మహాకాళి గుహలు
కోండవీటి గుహలు | |
---|---|
స్థలం | అంధేరి (తూర్పు), గుహల రోడ్డు దగ్గర ముంబై |
అక్షాంశ రేఖాంశాలు | 19°07′50″N 72°52′27″E / 19.130436°N 72.874133°E |
Geology | బసాల్ట్ |
Entrances | 20 |
Difficulty | సులువైనది |
మహాకాళి గుహలు 1 వ శతాబ్దం BCE, 6 వ శతాబ్దం CE మధ్య రాతిలో తొలిచి నిర్మించిన 19 స్మారక కట్టడాలు.[1] వీటిని కొండివిట్ గుహలు అనికూడా అంటారు.
ఈ బౌద్ధ ఆశ్రమం ముంబై నగరపు తూర్పు శివారు అంధేరీలో ఉంది. ఈ స్మారక కట్టడంలో రెండు సమూహాల రాతి గుహలున్నాయి -వాయవ్యంలో 4 గుహలు, ఆగ్నేయంలో 15 గుహలు ఉన్నాయి. చాలా గుహలను నల్ల బసాల్ట్ రాళ్ళ నుండి చెక్కారు.
వీటిలో చాల గుహలు విహారాలు, సన్యాసుల నివాసాలూ కాగా, ఆగ్నేయం లోని 9 వ గుహ చైత్యం. వాయవ్యం లోని గుహలను 4-5 శతాబ్దాల్లో చెక్కారు. ఆగ్నేయం లోని గుహలు అంతకు ముందువి. ఈ రాళ్ళలో నీళ్ళ తొట్లుకూడా తొలిచి ఉన్నాయి.
గుహ-9 ఈ గుహలన్నిటి లోకీ పెద్దది. ఇందులో బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించి 7 చిత్రాలున్నాయి. అయితే ఇవన్నీ విరిగిపోయి ఉన్నాయి.[2]
జోగేశ్వరి-విఖ్రోలి లింకు రోడ్డుకు, SEEPZ కూ మధ్య ఉన్న జంక్షను వద్ద ఈ గుహలు ఉన్నాయి. ఈ గుహలనూ అంధేరి కుర్లా రోడ్డునూ కలిపే రోడ్డుకు ఈ గుహల పేరిట మహాకాళి రోడ్డు అనే పేరు వచ్చింది.ఈ గుహలు ఒక కొండ పైన ఉన్నాయి.[3]
రవాణా సౌకర్యాలు
[మార్చు]జోగెశ్వరి -విఖ్రోలి లింక్ రోడ్, సెపెజ్ల మధ్య జంక్షన్ సమీపంలో ఉంది. బస్సు సౌకర్యము కలదు
మూలాలు
[మార్చు]- ↑ Jaisinghani, Bella (13 July 2009). "Ancient caves battle neglect". Times of India. Retrieved 2009-10-28.
- ↑ Bavadam, Lyla (18–31 July 2009). "In a shambles". Frontline (U.S. TV series). Archived from the original on 2013-01-25. Retrieved 2009-10-28.
- ↑ Gaur, Abhilash (2004-01-25). "Pay dirt: Treasure amidst Mumbai's trash". The Tribune. Retrieved 2008-09-01.