Jump to content

శివధనుర్భంగం

వికీపీడియా నుండి

శివధనుర్భంగం హిందూ పురాణమైన రామాయణం లోని బాలకాండలోని ఒక ఘట్టం.

కథాంశం

[మార్చు]

విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగ రక్షణార్థం వెంటబెట్టుకొని పోతాడు. యాగం పూర్తయిన తరువాత మిథిలా నగరానికి తీసుకొని వెళ్తాడు. అదే సమయంలో అక్కడ సీతా స్వయంవరం ఏర్పాటు చేయబడినది. శివ ధనుస్సు ను ఎక్కుపెట్టిన వీరునకు తన కూతురు సీతనిచ్చి పెండ్లి చేస్తానని జనక మహారాజు చాటించాడు. అది తెలుసుకొన్న విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని అక్కడికి వెళ్తాతడు. అక్కడ విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు శివధనుర్భంగం చేయడానికి సిద్ధమౌతాడు.

శివధనుస్సు తనను గర్వంతో ఎక్కుపెట్టడానికి వస్తున్న రాజుల బలాలను ఆహుతులుగా మ్రింగి ఎర్రని రత్నకాంతులనే మంటలు ప్రకాశింపగా, అంతకంతకు పెరుగుతూ నిల్చిన పెద్ద అగ్ని వలె అశ్చర్యాన్ని కలిగిస్తోంది. అట్టి శివధనుస్సుగా ను రాముడు అవలీలఎక్కుపెట్టడం చూసి, విశ్వామిత్రుడు భుదేవిని, ఆదిశేషుని, తాబేలుని, దిగ్గజాలను భయపడకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు.

తరువాత తనను దేవ బ్రాహ్మణులు, రాజశ్రేష్టులు మొదలైన వారంతా సంతోషంతో చూస్తుండగా, తన విజయాన్ని శాశ్వతంగా లోకమంతా ప్రకటించే విధంగా రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టాడు. వెంటనే అది దిక్కులు పిక్కటిల్లేటట్లుగా పెళ పెళ, పెట పెట ధ్వనులు చేస్తూ విరిగిపోయింది.

శివధనుస్సు విరగ్గానే స్వయంవరానికి వచ్చిన రాజుల గర్వాతిశయాలు నశించాయి. భూభాగమంతఅ బీటలు వారింది. దిగ్గజాలు నలిగిపోయాయి. శేషాహి కుంగిపోయింది. పంచభూతాలు భయపడ్డాయి. లోకాలన్నీ వణకిపోయాయి. జనక మహారాజు, రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు తప్ప మిగిలిన వారంతా మూర్ఛిల్లారు.

జనక మహారాజు సంతోషంతో దశరథ మహారాజును అక్కడకు రప్పించి సీతాదేవిని రామునికిచ్చి పెళ్ళి జరిపిస్తాడు.

మూలాలు

[మార్చు]