అక్షాంశ రేఖాంశాలు: 18°52′40″N 77°57′23″E / 18.87778°N 77.95639°E / 18.87778; 77.95639

మహాలక్ష్మీ ఆలయం ఆదిలాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహాలక్ష్మీ ఆలయం తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని మహాలక్ష్మీ వాడాలో ఉంది[1].ఒకే పీఠం పై మహాలక్ష్మీ,మహంకాళి మాత,సరస్వతీ మాత కొలువై నిత్యదర్శనమిస్తాయి. అత్యంత పవిత్రమైన పురాతన ఆలయంలో ఒకటి[2][3] .

మహాలక్ష్మీ దేవాలయం ఆదిలాబాద్
మహాలక్ష్మీ దేవాలయం ఆదిలాబాద్ is located in Telangana
మహాలక్ష్మీ దేవాలయం ఆదిలాబాద్
మహాలక్ష్మీ దేవాలయం ఆదిలాబాద్
తెలంగాణ లోని ప్రదేశం
భౌగోళికాంశాలు:18°52′40″N 77°57′23″E / 18.87778°N 77.95639°E / 18.87778; 77.95639
పేరు
స్థానిక పేరు:Mahalaxmi Temple
మహాలక్ష్మీ మందిరం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్
ప్రదేశం:ఆదిలాబాద్ రురల్ మండలంలోని మహాలక్ష్మీవాడ
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:మహాలక్ష్మీ, సరస్వతీ,మహంకాళి
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం
ఆలయాల సంఖ్య:01
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
1351

చరిత్ర

[మార్చు]

మహాలక్ష్మీ ఆలయానికి సుమారు 700 సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడి రాతి గోడల పై రాసి ఉన్న రాతల ప్రకారం 1351 లో ఈ ఆలయం నిర్మాణమైనట్లు దాత పేరుతో రాయబడి ఉంది. ఆదిలాబాద్ పట్టణం దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నపుడే ఇచట గ్రామ దేవతగా స్థాపించారని పెద్దలు చెబుతుంటారు[4].

పూజ,విధానం

[మార్చు]

ఈ మహాలక్ష్మీ దేవికి పూజ చేసే సమయంలో భాజాభంత్రీలతో తుమ్మల నారాయణ గాయకుల బృందం భీంసరి వాగు కు వెళ్ళి రాగి పాత్రలో పవిత్ర జలాన్నీ తీసుకొచ్చి దేవతలకు అభిషేకం చేసేవారట. అమ్మవార్లకు సైనుబట్టతో కుట్టిన వస్త్రాలను అలంకరించే కుంకుమ బోట్లు పెట్టి అగర ఒత్తులు వెలిగించి కోబ్బరి కాయలు కోటి పూజ చేసేవారు. శ్రావణమాసంలో నేల రోజులు భజనలు పాడుతు వినాయక చవితి వరకు భజన కార్యక్రమాలు కోనసాగించే వారు.భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇచట ఉన్న బావి నీళ్ళతో బ్రహ్మ ముహూర్తంలో దేవతలు స్నానమాచరించే వారిని అంటారు.ఆషాఢ మాసంలో ఈ ఆలయం భక్తులతో అత్యంత సందడిగా ఉంటుంది. అకాడీ పండుగ సంధర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి [5]వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు‌.ఆ సమయంలో ఆలయ పరిసర ప్రాంతం భక్తులతో కోలాహలంగా ఉంటుంది.ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నేరవేరతాయిని భక్తుల విశ్వాసం[6].

మూలాలు

[మార్చు]
  1. "Mahalaxmiwada Locality". www.onefivenine.com. Retrieved 2024-07-04.
  2. "మహిమాన్విత క్షేత్రం ఆ మహాలక్ష్మీ ఆలయం." News18 తెలుగు. 2024-06-10. Retrieved 2024-07-04.
  3. "Mahalaxmi Temple, Adilabad, telangana, India". indiasthan.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-29. Archived from the original on 2024-07-05. Retrieved 2024-07-04.
  4. "మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తే.. ఏ కార్యం మొదలుపెట్టినా జరగాల్సిందే!". News18 తెలుగు. 2024-06-15. Retrieved 2024-07-04.
  5. "బోనమెత్తి.. మొక్కుతీర్చి - | Sakshi". www.sakshi.com. Retrieved 2024-07-04.
  6. M, Vamsi (2024-06-15). "ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఏ పని మొదలుపెట్టినా విజయం.. ఆలయం ఎక్కడంటే?". Telugu Rajyam (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-04.