హోళికా దహనం
హోళికా దహనం | |
---|---|
రకం | హిందువుల ఉత్సవం |
ప్రారంభం | పాల్గుణ మాస పూర్ణిమ |
ఉత్సవాలు | హోళికా దహనం |
సంబంధిత పండుగ | హోళీ |
హోలికా దహనంను హోలికా అనే రాక్షసి బొమ్మ కాలుస్తూ జరుపుకుంటారు.హిందూధర్మం లోని అనేక సంప్రదాయాల ప్రకారం హోళిని చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు.దాదాపు భారతదేశంలోని ప్రతి వాడలో హోళికా దహనం నిర్వహిస్తారు. సాంప్రదాయం ప్రకారం, ప్రజలు హోళికా దహనం కోసం ఒకటి లేదా రెండు చెక్క ముక్కలను అందజేస్తారు. ఇది హోలిక తన మేనల్లుడు, విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నించిన అగ్నిలో కాల్చబడిందని సూచిస్తుంది. తద్వారా హోలీకి ఆ పేరు వచ్చింది.దహనం నిర్వహించిన సమయంలో ప్రజలు అగ్ని చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటారు.
ప్రాముఖ్యత
[మార్చు]హోళీ ముందు రోజు రాత్రి, ఈ సంప్రదాయానికి అనుగుణంగా ఉత్తర భారతదేశం, నేపాల్, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హోళీ దహనం నిర్వహిస్తారు. [1]యువత సరదాగా రకరకాల వస్తువులను దొంగిలించి హోళికా అగ్నిలో వేస్తారు.
భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజును హోళికా దహన్ పేరుతో ఒక పండుగగా జరుపుకుంటారు. [2]హోళీ సందర్భంగా వెలిగించిన అగ్ని హోళికా అనే రాక్షసి దహనానికి ప్రతీక.ప్రహ్లాదుడు తన విష్ణువు పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు కాబట్టి, హోళిక ప్రహ్లాదుడ్ని చంపడానికి ప్రయత్నించినా కూడా తనే అగ్నిలో పడి దహనం అయ్యింది కాబట్టి చెడుపై మంచి విజయంగా ప్రజలు దీన్ని భావిస్తారు.
ఆచారం
[మార్చు]- హోళీ మంటల కోసం హోళికా అగ్నిని సిద్ధం చేయడం
పండుగకు కొన్ని రోజుల ముందు నుండి ప్రజలు పార్కులు, కమ్యూనిటీ సెంటర్లు, దేవాలయాలు వంటి ఇతర బహిరంగ ప్రదేశాల్లో హోళికా మంటల కోసం కలప, మండే పదార్థాలను సేకరించడం ప్రారంభిస్తారు.సేకరించిన కలపను పేర్చి దానిపై ప్రహ్లాదుడిని మోసగించిన హోళికను సూచించే ఒక దిష్టిబొమ్మను ఉంచుతారు.
- హోళికా దహనం
హోళీ పండుగ ముందురోజు, సాధారణంగా సూర్యాస్తమయం సమయంలో లేదా తర్వాత, హోళికా దహనంకు ప్రతీకగా అగ్ని వెలిగిస్తారు.ఈ ఆచారం చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది.ప్రజలు మంటల చుట్టూ నిలబడి, పాటలు పాడతారు, నృత్యం చేస్తారు.
మరుసటి రోజు ప్రజలు ప్రసిద్ధ రంగుల పండుగ అయిన హోళిని జరుపుకుంటారు.
హోళికా దహనంకు కారణం
[మార్చు]ఉత్తరప్రదేశ్‌లోని ఎరిచ్‌లో హోళికా దహనం, హోళీ వేడుకలకు అత్యంత చారిత్రక వివరణ ఉంది.భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో హోళికా దహనంకి వివిధ కారణాలు చెప్పబడ్డాయి.వాటిలో:
- శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుడిని కాపాడటానికి హోళికను సంహరించాడు, తద్వారా హోళికా దహనం ఏర్పడింది.
- 'హోళికా దహనం వలన ఎవరికీ హాని కలగకూడదు' అని హోళికను బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. [3]
మూలాలు
[మార్చు]- ↑ Singh, S. Harpal (27 March 2013). "Forests bear the brunt of Holi". The Hindu. Retrieved 9 January 2020 – via www.thehindu.com.
- ↑ "Holika Dahan Burning Time and Muhurat in 2020 All Around the World". Holi festival 2020 (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-16. Archived from the original on 2020-01-29. Retrieved 2020-02-11.
- ↑ The Meaning of Holi Parmarth Archived 2012-09-09 at Archive.today Retrieved on 26 October 2007