హృద్ధమని వ్యాకోచ చికిత్స (కరోనరీ యాంజియోప్లాస్టీ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హృద్ధమనుల వ్యాకోచ చికిత్స (కరోనరీ యాంజియోప్లాస్టీ)

[మార్చు]

హృద్ధమనులలో ధమనీకాఠిన్యం వలన సంకుచితమైన భాగాలను వ్యాకోచింపచేసి ఆ భాగాల్లో లోహపు జాలికలను వ్యాకోచసాధనాలుగా (స్టెంట్స్) అమర్చుతారు[1]. హృద్ధమనులను వ్యాకోచింపచేయుట వలన హృదయకండరానికి రక్తప్రసరణ పునరుద్ధింపబడుతుంది.

విధానం

[మార్చు]

ఊరుధమని లేక ముంజేతిలో వెలుపలిధమని ద్వారా వ్యాకోచింపబడే బుడగ గల కృత్రిమ నాళికను చొప్పించి బృహద్ధమని గుండా ఆ నాళికను

హృద్ధమనిలో వ్యాకోచ సాధనం

హృద్ధమని లోనికి చొప్పిస్తారు. సంకుచిత భాగాలను చేరుకొన్నాక బుడగను వ్యాకోచింపచేసి సంకుచితభాగాన్ని వ్యాకోచింపచేస్తారు. ఆ తరువాత ఆ భాగములో లోహపు జాలిక వ్యాకోచసాధనాన్ని (స్టెంట్) హృద్ధమని గోడకి ఆనుకొనునట్లు అమర్చుతారు. ఈ సాధనం ధమనిలోపలి గోడపై కొవ్వును క్రిందకు అణచి ధమని లోపలి పరిమాణాన్ని పెంచిఉంచుతుంది[2].

ప్రయోజనాలు

[మార్చు]

ఈ ధమనీవ్యాకోచ ప్రక్రియ వలన హృదయకండరానికి రక్తప్రసరణ మెరుగవుతుంది. అందువలన గుండెపోటు కలిగిన వారిలో హృదయకండర నష్టం లేకుండా ఉండడమో లేక తక్కువ అవడమో జరుగుతుంది. గుండె పనితీరు మెరుగవుతుంది. ఉపద్రవాలు తగ్గుతాయి. గుండెపోటు లేక గుండెనొప్పి మాత్రమే ఉన్నవారిలో గుండెనొప్పులు ఛాతిలో బిగుతు, ఆయాసం తగ్గి రోగులు వారి దైనందిక కార్యక్రమాలు నడుపుకోగలుగుతారు[3]. వ్యాయామశక్తి కూడా మెరుగవుతుంది. వాడవలసిన మందులు తగ్గుతాయి. హృద్ధమని వ్యాకోచప్రక్రియలు హృద్ధమనులలో అవరోధ అధిగమన శస్త్రచికిత్సల ( కరోనరీ బైపాస్ సర్జరీలు) కంటె తేలిక, తక్కువసమయం తీసుకుంటాయి[4].

మూలాలు

[మార్చు]
  1. "Coronary angioplasty and stent insertion". nhs.uk (in ఇంగ్లీష్). 2017-10-24. Retrieved 2023-09-07.
  2. "Angioplasty and Stent Placement for the Heart". www.hopkinsmedicine.org (in ఇంగ్లీష్). 2021-08-08. Retrieved 2023-09-07.
  3. "Coronary angioplasty and stents - Mayo Clinic". www.mayoclinic.org (in ఇంగ్లీష్). Retrieved 2023-09-07.
  4. "Angioplasty: Types, Procedure Details and Recovery". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2023-09-07.