ఎయిర్ బెర్లిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Air Berlin
IATA
AB
ICAO
BER
Callsign
AIR BERLIN
స్థాపితము1978 (as Air Berlin USA)
కార్యకలాపాల ప్రారంభం1979
Hubs
  • Berlin-Tegel Airport
  • Düsseldorf Airport
దృష్టి సారించిన నగరాలు
  • Hamburg Airport
  • Munich Airport
  • Palma de Mallorca Airport
  • Stuttgart Airport
  • Zurich Airport
m:en:Frequent-flyer programtopbonus
Alliance
  • Oneworld
  • Etihad Equity Alliance
Subsidiaries
  • Belair (airline)
Fleet size131
గమ్యస్థానములు171
సంస్థ నినాదముYour Airline.
మాతృసంస్థairberlin group
ప్రధాన కార్యాలయముAirport Bureau Center
Charlottenburg-Wilmersdorf,
Berlin, Germany
కీలక వ్యక్తులు
  • Hartmut Mehdorn, Chairman
  • Stefan Pichler, President and CEO
ఆదాయముDecrease 4.15 billion (2013)[1]
Operating incomeDecrease -231.9 million (2013)[1]
స్థూల ఆదాయమ్Decrease -315.5 million (2013)[1]
మొత్తం ఆస్తులుDecrease 1.89 billion (2013)[1]
Total equityDecrease -186.1 million (2013)[1]
ఉద్యోగులు8,905 (12/2013)[1]

ఎయిర్ బెర్లిన్ అనేది జర్మనీ యొక్క రెండో అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థ. దీనికంటే ముందు ర్యాంకులో లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ఉంది. అంతేకాదు ప్రయాణికులను తీసుకెళ్లే అతి పెద్ద వైమానిక సంస్థల్లో యూరప్ ఖండంలో ఎనిమిదో అతి పెద్ద ఎయిర్ లైన్ గా గుర్తింపు సాధించింది.[2] ఈ ఎయిర్ లైన్ యొక్క నెట్ వర్క్ జర్మనీలోని 17 నగరాలతో పాటు అనేక అంతర్జాతీయ గమ్యస్థానాలకు విస్తరించి ఉంది. [3]

విషయ సూచిక

[మార్చు]
  • 1 చరిత్ర
  • 2 గమ్యాలు
  • 3విమానాలు
  • 4 అవార్డులు
  • 5 ఇవి కూడా చూడండి
  • 6 బయటి లింకులు
  • 7 మూలాలు

చరిత్ర

[మార్చు]

ఎయిర్ బెర్లిన్ అనేది ప్రధానంగా జర్మనీ వైమానిక సంస్థ. ఇది బెర్లిన్ ఆధారంగా పనిచేస్తుంది. 1978లో ఇది ఎయిర్ బెర్లిన్ యు.ఎస్.ఎ. పేరుతో ప్రారంభమైంది. దీని కార్యకలాపాలు 1979లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇది ప్రపంచస్థాయి ఎయిర్ లైన్ గా గుర్తింపు సాధించింది. 2001 నుంచి ఈ సంస్థ ఇథిహాద్ ఎయిర్ వేస్ తో భాగస్వామ్యం పొందింది. అంతేకాదు ఈ సంస్థ వన్ వరల్డ్ గ్లోబల్ సమూహంలో సభ్యత్వం కలిగి ఉంది. [4]

గమ్యాలు

[మార్చు]

ప్రధాన వ్యాసం: ఎయిర్ బెర్లిన్ గమ్యాలు

ఈ వైమానిక సంస్థ యునైటెడ్ స్టేట్స్, కరేబియన్, సౌత్ ఈస్ట్ ఆసియాతో పాటు సెలవు విడిది ప్రాంతాలుగా పేరుగాంచిన మెడిటేరనియన్ ప్రాంతం, క్యానరీ దీవులు, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల సహా మొత్తం 40 దేశాల్లోని 150 షెడ్యూలు గమ్యస్థానాలకు విమానాలు నడిపిస్తోంది.

విమానాలు

[మార్చు]

ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఎయిర్ బెర్లిన్ పలు విమానాలు నడిపిస్తోంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఆన్ లైన్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఎయిర్ బస్, బోయింగ్, క్యూ-400 రకాల విమానాలను ఈ సంస్థ నడిపిస్తోంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సరికొత్త విమానాలను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తోంది.

ఏప్రిల్-2015 నాటికి ఎయిర్ బెర్లిన్ విమానాల సముదాయంలో ఉన్న విమానాల వివరాలు [5]

బెర్లిన్ విమానాలు ప్రయాణికులు[107] సూచనలు
విమానం సేవలో ఆర్డర్లు ఆప్షన్లు సి వై మొత్తం
ఎయిర్

బస్ ఎ319-100

5 4 _ _ 150 150 బెలైర్ నిర్వహిస్తోంది
ఎయిర్

బస్ ఎ320-200

44 6 _ _ 180 180 బెలైర్ నిర్వహిస్తోంది
ఎయిర్

బస్ ఎ321-200

16 14 _ _ 210 210 2015

నాటికి రావాల్సి ఉంది

ఎయిర్

బస్ ఎ330-200

14 _ _ 19 279 298
బోయింగ్

737-700

8 _ _ _ 144 144 టి.యు.ఐ.ఫ్లై

నుంచి 6అద్దెకు, జెర్మనియా నుంచి మరో 2 అద్దెకు

బోయింగ్

737-800

28 2 _ _ 186 186 టి.యు.ఐ.ఫ్లై

నుంచి 6అద్దెకు

బాంబార్డియర్

డాష్ 8 క్యూ400

17 _ _ _ 76 76 ఎల్.జి.డబ్ల్యూ

నిర్వహణ

మొత్తం 131 26

సేవలు, బ్యాగేజ్ అలవెన్స్

[మార్చు]

ఎయిర్ బెర్లిన్ వెబ్ చెక్ ఇన్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఎకానమీ తరగతిలో ప్రయాణించే వారికి కూడా సరికొత్త అనుభూతి కలిగించే సౌకర్యాలు ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన సీట్లు, టీవీ స్క్రీన్లు, పిల్లల కోసం వీడియో గేమ్స్ ఉంటాయి. వ్యాపార తరగతి లో పడుకోవడానికి వీలుగా ఉండే లై-ఫ్లాట్ బెడ్లతో పాటు అనేక వ్యక్తిగత సదుపాయాలు ఉంటాయి. ఎయిర్ బెర్లిన్ బ్యాగెజ్ అలవెన్స్ కింద ఉచితంగా 8 కిలోల బరువు వరకు ఒక ప్యాక్ ను అనుమతిస్తారు. కొన్ని తరగతుల్లో నిబంధనల మేరకు మరో ప్యాక్ ను కూడా అనుమతించవచ్చు. ఫీజు తీసుకుని అనుమతించే బ్యాగేజ్ ను 23 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు. [6]

అవార్డులు

[మార్చు]
  • 2008: క్యాపిటల్ మాగజైన్: “ఎయిర్ లైన్ ఆఫ్ ది ఇయర్ 2008”, టెలిగ్రాఫ్ ట్రావెల్ అవార్డ్, వరల్డ్ ట్రావెల్ అవార్డు2008[114] బెస్ట్ బడ్జెట్ ఎయిర్ లైన్ [7]
  • 2009:యూరోపియన్ బిజినెస్ అవార్డు 2009, ఓకోమ్ పరిశోధన: అవార్డ్ ఫర్ “ప్రైమ్” ఇన్వెస్టిమెంట్ స్టేటస్
  • 2010: బిజినెస్ ట్రావెల్ అవార్డు 2010, రీయిజ్ బ్లిక్ 2010: ఎయిర్ లైన్ ఆఫ్ ది ఇయర్, స్పెయిన్ టూరిజం అవార్డు 2010,[8] క్లెవర్ రెయిజిన్! 2010: "యూరప్ యొక్క యంగస్ట్ ఫ్లీట్ ", స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డు 2010: " ఉత్తమ చవక ధరల ఎయిర్ లైన్ యూరప్", ఫ్రాజం-వన్-మెండెలెస్సెన్ పతకం, డానిష్ ట్రావెల్ అవార్డు: "ఉత్తమ చవక ధరల ఎయిర్ లైన్"
  • 2011: ట్రావెల్ ప్లస్ ఎయిర్ లైన్ అమ్నెటీ బ్యాగ్ అవార్డ్స్, బ్రాండ్ అవార్డ్ 2011, ఒకోగ్లోబో 2011[9]
  • 2014: బెస్ట్ బిజినెస్ క్లాస్ కేటగిరిలో ఎయిర్ లైన్ యూరప్ 2014 అవార్డు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Annual Report 2013 - Financial Figures" (PDF). Air Berlin. Archived from the original (PDF) on 2014-05-21. Retrieved 2014-04-21.
  2. "Berlin Tegel still Air Berlin's #1 base". Anna.aero. Retrieved 2012-03-28.
  3. "World Airline Directory: Air Berlin USA". Flight International: 272. 26 July 1980. Retrieved 28 August 2013.
  4. "Air Berlin enters into co-operation with Hainan Airlines". Airberlin.com. Archived from the original on 2012-03-25. Retrieved 2012-03-28.
  5. "Air Berlin". Cleartrip. Archived from the original on 2015-07-04. Retrieved 2015-06-03.
  6. airberlin Business Class Archived 2012-07-04 at the Wayback Machine. Air Berlin, retrieved on 19 January 2011.
  7. "Successful LTU Integration". Air Berlin. 31 March 2011. Archived from the original on 10 జనవరి 2014. Retrieved 18 August 2013.
  8. "Air Berlin awards". Airberlin.com. Archived from the original on 2011-04-24. Retrieved 2012-03-28.
  9. "Air Berlin historic fleet list at airfleets.net. Retrieved 2011-04-18". Airfleets.net. Archived from the original on 2012-03-26. Retrieved 2012-03-28.

ఇవి కూడా చూడండి

[మార్చు]