మైసూర్ రాజభవనం
Mysore Palace | |
---|---|
Built | 1912 |
Architect | Henry Irwin |
Architectural style(s) | Indo-Saracenic |
మైసూర్ రాజభవనం ఒకప్పుడు మైసూరును పరిపాలించిన ఒడయార్లు నివసించిన భవనం. భారతదేశంలోకెల్లా అతి పెద్ద భవనాల్లో ఒకటి.[1] దీన్ని ఇప్పుడు పురావస్తు సంగ్రహాలయంగా మార్చారు. ఒడయార్ల స్వాధీనంలో ఉన్న ఆభరణాలు, అద్భుతమైన చిత్రపటాలు ప్రదర్శనకు ఉంచారు. ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశము.[2] బంగారంతో చేసిన రాజసింహాసనం, రాజదర్బారు, కల్యాణ మండపం మొదలైనవి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ప్రధాన ద్వారం దగ్గర భారతీయ, యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు ఉన్నాయి.ప్రతి ఆదివారం సాయంత్రం, పండగ రోజుల్లో విద్యుద్దీపాలంకరణలతో మరింత శోభాయమానంగా ఉంటుంది.
చరిత్ర
[మార్చు]1399 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు మైసూర్ సామ్రాజ్యాన్ని ఒడయార్ వంశస్థులు పరిపాలించారు. ఈ రాజులు 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. కానీ రాజా ఒడయార్ తన రాజధానిని శ్రీరంగపట్నానికి తరలించడంతో మైసూరు అధికారిక పీఠానికి కొంచెం ప్రాభవం తగ్గింది. 1638లో మెరుపుల వలన భవనం పాక్షికంగాదెబ్బతినింది.[3] రణధీర కంటీరవ నరసరాజా ఓడయార్ మళ్ళీ దీన్ని పునర్నిర్మించాడు. 1762లో హైదర్ ఆలీ మైసూర్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడంతో దీని ప్రాభవం మరింత సన్నగిల్లింది.
ఉత్సవాలు
[మార్చు]ప్రతి సంవత్సరం మైసూరులో ఘనంగా జరిగే దసరా ఉత్సవాలకు ఈ భవనం ప్రధాన వేదిక. ప్రముఖ కళాకారులంతా ఈ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక మీద ప్రదర్శనలిస్తారు. పదవ రోజైన విజయదశమి రోజున ఘనంగా అలంకరించిన ఏనుగులు ఇతర కళా బృందాలతో ఊరేగింపు జరుగుతుంది.
దేవాలయాలు
[మార్చు]భవన ప్రాంగణంలో మొత్తం 12 దేవాలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి
- సోమేశ్వరాలయం (శివాలయం)
- లక్ష్మీ రమణాలయం (వైష్ణవాలయం)
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-03-04. Retrieved 2010-03-05.
- ↑ July 30, STEPHEN DAVID; August 9, 2010 ISSUE DATE:; August 6, 2010UPDATED:; Ist, 2010 16:42. "Southern star". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-02-13.
{{cite web}}
:|first4=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Maharaja's Palace".
ఇతర లింకులు
[మార్చు]- Official Virtual Tour website of Mysore Palace
- Mysore Palace
- Official Mysore Dasara Website Archived 2021-04-11 at the Wayback Machine
- Palaces of Mysore
- Mysore Palace lighting
- Archived 2014-02-27 at the Wayback Machine