ. అలాగే ’భగవద్గీత’లో కనిపించే శ్రీకృష్టుడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్టుడు పాత్రలకు తగినట్టుగా శ్లోకాలను, తాత్పర్యాలను భావప్రధానంగా పాడుతూ పఠించడం మరో విశేషం.
  • ’భగవద్గీతా’ గానానికి ప్రారంభంలో ఉపోద్ఘాతము, 18 అధ్యాయాలకు ముందు ఆయా అధ్యాయాలలోని ప్రధానాంశాల ప్రస్తావన, అధ్యాయం ప్రారంభంలో థీమ్ మ్యూజిక్, ప్రతి అధ్యాయం చివరన’కృష్టభజన’ఈ ’భగవద్గీత’రికార్డింగులో ఉన్నాయి.
  • ’భగవద్గీత’ను తెలుగు భాషతో పాటుహింది, ఇంగ్లీషు, జర్మన్, రష్యన్, ఫ్రెంచ్, జపనీస్మొదలైన అంతర్జాతీయ భాషలలో కూడా అనువదించి, ఆడియో సీడీలుగా విడుదల చేయడానికి, విస్తృత ప్రచారం చేయడానికి ఈ ఫౌండేషన్ సంకల్పించింది.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "గాయకుడు గంగాధర శాస్త్రి 'భగవద్గీత ఫౌండేషన్' ఆధ్వర్యంలో 'గీతా జయంతి' వేడుకలు". indiaglitz.com. indiaglitz. Retrieved 12 December 2016.
  2. "భాగవద్గీతా ఫౌండేషన్ జాలగుడు". భగవద్గీత ఫౌండేషన్. Archived from the original on 2022-01-06. Retrieved 2022-01-06.