భాస్కరవర్మన్
Bhaskaravarman | |
---|---|
వర్మన్ రాజవంశం చివరి పాలకుడు భాస్కరవర్మన్ (సా.శ. 600–650). బహుశా మధ్యయుగ కామరూప రాజ్యాలలో ఆయన అత్యంత విశిష్టమైన పాలకుడుగా గుర్తించబడ్డాడు. తన తండ్రి కాలంలో గౌడరాజు ఆక్రమించుకున్న రాజ్యాన్ని తిరిగి పొంది, వర్మన్ పాలనను తిరిగి స్థాపించగలిగాడు. గౌడ, తూర్పు మాళ్వా కూటమికి వ్యతిరేకంగా థానేశ్వరుకు చెందిన హర్షవర్ధనుడితో రాజకీయ కూటమి ఏర్పరుచుకున్నాడు.[1] చైనాకు చెందిన టాంగ్ వంశపు రాయబారులు జువాన్జాంగ్, లి యి-పియావో ఆయన కాలంలో సందర్శించి రాజు గురించి, రాజ్యం గురించీ తమ రచనల్లో రాసారు.
తన సోదరుడు సుప్రతిష్ఠివర్మన్ మరణించిన తరువాత భాస్కరవర్మన్ అధికారంలోకి వచ్చాడు. పౌరాణిక నరకాసురుడు, భగదత్తుడు, వజ్రదత్తుడు వంటి వారికి వారసుణ్ణని చెప్పుకున్న మొదటి కామరూప రాజు అతడు.[2] మలేచా రాజవంశం స్థాపకుడైన సాలస్తంభుడు, భాస్కరవర్మన్ మరణం తరువాత కామరూప రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు.
దుబి, నిధాన్పూర్ రాగి ఫలకాలు అతడు దానం చేసాడు. తన పూర్వీకుడైన భూతివర్మన్ చేసిన దానాన్నే అతడు మళ్ళీ చేసాడు. నలందాలో దొరికిన మట్టి ముద్ర ఒకటి కూడా అతడు జారీ చేసినదే.
నేపథ్యం
[మార్చు]సుస్థితవర్మన్ మహాసేనగుప్తుడి చేతిలో ఓడిపోయిన తరువాత ఆయన కుమారుడు సుప్రతిష్ఠివర్మన్ అధికారంలోకి వచ్చాడు. ఆయన కామరూప గజసైన్యాన్ని నిర్మించాడు. కాని ఆయన వారసుడు లేకుండా అకాలంగా మరణించాడు. ఆ విధంగా చిన్న కుమారుడు భాస్కరవర్మన్ కామరూపలో అధికారంలోకి వచ్చాడు.[3] ఆయన వారసత్వంగా సింహాసనం మీద అధికారం సాధించిన తరువాత కూడా సా.శ. 600 లో భాస్కరవర్మన్ కుమార (యువరాజు) అని పిలువబడ్డాడు. బహుశా ఆయన తన జీవితమంతా బ్రహ్మచారిగా జీవితం సాగించి ఉండవచ్చు.[4]
ప్రత్యర్థులు
[మార్చు]మహాసేనగుప్తుడు శశాంకతో కూటమి ఏర్పరుచుకుని, సుస్థితవర్మన్‌ను ఓడించి ఉత్తర, మధ్య బెంగాలు మీద నియంత్రణ సాధించాడు. మహాసేనగుప్తుడి మరణం తరువాత శశాంక ఈ భాగానికి పాలకుడు అయ్యాడు.[5] భాస్కరవర్మన్ సింహాసనాన్ని అధిరోహించిన సమయంలో ఉత్తర భారతదేశంలో రెండు బలమైన ప్రత్యర్థి శక్తులు అభివృద్ధి చెందినట్లు గుర్తించారు: ఒకటి మధ్య - ఉత్తర బెంగాలులో శశాంక ఆధ్వర్యంలో, మరొకటి భారతదేశం మధ్యలో హర్షవర్ధన తండ్రి ప్రభాకరవర్ధన ఆధ్వర్యంలో.[4]
థానేశ్వరులో ప్రభాకరవర్ధనుడి తరువాత వచ్చిన రాజవర్ధనను శశాంక హత్య చేసినప్పుడు, భాస్కరవర్మన్ ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి హంసవేగ అనే రాయబారిని పంపాడు. బాణ, జువాన్జాంగ్ ఇద్దరూ ఈ సంఘటన గురించి తమ రచనలలో ప్రస్తావించారు.[6]
హర్షవర్ధనుడితో కూటమి
[మార్చు]బాణబట్టు వ్రాసిన హర్షచరితలో హంసవేగ - హర్షవర్ధనుడి సమావేశం గురించి ఉంది. ఆ దౌత్యవేత్త ఇద్దరు రాజుల మధ్య ప్రమాదకర, రక్షణాత్మక కూటమిని ఏర్పాటుచేసి ప్రభావితం చేయగలిగిన సమర్ధుడుగా వివిధ బహుమతులు, ప్రశంశలు అందుకున్నాడు.
భాస్కరవర్మన్ సాధించిన విజయానికి గుర్తుగా శశాంకుడి పూర్వపు రాజధాని కర్ణసువర్ణ వద్ద నిధన్‌పూరు రాగి ఫలకం జారీ చేయబడింది.[7]
చైనీయులతో కూటమి
[మార్చు]క్రీ.పూ.648 తరువాత హర్షవర్ధనుడి ఆస్థానంలోని మంత్రి (ఈ మంత్రే హర్షుడి మరణానంతరం సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు) చైనా ప్రతినిధులకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు చైనా భారతదేశం మీద దాడి చేసింది. యుద్ధంలో మంత్రి ఓడిపోయి పట్టుబడ్డాడు. ఈ యుద్ధంలో భాస్కరవర్మన్ చైనీయులకు పశువుల మందలను, గుర్రాలను, యుద్ధావసర వస్తువులను సరఫరా చేసాడు.[8]
క్సింజాంగ్ రచనలో
[మార్చు]భాస్కరవర్మన్ ఆహ్వానం మేరకు చైనా యాత్రికుడు జువాన్జాంగ్ ఆయన ఆస్థానంలో భాస్కరవర్మన్ను సందర్శించాడు. స్వయంగా బౌద్ధుడు కాకపోయినా, రాజు బౌద్ధమతాన్ని పోషించాడని జువాన్జాంగ్ పేర్కొన్నాడు.[9] సి-యు-కి రచన ప్రకారం, భాస్కరవర్మన్ జాతిరీత్యా బ్రాహ్మణుడు.
భాస్కరవర్మన్ కామపురా
[మార్చు]జువాన్జాంగ్ తన ప్రయాణ కథనంలో కామరూపంలోకి ప్రవేశించే ముందు కరాటోయా అనే గొప్ప నదిని దాటినట్లు పేర్కొన్నాడు. తూర్పు సరిహద్దు దగ్గరగా ఉన్న కొండల రేఖ చైనా సరిహద్దుగా ఉంది. కామరూప దాదాపు 1700 మైళ్ల చుట్టుకొలతలో ఉందని ఆయన అన్నారు. వాతావరణం చాలా బాగుంది. ప్రజలు తక్కువ ఎత్తు, పసుపు రంగు గలవారని, భాస్కరవర్మన్ హిందూ మతస్థుడని, బౌద్ధుడు కాదని ఆయన పేర్కొన్నాడు. ప్రజలు నిజాయితీగా ఉన్నారు. వారి భాషా ఉచ్చారణ, మద్య భారతదేశప్రజల కంటే కొద్దిగా భిన్నంగా ఉంది. వారు హింసాత్మక స్వభావం కలిగి ఉన్నారు. పట్టుదల కలిగిన విద్యార్థులు ఉన్నారు. వారు దేవతలను ఆరాధించారు, బౌద్ధమతాన్ని నమ్మలేదు. కొన్ని వందల సంఖ్యలో దేవాలయా లున్నాయి. వివిధ వ్యవస్థలలో అనుచరులు ఉన్నారు. దేశంలోని కొద్దిమంది బౌద్ధులు తమ భక్తి చర్యలను రహస్యంగా ప్రదర్శించారు. దేశానికి తూర్పున ఉన్న కొండల శ్రేణి చైనా హద్దుల వరకు చేరిందని యాత్రికుడు నిర్ధారించాడు. ఈ పర్వత నివాసులు "మ్యాన్ ఆఫ్ ది లావో"కు సమానంగా ఉన్నారు. దేశం ఆగ్నేయంలో ఏనుగులు పుష్కలంగా ఉన్నాయి.[10]
వివరణ
[మార్చు]కామరూప తక్కువ తేమగా ఉందని, పంటలు క్రమం తప్పకుండా ఉంటాయని జువాన్జాంగ్ పేర్కొన్నాడు. కోకో-గింజలు, పనసపండ్లు సమృద్ధిగా పెరిగి ప్రజలచే ప్రశంసించబడ్డాయి. ఆయన అందించిన వివరణ ప్రస్తుత గౌహతికి సరిపోతుందని భావిస్తున్నారు. సి-యు-కిలో రచనల ఆధారంగా కామరూప చుట్టుకొలత సుమారు 1,700 మైళ్ళు (2,700 కిమీ). ఎడ్వర్డ్ ఆల్బర్ట్ గైట్ ఎత్తి చూపినట్లుగా, ఈ చుట్టుకొలతలో అస్సాం లోయ, సుర్మా లోయ, ఉత్తర బెంగాలు భాగాలు, మైమెన్సింగు భాగాలు ఉన్నాయి.
మతం
[మార్చు]భాస్కరవర్మన్ శివుడిని ఆరాధించినప్పటికీ ఆయన విద్యావంతులైన బౌద్ధ మతాచార్యులు, ఆయన కాలపు అధ్యాపకుల పట్ల ఎంతో గౌరవం కలిగి ఉండి బౌద్ధమతం పట్ల స్పష్టంగా మొగ్గు చూపాడు. సాధారణ ప్రజలు అనేక దేవాలయాలలో పూజించే దేవతలను ఆరాధించారు. బౌద్ధమతం అనుచరుల భక్తిని రహస్యంగా పాటించారు.
సంస్కృతి
[మార్చు]జువాన్జాంగు రచనల ఆధారంగా కామరూప ప్రజలు తీక్షణ స్వభావం కలిగినవారైనప్పటికీ నిజాయితీపరులు. కానీ పట్టుదల కలిగిన విద్యార్థులు ఉన్నారు. ప్రజలు తక్కువ ఎత్తుగా పసుపు రంగుతో ఉన్నారు. వారి భాషా ఉచ్ఛారణ భారతదేశం మధ్యభాగానికి భిన్నంగా ఉంది. కర్ణాసువర్ణ జారీ చేయబడిన నిధన్‌పూర్ శిలాశాసనంలో కనిపించే స్థానిక సాహిత్య రూపాలు, కార్యాలయాలు ఇతర కామరూప శాసనాలలో కనిపించదు.
కళలు పరిశ్రమలు
[మార్చు]భాస్కరవర్మన్ నుండి హర్షవర్ధనుడికి అత్యధికంగా బహుమతులు అందించబడ్డాయి. విలువైన రత్నాలతో నిండిన సున్నితమైన పనితనం రాజఛామరం, సచి-బెరడు మీద రాసిన పుతిలు, రంగులద్దిన చాపలు, అగరురసం, పట్టు సంచులలో కస్తూరి, మట్టికుండలలో ద్రవ మొలాసిసు, పాత్రలు, పెయింటింగులు, పేంతో తయారు చేసిన పంజరంలో బంగారంతో కప్పబడిన ఒక జత బ్రాహ్మిని బాతులు, పట్టువస్త్రాలు ఉన్నాయి.
నిధన్‌పూర్ శిలాశాసనం
[మార్చు]తన నిధన్‌పూర్ రాగి ఫలకశాసనంలో భాస్కరవర్మన్ కలియుగంలో పేరుకుపోయిన చీకటిని పారద్రోలడం ద్వారా తన ఆదాయాలను న్యాయంగా ప్రజలకు అందించడం ద్వారా ఆర్యమత వెలుగును వెల్లడించారని చెబుతారు; తన సామంతుల అందరి పరాక్రమాన్ని తన చేతుల బలం ద్వారా సమం చేశాడు. ఆయన తన వంశపారంపర్య విషయాల కోసం అనేక రకాల ఆనందాలను పొందాడు. ఆయన పట్ల విశ్వసనీయమైన భక్తి ఆయన స్థిరత్వం, నమ్రత, సామర్ధ్యం ద్వారా అధికరించింది. ఎవరు అద్భుతమైన కీర్తి అద్భుతమైన ఆభరణంతో, ప్రశంసల పుష్ప పదాలతో అలంకరించబడ్డారో అని యుద్ధంలో ఆయన స్వాధీనం చేసుకున్న వందలాది మంది రాజులు శ్లాఘించారు; ఇతరుల ప్రయోజనం కోసం బహుమతులు ఇవ్వడంలో శిబిలా వ్యవహరించారు; దేవతల గురువు (బృహస్పతి) వలె ఆయన శక్తులు తగిన సందర్భాలలో కనిపింపజేస్తూ రాజకీయ మార్గాలను రూపొందించి వర్తింపజేయడంలో అతని నైపుణ్యం గుర్తించబడ్డాయి; ఆయన ప్రవర్తన నేర్చుకోవడం, శౌర్యం, సహనం, పరాక్రమం, మంచి చర్యల ద్వారా అలంకరించబడింది ".[7]
నలందా ముద్రిక
[మార్చు]హర్షవర్ధనుడు, జువానుజాంగులతో భాస్కరవర్మన్‌కు ఉన్న సన్నిహిత సంబంధం ప్రఖ్యాత బౌద్ధ విశ్వవిద్యాలయం మగధతో అతని అనుబంధానికి అభివృద్ధి చేయడానికి దారితీసింది. ఎందుకంటే నలంద ప్రాంతంలో హర్షవర్ధనుడి రెండు విచ్ఛిన్న ముద్రలు కనుగొనబడ్డాయి. 1917–18 సంవత్సరంలో నలంద శిధిలాల తవ్వకాలలో డాక్టరు స్పూనరు ఈ ముద్రలను కనుగొన్నారు. ముద్ర వచనం క్రింది విధంగా ఉంది: [11]
శ్రీ గణపతి వర్మ శ్రీ యజ్ఞవత్యం శ్రీ మహేంద్ర వర్మ.
శ్రీ సువ్రతయం శ్రీ నారాయణవర్మ శ్రీ దేవవత్యం శ్రీ మహాభూత వర్మ.
శ్రీ విజ్ఞాన వాట్యం శ్రీ చంద్రముఖ వర్మ శ్రీ భోగవత్యం.
శ్రీ స్తితావర్మ తేన శ్రీ నాయన శోభయం (శ్రీ సుస్థితవర్మ)
(శ్రీ శ్యామ లక్ష్మం) శ్రీ సుప్రతిష్ఠ వర్మ.
శ్రీ భాస్కర వర్మేటి.
కేఎన్ దీక్షిత్ తన "నలంద కనుగొన్న ఎపిగ్రాఫికలు నోట్సు"లో జువాన్జాంగును ఆహ్వానించిన సిలభద్రకు భాస్కరవర్మన్ రాసిన లేఖగా ఈ ముద్ర ఉండవచ్చునని భావిస్తున్నారు.[12] అయినప్పటికీ ఇది రెండు హర్షవర్ధనుడి ముద్రలుగా కనుగొనబడ్డాయి. హర్షవర్ధనుడు, భాస్కరవర్మన్ ఇద్దరూ రాజమహల నుండి కనౌజ్కు వెళ్ళినప్పుడు చైనా యాత్రికుడితో కలిసి నలందాను సందర్శించారు. వారి సందర్శన జ్ఞాపకార్థం విశ్వవిద్యాలయంలో వారి ముద్రలను విడిచిపెట్టారు.[13]
మరణం
[మార్చు]భాస్కరవర్మన్ ఎలా, ఎప్పుడు మరణించాడో తెలియదు. కాని ఆయన పాలన 650 లో ముగిసిందని అంచనా.[ఆధారం చూపాలి]
వారసత్వం
[మార్చు]కుమార భాస్కరవర్మ సంస్కృత - పురాతన అధ్యయన విశ్వవిద్యాలయం (నల్బరి)కి ఆయన పేరు పెట్టబడింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. p. 39. ISBN 978-9-38060-734-4.
- ↑ "The mythical ancestors of (the Varman) line of rulers were Naraka, Bhagadatta and Vajradatta." (Sharma 1978:0.29)
- ↑ Kamarupa Sasanavali. p. 31.
- ↑ 4.0 4.1 Barua 1933, p. 58.
- ↑ Banger Jatiya Itihas, Rajanya Kanda.
- ↑ Barua 1933, p. 62.
- ↑ 7.0 7.1 Epigraphia Indica Vol XII. p. 78.
- ↑ Chatterji, Suniti Kumar (1951). Kirata-jana-krti. pp. 90, 92.
- ↑ (Gait 1906:53–55)
- ↑ (Gait 1926:23–24)
- ↑ J.B.O.R.S Vol VI. p. 151.
- ↑ ibid.
- ↑ Barua 1933, p. 98.
వనరులు
[మార్చు]- Barua, Kanak Lal (1933). Early History Of Kamarupa.
- Gait, E A (1906), A History of Assam, Thacker, Spink and Co., Calcutta
- Gait, Sir Edward (1926), A History of Assam, Lawyer's Book Stall, Guwahati
- Ghosh, Suchandra (2012). "Karnasuvarna". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
- Kāmarūpa-Kaliṅga-Mithilā:a politico-cultural alignment in Eastern India : history, art, traditions by Chandra Dhar Tripathi, Indian Institute of Advanced Study
- Sharma, Mukunda Madhava (1978). Inscriptions of Ancient Assam. Gauhati University, Assam.