సిద్ధిధాత్రీ దుర్గా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'సిద్ధిదాత్రీ దుర్గా, 'నవదుర్గల్లో తొమ్మిదవ, ఆఖరి అవతారం.  నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు ఈ  అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, దాత్రీ అంటే  ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక, జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం.[1][2]

\తామరపువ్వులో కూర్చుని ఉండే సిద్ధిదాత్రీ దుర్గాదేవికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయి. ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రీ దుర్గాదేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించేవారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి.

మూలాలు

[మార్చు]