స్థాయి
Jump to navigation
Jump to search
స్థాయి సంగీతంలో ఒక ముఖ్యమైన భాగం. రాగం బిగ్గరగా తీసినప్పుడు వెలువడే ధ్వని అధికంగా ఉంటే తార స్థాయి, ఒక మాదిరిగా ఉంటే మధ్యమ స్థాయి, తక్కువగా ఉంటే మంద్ర స్థాయి అంటారు. రకరకాల పౌనఃపున్యాలున్న ధ్వనులు స్వరాలు అనబడతాయి కనుక, అవి ఏ లెవెల్ లో ఉన్నాయో సూచించేవి స్థాయిలు.
స్వరాన్ని రాసేటప్పుడు అవి ఏ స్థాయిలో పాడాలో సూచించడానికి చుక్క (.) గుర్తు వాడతారు. అక్షరానికి క్రింద చుక్క గుర్తు పెడితే మంద్ర స్థాయి, పైన పెడితే తార స్థాయి, ఏ చుక్క గుర్తు లేకపోతే మధ్యమ స్థాయి అని అర్ధం.
సంగీతంలో మూడు స్థాయిలుంటాయి. అవి.
- 1. తార స్థాయి
- 2. మధ్యమ స్థాయి
- 3. మంద్ర స్థాయి