రాయచోటి గిరిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాయచోటి గిరిరావు (ఆగష్టు 25, 1865 - సెప్టెంబరు 8, 1918) ప్రసిద్ధ సంఘ సేవకులు, విద్యావేత్త.

జననం

[మార్చు]

వీరు 1865, ఆగష్టు 25 తేదీన బెంగుళూరు నగరంలో వినాయక చవితి పర్వదినాన జన్మించారు. వీరి తల్లిదండ్రులు నాగేశ్వరరావు, నాగమ్మ. వీరు 1881లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు. తర్వాత మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరి ఎఫ్.ఎ. పరీక్షలో ప్రథములుగాను పిదప 1887లో బి.ఎ. పరీక్షలోను ఉత్తీర్ణులయ్యారు.

వీరు తన జీవితాన్ని దేశ సేవకై అంకితం చేయదలచి మొదటి మెట్టుగ విద్యావ్యాప్తికై కృషి చేశారు. అందుకోసం మదనపల్లిని తన కార్యక్షేత్రంగా ఎన్నుకొన్నారు. అక్కడ కొందరు వ్యక్తులతో ఒక సంఘంగా ఏర్పడి 1888న ఆ గ్రామంలోని వేంకటేశ్వరాలయంలో ఒక పాఠశాలను నెలకొల్పారు. దానికి కాంగ్రస్ హై స్కూలు అని పేరు ఉండేది. తరువాత 1891లో జాన్ కాంగ్రెస్ హై స్కూలుగా పేరు మారింది. అది క్రమంగా వృద్ధిచెంది మదనపల్లి హై స్కూలుగా మరిణమించింది. దాని నిర్వహణ లక్షణ శర్మ అనే మితృని సహాయంతో వీరే నిర్వహించారు. పాఠశాల అభివృద్ధికోసం భవనాలను నిర్మించడానికి ఆర్థిక పరమైన ఇబ్బందుల మూలంగా 1910లో అనీబిసెంట్ ఆధ్వర్యంలోని దివ్య జ్ఞాన సమాజానికి యాజమాన్యానికి అప్పగించారు. తర్వాత కూడా వీరు ఆ పాఠశాలతో అధికారిక ప్రతిపత్తితో హెడ్ మాస్టర్ గా సంబంధాన్ని నిలబెట్టుకొని దాని అభివృద్ధికి కృషిచేశారు.[1] ఈ పాఠశాలను 1915 సంవత్సరంలో దివ్యజ్ఞాన సమాజం దీనిని గిరిరావు దివ్యజ్ఞాన కళాశాల (Giri Rao Theosophical College) గా అభివృద్ధి పరచి మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా చేశారు.[2]

మరణం

[మార్చు]

వీరు 1918 లో బొంబాయిలో జరిగిన దివ్యజ్ఞాన సభలకు హాజరై, తిరుగు ప్రయాణంలో అస్వస్థులై, తన కుమారుడున్న హంగరిలో దిగారు. మరునాడు వినాయక చవితి పర్వదినాన 1918, సెప్టెంబరు 8 న వీరు దివంగతులయ్యారు. వీరు ఆధ్వర్యంలో మదనపల్లెలో రూపొందిన ఆ పాఠశాల నేడు గిరిరావు థియసాఫికల్ హై స్కూలు అనే పేరుతో రాష్ట్రంలోని ఉత్తమ పాఠశాలలో ఒకటిగా పేరుపొందింది.

మూలాలు

[మార్చు]