ఆన్‌లైన్ బ్యాంకింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆన్లైన్ బ్యాంకింగ్కు సంబందించిన పరికరాలు

మనము డబ్బులు ఎవరికి ఇవ్వాలో వివరాలతో బ్యాంకులు ఇ-మెయిల్ పంపిస్తే, బ్యాంకు వారు ఆ అకౌంట్‌కు మనం చెప్పిన మొత్తాన్ని జమ చేస్తారు. దీనినే ఆన్లైన్ బ్యాంకింగ్ (లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఇ-బ్యాంకింగ్) అంటారు. అలాగే మనకు ఏ వస్తువు కావాలో ఆ వస్తువు కోసం షాపుకు ఇ-మెయిల్ ఆర్డరు పంపవచ్చు. వస్తువు విలువను షాపు వారి అకౌంట్‌కు జమ చేయమని బ్యాంకు వారికి ఇ-మెయిల్ పంప వచ్చును. అపుడు ఆ మొత్తం షాపువారి అకౌంట్‌కు జమ చేయబడుతుంది. ఆర్డరు చేసిన వస్తువు ఇంటికి చేరుతుంది. ఉదాహరణకు న్యూఢిల్లీలోని బాబా బజారు - ఇంటర్నెట్ షాపు వారికి ఇ-మెయిల్ ఆర్డరు పెడితే, వారు వస్తువును మనకు పంపుతారు. ఈ ఇ-షాపింగ్ కొరకు కొంత కాష్‌ను బ్యాంకు నుంచి తీసుకొని మన కంప్యూటరులో ఉంచవచ్చును. ఈ ఇ-క్యాష్‌ను ఏదైనా వస్తువులు కొనటానికి వినియోగించవచ్చును.

మూలాలు

[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ