లోథల్
స్థానం | Saragwala, Gujarat, India |
---|---|
రకం | Settlement |
చరిత్ర | |
స్థాపన తేదీ | Approximately 3700 BCE |
సంస్కృతులు | Indus Valley Civilization |
స్థల గమనికలు | |
తవకాల తేదీలు | 1955–1960 |
స్థితి | Ruined |
యజమాని | Public |
నిర్వహణ | Archaeological Survey of India |
ప్రజలకు అందుబాటు | Yes |
పురాతన సింధు లోయ నాగరికత దక్షిణపు నగరాలలో లోథల్ (IPA: [loˑt̪ʰəl])ప్రాంతం ఒకటి. పురాతన సింధు నాగరికతలో అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఇది ఒకటిగా ఉంది. గుజరాత్ లోని భలు ప్రాంతంలో ఉంది. [1] క్రీ. పూ 3700 నాటి నుండి ఇది మొట్టమొదట మానవనివాసిత ప్రాంతంగా ఉంది అని నిర్ధారించబడింది. [2]
తవ్వకాలు
[మార్చు]అధికారిక భారత ప్రభుత్వ సంస్థ అయిన భారత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ASI) ద్వారా 1955 ఫిబ్రవరి 13 నుండి 1960 మే 19 వరకు పురాతన స్మారక కట్టడాలు కోసం జరిపిన త్రవ్వకాలలో లోథల్‌ను కనుగొన్నారు. లోథల్ ఓడరేవు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ నౌకానగరంగా ఉండేది. అంతే కాకుండా నగరం సబర్మతి నది పురాతన ప్రవాహానికి అనుసంధానించబడి ఉంది. ఇది సింధు హరప్పా నగరాలు, సౌరాష్ట్ర ద్వీపకల్ప మధ్య వాణిజ్య మార్గంలో ఉంది. ప్రాచీన కాలంలో ఇది ఒక పెద్ద, ధనిక వర్తక కేంద్రంగా ఉండేది. ఇక్కడ నుండి పూలు, రత్నాలు, విలువైన ఆభరణాల వాణిజ్యం పశ్చిమ ఆసియా, ఆఫ్రికా ప్రాంతాలని ప్రభావితం చేసింది. వారు పూసల తయారీ, లోహశోధనలో ప్రారంభించిన సాంకేతికత, ఉపకరణాలు 4000 సంవత్సరాలకు మించి కొనసాగాయి. ఏఎస్ఐ ప్రకారం లోథల్ ప్రస్తుత పరిసర కచ్ ఎడారిలో భాగంగా ఉండేది. [3]పూర్వకాలంలో లోథల్ ఒక కీలకమైన, అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రంగా ఉంది.
రహదారి మార్గం
[మార్చు]లోథల్ అహ్మదాబాదు జిల్లాలోని ధోల్క తాలూకాలో శరవాల గ్రామంలో ఉంది. ఇది అహ్మదాబాదు-భావనగరు రైలుమార్గంలో లోథల్-భుర్ఖి రైల్వే స్టేషనుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుండి అహ్మదాబాదు (85 కిమీ / 53 మైళ్ళు), భావనగరు, రాజకోట, ధోల్కా నగరాలకు పక్కా రహదారులున్నాయి. ధోల్కా, బగోదర దీనికి సమీప నగరాలుగా ఉన్నాయి.
నిర్మాణ శైలి
[మార్చు]ఈ పట్టణం 1-2 మీటర్ల ఎత్తైన వాలులో ఎండబెట్టిన ఇటుక వేదికల మీద నిర్మినబడింది. ప్రతి వేదికమీద మందపాటి మట్టి, ఇటుక గోడలతో నిర్మించిన 20-30 ఇళ్ళు ఉన్నాయి. నగరంలో ఒక కోటకుడ్యం దిగువ పట్టణాన్ని విభజించబడుతుంది. శాలివాహన శకం 2350 లో వచ్చిన వరదలు ఈ గ్రామపు పునాదులు మైదానాలను నాశనం చేసాయి. [4] ఈ వరదలు లోథల్, సింధ్ హరప్ప చుట్టూ ఎత్తుగా కట్టడాలు విస్తరించేందుకు కారణంగా ఉన్నాయని భావిస్తున్నారు. దాదాపుగా సింధు లోయలోని పెద్ద నగరాలను అనుకరించే ఒక ప్రణాళికా బద్ధమైన పట్టణం నిర్మించడానికి ఈ విధానాన్ని ఉపయోగించారు. లోథల్ రూపకర్తలు దాన్ని నిరంతర వరదల నుండి రక్షించడం పైనే దృష్టి కేంద్రీకరించారు. నగరం కోటగోడ లేదా అక్రోపోలిసు చిన్న పట్టణాన్ని విభజించింది. దిగువ పట్టణం రెండు మండలాలుగా విభజించబడింది. ఉత్తర, దక్షిణ ప్రధాన రహదారి ప్రధాన వాణిజ్య ప్రాంతంగా ఉండేది. రెండు వైపులా ధనిక, సాధారణ వర్తకులు, కళాకారులు ఉన్నారు. మార్కెటు రెండు వైపులా నివాస ప్రాంతం ఉంది. చిన్న పట్టణం అయినా కాలానుగుణంగా లోతల్ గొప్పతనానం కొద్ది సంవత్సరాలలోనే విస్తరించింది.
పురాతత్వ పరిశోధన
[మార్చు]1947 లో బ్రిటిషు ఇండియా విభజించబడినప్పుడు మొహెంజో-దారో, హరప్పతో సహా చాలా సింధు ప్రాంతాలు పాకిస్థానులో భాగమయ్యాయి. భారతదేశ పురాతత్వ సర్వే శాఖ అన్వేషణ, త్రవ్వకం కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సర్వేలో వాయువ్య భారతదేశం అంతటా చాలా ప్రాంతాలు కనుగొనబడ్డాయి. 1954 - 1958 మధ్య, కచి (ముఖ్యంగా ధోలావిరా), సౌరాష్ట్ర ద్వీపకల్పాలలో 50 కంటే అధికమైన ప్రాంతాలలో త్రవ్వకాలు సాగాయి. హరప్పా నాగరికత " కిం " నదీతీరంలో 500 కిలోమీటర్లు (310 మైళ్ళు) విస్తరించింది. నర్మదా, తపతి నదుల మీదుగా భగత్రవు ప్రాంతం లోయలోకి ఇది ప్రవేశిస్తుంది. లోథల్ సింధులో ఉన్న మొహెంజో-దారో నుండి 670 కిలోమీటర్లు (420 మైళ్ళు) ఉంది. [5]
గుజరాతీ భాషలో లోథల్ (లోత్, (ల) కలయిక) అంటే సాధారణంగా "చనిపోయిని సమాధి చేసిన మట్టిదిబ్బ" అని అర్ధం. ఎందుకంటే అది సింధిలోని మొహెంజో-దారో నాగరికత విలసిన నగరం పేరుగా ఉంది. లోథల్‌కు పొరుగున ఉన్న గ్రామాలలోని పురాతన పట్టణ నివాసిత మానవ అవశేషాలు లభించాయి. 1850 నాటికి మట్టిదిబ్బ వరకు పడవలు ప్రయాణించాయి. 1942 లో బ్రోచి నుండి సారగ్వాలాకు మట్టిదిబ్బల మీదుగా కలప రవాణా చేశారు. ఒక పురాతన నదీ ప్రవాహం తీసుకు వచ్చిన సారవంతమైన మట్టితో ఆధునిక భోలాడును లోథల్ సారగ్వాలాతో కలుపుతూ మట్టి మార్గం రూపొందినట్లు భావిస్తున్నారు. [6]
ప్రధాన నగరం చిన్న పరిమాణం కారణంగా లోథల్ పెద్ద స్థావరం కాదని భావించారు. దాని "డాక్" ఇది బహుశా నీటిపారుదల సరస్సు అని ఊహాగానాలకు కారణమైంది. [7] అయినప్పటికీ ఇతర సమకాలీన పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నగరం సింధు నుండి గుజరాత్ లోని సౌరాష్ట్ర వరకు ఉన్న పురాతన వాణిజ్య మార్గం ఒక ప్రధాన నదీ వ్యవస్థలో భాగమని పేర్కొన్నారు. భారతదేశం పురావస్తు శాఖకు లోథల్ పురాతన వస్తువుల అతిపెద్ద సేకరణను అందించింది. [8] ఇది ఒకే సంస్కృతికి చెందిన ప్రదేశం (హరప్పను సంస్కృతి)గా నిర్ధారించబడింది. [ఆధారం చూపాలి]ఇది స్థానిక మైకేసియసు " రెడ్ వేర్ కల్చరు "(ఎర్ర పాత్రల సంస్కృతి) ప్రాంతంగా కూడా ఉనికిలో ఉంది. [ఎవరు?] ఆటోచోనసు ప్రజలు హరప్పను నాగరికతకు చెందిన ప్రజలకు పూర్వులు అని నమ్ముతారు. [ఆధారం చూపాలి]వీరు హరప్పన్ సంస్కృతి రెండు ఉప-కాలాలుగా వేరు చేయబడ్డారు: (క్రీ. పూ. 2400 - 1900 మధ్య) హరప్పా, మొహెంజో-దారో ప్రబలమైన సంస్కృతులుగా ఉన్నాయి. [ఆధారం చూపాలి]
సింధు నాగరికత విలసిల్లిన మొహెంజో-దారో, హరప్పలలో సింధునాగరికత క్షీణించిన తరువాత కూడా లోథల్ మనుగడ సాగించడమే కాక చాలా సంవత్సరాలు అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతానికి ఉష్ణమండల తుఫానులు, వరదలు - స్థిరమైన బెదిరింపులుగా ఉండి అవి ఈ ప్రాంతంలో అపారమైన విధ్వంసానికి కారణమయ్యాయి. ఇది ఈ సంస్కృతిని అస్థిరపరిచి చివరికి దాని ముగింపుకు కారణమై ఉండవచ్చని భావించబడుతుంది. స్థలాకృతి విశ్లేషణ దాని పతన సమయంలో ఈ ప్రాంతం శుష్కతతో లేదా రుతుపవనాల బలహీనతతో బాధపడిందని సంకేతాలు ఇచ్చాయి. పర్యావరణ రికార్డులు సూచించిన విధంగా నగరాన్ని విడిచిపెట్టడానికి కారణం వాతావరణంలో సంభవించిన మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు కారణమై ఉండవచ్చు. [9] లోథల్ మట్టిదిబ్బ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఆటుపోట్లతో ఉప్పు చిత్తడి భూమిగా మారింది. 2004 లో జర్నలు ఆఫ్ ది ఇండియను జియోఫిజిస్టు యూనియనులో భారతీయ శాస్త్రవేత్తలు ప్రచురించిన రిమోటు సెన్సింగు, టోపోగ్రాఫికలు అధ్యయనాల ఉపగ్రహ చిత్రాలు లోథల్ ప్రక్కనే 30 కిలోమీటర్ల (19 మైళ్ళు) పొడవు ఉన్న ఒక పురాతన, మెరిసే నది ఉన్నట్లు వెల్లడించాయి. ఉత్తర నదీ కాలువ భోగావో నది ఉపనది మైదానంగా ఉంది. రీచిలతో (1. 2–1. 6 కిమీ లేదా 0. 75–0. 99 మైళ్ళు) పోల్చినప్పుడు చిన్న కాలువ వెడల్పులు (10–300 మీ లేదా 33–984 అడుగులు) నగరం మీద బలమైన టైడలు ప్రభావం ఉన్నట్లు సూచిస్తున్నాయి. టైడలు జలాలు నగరం వరకు ప్రవహించి ఉండవచ్చు. ఈ నది ఎగువ ప్రవాహం నివాసితులకు తగిన మంచినీటి వనరును అందించాయి. [9]
నగర ప్రణాళిక
[మార్చు]క్రీ. పూ. 2350 లో సంభవించిన ఒక వరద ఈ గ్రామాన్ని స్థావరాలనూ పునాదులతో నాశనం చేసింది (క్రీ. పూ. 2350). సింధు నుండి వచ్చిన హరప్పన్లు లోథల్ సమీపంలో (సింధు లోయలోని గొప్ప నగరాల తరహాలో) తమ స్థావరాన్ని విస్తరించడానికి ప్రణాళికాబద్ధమైన నగరాన్ని రూపొందించడానికి ఈ వరదను అవకాశంగా ఉపయోగించుకున్నారు. [4] లోథల్ ప్రణాళికదారులు ఈ ప్రాంతాన్ని స్థిరమైన వరదల నుండి రక్షించడంలో నిమగ్నమయ్యారు. ఈ పట్టణాన్ని 1-2 మీటర్ల ఎత్తైన (3–6 అడుగులు) ఎండబెట్టిన ఇటుకల ప్లాట్‌ఫారంలుగా విభజించారు. ఒక్కొక్కటి 20-30 ఇళ్ళు మందపాటి మట్టి, ఇటుక గోడలతో నిర్మించారు. నగరాన్ని సిటాడెల్, లేదా అక్రోపోలిస్ గాను, దిగువ పట్టణంగానూ విభజించారు. పట్టణం పాలకులు అక్రోపోలిస్లో నివసించారు. ఇందులో చదును చేసిన సమిష్ఠి స్నానశాలలు. భూగర్భ, త్రాగునీటి కాలువలు, ఉపరితల కాలువలు బట్టీలో కాల్చిన ఇటుకలతో చక్కగా నిర్మించబడి ఉన్నాయి. దిగువ పట్టణాన్ని రెండు రంగాలుగా విభజించారు. ఉత్తర-దక్షిణ ప్రధాన వీధి ప్రధాన వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చేయబడింది. ఇది ధనిక, సాధారణ వ్యాపారులు, హస్తకళాకారుల దుకాణాలతో పరివేష్టితమై ఉంది. వాణిజ్యకూడలి ఇరువైపులా నివాస ప్రాంతాలు ఉన్నాయి. సంవత్సరాలలో లోథల్ దిగువ పట్టణం కూడా క్రమానుగతంగా విస్తరించబడింది.
లోథల్ ఇంజనీర్లు నావికాదళ వాణిజ్యం ప్రయోజనాల కోసం డాక్ యార్డు గిడ్డంగిని రూపొందించడానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నిర్మాణాన్ని "డాక్ యార్డు" గా గుర్తిస్తున్నారు. ఇది నదీముఖద్వారం నీటిపారుదల సరసు, కాలువ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. [7] ఇది ఈ పట్టణం తూర్పు భాగంలో నిర్మించబడింది. పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని అత్యున్నత నైపుణ్యం కలిగిన ఇంజనీరింగు సాధనగా భావిస్తారు. ఒండ్రుమట్టితో ఏర్పడే పూడికను నివారించడానికి ఇది నది ప్రధాన ప్రవాహానికి దూరంగా నిర్మించబడి ఉంది. కాని అధిక ఆటుపోట్లలో నౌకలకు కూడా లోపలికి ప్రవేశించడానికి వీలు కల్పించింది. 3. 5 మీటర్ల ఎత్తైన (10. 5 అడుగుల) వేదిక మీద మట్టి ఇటుకల మీద అక్రోపోలిసుకు దగ్గరగా గిడ్డంగిని నిర్మించారు. పాలకులు డాకు, గిడ్డంగి మీద నుండి కార్యకలాపాలను ఏకకాలంలో పర్యవేక్షించే వీలుకల్పించబడింది. సరుకు కదలికను సులభతరం చేయడానికి పశ్చిమంలో 220 మీటర్లు (720 అడుగులు) పొడవు గల మడ్బ్రికు వార్ఫు రేవు నిర్మించబడింది. గిడ్డంగికి సరుకు ఎత్తించడానికి వీలుగా ర్యాంపు నిర్మించబడి ఉంది. [10] గిడ్డంగికి ఎదురుగా ఒక ముఖ్యమైన ప్రజా భవనం ఉంది. దీని అద్భుతనిర్మాణం ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైంది. వారి సమయమంతా నగరం బహుళ వరదలు, తుఫానుల మీద కేంద్రీకరించి ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. డాకు ప్రాకారాలు సమర్థవంతంగా నిర్వహించబడ్డాయి. పట్టణం ఉత్సాహపూరితమైన పునర్నిర్మాణం వాణిజ్యం వృద్ధి, శ్రేయస్సును నిర్ధారిస్తుంది. అయినప్పటికీ పెరుగుతున్న సుసంపన్నత బహుశా వారి వ్యవస్థల మీద అధిక విశ్వాసం ఫలితంగా లోథల్ ప్రజలు వారి గోడలు, డాకు సౌకర్యాలను కాపాడుకోవడంలో విఫలమయ్యారు. క్రీస్తుపూర్వం 2050 లో తీవ్రవరద ఈ నిర్మాణంలోని తీవ్రమైన బలహీనతలు కొన్నింటిని బహిర్గతం చేసింది. సమస్యలు సరిగా పరిష్కరించబడలేదు. [11]
అన్ని నిర్మాణాలు అగ్నితో కాల్చిన ఇటుకలు(ఎండలో ఎండబెట్టిన ఇటుకలతో కాదు), సున్నం ఇసుక మోర్టార్లతో తయారు చేయబడ్డాయి. ఇటుకలు 4000 సంవత్సరాల తరువాత కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి. మోర్టారుతో ఒకదానితో ఒకటి అతికించబడి ఉన్నాయి. [12]
ఆర్ధికం, పట్టణ సంస్కృతి
[మార్చు]పట్టణ నిర్మాణం, దాని ఆకృతీ తీరూ హరప్పన్లు చాలా క్రమశిక్షణ గల వ్యక్తులు అని రుజువు చేస్తాయి. [13]
నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా వాణిజ్యం, పరిపాలనా విధులు నిర్వర్తించారు. మున్సిపలు పరిపాలన కఠినమైనది - చాలా వీధుల వెడల్పు చాలా కాలంగా ఒకే విధంగా ఉంది. పురపాలక నిర్మాణాలు ఆక్రమించి ఇతర నిర్మాణాలు నిర్మించబడలేదు. నగర కాలువలలో అడ్డుపడకుండా ఉండడం కోసం ఘన వ్యర్థాలను జమ చేయడానికి గృహాల్లో సంపు (సేకరణ గది) ఉంది. కాలువలు మ్యాన్హోల్సు, సెసుపూల్సు నగరాన్ని శుభ్రంగా ఉంచాయి. వ్యర్థాలను నదిలో జమ చేసారు. ఇది అధిక ఆటుపోట్ల సమయంలో కొట్టుకుపోతుంది. హరప్పను కళ, చిత్రలేఖనం కొత్త ప్రాంతీయ శైలి వెలుగులోకి వచ్చింది. కొత్త విధానాలలో జంతువుల సహజ పరిసరాలలో సంచరిస్తున్నట్లు వాస్తవిక చిత్రాలలో చిత్రీకరించబడి ఉన్నాయి. లోహాల సంస్కృతితో ప్రజలకు ప్రయోజనకరమైన వస్తుసామాగ్రి తయారు చేసి వాడుకున్నారని లోహ సామాగ్రి, బంగారం, ఆభరణాలు, అభిరుచిగా అలంకరించిన ఆభరణాలు ధృవీకరిస్తాయి.
వారి పరికరాలలో అధికంగా: లోహ ఉపకరణాలు, బరువులు, కొలతలు, ముద్రలు, మట్టి పాత్రలు, ఆభరణాలు సింధు నాగరికతలో కనిపించే ఏకరీతి ప్రమాణం, నాణ్యత కలిగి ఉన్నాయి. లోథల్ ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. మొహెంజో-దారో, హరప్ప నుండి రాగి, చెర్టు, పాక్షిక విలువైన రాళ్ళు భారీగా దిగుమతి చేసుకోబడ్డాయి. ఇవి అంతర్గత గ్రామాలు, పట్టణాలకు భారీగా పంపిణీ చేయబడ్డాయి. ఇది పెద్ద మొత్తంలో కాంస్య ఉపకరణాలు, చేప-గాలం, ఉలి, సుత్తి, ఆభరణాలను కూడా ఉత్పత్తి చేయబడ్డాయి. లోథల్ పూసలు, రత్నాల రాళ్ళు, దంతాలు, గవ్వలు ఎగుమతి చేసింది. దేశీయ అవసరాలను తీర్చిన రాతి బ్లేడు పరిశ్రమకు లార్కానా లోయ నుండి లేదా ఆధునిక కర్ణాటకలోని బీజాపూరు నుండి చక్కటి చెర్టు దిగుమతి చేయబడింది. భగత్రవు పాక్షికవిలువైన రాళ్లను సరఫరా చేయగా, ధోలావిరా, బెటు ద్వారకా నుండి చోంకు గవ్వలు వచ్చాయి. పరస్పర వస్తుమార్పిడి వ్యాపార సంబంధాలు నివాసులకు గొప్ప సంపదను ఇచ్చింది. ఈ వ్యారారంజ్ సరిహద్దులలోని ఈజిప్టు, బహ్రెయిను, సుమెరు వరకు విస్తరించింది. [11] పర్షియను గల్ఫు సీల్సు, వృత్తాకార బటను ముద్ర లోథల్ వాణిజ్యానికి సాక్ష్యాలుగా ఉన్నాయి. [14]
వాస్తుకళాభివృద్ధి
[మార్చు]సింధు నాగరికత ముగింపు గురించి విస్తారమైన చర్చ కొనసాగుతున్నప్పటికీ, లోథల్ పతనానికి ప్రకృతి విపత్తులు (ముఖ్యంగా వరదలు, తుఫానులు) మూలంగా ఉన్నాయని ఎ. ఎస్. ఐ. సేకరించిన పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. ఒక శక్తివంతమైన వరదలో పట్టణం మునిగి చాలా ఇళ్లను ధ్వంసం చేసింది. గోడలు, వేదికలు భారీగా దెబ్బతిన్నాయి. అక్రోపోలిసును వరద చదును చేయబడింది (క్రీ. పూ. 2000–1900). సాధారణ వర్తకులు, కొత్తగా నిర్మించిన తాత్కాలిక గృహాలలో నివసించారు. నది మార్గంలో తీవ్రమైన మార్పు, ఓడలు, రేవుల రవాణాను నిలిపివేసింది. [15] చిన్న నౌకలను నదీముఖద్వారంలో ప్రవేశింపజేయడానికి, ప్రవాహ కాలువను రేవుకు అనుసంధానించడానికి కొత్తవైనప్పటికీ బలహీనమైన బోట్లను నిర్మించారు. పెద్ద ఓడలు వీటికి దూరంగా ఉన్నాయి. ఇళ్ళు పునర్నిర్మించబడ్డాయి. అయినప్పటికీ వరద శిధిలాలను తొలగించకుండా వదలడంతో వాటి నాణ్యత క్షీణించి మరింత నష్టానికి గురిచేసాయి. ప్రజానివాసాల నుండి వెలువడే మురుగునీటిని జాడీలతో భర్తీ చేశారు. పౌరులు ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలను చేపట్టలేదు. బహిరంగ సమిష్ఠి స్నానశాలలను పునర్నిర్మించారు. అయినప్పటికీ పేలవమైన వ్యవస్థీకృత ప్రభుత్వంతో బయటి ఏజెన్సీ లేదా కేంద్ర ప్రభుత్వంతో, ప్రజా పనులను సరిగ్గా మరమ్మతులు చేయడం నిర్వహించడం జరగలేదు. భారీగా దెబ్బతిన్న గిడ్డంగి ఎప్పుడూ సరిగా మరమ్మతులు చేయబడలేదు. నిల్వలు చెక్క పెట్టెలలో నిల్వ చేయబడ్డాయి. పంటలు వరదలు, మంటలకు గురయ్యాయి. నగరం ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందింది. విపత్తుగా అంతరించకపోయినా వాణిజ్యం బాగా తగ్గింది. వనరులు తక్కువ పరిమాణంలో లభించాయి. స్వతంత్ర వ్యాపారాలు ఏర్పడ్డాయి. ఇది వ్యాపార-కేంద్రీకృత కర్మాగారాల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వీలు కల్పించింది. ఇక్కడ వందలాది మంది హస్తకళాకారులు ఒకే సరఫరాదారు, పెట్టుబడిదారు కొరకు పనిచేశారు. పూసల కర్మాగారంలో పది గదులు, పెద్ద కార్యాలయ ప్రాంగణం ఉన్నాయి. రాగిపని చేసే కంసాలి కర్మాగారంలో ఐదు కొలుమిలు, బహుళ శిల్పకారులు పని చేయడానికి వీలుగా సింకులు ఉన్నాయి. [16]
క్షీణిస్తున్న పట్టణ శ్రేయస్సు, వనరుల కొరత, పేలవమైన పరిపాలన స్థిరమైన వరదలు, తుఫానుల కారణంగా ఒత్తిడికి గురైన ప్రజల కష్టాలను అధికరించాయి. మట్టిలో లవణీయత పెరగినకారణంగా భూమి పంటలకు అనుకూలించలేదు. పంజాబులోని రంగ్పూరు, రోజ్డి, రూపారు, హరప్పా, సింధులోని మొహెంజో-దారో, చానుహుదారో నగరాలు ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి. ఒక భారీ వరద (క్రీ. పూ. 1900) ఒకే స్ట్రోకులో ఫ్లాగింగు టౌన్షిప్పును పూర్తిగా నాశనం చేసింది. పురావస్తు విశ్లేషణ బేసిను, డాకు సిల్టు శిధిలాలతో మూసివేయబడిందని భవనాలు నేలమట్టమయ్యాయని చూపిస్తుంది. ఈ వరద సౌరాష్ట్ర, సింధు, దక్షిణ గుజరాత్ మొత్తం ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. సింధు, సట్లెజు ఎగువ ప్రాంతాలను ప్రభావితం చేసింది. ఇక్కడ అనేక గ్రామాలు, టౌన్షిప్పులు కొట్టుకుపోయాయి. జనాభా అంతర్గత ప్రాంతాలకు పారిపోయింది. [17]
తరువాతి హరప్పను సంస్కృతి
[మార్చు]పట్టణ ప్రభావాలు లేనప్పటికీ తక్కువైన జనసాంధ్రతతో చాలా జనావాసాలు కొనసాగాయని పురావస్తు ఆధారాలు చూపిస్తున్నాయి. లోథల్‌కు తిరిగి వచ్చిన కొద్ది మంది ప్రజలు తమ నగరాన్ని పునర్నిర్మించలేకపోయారు. కాని ఆశ్చర్యకరంగా మత సంప్రదాయాలను కొనసాగించి, పేలవంగా నిర్మించిన ఇళ్ళు, రెల్లు గుడిసెలలో నివసించారు. వారు హరప్పను ప్రజలు అని స్మశానవాటికలో వారి అవశేషాల విశ్లేషణల ద్వారా రుజువు చేయబడింది. నగరం వాణిజ్యం, వనరులు దాదాపు పూర్తిగా పోయినప్పటికీ హరప్పను ప్రజలు కుండలు, పాత్రల తయారీలో తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు. ఈ సమయంలో ఎ. ఎస్. ఐ. పురావస్తు శాస్త్రవేత్తలు పంజాబు, సింధు నుండి సౌరాష్ట్రలోకి, సరస్వతి లోయకు (క్రీ. పూ. 1900–1700) శరణార్థుల సమూహాల కదలికను నమోదు చేశారు. [18] తరువాతి హరప్పన్లు బలహీనమైన నివాసాలతో కూడిన వందలాది స్థావరాలలో నివసించారు. పూర్తిగా నిరక్షరాస్యత, దిగువస్థాయి ఆర్థిక వ్యవస్థ, అధునాతన పరిపాలన, పేదరికం కలిగి ఉన్న పూర్తిగా పట్టణీకరణ లేని అనాగరికత ఈ ప్రజలుగా వీరు జీవించారని భావిస్తున్నారు. సింధు ముద్రలు వాడుకలో లేనప్పటికీ 8. 573 గ్రాముల బరువులు వాడకంలో ఉన్నాయి.
మ్యూజియం
[మార్చు]1961 సం. లో పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాన్ని పునరుద్ధరించారు, కందకాలు, ప్రవేశ ద్వారా కాలువలు, నదిని కలిపే మార్గాలను బహిర్గతం చేశారు. పరిశోధనలు ఫలితంగా ఒక మట్టిదిబ్బ, ఒక పట్టణం, ఒక మార్కెట్టు, ఒక డాక్, పురావస్తు ఇన్లెటు ఛానెల్లు, నీటి మడుగులు ఉన్నాయి. ఉత్తర తూర్పు, పశ్చిమ ప్రాంతాలు నీటమునిగిపోయాయి. త్రవ్వకాలు నిర్వహించిన ప్రాంతాలకు ఆనుకొని పురావస్తు మ్యూజియం ఉంది. ఇక్కడ భారతదేశం లోని సింధు-శకపు ప్రాచీనకాల సేకరణలలోని కొన్ని ముఖ్యమైన వస్తువులు ఇక్కడ ప్రదర్శించబడతాయి.
వరల్డ్ హెరిటేజ్ సైట్
[మార్చు]యునెస్కో లోథల్ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రతిపాదించింది. ఈ అప్లికేషన్ యునెస్కో తాత్కాలిక జాబితాలో పెండింగులో ఉంది. [19]
సింధు నాగరికత
[మార్చు]సింధు నాగరికత యొక్క ప్రధానమైన హరప్పా, మోహెంజోదారో కూలిపోయినప్పుడు, లోథల్ చాలా కాలం తర్వాత బయటపడింది, చాలా సంవత్సరాలు గడిచి పోయాయి. అలాగే ఉష్ణమండల తుఫానులు, ప్రవాహాలు వంటి శాశ్వతమైన ప్రమాదాలు, అపారమైన విధ్వంసాన్ని కలిగించాయి. దీని ఫలితంగా సంస్కృతి విచ్ఛిన్నం అవడమే కాకుండా అటువంటి పరిస్థితులలో అంతిమంగా దాని దశ ముగింపు ఏర్పడింది.
మూలాలు
[మార్చు]- ↑ "Where does history begin?".
- ↑ "Indus re-enters India after two centuries, feeds Little Rann, Nal Sarovar". India Today. 7 November 2011. Retrieved 7 November 2011.
- ↑ Leshnik, "The Harappan 'Port' at Lothal"
- ↑ 4.0 4.1 S. R. Rao (1985). Lothal. Archaeological Survey of India. p. 6.
- ↑ Robert W. Bradnock, Anil Mulchandani (2001). Rajasthan and Gujarat Handbook: The Travel Guide (PHP). Footprint Travel Guides. p. 276. ISBN 1-900949-92-X. Retrieved 26 October 2006.
- ↑ S. R. Rao (1985). Lothal. Archaeological Survey of India. pp. 2–3.
- ↑ 7.0 7.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;JSTOR
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ S. R. Rao (1985). Lothal. Archaeological Survey of India. pp. 30–31.
- ↑ 9.0 9.1 Khadkikar; et al. (2004). "Paleoenvironments around Lothal" (PDF). Journal of the Indian Geophysics Union (Vol. 8, No. 1). Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2019-10-11.
- ↑ S. R. Rao (1985). Lothal. Archaeological Survey of India. pp. 7–8.
- ↑ 11.0 11.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;RaoY
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-02-01. Retrieved 2019-10-11.
- ↑ S. R. Rao (1985). Lothal. Archaeological Survey of India. p. 8.
- ↑ Bridget, F. Raymond Allchin, The rise of civilization in India and Pakistan, p. 187
- ↑ S. R. Rao (1985). Lothal. Archaeological Survey of India. p. 12.
- ↑ S. R. Rao (1985). Lothal. Archaeological Survey of India. p. 13.
- ↑ S. R. Rao (1985). Lothal. Archaeological Survey of India. pp. 13–14.
- ↑ S. R. Rao (1985). Lothal. భారతదేశ పురాతత్వ సర్వే. pp. 13–15.
- ↑ http://whc.unesco.org/en/tentativelists/5918/, UNESCO
బయటి లింకులు
[మార్చు]- Pictures of Lothal Remains Archived 2008-08-28 at the Wayback Machine
- Lothal
- A Walk through Lothal
- Ancient Civilizations Timeline
- The Harappan Civilization Archived 2019-12-13 at the Wayback Machine
- Indus artefacts
- Cache of Seal Impressions Discovered in Western India Offers Surprising New Evidence For Cultural Complexity in Little-known Ahar-banas Culture, Circa 3000-1500 B. C Archived 2018-04-23 at the Wayback Machine
- "Sarasvati-Sindhu civilization". Archived from the original on 1 జనవరి 2007. Retrieved 11 మే 2018.
- Collection of images
- మూలాల లోపాలున్న పేజీలు
- Pages using infobox ancient site with unknown parameters
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు
- మూలాలు చేర్చవలసిన పాఠ్యమున్న వ్యాసాలు from May 2015
- All articles with specifically marked weasel-worded phrases
- Articles with specifically marked weasel-worded phrases from May 2015
- Commons category link from Wikidata
- గుజరాత్ పురావస్తు ప్రాంతాలు
- భారతదేశంలో పూర్వం ఉన్న ప్రాంతములు
- హిందూ మహాసముద్రం
- సింధు నాగరికత
- గుజరాత్ చరిత్ర
- 1954 పురావస్తు ఆవిష్కరణలు
- పర్యాటక ఆకర్షణలు
- గుజరాత్ జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలు
- అహ్మదాబాద్ జిల్లా పర్యాటక ఆకర్షణలు
- 24వ శతాబ్దం బిసి భవనాలు, నిర్మాణాలు