ఆర్కాన్సా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Map of USA AR.svg

ఆర్కన్సాస్ (Arkansas) అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటిలోకి 23వ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికా దక్షిణ భాగాన ఉన్నది. ఈ రాష్ట్రం అమెరికాలో మిస్సిస్సిపి నది ఒడ్డున ఉంది. ఈ రాష్ట్రానికి పొరుగున టెక్సస్, లూసియాన, టెన్నెస్సె, ఒక్లహొమా, మిస్సొరి రాష్ట్రాలు ఉన్నాయి. తూర్పు భాగంలో మిస్సిసిప్పి నది సరిహద్దును నిర్ధారిస్తున్నది. లిట్టిల్ రాక్ నగరము రాజధాని. లిట్టిల్ రాక్, ఫొర్త్ స్మిథ్, ఫెయెట్ విల్ల్, మరియు బెన్టొన్ విల్లె ఈ రాష్ట్రంలోని నాలుగు అతి పెద్ద నగరాలు. ఆర్కన్సాస్ వైవిద్యభరితమైన వాతావరణానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్ర జనాభా వివిధ జాతుల సమాహారం. ఆర్కన్సాస్ లో ప్రవాస భారతీయులు అధికంగా స్థిరపడిన ప్రాంతాలలో బెన్టొన్ విల్లె మరియు లిట్టిల్ రాక్ ముఖ్యమైనవి. ఉత్తర అమెరికాలో తొలిసారిగా సహజమైన వజ్రాలు దొరికిన ప్రదేశం ఆర్కాన్సాసే. భౌగోళికంగా ఎంతో వైవిద్యం కలదు ఒజార్క్స్, ఒచితా పర్వత శ్రేణుల నుండి ఉత్తరాన మిస్సిసిప్పీ నది వైపున్న పల్లపు ప్రాంతాల వరకు. రాష్ట్ర రాజధాని, అత్యధిక జనాభా కలిగిన ఊరు లిటిల్ రాక్.

"http://te.wikipedia.org/w/index.php?title=ఆర్కాన్సా&oldid=1308035" నుండి వెలికితీశారు