వెనిస్ వర్తకుని కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెనిస్ వర్తకుని కథ విలియం షేక్స్పియర్ రాసిన the merchant of Venice కు తెలుగు అనువాదం. దీనిని రచయిత 1600వ సంవత్సరములో రచించాడు. ఇది హాస్యము, విషాదము కలగలిసిన కథ.ఇది విలియం షేక్స్పియర్ రాసిన ఒక సుఖాంత గాథ.

ముఖ్యపాత్రలు[మార్చు]

  • ఆంటొనియో
  • బెసానియో
  • పోర్షియా
  • నెరిస్సా
  • గ్రేషియానో
  • లోరెంజో
  • జెస్సికా
  • షైలాక్
  • మొరాకో రాకుమారుడు
  • అరగాన్ రాకుమారుడు
  • డ్యూక్ ఆఫ్ వెనిస్
  • సెలారియో
  • బెల్తజార్
  • సేవకులు

సారాంశం[మార్చు]

అది పదహారవ శతాబ్దం లోని వెనిస్ నగరం. అది ప్రపంచంలోని అందమైన, ధనిక ప్రాంతాలలో ఒకటి.ఆ రాజ్యంలో ఒక ధనవంతమైన వ్యాపారి ఒకతను ఉన్నాడు.అతని పేరు ఆంటోనియో.ఆ రాజ్యంలోనే ఒక అందమైన యువకుడు వుండేవాడు.అతని పేరు బెసానియో. ఇతను ఒక అమ్మయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు.ఆమె ఎవ్వరో కాదు పోర్షియా. .ఈమె బెల్మాంట్ నగరంలోనే అందము, ఐశ్వర్యం గల అమ్మాయి.

అతను ఒక సహాయము కోసము తన అప్పులన్నింట్ని తీర్చే తన ప్రాణ స్నేహితుడైన ఆంటోనియో దగ్గరకు ఒక ముఖ్యమైన పని కోసం వెళ్లాడు.అతనికి మూడువేల ద్యూకెట్ ల ధనము అవసరమైంది.వెళ్లిన వెంటనే కుశలప్రశ్నలడిగి ధనము ఇవ్వమని అడిగాడు. దానికి సమాధానంగా ఆంటోనియో దిగు లుతో" మిత్రమా,నాకు చెప్పడానికే చాలా సిగ్గుగా వుంది.ఇలాంటి పరిస్థుతులో నీకు సాయం చెయ్యలేకపోతున్నాను.ప్రస్తుతం నా వోడలన్ని వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లాయి.అవి తిరిగి వస్తే తప్ప నాకు ధనం రాదు.అవి వచ్చేసరికిఎలాగూ మూడునెలలు పడుతుంది " అన్నాడు అదే నగరములో షైలాక్ అనే ఒక కృరమైన వర్తకుడు ఒకడున్నాడు.అతను పేదలకు కూడా ఎక్కువ వడ్డీతో రుణాలిస్తాడు.కానీ ఆంటోనియో వుచితముగా రుణాలివ్వడం వలన షైలాక్ యొక్క వ్యాపారం దెబ్బతింది.షైలాక్ యూదు మతస్థుడు.ఆంటోనియో క్రైస్తవుడు.కావున షైలాక్ కు ఆంటోనియా మీద చాలా కోపము.తన కోపానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎన్నొ రోజులుగా ఎదురుచూస్త్యున్నడు. ఇంతలో బెసానియోతో కలసి ఆంటోనియో తన ఇంటికి రావడాన్ని షైలాక్ గమనించాడు.కాసేపటిలో ఆంటోనియో షైలాక్ ఇంటి గుమ్మాం తొక్కాడు..షైలాక్ గౌరవ మర్యాదలు నటిస్తూ వారిరువురిని ఆహ్వానించాడు.వారిని ఎందుకు వచ్చారో అడిగాడు.