వికీపీడియా:రచ్చబండ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అడ్డదారి:
WP:VP
రచ్చబండ
వార్తలు | పాలసీలు | ప్రతిపాదనలు | సాంకేతికము | ఆలోచనలు| ఇతరత్రా..
జూలై నెల మొలకల జాబితా[మార్చు]

జూలై నెల మొలకల జాబితా వచ్చేసింది. ఇంకా జూన్, మే నెలల మొలకలు చాలా వరకూ అభివృద్ధి చెందలేదు. అందరూ ఈ మొలక వ్యాసాలపై కృషి చేయగలరు. ముఖ్యంగా ఎవరి మొలకల బాధ్యత వారిదే! --రహ్మానుద్దీన్ (చర్చ) 02:16, 2 జూలై 2014 (UTC)

డిఫాల్ట్‌గా డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితాల్లోని కొన్ని పేజీలు వచ్చేశాయి. అవి క్రమభివృద్ధి చెందుతాయి. --పవన్ సంతోష్ (చర్చ) 03:46, 2 జూలై 2014 (UTC)
  • ఔను మరి ప్రాజెక్టు పేజీలకు ఉపపేజీలుగా ఉండాల్సిన పేజీలను వ్యాస పేరుబరికి చేర్చేసారు. సరిచేయండి.--రహ్మానుద్దీన్ (చర్చ) 13:09, 2 జూలై 2014 (UTC)

ఆంద్ర ప్రదేశ్ కొత్త పటము[మార్చు]

ఆంద్ర ప్రదేశ్ (విభాజిత) పటము తయారైనదా ? తెవికీలో నగరాలు, పట్టణాలు మరియు ఊర్ల పేజీలలో ఉపయోగించడానికి అక్షాంశ రేఖాంశాలతో కూడిన పటమేదైనా తయారైనదా? ఆంగ్ల వికీలో తయారై ఉపయోగింపబడుచున్నది. అహ్మద్ నిసార్ (చర్చ) 20:55, 6 జూలై 2014 (UTC)

బాట్ హోదా కొరకు అభ్యర్థన.[మార్చు]

నేను ఒక నెల క్రితం బాట్ కోసం అభ్యర్థించాను, కాని ఇంత వరకు ఆమోదం పొందలేదు. దయచేసి అధికారులు ఈ సమస్యను త్వరగా చూసి పరిష్కరించడానికి ప్రయత్నించగలరు.Praveen Grao (చర్చ) 10:25, 17 జూలై 2014 (UTC)

IMPORTANT: Admin activity review[మార్చు]

Hello. A new policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc) was recently adopted by global community consensus (your community received a notice about the discussion). According to this policy, the stewards are reviewing administrators' activity on smaller wikis. To the best of our knowledge, your wiki does not have a formal process for removing "advanced rights" from inactive accounts. This means that the stewards will take care of this according to the new admin activity review here.   We have determined that the following users meet the inactivity criteria (no edits and no log actions for more than 2 years):

  1. Gsnaveen (administrator)
  2. Trivikram (administrator)
  3. Vnagarjuna (administrator)

  These users will receive a notification soon, asking them to start a community discussion if they want to retain some or all of their rights. If the users do not respond, then their advanced rights will be removed by the stewards.   However, if you as a community would like to create your own activity review process superseding the global one, want to make another decision about these inactive rights holders, or already have a policy that we missed, then please notify the stewards on Meta-Wiki so that we know not to proceed with the rights review on your wiki. Thanks, Rschen7754 01:11, 18 జూలై 2014 (UTC)

ఆంధ్ర లయోలా కాలేజీతో సీఐఎస్-ఏ2కే సంస్థాగత భాగస్వామ్యం[మార్చు]

ఇటీవలే సీఐఎస్-ఏ2కే నిర్వహించిన "Knowledge and Openness in the Digital era" అనే రెండు రోజుల నేషనల్ వర్క్ షాప్ విజయవాడలోని లయోలా కళాశాలలో జరిగింది. దాదాపుగా 50 మంది డిగ్రీ-పీజీ బోధనా ఉపాధ్యాయులకు వికీపీడియా, స్వేచ్ఛా విజ్ఞానం మీద శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ వర్క్‍షాప్ పర్యవసానంగా కళాశాల యాజమాన్యం వారి బోధనలోకి వికీపీడియా, స్వేచ్ఛా విజ్ఞానం, స్వేచ్ఛా విద్య వనరులను చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతూ సీఐఎస్-ఏ2కే తో మరింత అనుబంధంగా ఉండాలన్న ఆలోచనను వ్యక్తం చేసారు. ఈ దిశగా సీఐఎస్-ఏ2కే ఆంధ్ర లయోలా కాలేజీ యాజమాన్యంతో సంస్థాగత భాగస్వామ్యంపై అవగాహనకు రానుంది. ఈ అవగాహనా పత్రం ప్రకారం ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్ధులకు వికీపీడియాలో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, తెలుగు, అర్థశాస్త్రం మొ॥ విషయాలలో కొన్ని విశేష అంశాలకు సంబంధించిన వ్యాసాలు మన తెవికీలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థుల ద్వారా చేర్చబడతాయి. వికీపీడియా, ఓపెన్ నాలెజ్, ఓపెన్ కంటెంట్ మొదలగు అంశాలపై ఎంపిక చేసిన విద్యార్థులకు లోతైన శిక్షణ ఇవ్వనున్నాము. ఈ మొత్తం కార్యక్రమం సీఐఎస్-ఏ2కే పర్యవేక్షణలో జరగనుంది. ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం చాలా అవసరం. ముఖ్యంగా సహసభ్యులు విద్యార్థులకు వికీపీడియాపై సూచనలు సలహాలు ఇస్తూ, కొత్తగా వచ్చే వ్యాసాల నాణ్యత దెబ్బతినకుండా చూడగలము. ఈ కార్యక్రమం డిజైన్ త్వరలోనే ప్రాజెక్ట్ పేజీగా తెలుగు వికీలో ఉంచుతాము. ఇందుకు సంబంధించి సహసభ్యులు సహాయ సహకారాలందిస్తూ, ముందస్తు సూచనలు, సలహాలు క్రింద తెలుపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:11, 18 జూలై 2014 (UTC)

సూరా వ్యాసంలో సూరాల లింకులిచ్చుట ఎలా?[మార్చు]

సూరా వ్యాసంలో సూరాల వరుస క్రమం వున్నది. అందులో సూరా ల లింకు వికీసోర్సు లోని సూరా సమాచార వ్యాసానికి ఎలా లింకు ఇవ్వాలో తెలియరావడం లేదు. ఓ పదింటికి లింకులు ఇచ్చాను, సరిగా లింకు వచ్చినది. కాని మిగతా వాటికి లింకులిస్తే "లాక్" గుర్తు వస్తున్నది, దానిని క్లిక్ చేస్తే కురాన్ భావామ్రుతంలోని సూరా పేజీకి పోవడంలేదు. అహ్మద్ నిసార్ (చర్చ) 20:08, 19 జూలై 2014 (UTC)

[[s:<వికీసోర్స్ లో పేజీ శీర్షిక | లంకెలో కనిపించాల్సిన పాఠ్యం]] ఇలా వాడగలరు. పది వరకూ చేసాను! --రహ్మానుద్దీన్ (చర్చ) 16:14, 25 జూలై 2014 (UTC)
ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 07:19, 1 ఆగస్టు 2014 (UTC)

మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా ప్రాచుర్యమైన వ్యక్తి[మార్చు]

మా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే గేమ్‌షో వస్తూంది. ప్రస్తుతానికి ఇది మొదటి సీజన్ ఐనా ప్రాచుర్యం పొందింది. ఈ సీజన్‌లో తూర్పుగోదావరి నుంచి ప్రోగ్రామ్‌కి వచ్చిన పేరి ఉమాకాంత్ అనే వ్యక్తి తన అపూర్వమైన మేధస్సు, విస్తారమైన విజ్ఞానం, బాల్యపు అమాయకత్వం కలగలిసి ఆ షో ద్వారా విశేష అభిమానం, ఆదరణ పొందారు. చిన్న టీచర్‌గా పనిచేస్తున్న ఆయన ప్రొఫైల్ ఇక్కడ లభ్యం. మహా విజ్ఞానశాలిగా, నాగార్జునతో పాటుగా పలువురి మాటల్లో నడిచే విజ్ఞాన సర్వస్వంగా పేరొందిన ఈయన గురించి తెవికీలో ఓ పేజీ తయారు చేయవచ్చా? ఆయన ప్రాచుర్యం అందుకు సరిపోతుందా?--పవన్ సంతోష్ (చర్చ) 17:02, 24 జూలై 2014 (UTC)

సరిపోదు. మీలో యెవరు కోటీశ్వరులు పేజీ సృష్టించి, ఆపై అతని గురించి ఒక సెక్షన్ చేర్చి ఆ తరువాత ఇలాంటి చర్చలు మొదలుపెట్టండి. మీరు పూర్తి చేయాల్సిన మొలకల సంఖ్య ఇంతింతై వటుడింతై అని పెరుగుతూంది. నేను మీకు ప్రాజెక్టు ఉపపేజీలుగా పుస్తకాల జాబితాలని మార్చమని చెప్పిన సలహా కూడా మీకందినట్టూ లేదు! --రహ్మానుద్దీన్ (చర్చ) 16:17, 25 జూలై 2014 (UTC)
  1. మీలో ఎవరు కోటీశ్వరుడు గురించి మీ సలహా బావుంది. తప్పనిసరిగా పాటిస్తాను.
  2. నా మొలకల సంఖ్యను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూనే ఉన్నాను. తక్కువే వున్నాయి. అవీ మొలకల స్థాయి నుంచి తప్పిస్తాను.
  3. మీరు గతంలో చర్చా పేజీలోనూ, వ్యక్తిగత సంభాషణలోనూ జాబితాలను ప్రాజెక్టు ఉపపేజీలుగా మార్చే విషయంపై చేసిన సూచన విషయం ఇక్కడ చర్చకు పెట్టాను. నేను జాబితా పేజీల ప్రధాన సూచికను ప్రాజెక్టు ఉపపేజీగా మార్చగా సహసభ్యులు వెంకట రమణ గారు వెంటనే ఫోన్ చేసి అన్ని పేజీలు అలా మార్చవద్దు, కంటెంట్ పేజీగానే అభివృద్ధి చేయాల్సిందని సూచించారు. భిన్నాభిప్రాయాలు వస్తూండడంతో ప్రాజెక్టు చర్చ పేజీలో చర్చకుపెట్టి ఆయనను అభిప్రాయం అక్కడే వ్యక్తపరచమన్నాను. ఇప్పటికి ఆయన మాత్రమే స్పందించారు. మీరు కూడా ఈ విషయంపై మీ స్పందన ప్రాజెక్టు చర్చాపేజీలో వ్యక్తపరిస్తే బావుంటుంది. కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (చర్చ) 07:03, 26 జూలై 2014 (UTC)

తెలుగు సినీ గేయ రచయితలు[మార్చు]

సినీ సాహిత్యానికి తెలుగు వారి జీవితాలకి అవినాభావ సంబంధం. వేటూరి, సిరివెన్నెల, ఆత్రేయ, ఆరుద్ర, సముద్రాల, సినారె, దాశరధి మొ|| భాషలో,వ్యాకరణంలో భాగమయ్యారు. ఎందరో మహానుభావులు, ఆందరికీ వందనములు.

వికీలో ఏదైనా చర్చను ప్రారంభించినా, లేదా జరుగుతున్న చర్చలో పాల్గొన్నా సంతకం చేయడం ఆనవాయితీ. మీ సంతకాన్ని మీరు చేర్చిన సమాచారం చివర (నాలుగు టిల్ట్ లు ఇలా Rajasekhar1961 (చర్చ) 05:41, 1 ఆగస్టు 2014 (UTC)) చేయవచ్చును.Rajasekhar1961 (చర్చ) 05:41, 1 ఆగస్టు 2014 (UTC)
--~~~~ అని సంతకం చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 05:50, 1 ఆగస్టు 2014 (UTC)

విశేష వ్యాసాలు[మార్చు]

ఇప్పటికి తెవికీ లో 25 విశేష వ్యాసాలున్నాయి. వీటి సంఖ్య పెంచే అవకాశం మెండుగా వున్నది. నాణ్యత గలిగిన వ్యాసాలు చాలా వరకు వున్నాయి. ఈ దఫా ఓ పది వ్యాసాల ప్రతిపాదనలు చేద్దామనే ఉద్దేశ్యం. సభ్యులు స్పందించ గలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 07:22, 1 ఆగష్టు 2014 (UTC)

ధన్యవాదాలు. మీరు ఒక 5-10 మంచి వ్యాసాల్ని ప్రతిపాదించండి. అందరం కలిసి అభివృద్ధి చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 07:32, 1 ఆగష్టు 2014 (UTC)
మీరు అభివృద్ధి చేసేప్పుడు అవసరాన్ని బట్టి డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా గ్రంథాల జాబితాకు సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా నేనెలాగూ పుస్తకాలు కాటలాగ్ చేస్తున్నాను కనుక చక్కని మూలాలుగా పనికివచ్చే గ్రంథాలు నేను వెతికిపెడతాను. మీరు విశేష వ్యాసాలను ప్రతిపాదిస్తే దాన్ని బట్టి నాకు దొరికిన, దొరుకుతున్న పుస్తకాలను మూలాలుగా మీకందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:16, 1 ఆగష్టు 2014 (UTC)