వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రధాన పేజీచర్చకార్యక్రమ
ప్రణాళిక
కమిటీలుసన్నాహక
సమావేశాలు
స్కాలర్‌షిప్స్నివేదికభావి కార్యాచరణ
తెవికీ పండగ 2024

తెలుగు వికీపీడియా 20 వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా వార్ష్జికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపులో వచ్చిన ప్రతిపాదనపై ఈ విషయమై రచ్చబండలో చర్చ జరిగింది. విశాఖపట్నంలో ఈ వార్షికోత్సవం జరపాలని ఈ చర్చలో నిర్ణయించారు. ఆ తరువాత జరిగిన సన్నాహక సమావేశాల్లో సిఐఎస్ ఎ2కె సంస్థ ఈ వార్షికోత్సవాలకు నిధులు సమకూర్చడంతో పాటు నిర్వహణ లోనూ పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చింది.

ఉత్సవాల నిర్వహణకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేసుకుని, తెలుగు వికీమీడియన్లు పనుల్లోకి దిగారు. ఈ కమిటీలు ఒక్కసారి కూడా భౌతికంగా సమావేశం కాలేదు; సమావేశాలన్నీ ఆన్‌లైను లోనే జరిగాయి.

కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా అనేక చర్చలు జరిగాయి, అనేక ప్రతిపాదనలు వచ్చాయి. కొన్ని ముందే వీగిపోయాయి, కొన్ని ప్రతిపాదనలపై పనులు మొదలుపెట్టాక కొంతపని జరిగాక మధ్యలో విరమించుకున్నారు. అయితే, తగినంత మంది చురుకైన కార్యకర్తలు లేక గానీ, సరిపడినంత సమయం లేక గానీ ఆగిపోయిన పనులు ఉన్నాయేమో గానీ, డబ్బు లేక ఆగిన పనులేమీ లేవు. సిఐఎస్ వారికే ఆ శ్రేయస్సు చెందుతుంది.

మౌలికాంశాలు[మార్చు]

  • స్థలం: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
  • వేదిక: డాల్ఫిన్ హోటల్, డాబా గార్డెన్స్
  • తేదీలు: 2024 జనవరి 26-28
  • నిర్వహణ: తెలుగు వికీపీడియా
  • ఆర్థిక సహకారం, సహ నిర్వహణ: సిఐఎస్ ఎ2కె

సన్నాహకాలు[మార్చు]

వార్షికోత్సవాలు నిర్వహించాలా లేదా అనే చర్చతో మొదలైన సమావేశాలు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో కలిసి నిర్వహించాలి వంటి అంశాలను నిర్ణయించుకుంటూ, ఏమేం చెయ్యాలి అనే ఎలా చెయ్యాలి అనే ప్రణాళికలు వేసుకునేదాకా 12 కు పైగా సమావేశాలు జరిగాయి. మూణ్ణాలుగు వాట్సాప్ గ్రూపులు, కొన్ని డజన్ల గంటల చర్చలు, కొన్ని వందల గంటల గూగుల్ డాక్స్ ల కృషి తరువాత కార్యక్రమాలు ఒక రూపుకు వచ్చాయి.

ఇలా మొదలైంది[మార్చు]

2023 నవంబరు.. క్రికెట్ ప్రపంచకప్ జరుగుతున్న సమయం. భారద్దేశమంతా క్రికెట్ జ్వరంతో ఉంది. తెవికీ కూడా ఆ జ్వరం తగిలి, క్రికెట్ 2023 ప్రాజెక్టులో వాడుకరులు బాగా బిజీగా ఉన్నారు. ఆ సమయంలో, 2023 నవంబరు 5 న మొదటి సమావేశం జరిగింది. నవంబరు 22 న రెండవ సమావేశం జరిగింది. ఈ రెండు సమావేశాల్లో, జనవరి 26-28 తేదీల్లో ఉత్సవం జరపాలని, విశాఖలో జరపాలని, సిఐఎస్ ఎ2కె ఆర్థిక, నిర్వహణా సహకారంతో జరపాలనీ, నిశ్చయించారు. జనవరి 26, గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు. 27, 28 శని, ఆదివారాలు. ఈ కారణాన ఎక్కువమందికి వీలు ఉంటుందని ఈ తేదీలను అనుకున్నారు. కార్యక్రమాలు ఆటవిడుపు, విజ్ఞానం, లోచూపు, ముందుచూపు అన్నీ ఉండాలని నిశ్చయించారు.

ఖర్చు సుమారు 9 లక్షలు అవుతుందని భావించారు. ఈ ఖర్చు పూర్తిగా సిఐఎస్ ఎ2కె భరిస్తుందని తన్వీర్ హాసన్ గారు తెలియజేసారు.

ఇలా సాగింది[మార్చు]

2023 డిసెంంబరులో రెండవ దశ సన్నాహకాలు జరిగాయి. వివిధ సన్నాహక కమిటీలు ఏర్పాటు, బాధ్యతల పంపకాలతో ఈ దశ మొదలైంది. 2023 డిసెంబరు 5 న సమావేశాలు మొదలై వారానికి రెండు మూడు సమావేశాలు జరిగాయి. అన్ని కమిటీలు కలివిడిగా, ఏ కమిటీకి ఆ కమిటీ విడివిడిగా.. అనేక సమావేశాలు జరిగాయి. స్కాలర్‌షిప్పుల కోసం అప్లికేషన్లు కోరడం, వచ్చిన వాటిని పరిశీలించి, అనుకున్న అర్హత ప్రమాణాల మేరకు స్కాలర్‌స్ఝిప్పు విజేతల ఎంపిక చెయ్యడం జరిగాయి. ఎంపికైన వారందరినీ సంప్రదించి వారికి ప్రయాణ ఏర్పాట్లు చేసారు. కొందరు, తామే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు.

ఉత్సవాల మూడురోజులలో ఏ రోజున ఏ కార్యక్రమాలు చెయ్యాలి అనే విషయమై చర్చల తరువాత ప్రణాళిక తయారైంది. మొదటి రోజు ఆటవిడుపు కార్యక్రమాలుండాలని తేల్చారు. ఈ కార్యక్రమాల్లో స్థూలంగా

  • తెలుగులో విజ్ఞాన సృష్టి, వితరణ, భద్రం చెయ్యడం ఎలా జరిగేది, ఎలా జరిగింది, ఎలా జరుగుతోంది
  • పై అంశాలపై ఇతర రంగాల్లో జరుగుతున్న కృషితో తెవికీ ఎలా లబ్ధి పొందవచ్చు
  • తెవికీలో జరిగిన కృషి ఎలా ఉంది, ఎలా ఉండాల్సింది, ఇకముందు ఎలా ఉండాలి
  • వికీమీడియన్లు చేసిన, చేస్తూ ఉన్న కృషిని సంస్మరించుకోవడం

వంటి విషయాలపై కార్యక్రమాలు ఉండాలని నిర్ణయించారు. విజ్ఞానానికి సబంధించి వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వారిని ఆహ్వానించాలన్న నిర్ణయం మేరకు, కొందరు సాంస్కృతిక సారథులను ఎంపిక చేసుకుని, వారిని ఆహ్వానించి, వారి సమ్మతి పొందారు.

అవసరమైన ప్రదర్శకాలు, రచనలు, వగైరాలను తయారుచేసే పనులను పంచుకున్నారు. కొన్నిటిని బైటవారికి అప్పజెప్పారు. ఈ ఉత్సవాలకే కాకుండా భవిష్యత్తులో జరిపే అన్ని ఉత్సవాలకూ వాడుకునేలా ఒక ప్రత్యేకమైన పేరును కాయించి బ్రాండింగు చెయ్యాలనే ఉద్దేశంతో దీనికి "తెవికీ పండగ" (పండుగ కాదు) అని పేరుపెట్టారు. లోగోల తయారు చేయించారు.

ఉత్సవాల సందర్భంగా వికీ లవ్స్ వైజాగ్ పేరిట ఒక ఫొటోల పోటీ జరపాలని నిశ్చయించారు. ఆ పోటీ 2024 మార్చి 5 న విజయవంతంగా ముగిసింది.

తెలుగు వికీమీడియా ప్రాజెక్టులపై, ముఖ్యంగా తెవికీ ప్రస్థానంపై ఒక వివరమైన, విపులమైన పుస్తకం తీసుకు రావాలని సంకల్పించారు., దీనిపై కొందరు పనిచెయ్యడం మొదలుపెట్టారు గానీ, కానీ ఉన్న సమయం అతి తక్కువ కాబట్టి ఉత్సవాల నాటికి ఆ పుస్తకాన్ని తేలేమని ఆ పనికి కామా పెట్టారు.

విశాఖలో తారస్థాయికి చేరి..[మార్చు]

ఇలా ముగిసింది.