లీ బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీ బాయి

లీ బాయి :  చైనా దేశపు కవి బిరుదానికి ’టూపూ’తో స్పర్థ వహించినవాడు.  రాజవంశానికి చెందిన వాడనని చెప్పుకోవడం లీ బాయికు చాలా ఇష్టం.  కానీ నిజానికి అతడు అదే గృహ నామం గల ఒక  తక్కువ స్థాయి కుటుంబానికి చెందినవాడు[1].  తన 19వ ఏటనే అతడు తన ఇంటిని విడిచి,  తావోయిస్టు ఏకాంత వాసి(తావోయిస్ట్‌- లోనోట్సి)కలసి జీవింప సాగాడు ఇలా కొన్నాళ్ళు సంచార జీవనం చేశాక అతడు వివాహమాడి అత్తవారి కుటుంబంతో పాటు హాన్‌ చౌ (Han- chou) ఉత్తర  భాగంలో ఉంటూ ఉండేవాడు[2]. అప్పటికే అతడు కవితలు వ్రాయడం ప్రారంభించాడు. సెక్రటరీ ఉద్యోగం  సంపాదించాలనే ఆశతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు తన కవితలు చూపించేవాడు.  కానీ అతని ఆశ ఫలించలేదు. సా.శ. 734 లో ఈశాన్య చీనాలో  ఉన్న ఒక స్నేహితుని చూడడానికి వెళ్లడంతో అతని సంచార జీవనం రెండోదశ ప్రారంభమైంది. సా.శ. 742 లో అతడు రాజధాని నగరం అయినా ’చాంగ్‌ ఆన్’(Chang-an) చేరుకొని ఆస్థాన పదవిని ఆశించాడు. ప్రభుత్వ పదవి ఏమి లభించకపోయినా ప్రసిద్ద కవుల జాబితాలో అతని పేరు చేర్చబడింది. కొద్ది క్షణాల వ్యవధిలో ఆస్థాన సంఘటనలను కవితల రూపంలో వర్ణించి గానం చేయటం ఆ కువుల సంఘం నిర్వహించే బాధ్యత అలాంటి కృత్రిమ జీవనం అంటే విసుగు పుట్టి సా.శ. 744 శిశిర ఋతువులో మరల సంచార జీవనం ప్రారంభించాడు.[3] ఈ సమయంలో అతడు ఆలనాటి మేటి కవులు కొందరిని కలయడం  తటస్థించింది. ఈ విధంగా లీ బాయి పేరు ప్రఖ్యాతలు పొందేసరికి  పూ (fu) పేరు కూడా ఎవరు ఎరుగరు.  తనకంటే పెద్దవాడైన లి బాయి  అంతకంతకు ’తావోయి జమ్‌’  లోను స్వర్ణకార విద్య (Alchemical studies)లోను నిమగ్నుడై ఉండటంతో ’టూపూ’  అతని ప్రభావానికి చొరవ కి లోనయ్యాడు. అప్పటికే లీ బాయి ఒక పెద్ద ’తావోయిస్టు’  ప్రముఖుని ద్వారా  ’ఆధ్యాత్మిక ప్రగతి’లో డిప్లమా పొంది తావోయిస్టుగా  ముద్ర పొందాడు.[4]   సా.శ. 756 చైనా చక్రవర్తి 16వ కుమారుడైన ప్రిన్స్  లీస్‌ చేసిన సైనిక ఆక్రమణకు సంబంధించి లీ బాయి అనధికారికంగా ఆస్థాన కవిగా నియమింపబడ్డాడు. అనంతరం కొద్దికాలానికే స్వతంత్ర రాజ్యస్థాపనకు ప్రయత్నం చేశాడనే నేరారోపణతో ఆ యువరాజు మరణ దండనకు గురికావటం ఆస్థాన కవి అయిన లి బాయి చ్యొ-చియాంగ్‌(Chin-chiang) నగరంలో చెరసాలలో బంధించబడటం జరిగింది. ఈ కల్లోలానికి సంబంధించిన కేసులలో విధించిన ఆజ్ఞలను పునః పరిశీలించడానికి ఒక యోగిని నియమించారు. అతడు లిపోకు  సంబంధించిన కేసును పరిశీలించి నిర్దోషిగా భావించి విడుదల చేసి, తన దగ్గరనే స్టాఫ్‌ సెక్రటరీగా  నియమించుకోవడం జరిగింది,  కానీ సా.శ. 758 లో లీ బాయి  పై కేసులు తిరుగదోడి  అతనికి యేలాంగ్ (yeh-lang)కు  పోవలసినది దేశ బహిష్కార  శిక్ష విధించాడు. అతడు అక్కడకు చేరే లోపున దోషులందరికీ మూకుమ్మడి క్షమ ప్రసాదింప పడడంతో అతడు తూర్పు చైనాకు తిరిగి వచ్చాడు. అక్కడ తన బంధువు ఇంటిలో కొన్నాళ్ళు ఉండి తరువాత కాలధర్మం చెందాడు.  కానీ అతడు తప్పతాగి ఒక పడవలో కూర్చుని నీటిలో ప్రతిఫలించిన చంద్రబింబాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడంలో నీటిలో మునిగి చనిపోయాడని ఒక వదంతి ప్రచారంలో ఉంది. తన జీవన విధానంలోనూ కవిత లోనూ కూడా లి బాయి కాల్పనిక వాదిగా కనిపిస్తాడు.  చైనాలోని ప్రతిభావంతులైన  తత్వవేత్తల పరంపరలో ఒక అడుగు ప్రసిద్ధి చెందిన తరచుగా మద్యపాన మహోత్సవాలలో లీనమై ఉండేవాడు అతడు స్నేహం, ఏకాంతం, కాలగమనం,ప్రకృతి ఆనంద హేల మొదలైన విషయాలపై కూడా కవితలు అల్లాడు నిర్వాసిత అపరాధి అని పేరు పొందిన ప్రతిభ కల్పనా పటిమ గల మహాకవిగా ప్రసిద్ధుడు ఆర్థర్ వేలి రచించిన అతని జీవిత చరిత్ర  పోయెట్రీ అండ్ కేరీర్‌  లీ బాయి అనే పేరుతో 1955 లో ప్రచురితమయ్యింది [5]

మూలాలు[మార్చు]

  1. https://en.wikipedia.org/wiki/Li_Bai#cite_note-1
  2. https://en.wikipedia.org/wiki/Li_Bai#cite_note-Beckwith,_127-5
  3. విజ్ఞాన సర్వస్వం సంపుటం -5 విశ్వసాహితి. హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం. 1994. p. 830. ISBN 81-86073-09-4.
  4. Wikisource link to https://100tangpoems.wordpress.com/2020/06/07/li-bai-why-i-live-in-the-green-mountains/. వికీసోర్స్. 
  5. Wikisource link to https://en.wikipedia.org/wiki/New_Book_of_Tang. వికీసోర్స్. 
"https://te.wikipedia.org/w/index.php?title=లీ_బాయి&oldid=3876074" నుండి వెలికితీశారు