వికీపీడియా:లాగిన్‌ అవడం ఎలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం సహాయం పేజీల లోని ఒక భాగం.

లాగిన్‌ ఎందుకు అవాలి?

[మార్చు]

మరిన్ని వివరాల కొరకు వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి. అన్నిటి కంటే ముఖ్యం, మీ రచనలన్నీ మీ పేరుకే చెందుతాయి.

లాగిన్‌ ఎలా అవాలి?

[మార్చు]

ముందు మీ బ్రౌజరు కూకీలకు సిద్ధంగా ఉందని నిర్ధారించుకోండి. (ఈ సందర్భంలో గోప్యతా విధానం చూడండి)

ఇక్కడున్న లాగిన్‌ లింకును గాని, ఈ పేజీకి పైన కుడి పక్కన ఉన్న లాగిన్‌ లింకును గాని నొక్కండి. మీ సభ్యనామం, సంకేత పదం కొరకు అడుగుతుంది. మీరు అసలు అకౌంటు సృష్టించకపోతే, మూడో పెట్టెలో సంకేత పదాన్ని రెండో సారి రాసి మీట నొక్కితే మీ అకౌంటు సృష్టింపబడుతుంది. మీకిష్టమైతే ఈ-మెయిల్‌ అడ్రసు కూడా ఇవ్వవచ్చు. ఇతర సభ్యులు ఈ ఆద్రసుకు మెయిల్‌ పంపగలరు కానీ వారు మీ అడ్రసు ఏమిటో తెలుసుకోలేరు.

నన్ను గుర్తు పెట్టుకో అనే చెక్‌ బాక్సులో టిక్కు పెడితే, ఒకే కంప్యూటరు నుండి వికీపీడియాను చూస్తూంటే, ప్రతీసారీ లాగిన్‌ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఫైర్‌వాల్‌ కానీ, అడ్‌బ్లాకింగు సాఫ్ట్‌వేర్‌ కాని కూకీ లను కెలికే అవకాశం ఉంది. మీరు పదే పదే లాగిన్‌ కావలసి వస్తుంటే, సమస్య ఇదే అవటానికి అవకాశం ఉంది.

లాగిన్‌ సమస్యలు

[మార్చు]

మీరు లాగిన్‌ అయినట్లుగా పేజీలో చూపిస్తుంది, కానీ ఆ తరువాత ఏదైనా పేజీకి వెళ్ళగానే లాగౌట్‌ అయినట్లుగా చూపిస్తుంటే, సమస్య కూకీ దే అవడానికి అవకాశం ఉంది. కూకీలతో సమస్య లేదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, కూకీలను అనుమతించని సైట్ల జాబితా లోకి పొరపాటున వికీపీడియా కూడా చేరిందేమో చూడండి. (ఈ అంశం మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ 0.6, IE6 లలో ఉంది). మీ కంప్యూటరు తేదీ, సమయం సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి; అది సరిగ్గా లేకపోతే, కూకీలు ముందే మురిగి పోయే అవకాశం ఉంది.

ఒక్కోసారి మీరు రచనలు చెయ్యడం మొదలుపెట్టి భద్రపరచే లోగానో, లేక ఒక విండో నుండి మరో దానికి వెళ్ళేటపుడు గాని లాగౌట్‌ అయిపోవచ్చు. ఇది మీ బ్రౌజరు సెట్టింగుల వలన కావచ్చు, లేక ఒక్కోసారి విపరీతమైన పని వత్తిడి వలన సర్వరు తప్పు చెయ్యడం వలన కావచ్చు. నన్ను గుర్తు పెట్టుకో అనే చెక్‌బాక్సులో టిక్కు పెడితే అసలిలాంటివేమీ జరగవు. మీరు వాడేది పబ్లిక్‌ కంప్యూటరు అయితే మీ పని అయిపోయాక, కూకీలను తొలగించండి.

అభిరుచులను ఎలా నిశ్చయించుకోవాలి

[మార్చు]

పేజీకి పైనున్న "నా అభిరుచులు" లింకును నొక్కండి. ఆ పేజీలో వివిధ అంశాలు ఉంటాయి, వాటిలో కొన్ని ఇవి:

  • మీ సంకేత పదం మార్చడం.
  • తొడుగు మార్చడం.

అభిరుచుల సహాయం చూడండి.

మీ సభ్యుని పేజీ , సభ్యుని చర్చా పేజీ

[మార్చు]

లాగిన్‌ అయ్యాక, మీ సభ్యుని పేజీ , సభ్యుని చర్చా పేజీ లను సృష్టించుకోవచ్చు. మీ సభ్యనామం పేజీకి పైన కనపడుతూ ఉంటుంది. దీనిని నొక్కితే, మీ సభ్యుని పేజీకి వెళ్తారు. మిగతా పేజీల లాగానే దీనిలో కూడా రచనలు చేసుకోవచ్చు. చాలామంది తమ గురించి కాస్త తమ పేజీలో రాసుకుంటారు.


మీకో సభ్యుని చర్చా పేజీ కూడా ఉంటుంది. పేజీకి పైన మీ సభ్యనామం పక్కన ఉన్న నా గురించి చర్చ అనే లింకును నొక్కి ఈ పేజీ కి వెళ్ళవచ్చు. ఈ పేజీలో ఇతరులు మీకు సందేశాలు ఇవ్వవచ్చు, మీరు వాటికి సమాధానాలు రాయవచ్చు. మరింత సమాచారానికై సభ్యుని పేజీ, చర్చా పేజీలు చూడండి.

నిష్క్రమించడం (లాగౌట్‌) ఎలా

[మార్చు]

పేజీకి పైన ఉన్న నిష్క్రమణ లింకును నొక్కి ఎప్పుడైనా నిష్క్రమించవచ్చు.