Jump to content

వాట్

వికీపీడియా నుండి

సామర్థానికి ప్రమాణం "వాట్"

ఒక జౌలు పని ఒక సెకను కాలంలో జరిగితే విద్యుత్ సామర్థాన్ని ఒక వాట్ అంటాం.
క్రిందినుదహరించిన సామర్థ సమీకరణముల నుండి, వాట్ = వోల్టు .ఆంపియర్.

విద్యుత్ సామర్థ్యం

[మార్చు]

ఘటము, బ్యాటరీ లేదా ఏదైనా శక్తి జనకం పనిచేసే రేటు దానికి సంధానం చేయబడిన విద్యుత్ సాధనంపై ఆధారపడి ఉంటుంది. ఈ విద్యుత్ సాధనాలు వాటికి అందించబదిన పనిని కాంతి లేదా ఉష్ణం వంటి మరో శక్తి రూపంలోకిఒ మార్చుతాయి. కాబట్టి ఒక విద్యుత్ సాధనం ఎంత శక్తిని వినియోగించుకున్నది అనే అంశం, విద్యుత్ జనకం చేసిన పని నుండి నిర్థారించవచ్చు.

విద్యుత్ పని రేటును, విద్యుత్ సామర్థ్యంగా నిర్వచిస్తారు.
ఒక విద్యుత్ వలయంలోని విద్యుత్ పరికరం పనిని కాలంలో చేస్తే, ఆ పరికర విద్యుత్ సామర్థ్యం ను,
జౌలు/సెకను లేదా వాట్. గా రాయవచ్చు.
పై సమీకరణముల నుండి
అంటే సామర్థ్యం = పొటెన్షియల్ భెదం X విద్యుత్ ప్రవాహం.
సామర్థ్యాన్ని ఒక విద్యుత్ జనకం, విద్యుత్ పరికరానికి అందిస్తే అది పూర్తిగా వినియోగించు కుంటుంది. కాబట్టి విద్యుత్ పరికరం వినియోగించుకున్న శక్తిని విద్యుత్ జనక సామర్థంగా తెలుసుకోవచ్చు.

యివి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వాట్&oldid=3162091" నుండి వెలికితీశారు