భారత జాతీయ ఎస్టీ కమిషన్
Jump to navigation
Jump to search
భారత జాతీయ ఎస్టీ కమిషన్ | |
---|---|
కమిషన్ అవలోకనం | |
స్థాపనం | 19 ఫిబ్రవరి 2004 |
పూర్వపు కమిషన్ | జాతీయ ఎస్సీ కమిషన్ , ఎస్టీ కమిషన్ 1978 |
అధికార పరిధి | భారత ప్రభుత్వం |
ప్రధాన కార్యాలయం | న్యూఢిల్లీ |
Minister responsible | అర్జున్ ముండా, గిరిజన మంత్రిత్వ శాఖ |
కమిషన్ కార్యనిర్వాహకుడు/లు | కుంభ మనోజ్ కుమార్ , చైర్మన్, కార్యదర్శి బారి కృష్ణ దామోర్ హర్షద్ భాయ్ చునిలాల్ వాసవ, సభ్యుడు |
వెబ్‌సైటు | |
https://ncst.nic.in |
భారత జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం 2004 సంవత్సరంలో ఏర్పడింది. ఇది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. రాజ్యాంగంలోని 338 (ఎ) అధికరణ జాతీయ షెడ్యూల్డ్ తెగల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగ పరంగా షెడ్యూల్డ్ తెగలకు కల్పించిన రక్షణలను పరిరక్షించడం ఈ సంస్థ లక్ష్యం.[1]
నిర్మాణం, నియామకం, పదవీ కాలం
[మార్చు]జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌లో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు ఇతర సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మహిళ సభ్యురాలు తప్పనిసరి. వీరందరూ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినవారై ఉండాలి. కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించే, తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. వీరి పదవీ కాలం మూడేళ్లు.[2]
విధులు
[మార్చు]- షెడ్యూల్డ్ తెగల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు విచారణ చేపట్టడం.
- ఎస్టీలకు రాజ్యాంగపరంగా, శాసనపరంగా కల్పించిన ప్రత్యేక రక్షణ పట్ల అవగాహన కల్పించి చైతన్యపరచడం.
- ఎస్టీల ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వాలకు సలహా ఇవ్వడం.
- ఎస్టీల రక్షణ కోసం అవసరమైన చర్యలపై రాష్ట్రపతికి సలహాలివ్వడం.
- ఏదైనా విషయాన్ని విచారించే విషయంలో ఈ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
చైర్మన్లు
[మార్చు]నెం | పేరు | ఫోటో | పదవి కాలం | ఇతర విషయాలు | |
---|---|---|---|---|---|
1 | కున్వర్ సింగ్ | 2004 | 2007 | ||
2 | ఊర్మిళా సింగ్ | 2007 | 2010 | ||
3 | రామేశ్వర్ వోరాన్ | 2010 | 2013 | [3] | |
4 | 2013 | 2017 | [4][5] | ||
5 | నంద కుమార్ సాయి | 2017 | 2020 | [6] | |
6 | హర్ష చౌహన్ | 18 February 2021 | 2022 | [7] | |
7 | కుంభ మనోజ్ కుమార్ | 2023 | అధికారంలో ఉన్న |
ఇవి కూడా చుడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eenadu (2019). "జాతీయ, రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు". Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
- ↑ Sakshi (2015). "జాతీయ కమిషన్లు-విధులు" (in ఇంగ్లీష్). Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
- ↑ "Rameshwar Oraon appointed NCST Chairman". iGovernment.in. 2010-10-26. Archived from the original on 2012-09-03. Retrieved 2021-08-24.
- ↑ "Introduction". Retrieved 2016-09-20.
- ↑ "Introduction | National Commission for Scheduled Tribes". www.ncst.nic.in (in ఇంగ్లీష్). Retrieved 2017-02-13.
- ↑ "Archived copy". Archived from the original on 4 May 2018. Retrieved 28 April 2018.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Outlook India (19 February 2021). [Kumbha Manoj Kumar https://www.google.com/search?kgmid=/g/11trdhp8ry&hl=en-IN&q=Kumbha+Manoj+Kumar&kgs=49f0b2bb29b4763b&shndl=17&source=sh/x/kp/osrp/m5/2 "Kumbha Manoj Kumar appointed chairperson of National Commission for Scheduled Tribes"]. Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
{{cite news}}
: Check|url=
value (help)