Jump to content

వీలునామా

వికీపీడియా నుండి
బషీర్ షాహబ్ చివరి వీలునామా

వీలునామాఅనగా ఒక వ్యక్తి తన తదనంతరం తన ఆస్తిపాస్తుల బదిలీ విషయాలకు సంబంధించి చేసే చట్టపరమైన పత్రము. భవిష్యత్ జీవితం సాఫీగా సాగాలనే ఉద్యేశ్యంతో ప్రతీఒక్కరు తాము సంపాదించిన దాంట్లో కొంత దాచుకుంటారు. అలా దాచుకున్న మొత్తాన్ని స్థిరాస్తి, చరాస్తి రూపంలో కొంత మొత్తాన్ని జాగ్రత్త పరుచడం మనం చూస్తుంటాం. అయితే అలా దాచుకున్న మొత్తాన్ని, లేదా ఆస్తులను తమ తదనంతరం తమకిష్టమైన వారికి చెందేలా తమ అభిప్రాయాన్ని రాసి భద్రపరుచుకునే సాధనమే వీలునామా.[1] దీనిని రిజిష్ట్రారు కార్యాలయములో నమోదు చేయవలసిన అవసరం లేదు. నమోదు చేసిన స్టాంపు పన్ను లేదు. దీనిని రహస్యంగా వుంచి నమోదుచేయాలనుకున్నప్పుడు మూతపెట్టిన కవరులో వుంచి నమోదు చేయవచ్చు. వ్రాసే వ్యక్తులు యుక్తవయస్సు(మెజారిటీతీరిన) వారై వుండాలి. వారి మానసిక స్థితి సరిగా వుండాలి. వీలునామా రాయడానికి తెల్లకాగితం వాడితే సరిపోతుంది. ఇద్దరు సాక్షులు సంతకం చేయాలి. వీలునామా ప్రతిపేజీపై వ్రాయించే వ్యక్తి సంతకం చేయాలి. [2]

వనరులు

[మార్చు]
  1. భారతీయ వారసత్వ చట్టం నెం.39/1925
  2. గిరిజ శ్రీభగవాన్ (2006). వీలునామా.. ఎలా వ్రాయాలి. విజయవాడ: జెపి పబ్లికేషన్స్.


బయటి వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వీలునామా&oldid=3258532" నుండి వెలికితీశారు