Jump to content

సహాయం:మూస గురించి క్లుప్తంగా

వికీపీడియా నుండి

ఇది మూసల గురించిన స్థూల వివరణ. పూర్తి వివరాలు సహాయము:మూస లో చూడవచ్చు.

మూస అంటే మూస నేంస్పేసులో ఉండే పేజీలు. అంటే [[మూస:మూసపేరు]] లాగా "మూస:" తో మొదలయ్యే ప్రతీ పేజీ కూడా మూస అన్నమాట. మూస లోని విషయాన్ని ఏ పేజీలోనైనా పెట్టవచ్చు. అలా పెట్టేందుకు గమ్యం పేజీలో ఇలా రాయాలి: {{మూసపేరు}}.

ఒకే విశేషాన్ని అనేక పేజీల్లో రాయాలంటే మూసలను వాడుతాము. అలాగే బాయిలరుప్లేటు సందేశాలు, అనేక సంబంధిత పేజీల మధ్య ప్రయాణం మొదలైన వాటి కోసం మూసలను వాడుతాము. మూసలకు పరామితులు (parameters) కూడా ఇవ్వవచ్చు. ఈ విధంగా ఒకే మూసను వివిధ పేజీల్లో వాడి, ఆయా పేజీలకు తగినట్లుగా టెక్స్టును చూపించవచ్చు.

మూసల సృష్టి, దిద్దుబాటు

[మార్చు]

ఏదైనా పేజీని ఎలా సృష్టిస్తారో మూసనూ అలాగే సృష్టించాలి. ఒకటే తేడా ఏంటంటే, పేరు మూస: తో మొదలవ్వాలి.

మూస తయారయ్యాక, ఇక దాన్ని వాడదలచిన పేజీల్లో {{మూసపేరు}} అని రాస్తే సరిపోతుంది. దాన్ని వాడిన ప్రతి పేజీలోను ఎప్పుడూ అదే టెక్స్టు కనిపిస్తుంది. మూసను మార్చినపుడు, మూసను వాడిన అన్ని పేజీల్లో కూడా టెక్స్టు మారిపోతుంది.

అలా కాకుండా, మూసను చేర్చే గమ్యం పేజీలో {{subst:మూసపేరు}} అని కూడా రాయవచ్చు. అలా రాసినపుడు, మూస పేజీలో ఉన్న టెక్స్టును మొదటిసారి తెచ్చుకుని గమ్యం పేజీలో పెట్టేస్తుంది. ఆ తర్వాత మూసను మార్చినప్పటికీ అప్పటికే ఆ మూసను subst: అని వాడిన పేజీల్లోని టెక్స్టు మారిపోదు. కొన్ని సందర్భాల్లో మనకలాంటి సౌకర్యం కావాలి కూడా..

మీరు దిద్దుబాటు చెయ్యాలనుకున్న మూస {{ఫలానా}} అనుకోండి, దానిలో దిద్దుబాటు చేసేందుకు మూస:ఫలానా అనే లింకుకు వెళ్తారు. ఆ పేజీకి వెళ్ళేందుకు మామూలుగానే అన్వేషణ పెట్టెలో రాసి వెతకొచ్చు, లేదా ప్రయోగశాల లో ఆ లింకు రాసి దాన్ని నొక్కి వెళ్ళొచ్చు.

ఆ పేజీకి వెళ్ళాక ఇతర పేజీల్లో దిద్దుబాటు చేసినట్టుగానే, అక్కడ కూడా దిద్దుబాటు చెయ్యండి. కాకపోతే మీరు చేసే మార్పులు అనేక పేజీల్లో చోటుచేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

తరచూ అడిగే ప్రశ్నలు

[మార్చు]
ఓ మూసను ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టుల్లో వాడొచ్చా?
లేదు, ఏ ప్రాజెక్టు మూసలు ఆ ప్రాజెక్టులో ప్రత్యేకంగా సృష్టించుకోవాలి.
మూసలో పారామితులను (parameters) చేర్చవచ్చా?
చేర్చవచ్చు. వివరాలకు సహాయము:మూస చూడండి.
పేజీలో ఎన్ని మూసలను వాడవచ్చు?
మీకిష్టమొచ్చినన్నిటిని వాడవచ్చు.
నేను మూసను మార్చాను, కానీ దాన్ని వాడిన పేజీలో ఆ మార్పు కనబడలేదేంటి?
కాషెతో కొన్ని ఇబ్బందులున్నాయి. దీనికో పద్ధతుంది: ఏ పేజీలో అయితే మూసలో చేసిన మార్పు కనబడలేదో ఆ పేజీ యొక్క మార్పు లింకును నొక్కండి. ఏ మార్పూ చెయ్యకుండానే భద్రపరచండి. అంటే ఓ డమ్మీ దిద్దుబాటు చేసారన్నమాట. అప్పుడు మార్పులు కనిపిస్తాయి. మరో మార్గం.. Ctrl, F5 కీలను కలిపి నొక్కడం..
మూసను కొత్త పేరుకు తరలించవచ్చా?
వచ్చు. మామూలు పేజీలను తరలించినట్టే ఇది కూడా.
మూసలో మరో మూసను వాడవచ్చా?
మూసలో మరో మూసను వాడవచ్చు. కానీ మూస ట్యాగులో మరో మూస ట్యాగును వాడరాదు.
కొత్త మూసను ఎట్లా సృష్టించాలి?
కొత్త పేజీని ఎలా సృష్టిస్తారో ఇదీ అంతే. తేడా అల్లా, మూస పేజీ పేరు "మూస:" తో మొదలవ్వాలి.

ఉదాహరణలు

[మార్చు]