స్విచ్ మోడ్ పవర్ సప్లై
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
స్విచ్ మోడ్ పవర్ సప్లై లేదా ఎస్ఎంపిఎస్ అనేది సమర్ధవంతంగా విద్యుత్ శక్తిని మార్పిడి చేయగల మార్పిడి నియంత్రకమును పొందుపరచుకున్న ఒక ఎలక్ట్రానిక్ పవర్ సప్లై. వోల్టేజ్, కరెంటు లక్షణాలు మార్చే ఇతర పవర్ సప్లైల వలె ఎస్ఎంపిఎస్ వ్యతిగత కంప్యూటర్ వంటి వాటికి మెయిన్ పవర్ నుండి ఏభాగానికి ఎంత కరెంట్ సరఫరా చేయాలో అంత విద్యుత్ మాత్రమే ఆ భాగాలకు సరఫరా అయ్యేలా చేస్తుంది. ఒక సరళ విద్యుత్ సరఫరాలా కాకుండా, ఈ స్విచ్ మోడ్ యొక్క పాస్ ట్రాన్సిస్టర్ నిరంతరంగా లో-డిస్సిపేషన్ (తక్కువ దుర్వ్యయం), ఫుల్-ఆన్, ఫుల్ ఆఫ్ స్థితుల మధ్య మారుతూ, అధిక దుర్వ్యయ మార్పులలో చాలా తక్కువ సమయం తీసుకుంటూ ఇది వృధా శక్తిని తగ్గిస్తుంది. సాధారణంగా స్విచ్ మోడ్ పవర్ సప్లై ఎటువంటి శక్తిని వ్యర్థం కానివ్వదు. వోల్టేజ్ రెగ్యులేషన్ ఆన్ నుంచి ఆఫ్ సమయం యొక్క వివిధ నిష్పత్తుల ద్వారా ఈ పనిని సాధిస్తుంది. దీనికి విరుద్ధంగా, లీనియర్ పవర్ సప్లై నిరంతరంగా పాస్ ట్రాన్సిస్టర్ లోకి పవర్ ను దోయటం ద్వారా అవుట్పుట్ వోల్టేజ్ నియంత్రిస్తుంది. ఈ అధిక శక్తి మార్పిడి సామర్థ్యం అనేది స్విచ్ మోడ్ పవర్ సప్లై యొక్క ఒక ముఖ్యమైన ప్రయోజనంగా ఉంది. స్విచ్ మోడ్ పవర్ సప్లై కలిగి ఉండే ట్రాన్స్ఫార్మర్ పరిమాణం, బరువులో చిన్నదిగా ఉండు కారణంగా లీనియర్ పవర్ సప్లై కంటే గణనీయంగా చిన్నగా, తేలికగా ఉండవచ్చు.
ఎక్కువ సామర్థ్యం, చిన్న పరిమాణం లేదా తేలికైన బరువు కలిగినవి అవసరమనుకున్నప్పుడు మార్పిడి నియంత్రకాలను (స్విచింగ్ రెగ్యులేటర్) లీనియర్ రెగ్యులేటర్లకు (సరళ నియంత్రకాల) ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.