వికీపీడియా:భాషాంతర లింకులు
ఒక భాషలోని వికీపీడియా వ్యాసం నుండి, వేరే భాషలోని అదే వ్యాసానికి పెట్టే లింకులను భాషాంతర లింకులు అంటారు.
ఈ భాషాంతర లింకు కామన్స్ లో కూడా పనిచేస్తుంది. అయితే ఒకవైపు మాత్రమే పని చేస్తుంది, వికీపీడియాల నుండి కామన్స్ కు పని చెయ్యదు: వికీపీడియా నుండి కామన్స్ కు ఇచ్చే లింకు అంతర్గత లింకు లాంటిదే.
మామూలు మోనోబుక్ ఇంటరుఫేసులో ఆ భాషాంతర లింకులు పేజీకి ఎడమవైపున ఇతర భాషలు అనే శీర్షిక కింద కనిపిస్తాయి.
సింటాక్సు
[మార్చు]భాషాంతర లింకులు కింది పద్ధతిలో ఉంటాయి:
- [[language code:పేరు]]
ఇక్కడ language code అంటే ప్రకారం ఇచ్చే రెండు అక్షరాల కోడు. తెలుగుకు "te", ఇంగ్లీషుకు "en", తమిళానికి "ta", ఇలాగ. ఉదాహరణకు తెలుగు అనే వ్యాసానికి ఇచ్చే భాషాంతర లింకులు ఇలా ఉంటాయి:
- [[ta:தெலுங்கு]], [[hi:तेलुगू भाषा]], [[en:Telugu language]], [[fr:Télougou]], [[da:Telugu]]
ఈ లింకులు మామూలు లింకుల్లాగా వ్యాసంలో ఉండవు, పేజీకి ఎడమవైపున ప్రత్యేకమైన "ఇతర భాషలు" అనే విభాగం కింద నమోదయి ఉంటాయి. వ్యాసం మూలంలో వీటిని అట్టడుగున, వర్గాల తరువాత ఉంచాలి.
వ్యాసంలోనే ఉండే భాషాంతర లింకులు
[మార్చు]- చర్చాపేజీలకు, మెటా కు ఇచ్చే లింకులు మామూలు లింకుల లాగానే వ్యాసంలోనే కనిపిస్తాయి.
- వ్యాసంలోనే కనబడే విధంగా ఇతర భాషల్లోని వ్యాసానికి లింకులు ఇచ్చేందుకు గాను, లింకుకు ముందు ఒక కోలన్ ఇస్తే సరిపోతుంది. - ఉదా. [[:en:తెలుగు]] అని రాస్తే en:తెలుగు కు లింకు ఏర్పడుతుంది. సదరు భాషలోని అదే వ్యాసానికి కాక, వేరే వ్యాసానికి లింకు ఇవ్వాల్సిన సందర్భంలోనే దీన్ని వాడాలి.