2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
| |||||||||||||
అభిప్రాయ సేకరణలు | |||||||||||||
| |||||||||||||
|
ఆంధ్రప్రదేశ్ 16 వ శాసనసభకు ఎన్నికలు, 2024 మే 13 న జరిగాయి. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15 వ సభకు, 2024 జూన్ 11 న కాలం తీరిపోనుంది.[1] సభ లోని మొత్తం 175 స్థానాలకూ ఎన్నికలు జరిగాయి. శాసనసభ ఎన్నికలతో పాటు, లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రాష్ట్రం లోని 25 లోక్‌సభ స్థానాలకు కూడా ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి.
రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు, 175 శాసనసభ స్థానాలకు పోలింగు జరిగింది. శాసనసభలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు, లోక్‌సభలో 4 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలూ ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 ఓటర్లు ఉండగా, వీరిలో 2,00,74,322 మంది పురుషులు, 2,07,29,452 మంది మహిళా ఓటర్లు, 3,482 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 67,434 మంది మిలిటరీలో ఉన్న ఓటర్లు, 7,603 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉండగా[2], మొతం 46,165 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.[3]
2019 ఎన్నికలు[మార్చు]
2019 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొత్తం 175 కు గాను 151 స్థానాల్లో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. వై ఎస్. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.[4] తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు, జనసేన 1 స్థానం గెలుచుకున్నాయి.
ఎన్నికల కార్యక్రమ వివరాలు[మార్చు]
2024 మార్చి 16 న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. దాని ప్రకారం రాష్ట్ర శాసనసభ లోని మొత్తం 175 స్థానాకూ ఒకేసారి మే 13 న ఎన్నికలు జరుగుతాయి. శాసనసభ ఎన్నికల కాలక్రమణిక ఇలా ఉంది[5]:
ఏప్రిల్ 18 నుండి 25 వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ, 26 నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
వివరాలు | తేదీ |
---|---|
నోటిఫికేషన్ తేదీ | 2024 మార్చి 16 |
గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ | 2024 ఏప్రిల్ 18 |
నామినేషన్లు వేయడానికి చివరి తేదీ | 2024 ఏప్రిల్ 25 |
నామినేషన్ల పరిశీలన తేదీ | 2024 ఏప్రిల్ 26 |
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | 2024 ఏప్రిల్ 29 |
పోలింగ్ తేదీ | 2024 మే 13 |
ఓట్ల లెక్కింపు తేదీ | 2024 జూన్ 4 |
ఎన్నికల ప్రక్రియ ముగిసే తేదీ | 2024 జూన్ 6 |
పోటీ చేస్తున్న పార్టీలు, వాటి పొత్తులు[మార్చు]
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసాయి.
కూటమి/పార్టీ | పార్టీ జెండా | గుర్తు | పార్టీ నాయకుడు | పోటీ చేసిన స్థానాల సంఖ్య | ||||
---|---|---|---|---|---|---|---|---|
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వైఎస్ జగన్ మోహన్ రెడ్డి | 175 [6] | ||||||
NDA[7] | తెలుగు దేశం | నారా చంద్రబాబునాయుడు | 144[8] | 175 | ||||
జనసేన పార్టీ | పవన్ కళ్యాణ్ | 21 | ||||||
భారతీయ జనతా పార్టీ | దగ్గుబాటి పురంధేశ్వరి | 10 | ||||||
ఇండియా కూటమి [9] | భారత జాతీయ కాంగ్రెస్ | వైఎస్ షర్మిల | 159[10][11] | 175 | ||||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | వి.శ్రీనివాసరావు.[12] | 8 | ||||||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) | కె. రామకృష్ణ | 8 |
నియోజకవర్గం వారీగా అభ్యర్థులు[మార్చు]
- తెలుగుదేశం, జనసేనలు తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసాయి. పొత్తులో భాగంగా జనసేన 24 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. వీటిలో జనసేన 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తెదేపా 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.[13]
- 2024 మార్చి 14న తెదేపా మరొక 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.[14]
- వైకాపా, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ అభ్యర్థులందరి జాబితాను ఒకేసారి మార్చి 16 న విడుదల చేసింది.[15]
- 2024 మార్చి 23 న తెదేపా తన మూడో జాబితాలో 11 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.[16][17]
- వైఎస్సార్ కాంగ్రెస్, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అభ్యర్థుల పూర్తి జాబితా.[18][19]
- జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడైన వి.వి.లక్ష్మీనారాయణ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుండి పోటీలో నిలబడ్డాడు.[19]
- జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి శ్రీధర దక్షిణామూర్తి పోటీలో నిలబడ్డారు.
జిల్లా | నియోజకవర్గం | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ[20][21][22] | ఎన్.డి.ఎ[23][24] | కాంగ్రెస్ పార్టీ[25][26] | |||||||||
శ్రీకాకుళం | 1 | ఇచ్ఛాపురం | వైకాపా | పిరియా విజయ | తెదేపా | బెందాళం అశోక్ | INC | మాసుపత్రి చక్రవర్తిరెడ్డి | |||
2 | పలాస | వైకాపా | సీదిరి అప్పలరాజు | తెదేపా | గౌతు శిరీష | INC | మజ్జి త్రినాథ్ బాబు | ||||
3 | టెక్కలి | వైకాపా | దువ్వాడ శ్రీనివాస్ | తెదేపా | కింజరాపు అచ్చన్నాయుడు | INC | కిల్లి కృపారాణి | ||||
4 | పాతపట్నం | వైకాపా | రెడ్డి శాంతి | తెదేపా | మామిడి గోవిందరావు | INC | కొప్పురోతు వెంకట్రావు | ||||
5 | శ్రీకాకుళం | వైకాపా | ధర్మాన ప్రసాదరావు | తెదేపా | గొండు శంకర్ | INC | అంబటి నాగభూషణరావు
(పైడి నాగభూషణరావు స్థానంలో)[26] | ||||
6 | ఆమదాలవలస | వైకాపా | తమ్మినేని సీతారాం | తెదేపా | కూన రవికుమార్ | INC | సనపల అన్నాజీరావు | ||||
7 | ఎచ్చెర్ల | వైకాపా | గొర్లె కిరణ్ కుమార్ | BJP | ఎన్. ఈశ్వరరావు | INC | కరిమజ్జి మల్లేశ్వరరావు | ||||
8 | నరసన్నపేట | వైకాపా | ధర్మాన కృష్ణదాస్ | తెదేపా | బగ్గు రమణమూర్తి | INC | మంత్రి నరసింహమూర్తి | ||||
విజయనగరం | 9 | రాజాం (SC) | వైకాపా | డా. తలే రాజేష్ | తెదేపా | కోండ్రు మురళీమోహన్ | INC | కంబాల రాజవర్ధన్ | |||
పార్వతీపురం మన్యం | 10 | పాలకొండ (ST) | వైకాపా | విశ్వాసరాయి కళావతి | JSP | నిమ్మక జయకృష్ణ | INC | సరవ చంటిబాబు | |||
11 | కురుపాం (ST) | వైకాపా | పాముల పుష్ప శ్రీవాణి | తెదేపా | తోయక జగదీశ్వరి | CPI(M) | మండంగి రమణ | ||||
12 | పార్వతీపురం (SC) | వైకాపా | అలజంగి జోగారావు | తెదేపా | బోనెల విజయ్ చంద్ర | INC | బత్తిన మోహనరావు | ||||
13 | సాలూరు (ST) | వైకాపా | పీడిక రాజన్న దొర | తెదేపా | గుమ్మిడి సంధ్యా రాణి | INC | మువ్వల పుష్పారావు | ||||
విజయనగరం | 14 | బొబ్బిలి | వైకాపా | శంబంగి వెంకట చిన అప్పలనాయుడు | తెదేపా | రావు వెంకట శ్వేతా చలపతి కుమార కృష్ణ రంగారావు | INC | మరిపి విద్యాసాగర్ | |||
15 | చీపురుపల్లి | వైకాపా | బొత్స సత్యనారాయణ | తెదేపా | కిమిడి కళా వెంకటరావు | INC | జమ్ము ఆదినారాయణ | ||||
16 | గజపతినగరం | వైకాపా | బొత్స అప్పలనరసయ్య | తెదేపా | కొండపల్లి శ్రీనివాస్ | INC | దోలా శ్రీనివాస్ (గాదాపు కూర్మినాయుడు స్థానంలో)[26] | ||||
17 | నెల్లిమర్ల | వైకాపా | బడుకొండ అప్పలనాయుడు | JSP | లోకం నాగ మాధవి | INC | సరగడ రమేష్ కుమార్ | ||||
18 | విజయనగరం | వైకాపా | కోలగట్ల వీరభద్రస్వామి | తెదేపా | పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు | INC | సుంకరి సతీష్ కుమార్ | ||||
19 | శృంగవరపుకోట | వైకాపా | కడుబండి శ్రీనివాసరావు | తెదేపా | కోళ్ల లలితకుమారి | INC | గేదెల తిరుపతి | ||||
విశాఖపట్నం | 20 | భీమిలి | వైకాపా | ముత్తంశెట్టి శ్రీనివాసరావు | తెదేపా | గంటా శ్రీనివాసరావు | INC | అడ్డాల వెంకటవర్మ రాజు | |||
21 | తూర్పు విశాఖపట్నం | వైకాపా | ఎం. వి. వి. సత్యనారాయణ | తెదేపా | వెలగపూడి రామకృష్ణ బాబు | INC | గుత్తుల శ్రీనివాసరావు | ||||
22 | దక్షిణ విశాఖపట్నం | వైకాపా | వాసుపల్లి గణేష్ కుమార్ | JSP | వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ | INC | వాసుపల్లి సంతోష్ | ||||
23 | ఉత్తర విశాఖపట్నం[a] | వైకాపా | కమ్మిల కన్నపరాజు | BJP | పి.విష్ణు కుమార్ రాజు | INC | లక్కరాజు రామారావు | ||||
24 | పశ్చిమ విశాఖపట్నం | వైకాపా | ఆడారి ఆనంద్ కుమార్ | తెదేపా | పి.జి.వి.ఆర్. నాయుడు | CPI | అత్తిలి విమల | ||||
25 | గాజువాక | వైకాపా | గుడివాడ అమర్నాథ్ | తెదేపా | పల్లా శ్రీనివాసరావు | CPI(M) | ఎం.జగ్గునాయుడు | ||||
అనకాపల్లి | 26 | చోడవరం | వైకాపా | కరణం ధర్మశ్రీ | తెదేపా | కె.ఎస్.ఎన్.ఎస్.రాజు | INC | జగత శ్రీనివాసరావు | |||
27 | మాడుగుల | వైకాపా | ఈర్లె అనూరాధ (బూడి ముత్యాల నాయుడు) | తెదేపా | బండారు సత్యనారాయణ మూర్తి
(పైలా ప్రసాదరావు స్థానంలో) |
INC | బి.బి.ఎస్.శ్రీనివాసరావు | ||||
అల్లూరి సీతారామరాజు | 28 | అరకులోయ (ST) | వైకాపా | రేగం మత్స్యలింగం | BJP | పాంగి రాజారావు | INC | శెట్టి గంగాధర స్వామి | |||
29 | పాడేరు (ST) | వైకాపా | మత్స్యరాస విశ్వేశ్వర రాజు | తెదేపా | కిల్లు వెంకట రమేష్ నాయుడు | INC | సతక బుల్లిబాబు | ||||
అనకాపల్లి | 30 | అనకాపల్లి | వైకాపా | మలసాల భరత్ కుమార్ | JSP | కొణతాల రామకృష్ణ | INC | ఇల్లా రామగంగాధరరావు | |||
31 | పెందుర్తి | వైకాపా | అన్నంరెడ్డి అదీప్‌రాజ్ | JSP | పంచకర్ల రమేష్ బాబు | INC | పిరిడి భగత్ | ||||
32 | ఎలమంచిలి | వైకాపా | యు.వి. రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు) | JSP | సుందరపు విజయ్ కుమార్ | INC | తనకాల నర్సింగరావు | ||||
33 | పాయకరావుపేట (SC) | వైకాపా | కంబాల జోగులు | తెదేపా | వంగలపూడి అనిత | INC | బోని తాతారావు | ||||
34 | నర్సీపట్నం | వైకాపా | పెట్ల ఉమా శంకర్ గణేష్ | తెదేపా | చింతకాయల అయ్యన్న పాత్రుడు | INC | రుత్తల శ్రీరామమూర్తి | ||||
కాకినాడ | 35 | తుని | వైకాపా | దాడిశెట్టి రాజా | తెదేపా | యనమల దివ్య | INC | గెలం శ్రీనివాసరావు | |||
36 | ప్రత్తిపాడు | వైకాపా | వరుపుల సుబ్బారావు | తెదేపా | వరుపుల సత్యప్రభ | INC | ఎన్.వి.వి.సత్యనారాయణ | ||||
37 | పిఠాపురం | వైకాపా | వంగా గీత | JSP | పవన్ కళ్యాణ్ | INC | మాడేపల్లి సత్యానందరావు | ||||
38 | కాకినాడ గ్రామీణ | వైకాపా | కురసాల కన్నబాబు | JSP | పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) | INC | పిల్లి సత్యలక్ష్మి | ||||
39 | పెద్దాపురం | వైకాపా | దావులూరి దొరబాబు | తెదేపా | నిమ్మకాయల చినరాజప్ప | INC | తుమ్మల దొరబాబు | ||||
తూర్పు గోదావరి | 40 | అనపర్తి | వైకాపా | సత్తి సూర్యనారాయణ రెడ్డి | BJP | నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (శివకృష్ణంరాజు స్థానంలో) | INC | ఎల్లా శ్రీనివాస
వడయార్ | |||
కాకినాడ | 41 | కాకినాడ సిటీ | వైకాపా | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి | తెదేపా | వనమూడి వెంకటేశ్వరరావు (కొండబాబు) | INC | చెక్కా నూకరాజు | |||
కోనసీమ | 42 | రామచంద్రపురం | వైకాపా | పిల్లి సూర్యప్రకాష్ | తెదేపా | వాసంసెట్టి సుభాష్ | INC | కోట శ్రీనివాసరావు | |||
43 | ముమ్మిడివరం | వైకాపా | పొన్నాడ వెంకట సతీష్ కుమార్ | తెదేపా | దాట్ల సుబ్బరాజు | INC | పాలెపు ధర్మారావు | ||||
44 | అమలాపురం (SC) | వైకాపా | పినిపే విశ్వరూప్ (పినిపే శ్రీకాంత్ స్థానంలో) | తెదేపా | అయితాబత్తుల ఆనందరావు | INC | అయితాబత్తుల సుభాషిణి | ||||
45 | రాజోలు (SC) | వైకాపా | గొల్లపల్లి సూర్యారావు | JSP | దేవ వర ప్రసాద్ | INC | సరెళ్ళ ప్రసన్న కుమార్ | ||||
46 | పి.గన్నవరం (SC) | వైకాపా | విప్పర్తి వేణుగోపాలరావు | JSP | గిడ్డి సత్యనారాయణ | INC | కొండేటి చిట్టిబాబు | ||||
47 | కొత్తపేట | వైకాపా | చీర్ల జగ్గిరెడ్డి | తెదేపా | బండారు సత్యానందరావు | INC | రౌతు ఈశ్వరరావు | ||||
48 | మండపేట | వైకాపా | తోట త్రిమూర్తులు | తెదేపా | వేగుళ్ళ జోగేశ్వరరావు | INC | కామన ప్రభాకరరావు | ||||
తూర్పు గోదావరి | 49 | రాజానగరం | వైకాపా | జక్కంపూడి రాజా | JSP | బత్తుల బలరామ కృష్ణుడు | INC | ముండ్రు వెంకట శ్రీనివాస్ | |||
50 | రాజమండ్రి పట్టణ | వైకాపా | మార్గాని భరత్‌రామ్ | తెదేపా | ఆదిరెడ్డి వాసు | INC | బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న | ||||
51 | రాజమండ్రి గ్రామీణ | వైకాపా | చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ | తెదేపా | గోరంట్ల బుచ్చయ్య చౌదరి | INC | బాలేపల్లి మురళీధర్ | ||||
కాకినాడ | 52 | జగ్గంపేట | వైకాపా | తోట నరసింహం | తెదేపా | జ్యోతుల నెహ్రూ | INC | మారోతు వి.వి. గణేశ్వరరావు | |||
అల్లూరి సీతారామరాజు | 53 | రంపచోడనరం (ST) | వైకాపా | నాగులపల్లి ధనలక్ష్మి | తెదేపా | మిరియాల శిరీష | CPI(M) | లోతా రామారావు | |||
తూర్పు గోదావరి | 54 | కొవ్వూరు (SC) | వైకాపా | తలారి వెంకట్రావు | తెదేపా | ముప్పిడి వెంకటేశ్వరరావు | INC | అరిగెల అరుణ కుమారి | |||
55 | నిడదవోలు | వైకాపా | గెడ్డం శ్రీనివాస్ నాయుడు | JSP | కందుల దుర్గేష్ | INC | పెద్దిరెడ్డి సుబ్బారావు | ||||
పశ్చిమ గోదావరి | 56 | ఆచంట | వైకాపా | చెరుకువాడ శ్రీరంగనాధ రాజు | తెదేపా | పితాని సత్యనారాయణ | INC | నెక్కంటి వెంకట సత్యనారాయణ | |||
57 | పాలకొల్లు | వైకాపా | గుడాల శ్రీహరి గోపాలరావు | తెదేపా | నిమ్మల రామానాయుడు | INC | కొలుకులూరి అర్జునరావు | ||||
58 | నర్సాపురం | వైకాపా | ముదునూరి నాగరాజ వరప్రసాద్ రాజు | JSP | బొమ్మిడి నాయకర్ | INC | కానూరి ఉదయభాస్కర కృష్ణప్రసాద్ | ||||
59 | భీమవరం | వైకాపా | గ్రంధి శ్రీనివాస్ | JSP | పులపర్తి రామాంజనేయులు | INC | అంకెం సీతారాము | ||||
60 | ఉండి | వైకాపా | పి.వి.ఎల్ నరసింహరాజు | తెదేపా | రఘురామ కృష్ణంరాజు
(మంతెన రామరాజు స్థానంలో) |
INC | వేగేశన వెంకట గోపాలకృష్ణంరాజు | ||||
61 | తణుకు | వైకాపా | కారుమూరి వెంకట నాగేశ్వరరావు | తెదేపా | ఆరిమిల్లి రాధాకృష్ణ | INC | కడలి రామరావు | ||||
62 | తాడేపల్లిగూడెం | వైకాపా | కొట్టు సత్యనారాయణ | JSP | బొలిశెట్టి శ్రీనివాస్ | INC | మార్నీడి శేఖర్ | ||||
ఏలూరు | 63 | ఉంగుటూరు | వైకాపా | పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) | JSP | పత్సమట్ల ధర్మరాజు | INC | పాతపాటి హరికుమార్ రాజు | |||
64 | దెందులూరు | వైకాపా | కొటారు అబ్బయ్య చౌదరి | తెదేపా | చింతమనేని ప్రభాకర్ | INC | ఆలపాటి నరసింహమూర్తి | ||||
65 | ఏలూరు | వైకాపా | ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (అళ్ల నాని) | తెదేపా | బడేటి రాధా కృష్ణ | CPI | బండి వెంకటేశ్వరరావు | ||||
తూర్పు గోదావరి | 66 | గోపాలపురం (SC) | వైకాపా | తానేటి వనిత | తెదేపా | మద్దిపాటి వెంకటరాజు | INC | సోడదాసి మార్టిన్ లూథర్ | |||
ఏలూరు | 67 | పోలవరం (ST) | వైకాపా | తెల్లం రాజ్యలక్ష్మి | JSP | చిర్రి బాలరాజు | INC | దువ్వెళ్ళ సృజన | |||
68 | చింతలపూడి (SC) | వైకాపా | కంభం విజయరాజు | తెదేపా | సోంగా రోషన్ | INC | ఉన్నమట్ల రాకాడ ఎలీజా | ||||
ఎన్టీఆర్ | 69 | తిరువూరు (SC) | వైకాపా | నల్లగట్ల స్వామి దాస్ | తెదేపా | కొలికిపూడి శ్రీనివాసరావు | INC | లాం తాంతియా కుమారి | |||
ఏలూరు | 70 | నూజివీడు | వైకాపా | మేకా వెంకట ప్రతాప్ అప్పారావు | తెదేపా | కొలుసు పార్థసారథి | INC | మరీదు కృష్ణ | |||
కృష్ణా | 71 | గన్నవరం | వైకాపా | వల్లభనేని వంశీ మోహన్ | తెదేపా | యార్లగడ్డ వెంకట్రావు | INC | కళ్ళం వెంకటేశ్వరరావు | |||
72 | గుడివాడ | వైకాపా | కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) | తెదేపా | వెనిగండ్ల రాము | INC | వడ్డాది గోవిందరావు | ||||
ఏలూరు | 73 | కైకలూరు | వైకాపా | దూలం నాగేశ్వరరావు | BJP | కామినేని శ్రీనివాసరావు | INC | బొడ్డు నోబెల్ | |||
కృష్ణా | 74 | పెడన | వైకాపా | ఉప్పాల రమేష్ (రాము) | తెదేపా | కాగిత కృష్ణ ప్రసాద్ | INC | శొంఠి నాగరాజు | |||
75 | మచిలీపట్నం | వైకాపా | పేర్ని కృష్ణమూర్తి | తెదేపా | కొల్లు రవీంద్ర | INC | అబ్దుల్ మతీన్ | ||||
76 | అవనిగడ్డ | వైకాపా | సింహాద్రి రమేష్ బాబు | JSP | మండలి బుద్ధప్రసాద్ | INC | అందె శ్రీరామమూర్తి | ||||
77 | పామర్రు (SC) | వైకాపా | కైలా అనిల్ కుమార్ | తెదేపా | వర్ల కుమార్ రాజా | INC | డి.వై.దాస్ | ||||
78 | పెనమలూరు | వైకాపా | జోగి రమేష్ | తెదేపా | బోడె ప్రసాద్ | INC | ఎలిసాల సుబ్రహ్మణ్యం | ||||
ఎన్.టి.ఆర్. | 79 | విజయవాడ వెస్ట్ | వైకాపా | షేక్ ఆసిఫ్ | BJP | సుజనా చౌదరి | INC | జి.కోటేశ్వరరావు | |||
80 | విజయవాడ సెంట్రల్ | వైకాపా | వెల్లంపల్లి శ్రీనివాస్ | తెదేపా | బోండా ఉమామహేశ్వరరావు | CPI(M) | చిగురుపాటి బాబూరావు | ||||
81 | విజయవాడ | వైకాపా | దేవినేని అవినాష్ | తెదేపా | గద్దె రామమోహనరావు | INC | పొనుగుపాటి నాంచారయ్య
(సుంకర పద్మశ్రీ) | ||||
82 | మైలవరం | వైకాపా | సర్నాల తిరుపతిరావు యాదవ్ | తెదేపా | వసంత కృష్ణప్రసాద్ | INC | బొర్రా కిరణ్ | ||||
83 | నందిగామ (SC) | వైకాపా | మొండితోక జగన్మోహనరావు | తెదేపా | తంగిరాల సౌమ్య | INC | మండ వజ్రయ్య | ||||
84 | జగ్గయ్యపేట | వైకాపా | సామినేని ఉదయభాను | తెదేపా | శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య | INC | కర్నాటి అప్పారావు | ||||
పల్నాడు | 85 | పెదకూరపాడు | వైకాపా | నంబూరు శంకర్ రావు | తెదేపా | భాష్యం ప్రవీణ్ | INC | పమిడి నాగేశ్వరరావు | |||
గుంటూరు | 86 | తాడికొండ (SC) | వైకాపా | మేకతోటి సుచరిత | తెదేపా | తెనాలి శ్రావణ్ కుమార్ | INC | మంచాల సుశీల్ రాజా (చిలకా విజయకుమార్ స్థానంలో)[26] | |||
87 | మంగళగిరి | వైకాపా | మురుగుడు లావణ్య | తెదేపా | నారా లోకేష్ | CPI(M) | జొన్నా శివశంకర్ | ||||
88 | పొన్నూరు | వైకాపా | అంబటి మురళీకృష్ణ | తెదేపా | ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ | INC | జక్కా రవీంద్రనాథ్ | ||||
బాపట్ల | 89 | వేమూరు (SC) | వైకాపా | వరికూటి అశోక్ బాబు | తెదేపా | నక్కా ఆనంద బాబు | INC | బురగ సుబ్బారావు | |||
90 | రేపల్లె | వైకాపా | ఈవూరు గణేష్ | తెదేపా | అనగాని సత్యప్రసాద్ | INC | మోపిదేవి శ్రీనివాసరావు | ||||
గుంటూరు | 91 | తెనాలి | వైకాపా | అన్నాబత్తుని శివకుమార్ | JSP | నాదెండ్ల మనోహర్ | INC | చందు సాంబశివుడు - నామినేషన్‌ను తిరస్కరించారు (ఎస్.కె.బషీర్ స్థానంలో) | |||
బాపట్ల | 92 | బాపట్ల | వైకాపా | కోన రఘుపతి | తెదేపా | వేగేశన నరేంద్రవర్మ | INC | గంటా అంజిబాబు | |||
గుంటూరు | 93 | ప్రత్తిపాడు (SC) | వైకాపా | బాలసాని కిరణ్ కుమార్ | తెదేపా | బూర్ల రామాంజనేయులు | INC | కొరివి వినయకుమార్ | |||
94 | గుంటూరు పశ్చిమ | వైకాపా | విడదల రజని | తెదేపా | పిడుగురాళ్ళ మాధవి | INC | డా.రాచకొండ జాన్ బాబు | ||||
95 | గుంటూరు తూర్పు | వైకాపా | షేక్ నూరి ఫాతిమా | తెదేపా | మహ్మద్ నజీర్ | INC | షేక్ మస్తాన్ వలీ | ||||
పల్నాడు | 96 | చిలకలూరిపేట | వైకాపా | కె. మనోహర్ నాయుడు | తెదేపా | పత్తిపాటి పుల్లారావు | INC | మద్దుల రాధాకృష్ణ | |||
97 | నరసరావుపేట | వైకాపా | గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి | తెదేపా | చదలవాడ అరవింద్‌బాబు | INC | షేక్ మహబూబ్ బాషా | ||||
98 | సత్తెనపల్లి | వైకాపా | అంబటి రాంబాబు | తెదేపా | కన్నా లక్ష్మీనారాయణ | INC | చుక్కా చంద్రపాల్ | ||||
99 | వినుకొండ | వైకాపా | బొల్లా బ్రహ్మ నాయుడు | తెదేపా | జి.వి.ఆంజనేయులు | INC | చెన్న శ్రీనివాసరావు | ||||
100 | గురజాల | వైకాపా | కాసు మహేష్ రెడ్డి | తెదేపా | యరపతినేణి శ్రీనివాసరావు | INC | తియ్యగూర యలమందారెడ్డి | ||||
101 | మాచెర్ల | వైకాపా | పిన్నెల్లి రామకృష్ణారెడ్డి | తెదేపా | జూలకంటి బ్రహ్మానంద రెడ్డి | INC | యరమల రామచంద్రారెడ్డి | ||||
ప్రకాశం | 102 | ఎర్రగొండపాలెం (SC) | వైకాపా | తాటిపర్తి చంద్రశేఖర్ | తెదేపా | గూడూరి ఎరిక్సన్ బాబు | INC | బూదాల అజితారావు | |||
103 | దర్శి | వైకాపా | బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి | తెదేపా | గొట్టిపాటి లక్ష్మి | INC | పుట్లూరి కొండారెడ్డి | ||||
బాపట్ల | 104 | పర్చూరు | వైకాపా | యడం బాలాజీ | తెదేపా | ఏలూరి సాంబశివరావు | INC | ఎన్.ఎస్.శ్రీలక్ష్మి జ్యోతి | |||
105 | అద్దంకి | వైకాపా | పానెం హనిమి రెడ్డి | తెదేపా | గొట్టిపాటి రవి కుమార్ | INC | అడుసుమల్లి కిషోర్ బాబు | ||||
106 | చీరాల | వైకాపా | కరణం వెంకటేష్ | తెదేపా | మద్దులూరి మాలకొండయ్య యాదవ్ | INC | ఆమంచి కృష్ణమోహన్ | ||||
ప్రకాశం | 107 | సంతనూతలపాడు (SC) | వైకాపా | మేరుగు నాగార్జున | తెదేపా | బొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్ | INC | పాలపర్తి విజేష్‌రాజ్ | |||
108 | ఒంగోలు | వైకాపా | బాలినేని శ్రీనివాస రెడ్డి | తెదేపా | దామచర్ల జనార్దనరావు | INC | తుర్కపల్లి నాగలక్ష్మి (బుట్టి రమేష్ బాబు స్థానంలో)[26] | ||||
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | 109 | కందుకూరు | వైకాపా | బుర్రా మధు సూధన్ యాదవ్ | తెదేపా | ఇంటూరి నాగేశ్వరరావు | INC | సయ్యద్ గౌస్ మొహిద్దీన్ | |||
ప్రకాశం | 110 | కొండపి (SC) | వైకాపా | ఆదిమూలపు సురేష్ | తెదేపా | డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి | INC | పసుమర్తి సుధాకర్ (శ్రీపతి సతీష్ స్థానంలో) | |||
111 | మార్కాపురం | వైకాపా | అన్నా రాంబాబు | తెదేపా | కందుల నారాయణరెడ్డి | INC | సయ్యద్ జావేద్ అంవర్ (షేక్ సైదా స్థానంలో) | ||||
112 | గిద్దలూరు | వైకాపా | కుందూరు నాగార్జున రెడ్డి | తెదేపా | ముత్తుముల అశోక్ రెడ్డి | INC | పగడాల పెదరంగస్వామి | ||||
113 | కనిగిరి | వైకాపా | దద్దాల నారాయణ యాదవ్ | తెదేపా | ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి | INC | దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవాని స్థానంలో)[26] | ||||
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | 114 | కావలి | వైకాపా | రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి | తెదేపా | కావ్య కృష్ణారెడ్డి | INC | పొదలకూరి కళ్యాణ్ | |||
115 | ఆత్మకూరు | వైకాపా | మేకపాటి విక్రమ్ రెడ్డి | తెదేపా | ఆనం రామనారాయణరెడ్డి | INC | చెవురు శ్రీధరరెడ్డి | ||||
116 | కోవూరు | వైకాపా | నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి | తెదేపా | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి | INC | నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి (నెబ్రంబాక మోహన్ స్థానంలో)[26] | ||||
117 | నెల్లూరు సిటీ | వైకాపా | మహ్మద్ ఖలీల్ అహ్మద్ | తెదేపా | పొంగూరు నారాయణ | CPI(M) | మూలం రమేష్ | ||||
118 | నెల్లూరు రూరల్ | వైకాపా | ఆదాల ప్రభాకర రెడ్డి | తెదేపా | కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి | INC | షేక్ ఫయాజ్ | ||||
119 | సర్వేపల్లి | వైకాపా | కాకాణి గోవర్ధన్‌రెడ్డి | తెదేపా | సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి | INC | పూల చంద్రశేఖర్ (పి.వి.శ్రీకాంత్ రెడ్డి స్థానంలో)
(పూల చంద్రశేఖర్ స్థానంలో)[26] | ||||
తిరుపతి | 120 | గూడూరు (SC) | వైకాపా | మేరిగ మురళీధర్ | తెదేపా | పాసిం సునీల్ కుమార్ | INC | డా. యు.రామకృష్ణారావు (చిల్లకూరు వేమయ్య స్థానంలో)[26] | |||
121 | సూళ్లూరుపేట (SC) | వైకాపా | కిలివేటి సంజీవయ్య | తెదేపా | నెలవెల విజయశ్రీ | INC | చందనమూడి శివ (గడి తిలక్ బాబు స్థానంలో)[26] | ||||
122 | వెంకటగిరి | వైకాపా | నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి | తెదేపా | కురుగోండ్ల రామకృష్ణ
(కురుగోండ్ల లక్ష్మీప్రియ) |
INC | పంటా శ్రీనివాసులు | ||||
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | 123 | ఉదయగిరి | వైకాపా | మేకపాటి రాజగోపాల్ రెడ్డి | తెదేపా | కాకర్ల సురేష్ | INC | సోము అనిల్ కుమార్ రెడ్డి | |||
కడప | 124 | బద్వేలు (SC) | వైకాపా | దాసరి సుధ | BJP | బొజ్జా రోషన్న | INC | నీరుగట్టు దొర విజయ జ్యోతి | |||
అన్నమయ్య | 125 | రాజంపేట | వైకాపా | ఆకెపాటి అమరనాథ్ రెడ్డి | తెదేపా | సుగవాసి సుబ్రహ్మణ్యం | CPI | బుక్కే విశ్వనాథ నాయక్ | |||
కడప | 126 | కడప | వైకాపా | అంజాద్ బాషా షేక్ బేపారి | తెదేపా | రెడ్డెప్పగారి మాధవి రెడ్డి | INC | తుమ్మన్ కల్యాల్ అస్జల్ అలీఖాన్ | |||
అన్నమయ్య | 127 | కోడూరు (SC) | వైకాపా | కోరముట్ల శ్రీనివాసులు | JSP | అరవ శ్రీధర్ (యనమల భాస్కరరావు స్థానంలో) | INC | గోశాల దేవి | |||
128 | రాయచోటి | వైకాపా | గడికోట శ్రీకాంత్ రెడ్డి | తెదేపా | మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి | INC | షేక్ అల్లాబక్ష్ | ||||
కడప | 129 | పులివెందుల | వైకాపా | వైయస్ జగన్ మోహన్ రెడ్డి | తెదేపా | మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి - బీటెక్ రవి | INC | మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి | |||
130 | కమలాపురం | వైకాపా | పి. రవీంద్రనాథ్ రెడ్డి | తెదేపా | పుత్తా చైతన్యరెడ్డి | CPI | గాలి చంద్ర | ||||
131 | జమ్మలమడుగు | వైకాపా | ఎం.సుధీర్ రెడ్డి | BJP | సి.హెచ్. ఆదినారాయణ రెడ్డి | INC | పాముల బ్రహ్మానందరెడ్డి | ||||
132 | ప్రొద్దుటూరు | వైకాపా | రాచమల్లు శివప్రసాద్ రెడ్డి | తెదేపా | వరదరాజులరెడ్డి | INC | షేక్ పూల మహ్మద్ నజీర్ | ||||
133 | మైదుకూరు | వైకాపా | ఎస్. రఘురామిరెడ్డి | తెదేపా | పుట్టా సుధాకర్ యాదవ్ | INC | గుండ్లకుంట శ్రీరాములు | ||||
నంద్యాల | 134 | ఆళ్లగడ్డ | వైకాపా | గంగుల బ్రిజేంద్రరెడ్డి | తెదేపా | భూమా అఖిల ప్రియ | INC | బారగొడ్ల హుసేన్ బాషా | |||
135 | శ్రీశైలం | వైకాపా | శిల్పా చక్రపాణిరెడ్డి | తెదేపా | బుడ్డా రాజశేఖర రెడ్డి | INC | అజర్ సయ్యద్ ఇస్మాయిల్ | ||||
136 | నందికొట్కూరు (SC) | వైకాపా | దారా సుధీర్ | తెదేపా | గిత్తా జయసూర్య | INC | తొగురు ఆర్థర్ | ||||
కర్నూలు | 137 | కర్నూలు | వైకాపా | ఎ. ఎండీ ఇంతియాజ్ అహ్మద్ | తెదేపా | టి.జి.భరత్ | CPI(M) | షేక్ జిలానీ బాషా | |||
నంద్యాల | 138 | పాణ్యం | వైకాపా | కాటసాని రామభూపాల్ రెడ్డి | తెదేపా | గౌరు చరిత రెడ్డి | CPI(M) | డి.గౌస్ దేశాయ్ | |||
139 | నంద్యాల | వైకాపా | శిల్పా రవికిషోర్ రెడ్డి | తెదేపా | ఎన్. ఎం. డి. ఫరూక్ | INC | గోకుల కృష్ణారెడ్డి | ||||
140 | బనగానపల్లె | వైకాపా | కాటసాని రామిరెడ్డి | తెదేపా | బి.సి.జనార్దన్ రెడ్డి | INC | గూటం పుల్లయ్య | ||||
141 | డోన్ | వైకాపా | బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి | తెదేపా | కోట్ల జయసూర్య ప్రకాశ రెడ్డి | INC | గారపాటి మద్దులేటి స్వామి | ||||
కర్నూలు | 142 | పత్తికొండ | వైకాపా | కంగాటి శ్రీదేవి | తెదేపా | కే.ఈ. శ్యామ్ బాబు | CPI | పి,.రామచంద్రయ్య | |||
143 | కోడుమూరు (SC) | వైకాపా | ఆదిమూలపు సతీష్ | తెదేపా | బొగ్గుల దస్తగిరి | INC | పరిగెళ్ళ మురళీకృష్ణ | ||||
144 | ఎమ్మిగనూరు | వైకాపా | బుట్టా రేణుక | తెదేపా | బి.వి.జయనాగేశ్వర రెడ్డి | INC | మరుముళ్ళ ఖాసిం వలీ | ||||
145 | మంత్రాలయం | వైకాపా | వై. బాలనాగి రెడ్డి | తెదేపా | నల్లగోని రాఘవేంద్రరెడ్డి | INC | పి.ఎస్. మురళీకృష్ణ రాజు | ||||
146 | ఆదోని | వైకాపా | వై.సాయి ప్రసాద్ రెడ్డి | BJP | పీ.వి. పార్థసారథి | INC | గొల్ల రమేశ్ | ||||
147 | ఆలూరు | వైకాపా | బూసిన విరూపాక్షి | తెదేపా | బి. వీరభద్ర గౌడ్ | INC | ఆరకట్ల నవీన్ కిషోర్ | ||||
అనంతపురం | 148 | రాయదుర్గం | వైకాపా | మెట్టు గోవింద రెడ్డి | తెదేపా | కాలవ శ్రీనివాసులు | INC | ఎం.బి.చినప్పయ్య | |||
149 | ఉరవకొండ | వైకాపా | వై.విశ్వేశ్వర రెడ్డి | తెదేపా | పయ్యావుల కేశవ్ | INC | వై.మధుసూదనరెడ్డి | ||||
150 | గుంతకల్లు | వైకాపా | వై.వెంకట్రామి రెడ్డి | తెదేపా | గుమనూరు జయరాం | INC | కావలి ప్రభాకర్ | ||||
151 | తాడిపత్రి | వైకాపా | కేతిరెడ్డి పెద్దా రెడ్డి | తెదేపా | జేసీ అశ్మిత్ రెడ్డి | INC | గుజ్జల నాగిరెడ్డి | ||||
152 | సింగనమల (SC) | వైకాపా | మన్నెపాకుల వీరాంజనేయులు | తెదేపా | బండారు శ్రావణి శ్రీ | INC | సాకె శైలజానాథ్ | ||||
153 | అనంతపురం అర్బన్ | వైకాపా | అనంత వెంకట రామిరెడ్డి | తెదేపా | దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ | CPI | సి.జాఫర్ | ||||
154 | కళ్యాణదుర్గం | వైకాపా | తలారి రంగయ్య | తెదేపా | అమిలినేని సురేంద్ర బాబు | INC | పి.రాంభూపాల్ రెడ్డి | ||||
155 | రాప్తాడు | వైకాపా | తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి | తెదేపా | పరిటాల సునీత | INC | ఆది ఆంధ్ర శంకరయ్య | ||||
శ్రీ సత్యసాయి | 156 | మడకశిర (SC) | వైకాపా | ఈర లక్కప్ప | తెదేపా | ఎం.ఇ .సునీల్ కుమార్ | INC | కరికెర సుధాకర్ | |||
157 | హిందూపురం | వైకాపా | తిప్పెగౌడ నారాయణ్ దీపిక | తెదేపా | నందమూరి బాలకృష్ణ | INC | మహమ్మద్ హుసేన్ ఇనయతుల్లా (వి.నాగరాజు స్థానంలో)[26] | ||||
158 | పెనుకొండ | వైకాపా | కె. వి. ఉషశ్రీ చరణ్ | తెదేపా | సవిత | INC | పి,నరసింహప్ప | ||||
159 | పుట్టపర్తి | వైకాపా | దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి | తెదేపా | పల్లె సింధూరారెడ్డి | INC | మధుసూదనరెడ్డి | ||||
160 | ధర్మవరం | వైకాపా | కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి | BJP | వై. సత్యకుమార్ | INC | రంగన అశ్వత్థ నారాయణ | ||||
161 | కదరి | వైకాపా | బి. ఎస్. మక్బూల్ అహ్మద్ | తెదేపా | కందికుంట వెంకటప్రసాద్ | INC | కె.ఎస్.,షానవాజ్ | ||||
అన్నమయ్య | 162 | తంబళ్ళపల్లె | వైకాపా | పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి | తెదేపా | జయచంద్రా రెడ్డి | INC | ఎం.ఎన్.చంద్రశేఖరరెడ్డి | |||
163 | పీలేరు | వైకాపా | చింతల రామచంద్రారెడ్డి | తెదేపా | నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి | INC | బాలిరెడ్డి సోమశేఖరరెడ్డి | ||||
164 | మదనపల్లె | వైకాపా | నిస్సార్ అహ్మద్ | తెదేపా | షాజహాన్ బాషా | INC | మల్లెల పవన్ కుమార్ రెడ్డి | ||||
తిరుపతి | 166 | చంద్రగిరి | వైకాపా | చెవిరెడ్డి మోహిత్ రెడ్డి | తెదేపా | పులివర్తి వెంకట మణిప్రసాద్ (నాని) | INC | కనుపర్తి శ్రీనివాసులు | |||
167 | తిరుపతి | వైకాపా | భూమన అభినయ్ రెడ్డి | JSP | ఆరణి శ్రీనివాసులు | CPI | పి,.మురళి | ||||
168 | శ్రీకాళహస్తి | వైకాపా | బియ్యపు మధుసూదన్ రెడ్డి | తెదేపా | బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి | INC | పోతుగుంట రాజేష్ నాయుడు | ||||
169 | సత్యవేడు (SC) | వైకాపా | నూకతోటి రాజేష్ | తెదేపా | కోనేటి ఆదిమూలం | INC | బాలగురువం బాబు | ||||
చిత్తూరు | 165 | పుంగనూరు | వైకాపా | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | తెదేపా | చల్లా రామచంద్రారెడ్డి (బాబు) | INC | జి.మురళీమోహన్ యాదవ్ | |||
170 | నగరి | వైకాపా | ఆర్.కె.రోజా | తెదేపా | గాలి భాను ప్రకాష్ | INC | పోచరెడ్డి రాకేష్ రెడ్డి | ||||
171 | గంగాధార నెల్లూరు (SC) | వైకాపా | కళత్తూరు కృపా లక్ష్మి | తెదేపా | వి.ఎమ్. థామస్ | INC | డి.రమేష్ బాబు | ||||
172 | చిత్తూరు | వైకాపా | ఎం. విజయానంద రెడ్డి | తెదేపా | గురజాల జగన్ మోహన్ | INC | జి.టికారామ్ | ||||
173 | పూతలపట్టు (SC) | వైకాపా | ఎం. సునీల్ కుమార్ | తెదేపా | డా. కలికిరి మురళీమోహన్ | INC | ఎం.ఎస్.బాబు | ||||
174 | పలమనేరు | వైకాపా | ఎన్.వెంకట గౌడ | తెదేపా | ఎన్. అమరనాథ రెడ్డి | INC | బి.శివశంకర్ | ||||
175 | కుప్పం | వైకాపా | కె.ఆర్. జె . భరత్ | తెదేపా | ఎన్.చంద్రబాబు నాయుడు | INC | ఆవుల గోవిందరాజులు |
- ↑ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుండి జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ పోటీచేస్తున్నాడు.
సంఘటనలు[మార్చు]
ఎన్నికలలో అక్రమాలు[మార్చు]
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ఎన్నికలలో గెలవడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించాడు. 2023 ఆగస్టు 28న నారా చంద్రబాబునాయుడు, అర్హులైన ఓటర్లందరినీ చేర్చి నకిలీ ఓటర్లను తొలగించేలా చూడాలని భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల డేటాను ప్రైవేట్ ఏజెన్సీలకు బదిలీ చేయడంపై విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు, ఎన్నికల విధులకు ఉపాధ్యాయులకు బదులుగా గ్రామ వాలంటీర్లను నియమించడాన్ని వ్యతిరేకించాడు.[27][28] విశాఖపట్నం తూర్పులో 40 వేల ఓట్లు, విజయవాడ సెంట్రల్లో 23 వేల ఓట్లు, పర్చూరు, తాడికొండ, ఉరవకొండ నియోజకవర్గాల్లో 23 వేల ఓట్లు తొలగించినట్లు డాక్యుమెంటరీ ఆధారాలను కూడా ఎన్నికల సంఘానికి సమర్పించారు.[29][30]
2024 ఏప్రిల్ 13 న ముఖ్యమంత్రి Y. S. జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో బస్సుపై నిలబడి ప్రచారం చేస్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి అతనిపై రాయి విసిరాడు.[31] రాయి అతని నుదుటిపై ఎడమ కంటికి పైన తాకింది. పెద్ద గాయాలు కాకుండా చిన్న కోత ఏర్పడింది.[32] తమ నాయకుడిపై దాడి చేయడానికి ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని YSRCP ఆరోపించగా,[33] ప్రతిపక్ష నాయకుడు, N. చంద్రబాబు నాయుడు ఈ చర్యను ఖండించాడు. ఈ సంఘటనపై ఎన్నికల సంఘం నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరాడు. అంతేకాకుండా, ఆ సంఘటన జరిగిన పరిస్థితులు, సమయాన్ని ప్రశ్నిస్తూ తెదేపా, 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు జగన్‌పై కోడికత్తి దాడి జరిగినట్లే, ఇప్పుడు కూడా సానుభూతి సాధించే లక్ష్యంతో ఇది జరిగిందని ఆరోపించింది.[34][35][36][37] జగన్ వాహనంపై నిలబడి ఉన్న సమయంలో కరెంటు తీగల వలన ప్రమాదం జరగకుండా నిరోధించడానికి అధికారులు ఆ సమయంలో విద్యుత్ సరఫరాను ఆపేసారు.[38] ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా వివిధ రాజకీయ నాయకులు ఈ దాడిని ఖండించారు.[39]
పోలింగు[మార్చు]
రాష్ట్రమంతా పోలింగు ఒకేసారి 2024 మే 13 న ఉదయం 7 గంటలకు పోలింగు మొదలై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొత్తం 46,389 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. పోలింగు ముగిసే సమయానికి క్యూలో నిలబడి ఉన్న వోటర్లు కూడా వోటు హక్కు వినియోగించుకునే సరికి చాలాచోట్ల రాత్రి బాగా పొద్దుపోయింది. సాయంత్రం 6 గంటలకు 3,500 కేంద్రాల్లో 100 నుండి 200 మంది వరకూ క్యూలో ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది.[40] మొత్తం 81.86 శాతం పోలింగు నమోదయింది.[41] 2014 లో 78.41 శాతం పోలింగ్ నమోదు కాగా, 2019లో 79.77 శాతం నమోదైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 2.09 శాతం పెరిగింది. దర్శి నియోజకవర్గంలో 90.91 శాతంతో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా, తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతం నమోదయింది.[42]
పోస్టల్ వోట్లు[మార్చు]
ఈ ఎన్నికలలో భారీ సంఖ్యలో పోస్టలు వోట్లు పోలయ్యాయి. మొత్తం 5,39,189 వోట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.[43]
పోలింగు ఘటనలు[మార్చు]
పోలింగు నాడు రాష్ట్రంలో వివిధ చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. పలనాడులో 8 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ముగ్గురు తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లు కిడ్నాప్ కాగా, పోలీసలు వారిని విడిపించారు. ఈ ఘటనలో స్థానిక ఎస్సైని సస్పెండ్ చేసింది.[40]
తెనాలిలో వైకాపా అభ్యర్థి, అప్పటి ఎమ్మెల్యే అయిన అన్నాబత్తుని శివకుమార్, క్యూలో నిలబడ్డ సుధాకర్ అనే వోటరును చెంపపై కొట్టగా అతను తిరిగి శివకుమార్‌ను చెంపపై కొట్టాడు. ఆపై ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్‌ను కొట్టారు. ఈ ఘటనలో పోలీసులు శివకుమార్‌ను గృహనిర్బంధం చేసారు.[44]
పోలింగు మరుసటి రోజు, మే 14 న, తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి, పులివర్తి నానిపై దాడి జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భద్రపరచిన ఈవీయెమ్లను పరిశీలించి తిరిగి వస్తూండగా అతనిపై ఈ దాడి జరిగింది.[45]
రాష్ట్రంలో జరిగిన హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం, మే 16 న ముగ్గురు ఉన్నత పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది. పలనాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండు చేయగా, తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. ఈ మూడు జిల్లాల్లో 12 మంది ఇతర పోలీసు అధికారులను కూడా సస్పెండు చేసింది. పల్నాడు జిల్లా కలెక్టరును బదిలీ చేసింది.[46]
ఎన్నికల్లో పలనాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసపై దర్యాప్తు జరిపేందుకు ఎన్నికల కమిషను ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మే 17 న ఏర్పాటు చేసిన ఈ బృందంలో 13 మంది సభ్యులున్నారు. దీనికి ఐజి బ్రజ్ లాల్ నేతృత్వం వహిస్తాడు.[47]
మాచర్ల నియోజకవర్గం, పాలువాయి గేటు పోలింగు కేంద్రంలో వైకాపా అభ్యర్థి, అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈవీయెం యంత్రాన్ని నేలకేసి కొట్టి ధ్వంసం చేసాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ఆలస్యంగా 2024 మే 23 న వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చెయ్యబోగా అతను పారిపోయాడు.[48] ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, పిన్నెల్లిపై జూన్ 6 వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.[49]
ఫలితాలు[మార్చు]
కూటమి/పార్టీ వారీగా ఫలితాలు
కూటమి/పార్టీ | వోట్లు | స్థానాలు | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య | % | ±pp | పోటీ చేసినవి | గెలిచినవి | +/− | ||||
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | 175 | ||||||||
ఎన్‌డిఎ | తెలుగుదేశం పార్టీ | 144 | |||||||
జనసేన పార్టీ | 21 | ||||||||
భారతీయ జనతా పార్టీ | 10 | ||||||||
మొత్తం | 175 | ||||||||
ఇండియా కూటమి | భారత జాతీయ కాంగ్రెస్ | 159 | |||||||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండీయా (మార్క్సిస్ట్) | 8 | ||||||||
భారత కమ్యూనిస్టు పార్టీ | 8 | ||||||||
Total | 175 | ||||||||
ఇతర పార్టీలు | |||||||||
స్వతంత్రులు | |||||||||
నోటా | |||||||||
మొత్తం | 100% | - | 175 | - |
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Terms of the Houses". Election Commission of India (in Indian English). Retrieved 25 June 2022.
- ↑ Mackenzie, W.J.M. (2024-03-13), "Indirect Elections", Free Elections, London: Routledge, pp. 47–49, ISBN 978-1-003-49206-1, retrieved 2024-03-28
- ↑ Andhrajyothy (25 April 2024). "Andhra Pradesh Assembly Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.
- ↑ "Jagan Mohan Reddy takes oath as Andhra Pradesh CM after landslide victory". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-05-30. Retrieved 2023-04-10.
- ↑ "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Archived from the original on 2024-03-17. Retrieved 2024-03-17.
- ↑ "Jagan drops 10 more MLAs ahead of upcoming elections". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-01-04. Retrieved 2024-01-04.
- ↑ Bureau, The Hindu (8 March 2024). "BJP-TDP-Jana Sena alliance agreed to in principle, says TDP MP". The Hindu.
- ↑ Andhrajyothy (30 March 2024). "టీడీపీ అభ్యర్థులు ఎవరు ఎక్కడి నుంచి." Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
- ↑ Bureau, The Hindu (2024-02-23). "Y. S. Sharmila says Congress and Left parties will fight elections together in Andhra Pradesh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-03-16.
- ↑ Andhrajyothy (2 April 2024). "అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్.. వైఎస్ షర్మిల పోటీ చేసేది ఎక్కడి నుంచంటే?". Archived from the original on 2 April 2024. Retrieved 2 April 2024.
- ↑ Eenadu (3 April 2024). "కడప నుంచి షర్మిల.. ఏపీలో కాంగ్రెస్ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే." Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.
- ↑ "V Srinivasa Rao CPM's new Andhra Pradesh state secretary". The New Indian Express. Retrieved 2023-09-26.
- ↑ "తెదేపా, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల". EENADU. Archived from the original on 2024-02-29. Retrieved 2024-03-17.
- ↑ "TDP: తెదేపా అభ్యర్థుల రెండో జాబితా విడుదల". ఈనాడు. Archived from the original on 2024-03-14. Retrieved 2024-03-17.
- ↑ "వైకాపా అభ్యర్థుల జాబితా విడుదల". ఈనాడు. Archived from the original on 2024-03-16. Retrieved 2024-03-17.
- ↑ ABN (2024-03-22). "TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల.. టికెట్ దక్కిన నేతలు వీరే." Andhrajyothy Telugu News. Retrieved 2024-03-26.
- ↑ "TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల.. టికెట్ దక్కిన నేతలు వీరే.. | TDP Third List Released, Check Here List, Siva". web.archive.org. 2024-03-26. Archived from the original on 2024-03-26. Retrieved 2024-03-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Eenadu (25 April 2024). "Andhra Pradesh Assembly Elections Candidates List 2024". Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.
- ↑ 19.0 19.1 "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు - అభ్యర్థులు". ఈనాడు. 2024-05-06. Archived from the original on 2024-05-07. Retrieved 2024-05-07.
- ↑ Andhrajyothy (16 March 2024). "వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా విడుదల.. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఔట్". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.
- ↑ "YSRCP release second list". TimesNow (in ఇంగ్లీష్).
- ↑ "Jagan drops 10 more MLAs in the third candidate list". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-01-13. Retrieved 2024-01-28.
- ↑ Raghavendra, V. (2024-02-24). "A.P. Assembly elections: TDP-JSP alliance releases first list of candidates". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-02-24.
- ↑ Eenadu. "ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే." Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
- ↑ "Andhra Pradesh Assembly Elections Candidates List 2024 - Eenadu.net". web.archive.org. 2024-04-14. Archived from the original on 2024-04-14. Retrieved 2024-05-06.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 26.00 26.01 26.02 26.03 26.04 26.05 26.06 26.07 26.08 26.09 26.10 "ఏపీ ఎన్నికలు.. మరో 38 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్". ఈనాడు. Archived from the original on 2024-04-22. Retrieved 2024-04-24.
- ↑ PTI (2023-08-28). "TDP asks EC to ensure fake voters are weeded out of Andhra electoral rolls". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-28.
- ↑ Bureau, The Hindu (2023-08-22). "Chandrababu Naidu to lodge complaint on bogus voters in Andhra Pradesh with Election Commission of India". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-12-28.
- ↑ "TDP chief N Chandrababu Naidu lodges complaint with ECI over mass deletion of votes in Andhra Pradesh". The Times of India. 2023-08-29. ISSN 0971-8257. Retrieved 2023-12-28.
- ↑ "TDP supremo likely to lodge complaint with ECI over bogus voters". The New Indian Express. Retrieved 2023-12-28.
- ↑ "Jagan Reddy Injured In Stone-Throwing While Campaigning In Andhra Pradesh". NDTV.com. Retrieved 2024-05-06.
- ↑ "Police pick up 26-year-old for hurling stone that injured Andhra CM Jagan Reddy". The Indian Express (in ఇంగ్లీష్). 2024-04-18. Retrieved 2024-05-12.
- ↑ "Stone hurled at Jagan Mohan Reddy ignites war of words among Andhra Pradesh parties". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-05-12.
- ↑ PTI. "Stone pelting attack on Jagan being investigated as attempted murder; YSRCP & TDP exchange blows". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2024-05-12.
- ↑ Potnuru, Vasu (2024-04-17). "Stone pelting incident is another version of Kodi Kathi 2.0". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-05-12.
- ↑ "Stone hurled at Jagan Mohan Reddy ignites war of words among Andhra Pradesh parties - The Economic Times". m.economictimes.com. Retrieved 2024-05-06.
- ↑ Correspondent, D. C. (2024-04-15). "MLC B.T. Naidu Calls Stone-pelting Kodi Kathi 2.0". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-05-12.
- ↑ "Jagan hits the road again after stone pelting incident; little headway in police probe so far". The Indian Express (in ఇంగ్లీష్). 2024-04-15. Retrieved 2024-05-12.
- ↑ "Andhra CM Jagan Reddy Suffers Injuries After Stones Hurled At His Bus In Vijayawada, PM Modi Wishes Him Speedy Recovery". News18 (in ఇంగ్లీష్). 2024-04-13. Retrieved 2024-05-12.
- ↑ 40.0 40.1 "ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: పోలింగ్ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం జరిగిందంటే." BBC News తెలుగు. 2024-05-14. Archived from the original on 2024-05-23. Retrieved 2024-05-25.
- ↑ Eenadu (15 May 2024). "ఏపీలో 81.6 శాతం పోలింగ్: సీఈవో ముఖేశ్ కుమార్ మీనా". Archived from the original on 15 May 2024. Retrieved 15 May 2024.
- ↑ ABP Desham (15 May 2024). "ఏపీలో మొత్తం ఓటింగ్ శాతం 81.86- పాత రికార్డులు పక్కకు జరిగాయి- కొత్త చరిత్రకు కుర్చీ వేశాయి". Archived from the original on 15 May 2024. Retrieved 15 May 2024.
- ↑ "AP Elections: ఏపీలో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..?". ఆంధ్రజ్యోతి. 2024-05-24. Archived from the original on 2024-05-24. Retrieved 2024-05-25.
- ↑ "AP Elections 2024: తిక్క కుదిరింది.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెంప పగలగొట్టిన ఓటర్." ఆంధ్రజ్యోతి. 2024-05-13. Archived from the original on 2024-05-16. Retrieved 2024-05-25.
- ↑ "Pulivarthi Nani: చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం". ఈనాడు. Archived from the original on 2024-05-23. Retrieved 2024-05-25.
- ↑ "AP Elections 2024: ఏపీలో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు". ఆంధ్రజ్యోతి. 2024-05-16. Archived from the original on 2024-05-21. Retrieved 2024-05-25.
- ↑ "AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు". సాక్షి. Archived from the original on 2024-05-25. Retrieved 2024-05-25.
- ↑ "MLA Pinnelli: పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి విధ్వంసకాండ". ఈనాడు. Archived from the original on 2024-05-23. Retrieved 2024-05-25.
- ↑ "Pinnelli: జూన్ 6వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు". ఈనాడు. Archived from the original on 2024-05-24. Retrieved 2024-05-25.