రాజ పనస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Durian
Durio kutejensis fruits, also known as durian merah
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Durioneae
Genus:
Durio

Species

There are currently 30 recognised species (see text)

Synonyms

Lahia Hassk.[1]

పరిచయం

[మార్చు]

రాజ పనస చెట్టు Malvaceae అనే కుటుంబం చెందినది. ఇది పనస జాతికి సమీప బంధువు. ఆంగ్లంలో డ్యురియన్ (Durian) గా పిలువబడే రాజ పనస యొక్క సాగు ఇండొనేషియా, మలేషియా మొదలగు ఆగ్నేయ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల రాజపనస సాగు కేరళ రాష్ట్రంలోనూ జరుగుచున్నది.

వివరణ

[మార్చు]

ఈ చెట్టు యొక్క పండు పరిమాణంలో పెద్దదిగా ఉండి పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. రాజపనస పండు లోపలి కండను పొట్టు వంటి ముళ్ళతో కూడిన బలీయమైన తొక్కుతో కప్పబడి ఉంటుంది. ఈ పండు 30 సెంటీమీటర్ల (12 అంగుళాలు) పొడవు, 15 సెంటీమీటర్ల (6 అంగుళాలు) అడ్డుకొలత వరకు పెరుగుతుంది. ఇది ఒకటి నుంచి మూడు కిలోగ్రాముల బరువు తూగుతుంది. దీని పండు దీర్ఘగోళాకారం నుంచి గోళాకారం మధ్యలో ఉంటుంది. పైన ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పండ్లు వీటి జాతులను బట్టి లోపలి కండ రంగులో మార్పును కలిగి ఉంటాయి. పండు లోపలి కండ భాగం మాంసపు కండ వలె ఎరుపు నుంచి చామన చాయ వరకు, పసుపు నుంచి పాలిపోయిన పసుపు రంగు వరకు వివిధ రంగులను కలిగి ఉంటుంది.

సాగు

[మార్చు]

పోషక విలువలు

[మార్చు]
Durian (Durio zibethinus)
Nutritional value per 100 గ్రా. (3.5 oz)
శక్తి615 కి.J (147 kcal)
27.09 g
పీచు పదార్థం3.8 g
5.33 g
1.47 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ - ఎ44 IU
థయామిన్ (B1)
33%
0.374 mg
రైబోఫ్లావిన్ (B2)
17%
0.2 mg
నియాసిన్ (B3)
7%
1.074 mg
పాంటోథెనిక్ ఆమ్లం (B5)
5%
0.23 mg
విటమిన్ బి6
24%
0.316 mg
ఫోలేట్ (B9)
9%
36 μg
విటమిన్ సి
24%
19.7 mg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
1%
6 mg
రాగి
10%
0.207 mg
ఇనుము
3%
0.43 mg
మెగ్నీషియం
8%
30 mg
మాంగనీస్
15%
0.325 mg
ఫాస్ఫరస్
6%
39 mg
పొటాషియం
9%
436 mg
సోడియం
0%
2 mg
జింక్
3%
0.28 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు65g
Cholesterol0mg

Edible parts only, raw or frozen.
Refuse: 68% (Shell and seeds)
Source: USDA Nutrient database[2]
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database

రాజపనస పండులో ఎక్కువమొత్తంలో షుగర్, విటమిన్ సి, పొటాషియం, సెరొటోనెర్జిక్ ఎమినో యాసిడ్, ట్రిప్టోఫాన్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్లు ఉంటాయి.[3] మలేషియాలో రాజపనస ఆకులను, వేర్లను కషాయం కాచి జ్వరం వచ్చినప్పుడు శరీరానికి వ్రాస్తారు.

ఇతర విషయాలు

[మార్చు]
Sign forbidding durians on Singapore's Mass Rapid Transit

హైదరాబాద్ వంటి మెట్రోపొలిటాన్ నగరాల్లో రాజపనస కేజీ 750 రూపాయల ధర పలుకుచున్నది. అయితే రాజపనస వాసన కొందరు ఇష్టపడకపోవచ్చును. రాజపనస చాలా ఘాటు సువాసన వెదజల్లుతుంది. అందువలన ఆగ్నేయదేశాల్లోని హోటల్స్, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో రాజపనస నిషేధించబడింది.

మూలాలు

[మార్చు]
  1. "Durio L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-03-12. Retrieved 2010-02-16.
  2. "USDA National Nutrient Database". U.S. Department of Agriculture. Archived from the original on 2014-11-15. Retrieved 2013-02-22.
  3. Wolfe, David (2002). Eating For Beauty. Maul Brothers Publishing. ISBN 0-9653533-7-0.

లంకెలు

[మార్చు]

http://en.wikipedia.org/wiki/Durian

సూచికలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాజ_పనస&oldid=3835924" నుండి వెలికితీశారు